Nitin Patel
-
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్
రాజ్‌కోట్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు. మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, భూపేంద్రసిన్హ్ చూడాసమా, ప్రదీప్‌సిన్హ్ జడేజా.. ఈ మేరకు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖలు రాశారు. ఈ నలుగురు వేర్వేరుగా లేఖలు రాసినట్టు బీజేపీ అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ ధ్రువీకరించారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో బీజేపీ కేంద్ర పార్లమెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీనియర్ నాయకుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తమకు టికెట్లు వద్దంటూ సీనియర్లు లేఖలు ఇవ్వడంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పి తప్పినట్టయింది. పోటీ చేయనని ముందే చెప్పా: రూపానీ ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. గుజరాత్‌కు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం బీజేపీ నాకు కల్పించింది. ఇప్పుడు నన్ను పంజాబ్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సీనియర్ నాయకుడిగా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ముందే ప్రకటించాను. నేను టికెట్ కూడా అడగటం లేద’ని విజయ్ రూపానీ విలేకరులతో చెప్పారు. 66 ఏళ్ల రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2016, ఆగస్టు నుంచి 2021, సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా: పటేల్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెహసానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం లేదని, తన పేరు పరిశీలించొద్దని పాటిల్‌కు రాసిన లేఖలో నితిన్ పటేల్ పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కడి, మెహసానా స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాన’ని పటేల్ విలేకరులతో అన్నారు. తొమ్మిది సార్లు పోటీ చేశా, ఇక చాలు.. పార్టీ తనకు తొమ్మిది సార్లు అవకాశం ఇచ్చిందని, ఇక చాలని మాజీ మంత్రి, ధోల్కా ఎమ్మెల్యే భూపేంద్రసిన్హ్ చూడాసమా అన్నారు. ‘తొమ్మిది సార్లు పోటీ చేసే అవకాశమిస్తే నేను ఐదు సార్లు గెలిచి క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను. ఇక చాలు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీకి ముందే చెప్పాన'ని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనని, పార్టీ తనకు ఏ పని అప్పగించినా చేస్తానని ప్రదీప్‌సిన్హ్ జడేజా పేర్కొన్నారు. (క్లిక్: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను) -
హర్ ఘర్ తిరంగాలో అపశ్రుతి.. మాజీ మంత్రికి గాయం
అహ్మదాబాద్: డెబ్భై ఐదేళ్ల భారత దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా.. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగాకు పిలుపు ఇచ్చింది. ఇంటా వాకిట బడి బండ్లు అనే తేడా లేకుండా అంతటా మూడు రంగుల మయం అయిపోయింది. మరోవైపు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో గుజరాత్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గాయపడ్డారు. శనివారం మెహ్సనా జిల్లా కడి ప్రాంతంలో ఆయన నేతృత్వంలో ర్యాలీ జరిగింది. అయితే వీధుల్లో తిరిగే ఆ ఆవు నినాదాలకు భయపడి.. ర్యాలీ వైపు దూసుకొచ్చింది. ఆవు ఢీ కొట్టి వెళ్లిపోవడంతో.. ఆయన కింద పడిపోయారు. కాలికి గాయం కాగా.. సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆపై ఎస్కార్ట్ సాయంతో అహ్మదాబాద్ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని, నెలరోజుల రెస్ట్ అవసరమని బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. Stray cow attacks Gujarat's former Deputy CM Nitin Patel during "Har Ghar Tiranga" yatra in Mehsana. pic.twitter.com/pwlmqRi7nT — Saral Patel (@SaralPatel) August 13, 2022 He is former Dy. CM @Nitinbhai_Patel today he got injured by a running cow. May Allah grant him speedy recovery. Questions that come to my mind 1.Who is responsible 4 dis accident? 2.The security personnel r private or still provided by d govt? @SandeepPathak04@SanjayAzadSln pic.twitter.com/Nsx8yYJNjm — Dr. Tohid Alam khan AAP 🇮🇳 (@aapkatohid) August 13, 2022 ఇదీ చదవండి: రాఖీలో విషాదం.. గాలిపటం దారం యమపాశమై! -
టీమిండియాకు గాయాల బెడద.. ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..! ఇకపై...
