గాంధీనగర్: లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేకపోయిన ఓ కార్మికుడు మనస్థాపంతో తన నాలుక కోసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన శనివారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ శర్మ శిల్పాలు చెక్కుతుంటాడు. ఈ క్రమంలో అతను ప్రస్తుతం గుజరాత్‌లోని బనస్కంత జిల్లాలోని నాదేశ్వరి మాతాజీ ఆలయంలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లడానికి ఏ దారి లేకపోవడంతో అతను ఇంటిపై బెంగ పెట్టుకున్నాడు. దీంతో శనివారం నాడు ఆలయం ఎదుట నాలుక కోసుకున్నాడు. అపస్మారక స్థితిలో, రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ తనకూ సోకుతుందన్న భయంతో ఈ పని చేసుంటాడని కొందరు అనుమానిస్తుండగా, మరికొందరు మాత్రం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నాలుకను బలి ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. (వధూవరుల అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment