గాంధీనగర్ : ప్రజలు ఇంట్లో కూర్చొని 'కరోనా కరోనా' అంటే లాభం లేదని, సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించాలని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అన్నారు. మే 17 తర్వాత మరిన్ని సడలింపులు ఇస్తూ కేంద్రం అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో గుజరాత్‌లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలిపారు.
‘కరోనా మహమ్మారి ప్రపంచంలో చాలాకాలం ఉండొచ్చని, కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న గుజరాత్‌లో లాక్‌డౌన్ కారణంగా చాలామంది జోవనోపాధి కోల్పోయారు. వ్యాపారం, ఉద్యోగాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం.. ఇలా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి దశలవారీగా సడలింపులు ఇవ్వబోతున్నాం’ అని నితిన్ పటేల్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
(గుజరాత్ డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ ఆఫర్)
కరోనా కట్టడికి ఇప్పటికే రాష్ట్రం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే అని తెలిపారు. అయితే నితిన్ పటేల్ ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్‌లో పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని గుజరాత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ చావ్డా ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం ఏసీ రూముల్లో కూర్చొని వీడియా కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు తప్పా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్ ప్రజలు కరోనావైరస్‌తో జీవించడం నేర్చుకోవలసి ఉంటుందని చెబుతున్నారు మరి గత 50 రోజులుగా కరోనా కట్టడికి ఏం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఇప్పటివరకు అక్కడ 9000 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, 566 మంది మరణించారు.
(సెలూన్ షాప్‌లో పీపీఈ కిట్లు.. )
Comments
Please login to add a commentAdd a comment