Rahul Dravid- Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా ఫిజియో నితిన్ పటేల్‌ను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి హెడ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడనున్నాయి. కాగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి తదితరులు గాయాల బారిన పడి ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు ప్లేయర్లు కూడా అక్కడే శిక్షణ పొందుతున్నారు. హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్, ఆ తదుపరి సంవత్సరం వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఇలా వరుస ఐసీసీ ఈవెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లు గాయాలపాలవడం టీమిండియాలో ఆందోళనకు కారణమైంది. ఈ విషయంపై దృష్టి సారించిన హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. నితిన్ పటేల్‌ను ఎన్సీఏకు పంపాలన్న ఆలోచనను బీసీసీఐతో చర్చించినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. అనువజ్ఞుడైన నితిన్ ఎన్సీఏలో ఉంటే జట్టుకు మేలు చేకూరుతుందన్న వాదనతో ఏకీభవించిన బోర్డు.. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టు తర్వాత ఇందుకు సంబంధించి ప్రకటన వెలువరించే అవకాశం ఉందని పేర్కొంది. అంతేగాక ఇటీవల ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు.. సీనియర్ వుమెన్ టీమ్ కోసం సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కోసం అన్వేషణలో పడినట్లు పేర్కొంది. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
'కరోనా అని ఇంట్లోనే కూర్చుంటే లాభం లేదు'
గాంధీనగర్ : ప్రజలు ఇంట్లో కూర్చొని 'కరోనా కరోనా' అంటే లాభం లేదని, సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించాలని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అన్నారు. మే 17 తర్వాత మరిన్ని సడలింపులు ఇస్తూ కేంద్రం అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో గుజరాత్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలిపారు. ‘కరోనా మహమ్మారి ప్రపంచంలో చాలాకాలం ఉండొచ్చని, కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న గుజరాత్లో లాక్డౌన్ కారణంగా చాలామంది జోవనోపాధి కోల్పోయారు. వ్యాపారం, ఉద్యోగాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం.. ఇలా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి దశలవారీగా సడలింపులు ఇవ్వబోతున్నాం’ అని నితిన్ పటేల్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. (గుజరాత్ డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ ఆఫర్) కరోనా కట్టడికి ఇప్పటికే రాష్ట్రం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే అని తెలిపారు. అయితే నితిన్ పటేల్ ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్లో పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని గుజరాత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ చావ్డా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం ఏసీ రూముల్లో కూర్చొని వీడియా కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు తప్పా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్ ప్రజలు కరోనావైరస్తో జీవించడం నేర్చుకోవలసి ఉంటుందని చెబుతున్నారు మరి గత 50 రోజులుగా కరోనా కట్టడికి ఏం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఇప్పటివరకు అక్కడ 9000 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, 566 మంది మరణించారు. (సెలూన్ షాప్‌లో పీపీఈ కిట్లు.. ) -
20 మంది ఎమ్మెల్యేలతో వస్తే.. సీఎం పదవి
గాంధీనగర్ : త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్లో బీజేపీ ఎమ్మెల్యేలపై గాలం వేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాట్లాడుతూ.. గుజరాత్ ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరితో ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో లాథీ నియోజకవర్గ ఎమ్మెల్యే విర్జీ తుమారానే ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై అధికార పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ కూటమికి 77 స్థానాలు దక్కాయి. అయితే మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుజరాత్ కీలకంగా మారింది. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు తమ పార్టీలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. -
ఆ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి!
గాంధీనగర్: ఆదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఓ ఆస్పత్రిలో గత ఐదేళ్ల కాలంలో వెయ్యి మందికిపైగా చిన్నారులు మరణించారు. కఛ్ జిల్లా బూజ్ పట్టణంలోని జీకే ఆస్పత్రిలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని గుజరాత్ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ బుధవారం శాసనసభలో వెల్లడించారు. క్వశ్చన్ అవర్ సయమంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు నితిన్ పటేల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జీకే ఆస్పత్రిలో గడిచిన ఐదేళ్ల కాలంలో 1,018 మంది చిన్నారులు చనిపోయినట్టు తెలిపారు. 2014-15లో 188 మంది, 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది, 2018-19(ఇప్పటివరకు) 159 మంది చిన్నారులు చనిపోయినట్టు వెల్లడించారు. జీకే ఆస్పత్రిలో చిన్నారుల మరణాలపై దర్యాప్తు చేపట్టడానికి గత ఏడాది మే నెలలో కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కమిటీ తన నివేదికలో పిల్లల మరణాలకు వేర్వేరు కారణాలను పేర్కొందన్నారు. చనిపోయినవారిలో ఆ ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు, అక్కడికి రిఫర్ చేయబడిన చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. -
అహ్మదాబాద్ ఇకపై కర్ణావతి!!
గాంధీనగర్ : గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ పేరును మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ పేర్కొన్నారు. చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తని నేపథ్యంలో అహ్మబాద్ పేరును కర్ణావతిగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నితిన్ పటేల్ మాట్లాడుతూ...‘ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు కోరుకుంటే అహ్మదాబాద్ ఇకపై కర్ణావతిగా పిలువబడుతుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నితిన్ పటేల్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెజార్టీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం దిగజారుడుతనానికి పాల్పడుతోందంటూ విమర్శించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణావతి ఎందుకు? 11 వ శతాబ్దంలో జరిగిన యుద్ధంలో అశవాల్(ప్రస్తుతం అహ్మదాబాద్‌గా పిలువబడుతున్న ప్రాంతం) రాజును ఓడించిన చాళుక్య రాజు కర్ణ సబర్మతీ తీరంలో కర్ణావతి అనే పట్టణాన్ని స్థాపించాడు. కాలక్రమంలో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న సుల్తాన్ అహ్మద్ షా కర్ణావతిని ఆక్రమించుకుని అహ్మదాబాద్‌గా పేరు మార్చాడు. అయితే ముస్లిం రాజు పేరుతో ఉన్న పట్టణ పేరును మార్చడం ద్వారా హిందూ ఓటర్లను ఆకర్షించవచ్చనే దుర్బుద్ధితోనే బీజేపీ ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. -
అమిత్ షా మంత్రాంగం.. చల్లబడ్డ నితిన్
గాంధీనగర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంత్రాంగం ఫలించింది. శాఖల కేటాయింపుల్లో తనకు అవమానం జరిగిందంటూ కినుక వహించిన గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఎట్టకేలకు మౌనంవీడారు. ఆదివారమే కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు. పోర్ట్పోలియోల విషయంలో షా స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు నితిన్ తెలిపారు. ‘‘పార్టీ చీఫ్ అమిత్ షా.. ఫోన్ చేసి నాతో మాట్లాడారు. నాకు తగిన శాఖలనే కేటాయించే విషయంలో మాట ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఆ హామీ మేరకు ఇప్పుడే సెక్రటేరియట్‌కు వెళ్లి బాధ్యతలు తీసుకుంటా’’ అని నితిన్ పటేల్ మీడియాతో అన్నారు. ఏమిటి వివాదం? : కీలకమైన ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన నితిన్ పటేల్.. గత కేబినెట్లో సీఎం తర్వాత నంబర్2గా వెలుగొందారు. తాజా ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్టానం ఆయనను మరోసారి డిప్యూటీ సీఎంను చేస్తూనే శాఖలను మార్చేసింది. తనకు సరిపడని శాఖలు కేటాయించారని కినుక వహించిన నితిన్.. పదవీబాధ్యతలు స్వీకరించకుండా తిరస్కారభావాన్ని ప్రకటించారు. నితిన్‌కు జరిగిన అవమానం యావత్ పటేల్ సామాజిక వర్గానికి జరిగిందిగా భావించాలని, 10 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వాన్నే కూల్చేయొచ్చని బీజేపీ విరోధులు ఆయనకు సూచనలు కూడా చేశారు. చివరికి అమిత్ షా జోక్యం చేసుకుని మంత్రాంగం నెరపడంతో నితిన్ చల్లబడి ఇచ్చిన శాఖలనే తీసుకునేందుకు సిద్ధపడ్డారు. (చదవండి : కొత్త ట్విస్ట్... నితిన్‌కు హార్దిక్ బంపరాఫర్) (చదవండి : గుజరాత్ కొత్త కేబినెట్లో కిరికిరి) -
కొత్త ట్విస్ట్... నితిన్‌కు హార్దిక్ బంపరాఫర్
గాంధీనగర్ : గుజరాత్ కేబినెట్ చిచ్చు తారాస్థాయికి చేరిన వేళ.. శాఖ కేటాయింపుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నితిన్‌భాయ్ పటేల్ వ్యవహారం గుజరాత్లో కొత్త రాజకీయానికి తెరలేపింది. పటేళ్ల ఆత్మగౌరవ సమస్య అంశం తెరపైకి రావటంతో పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చేశాడు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం నితిన్‌పటేల్‌కు హార్దిక్ బంపరాఫర్ ప్రకటించాడు. ‘‘ఆయన(నితిన్) వెంటనే బీజేపీని వీడాలి. తన వెంట మరో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలి. అలా వస్తే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఇప్పిస్తా’’ అని హామీ ఇస్తున్నాడు. బీజేపీ గౌరవించని పక్షంలో ఇంకా పార్టీని పట్టుకుని వేలాడే అవసరం నితిన్‌కు ఏంటని హార్దిక్ ప్రశ్నిస్తున్నాడు. సారంగపూర్‌లో మీడియాతో హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమాన భారంతో రగిలిపోతున్నట్లు, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పరిస్థితి అసంతృప్తి తారాస్థాయికి చేరితే మాత్రం బీజేపీ చెయ్యి జారి గుజరాత్ రాజకీయాల్లో సమూల మార్పులు వాటిల్లే అవకాశం ఉందన్నది విశ్లేషకుల మాట. -
గుజరాత్ : కొత్త కేబినెట్లో కిరికిరి
గాంధీనగర్ : కొత్తగా ఏర్పాటయిన గుజరాత్ కేబినెట్లో శాఖల కిరికిరి మొదలైంది. మొన్నటిదాకా మంత్రివర్గంలో నంబర్-2గా కొనసాగిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు.. ఈ దఫా కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖలు దక్కలేదు. శాఖల కోతను అవమానంగా భావిస్తోన్న నితిన్.. విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నారు. శుక్రవారం నాటికి దాదాపు మంత్రులంతా బాధ్యతలు స్వీకరించినా.. ఆయన మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇది తమ నాయకుడి ఆత్మగౌరవ సమస్య అని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని నితిన్ సన్నిహిత వర్గీయులు వ్యాఖ్యానించారు. చేజారిన టాప్ పోస్ట్! : 2016 ఆగస్టులో ఆనందిబెన్ పటేల్ రాజీనామా అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒకదశలో ఆయన పేరునే ఖరారుచేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో విజయ్ రూపానీకి సీఎం పీఠం దక్కింది. కాగా, డిప్యూటీ హోదాతోపాటు ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలు దక్కడంతో నితిన్ మిన్నకుండిపోయారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నితిన్‌కు మరోసారి డిప్యూటీ పోస్టు లభించింది కానీ శాఖల్లో కోత పడింది. ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్‌కు అప్పగించగా, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను సీఎం రూపానీ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. నితిన్ పటేల్‌కు రోడ్లు, భవనాలు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, నర్మదా-కల్పసర్ ప్రాజెక్టు శాఖలను కేటాయించారు. తాడోపేడో తేల్చుకుంటాం : శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమానభరంతో రగిలిపోతున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. పాత శాఖలను తిరిగి కేటాయిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని నితిన్ బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లుతెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్(ఫైల్ ఫొటో) -
రూపానీదే గుజరాత్ పీఠం
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీనే రెండోసారీ గుజరాత్ సీఎం పీఠం వరించింది. శుక్రవారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యులతో భేటీ తర్వాత పార్టీ కేంద్ర పరిశీలకుడు అరుణ్ జైట్లీ వివరాలు వెల్లడిస్తూ.. శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్ పటేల్‌ను ఎన్నుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నిక ల్లో వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవ సం చేసుకున్నా తక్కువ మెజార్టీతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో రూపానీని మరోసారి సీ ఎంగా కొనసాగించే అంశంపై ఊహాగానాలు కొనసాగాయి. అయితే పార్టీ అగ్ర నాయకత్వంతో రూపానీకి ఉన్న సాన్నిహిత్యం.. ఎలాంటి మచ్చలేని రాజకీయ జీవితం, తటస్థ కుల వైఖరి వంటి అంశాలు పూర్తిగా ఆయన వైపు మొగ్గు చూపేలా చేశాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఉప నేత పదవులకు రూపానీ, పటేల్ పేర్లను ఎమ్మెల్యే భూసేంద్ర సిన్హ్ చుదాసమ సూచించారని.. మరో ఐదుగురు సభ్యులు చుదాసమ ప్రతిపాదనను సమర్ధించారన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రూపానీ సంప్రదింపులు జరుపుతారని జైట్లీ చెప్పారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో.. 