![Class 7 student from Noida gives away piggy bank savings to help migrant labourers - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/1/Nioda%20girl.jpg.webp?itok=o1x6wI8R)
నిహారిక ద్వివేది
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్‌డౌన్ సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న సంస్థల దాకా, సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ముందుకు వస్తున్నారు. ఈక్రమంలోనే తమ స్వస్థలాలకు చేరకునేందుకు వేల కీలోమీటర్లు కాలినడకన పోతున్న వారి గాథలను విన్న ఓ బాలిక (12) మనసు ద్రవించింది. అందుకే తను పిగ్గీ బ్యాంకులో దాచుకున్న సొమ్మును వారికోసం వెచ్చించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది.(మనసు బంగారం)
నోయిడాకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని నిహారికా ద్వివేది గత రెండేళ్లుగా తను దాచుకున్న రూ .48,530 మొత్తాన్ని వలస కార్మికులు తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి సహాయంగా ప్రకటించింది. వలస కార్మికుల కష్టాలను చానళ్లలో చూసి చలించిపోయాననీ, అలాగే చాలామంది దాతలు ఇస్తున్న విరాళాలు కూడా తనను ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రేరేపించిందని తెలిపింది. తన వంతు బాధ్యతగా సాయం అందిస్తున్న ముగ్గురిలో ఒకరు క్యాన్సర్ రోగి కూడా ఉన్నారని నిహారికా చెప్పారు.
దీనిపై నిహారిక తల్లి, సుర్బీ ద్వివేది మాట్లాడుతూ వలస కూలీల గురించి వార్తలు చూసినప్పుడల్లా పాప చాలా బాధపడటం గమనించాము. అందుకే సన్నిహితుల ద్వారా వివరాలు సేకరించి ఆమె కోరిక మేరకు, ముగ్గురికి విమాన టికెట్లకు ఏర్పాటు చేసి పంపించామని తెలిపారు. ఇందుకు తమకు చాలా గర్వంగానూ, సంతోషంగానూ వుందన్నారు.
చదవండి :అతిపెద్ద మొబైల్ మేకర్‌గా భారత్: కొత్త పథకాలు
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment