
కొందరు ఆ భవన సముదాయంపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు.
సూరత్: మహమ్మారి కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలతోంది. అత్యవసర సేవలు, సర్వీసులు మినహా అన్నీ రద్దయ్యాయి. ఈనేపథ్యంలో తమను ఇళ్లకు పంపించకుండా బలవంతంగా పనిచేయించుకుంటున్నారని సూరత్‌లోని వజ్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది డైమండ్ బీ బౌర్స్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కొందరు ఆ భవన సముదాయంపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామినిచ్చారు.
(చదవండి: లాక్‌డౌన్: అక్కడ మరికొన్ని సడలింపులు)