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. ఇక మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించింది. గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థి రతన్ సిన్హ్ రాథోడ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పరిశీలకుల భేటీ మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ పాటు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మంగళ్ పాండేలు శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత మీడియాను కలవకుండానే ఢిల్లీ బయల్దేరారు. శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఈ బృందం పార్టీ అధినాయకత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా సీఎం పేరుపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. కంగ్రా ఎంపీ శాంతా కుమర్, మండీ ఎంపీ రామ్ స్వరూప్, సిమ్లా ఎంపీ కశ్యప్, మరో సీనియర్ నేత సురేశ్ భరద్వాజ్‌లు... పార్టీ కేంద్ర పరిశీలకుల్ని కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో కేంద్ర మంత్రి నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్లు ముందు వరుసలో ఉన్నారు. మయన్మార్ టు భారత్ విజయ్ రూపానీ(61) మయన్మార్ రాజధాని యాంగాన్(అప్పట్లో రంగూన్)లో జన్మించారు. ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కారణంగా 1960లో రూపానీ కుటుంబం గుజరాత్‌కు తరలివచ్చి రాజ్‌కోట్‌లో స్థిరపడింది. విద్యార్థి దశలోనే ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. కొన్నాళ్లు ఏబీవీపీలో పనిచేశాక బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జైన వర్గానికి చెందిన రూపానీ గుజరాత్లో బీజేపీ పటిష్టానికి ఎంతో కృషి చేశారు. 2006 నుంచి 2012 వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2014లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వజూభాయ్ వాలా కర్ణాటక గవర్నర్‌గా వెళ్లడంతో.. రాజ్‌కోట్ వెస్ట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. ఫిబ్రవరి 19, 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆగస్టు, 2016లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామాతో ఆయనను సీఎం పీఠం వరించింది. 2006లో గుజరాత్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రోత్సాహానికి చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. -
సీఎం అభ్యర్థిపై బెట్టింగ్ మార్కెట్ ఏమంటోందంటే?!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మొన్నటి వరకూ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారంటూ.. పందేలు కట్టిన బుకీలు తాజాగా సీఎం అభ్యర్థిపై భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. మెజారిటీ విషయంలో సర్వేలకన్నా బెట్టింగ్ మార్కెట్ అంచనాలు కచ్చితంగా ఉండడంతో.. సీఎం అభ్యర్థిపై బెట్టింగ్ పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్ సీఎం అభ్యర్థి రేసులో ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, నితిన్ పటేల్ ఉన్నారు. విజయ్ రూపానీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. విజయ్ రూపానీ మీద రూ. 1.60, నితిన్ పటేల్ మీద కూడా 1.60 బెట్టింగ్ నడుస్తోంది. ఇక అమిత్ షా మీద రూ. 3, కొత్త వ్యక్తి అవుతాడని రూ. 6 బెట్టింగ్ కాస్తున్నారు. ఆనందిబెన్ పటేల్ తరువాత అందరూ నితిన్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఎవరూ ఊహించని విధంగా విజయ్ రూపానీ సీఎం అయ్యారు. అలాగే యూపీలో కూడా ఎవరి అంచనాలకు అందకుండా యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠం ఎక్కారు. ఈ నేపథ్యంలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో అమిత్ షా మీద కూడా పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. -
ముఖ్యమంత్రి గెలుపు.. ముందంజలో డిప్యూటీ
గాంధీనగర్ : హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ పోరులో రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజయం సాధించారు. అయితే, ఈ విజయం ఆయన్ను కలవరపాటుకు గురి చేసిందనడంలో సందేహం లేదు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పలుమార్లు ఆధిక్యంలోకి వచ్చారు. విజయం సాధించిన రూపానీ, ఇంద్రనీల్ రాజ్యగురుల మధ్య తేడా పెద్దగా ఏమీ లేదు. మరోవైపు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌లు వెనుకంజలోకి వెళ్లి తిరిగి పుంజుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మెహసానా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. భావ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి జీతూ వాఘాణీ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు రాధన్‌పూర్ నియోజకవర్గంలో ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్, వడ్గాంలో దళిత నేత జిగ్నేష్ మెవానీలు ముందంజలో కొనసాగుతున్నారు. -
హార్థిక్ పటేల్ ఒక ఫూల్..!
అహ్మదాబాద్: పటీదార్ సామాజికవర్గాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పీఏఏఎస్ నేత హార్థిక్ పటేల్ ప్రయత్నిస్తున్నారని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మండిపడ్డారు. పటేల్ (పటీదార్) సామాజికవర్గానికి రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ.. ఉట్టి బక్వాస్ అని ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ కోటా హామీ అంగీకరించిన హార్థిక్ పటేల్‌ను ఫూల్ (మూర్ఖుడి)గా అభివర్ణించారు. ’కొందరు మూర్ఖులు మరికొందరు మూర్ఖులకు ఒక కాగితం ముక్కను ఇచ్చారు’ అని నితిన్ పేర్కొన్నారు. పటేల్‌కు బీసీ రిజర్వేషన్ కల్పించాలన్న తమ షరతులను కాంగ్రెస్ అంగీకరించిందంటూ హార్థిక్ పేర్కొన్న వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) గత రెండేళ్లుగా ఆందోళనలు నిర్వహించిందని, తీరా ఇప్పుడు ఆ డిమాండ్‌ను పక్కనబెట్టి కాంగ్రెస్ హామీని తలకెత్తుకుందని ఆయన విమర్శించారు. ‘సమాజంలో ఇది కులవాదాన్ని వ్యాప్తి చేసింది. మన సామాజికవర్గానికి ఉన్న ప్రతిష్టను హార్థిక్ దిగజార్చారు. సర్దార్ పటేల్, భగత్ సింగ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు’ అని నితిన్ ధ్వజమెత్తారు. అయితే, నితిన్ విమర్శలను హార్థిక్ తోసిపుచ్చారు. పటీదార్ సామాజికవర్గాన్ని ఫూల్స్ గా చూపేందుకు నితినే ప్రయత్నిస్తుందని హార్థిక్ ఎదురుదాడి చేశారు. తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని, గుజరాత్లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా అంగీకరించిందని, సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లను బీసీల్లో చేరుస్తామని ఆ పార్టీ పేర్కొందని హార్థిక్ పటేల్ ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు
-
డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్ ఎక్కనివ్వలేదు
అహ్మదాబాద్ : గుజరాత్ డిప్యూటీ సీఎం తనయుడు జైమిన్ పటేల్‌కు ఖతార్ ఎయిర్వేస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఫుల్‌గా మద్యం సేవించి విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయనను విమానంలో ఎక్కించుకునేందుకు ఖతార్ ఎయిర్వేస్ నిరాకరించింది. దాంతో వెకేషన్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన జైమిన్ కుటుంబం అర్థాంతంగా తమ ట్రిప్ రద్దు చేసుకుని, ఇంటిముఖం పట్టింది. అయితే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తన కొడుకునే వెనకేసుకు వచ్చారు. పైపెచ్చు తన కుమారుడి తప్పేమీ లేదని, ఎయిర్వేస్ సిబ్బందే అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు, వ్యాపారవేత్త జైమిన్ పటేల్ కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు గ్రీస్ వెళ్లేందుకు సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అయితే విమానం ఎక్కేందుకు వచ్చిన జైమాన్ అతిగా మద్యం సేవించి ఉండటంతో బోర్డింగ్ వద్దే ఆయన్ని ఖతార్ ఎయిర్వేస్ సిబ్బంది నిలిపివేశారు. తమకు సహకరించాలని ఆయన్ని సిబ్బంది కోరినప్పటికీ జైమిన్ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో వారు జైమిన్ కుటుంబాన్ని విమానంలోకి ఎక్కించుకునేందుకు తిరస్కరించారు. కాగా మద్యం సేవించిన జైమిన్ పటేల్ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, దీంతో ఆయన్ని వీల్ ఛైర్లో తీసుకు వచ్చినట్లు విమాన సిబ్బంది వెల్లడించారు. అలాగే ఇమ్మిగ్రేషన్, ఇతర చెకింగ్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ తమను డీఫేమ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయన్నారు. తన కుమారుడు, కోడలు, మనమరాలు వెకేషన్‌కు వెళుతున్నారని, తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, తెలిపారు. దీంతో వారు టూర్ వెళ్లకుండానే వెనుదిరిగి ఇంటికి వచ్చేశారన్నారు. అయితే తమను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రపన్ని అవాస్తవాలు, పుకార్లకు తెరలేపారని నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. -
గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి మహాత్మా మందిర్‌లో గవర్నర్ ఓపీ కోహ్లి మధ్యాహ్నం ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డిప్యూటీ సీఎం పదవి ఏర్పాటు చేశారు. నితిన్‌తో సహా 8 మంది కేబినెట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులు వెరసి 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. పాత మంత్రివర్గంలో నుంచి ఆనందీబెన్ పటేల్ వర్గానికి చెందిన ఇద్దరు, మరో ఏడుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. ఆనందీబెన్ వర్గీయులైన హోం సహాయ మంత్రి రజనీభాయ్ పటేల్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి వసుబెన్ త్రివేదిలను కొత్త కేబినెట్లోకి తీసుకోలేదు. ఆర్థిక మంత్రి సౌరభ్, సాంఘిక న్యాయ మంత్రి వోరా, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రి గోవింద్ పటేల్‌లకు ఉద్వాసన పలికారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మంత్రివర్గంలో అన్ని కులాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారు. పటేల్ వర్గానికి చెందిన 8 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కేబినెట్లోకి ఒకే ఒక మహిళ (నరోడ ఎమ్మెల్యే నిర్మల వాధ్వానీ)ను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత అద్వానీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, హర్షవర్ధన్, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, రఘుబర్ దాస్, మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ అభినందనలు గుజరాత్ కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన రూపానీకి ప్రధానిమోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ పర్యటన వల్ల రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేక పోయిన మోదీ.. రూపానీ, నితిన్ బృందం రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన ఆనందీబెన్ పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమని మరో ట్వీట్లో కొనియాడారు. -
నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి
-
నితిన్‌కు నిరాశ
గాంధీనగర్: ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆశించిన నితిన్ భాయ్ పటేల్‌కు కొంత నిరాశ కలిగింది. ఆయన డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం గుజరాత్ నాయకుల్లో.. మంత్రుల్లో నితిన్ భాయ్ పటేల్ మాత్రమే సీనియర్. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మొన్న ఆనందీ బెన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ నిర్వహించారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు ఉన్న బలహీనత ఒక్కటే అది కూడా ఈయనకు పటేల్ సామాజిక వర్గం కొంత దూరంగా ఉంటుంది. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లను ఇప్పించాలనే డిమాండ్ తోనే పటేళ్ల ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పీఠం మార్పునకు కూడా ఈ ఉద్యమం, దళితుల ఉద్యమం ఓ కారణమైంది. ఇలాంటి సమయంలో తిరిగి పటేళ్లకు పడని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే వివాదంగా మారుతుందేమోనని భావించిన బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఈ పదవిని విజయ్ రూపానికి అప్పగించినట్లు తెలుస్తోంది. కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి ముందు నితిన్ భాయ్ నే సీఎం అభ్యర్థి అని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటేళ్ల ఆందోళన సమస్యను అదిగమిస్తామన్నారు. 'పటేళ్ల వర్గం నాయకులతో మాట్లాడతాం. హర్థిక్ పటేల్, లాల్జీ, ఇతర నేతలందరితో సమస్యపై చర్చిస్తాం. దళితుల ఆందోళనను గుజరాత్ ప్రభుత్వం నియంత్రించలేక పోయిందనడం సరికాదు. ఆనందీ బెన్ పటేల్ ఆమె పనిచేసిన 26 నెలలు ఎంతో కష్టపడి పనిచేశారు' అని చెప్పారు. కానీ అనూహ్యంగా సీఎం అభ్యర్థి మారిపోయారు. నితిన్ భాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు. -
నితిన్కాదు.. విజయ్ ముఖ్యమంత్రి
గాంధీనగర్: అనూహ్యంగా ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని అధిష్టించనున్నారు. అంతకుముందు ఈ పదవి దక్కించుకుంటారని ఊహాగానాలు వచ్చిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎమ్మెల్యేలతో భేటీ అయిన అమిత్ షా ఈ నిర్ణయాన్ని వెలువరించారు. విజయ్ రూపాని ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. పరిపాలన పరంగా కూడా మంచి పట్టున్న వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం అమిత్ షా అహ్మదాబాద్ లోనే ఉండి పార్టీ ఎమ్మెల్యేలందరితో కాబోయే సీఎంపై వారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నితిన్ భాయ్ పటేల్ ఉత్తర గుజరాత్లో బలమైన నాయకుడని ఆయననే సీఎం పీఠం వరిస్తుందని తొలుత ఊహగానాలు వెలువడ్డాయి. -
గుజరాత్ సీఎం ఈయనేనంట!
గాంధీనగర్: అనూహ్యంగా ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠాన్ని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఆనందీ బెన్ పటేల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్ అధిరోహించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అధికార వర్గంతో రాష్ట్ర ఎమ్మెల్యేలు భేటీ కానున్న కొన్ని గంటలముందు కీలక వర్గాలు ఈ సమాచారం వెల్లడించాయి. నితిన్ పటేల్ ఉత్తర గుజరాత్లో బలమైన నాయకుడు. ఆయన తొలిసారి గుజరాత్ అసెంబ్లీకి 1999 ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్న ఆనందీ బెన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ నిర్వహించారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గ సభ్యులందరికన్నా ఈయనే సీనియర్ కూడా. అయితే, ఈయనకు పటేల్ సామాజిక వర్గం కొంత దూరంగా ఉంటుంది. ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్లను ఇప్పించాలనే డిమాండ్ తోనే పటేళ్ల ఉద్యమం వచ్చిన విషయం తెలిసిందే. సీఎం పీఠం మార్పునకు కూడా ఈ ఉద్యమం, దళితుల ఉద్యమం ఓ కారణమైంది. కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడానికి ముందు నితిన్ పటేల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటేళ్ల ఆందోళన సమస్యను అదిగమిస్తామన్నారు. 'పటేళ్ల వర్గం నాయకులతో మాట్లాడతాం. హర్థిక్ పటేల్, లాల్జీ, ఇతర నేతలందరితో సమస్యపై చర్చిస్తాం. దళితుల ఆందోళనను గుజరాత్ ప్రభుత్వం నియంత్రించలేక పోయిందనడం సరికాదు. ఆనందీ బెన్ పటేల్ ఆమె పనిచేసిన 26 నెలలు ఎంతో కష్టపడి పనిచేశారు' అని చెప్పారు. -
ఆనందీబెన్ వారసుడెవరు?
-
ఆనందీబెన్ వారసుడెవరు?
తెరపైకి నితిన్ పటేల్, రూపానీ, కేంద్రమంత్రి పురుషోత్తం అహ్మదాబాద్: గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటనతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీచేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆనందీబెన్ పటేల్ రాజీనామాను ఆమోదించటంతోపాటు కొత్త సీఎంనూ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, అసెంబ్లీ స్పీకర్ గణపత్ వసావా (గిరిజన నాయకుడు) జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు పార్టీలో మంచి పట్టుంది. దీనికి తోడు మోదీ పీఎం అయ్యాక.. గుజరాత్ సీఎం రేసులో నితిన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. పటేల్ సామాజిక వర్గానికి చెందినవాడైనా ఆ వర్గం యువత ఈయనపై పూర్తి వ్యతిరేకతతో ఉండటం.. నితిన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జైన్ వర్గానికి చెందిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది. గుజరాత్ ఇంధన మంత్రి సౌరభ్ పటేల్ పేరు కూడా సీఎం రేసులో వినబడుతోంది. ఈయన.. అంబానీ సోదరులకు దగ్గరి బంధువు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, స్పీకర్ గణపత్ వసావాలకూ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే.. గుజరాత్ బీజేపీ కార్యకర్తలు మాత్రం అమిత్ షా సీఎం అయితే.. పార్టీకి రాష్ట్రంలో ఎదురవుతున్న చిన్నాచితకా సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కాగా, బీజేపీ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను తొలగించటం.. ఆమెను బలిపశువును చేయటమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. -
గుజరాత్ కొత్త సీఎం ఎవరు?
న్యూఢిల్లీ: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటన చేయడంతో ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ మొదలైంది. రెండుమూడు రోజుల్లో నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశముంది. గుజరాత్ కొత్త సీఎంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. నారన్‌పురా అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ షా... గతంలో గుజరాత్ హోంమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి వదులుకోవడాన్ని ప్రధాని మోదీ అంగీకరిస్తారా, లేదా అనేది చూడాలి. అమిత్ షా తర్వాత పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. అమిత్ షాను గుజరాత్ సీఎంగా పంపకపోతే వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న పురుషోత్తం రేసులో ముందున్నారు. సౌరాష్ట్రలోని కడవా పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఆయన గుజరాత్ బీజేపీలో మోదీ తర్వాత మంచి వక్తగా పేరు గాంచారు. అమిత్ షా కంటే సీనియర్ అయిన ఆయన కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ ప్రభుత్వంలో అధికారికంగా నంబర్ టూగా కొనసాగుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆనందీబెన్ వారసుడిగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా విన్పిస్తోంది. జైన్ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొవడంలో సిద్ధహస్తుడు. సంఘ పరివార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దాల్సానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హాయంలో శక్తివంతమైన నేతగా ఉన్న ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంధానకర్తగా కీలకభూమిక పోషించారు. ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరి పేరు విన్పిస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘అక్రమ నిఘా’పై విచారణ కమిషన్
అహ్మదాబాద్: అక్రమ నిఘా వ్యవహారం దుమారం లేపడంతో గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి స్పందించక తప్పలేదు. ఆ అంశంపై గుజరాత్ ప్రభుత్వం సోమవారం ద్విసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ హైకోర్టుకు చెందిన రిటైర్డ్ మహిళా జడ్జి సుగ్నాబెన్ భట్ నేతృత్వంలోని ఈ కమిషన్3 నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. ‘ఒక మహిళకు భద్రత కల్పించిన విషయంలో వచ్చిన ఆరోపణలపై ఒక విచారణ సంఘాన్ని నియమించాం’ అని ఆర్థిక మంత్రి నితిన్ పటేల్ తెలిపారు. మోడీకి సన్నిహితుడైన మాజీ మంత్రి అమిత్‌షా మౌఖిక ఆదేశాలపై ఒక మహిళపై పోలీసులు అక్రమంగా నిఘా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.