సూరత్: కరోనా లాక్‌డౌన్ కారణంగా సూరత్‌లో చిక్కుకున్న వలస కార్మికులు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని, పని ప్రదేశాల్లో తమకు రావాల్సిన వేతనాలు చెల్లించలేదని ఆగ్రహించిన కార్మికులు వాహనాలకు నిప్పు పెట్టారు. డిజైనింగ్ పనులు చేసే మంచాలను కూడా తగులబెట్టారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు.
(చదవండి: కరోనాతో 14 నెలల చిన్నారి మృతి)
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 100కు పైగా నమోదైన మరునాడే ఈ ఘటన జరగడం గమనార్హం. లాక్‌డౌన్‌తో పనులు లేక... తిండి దొరక్క అల్లాడుతున్న తమను పట్టించుకున్న నాథుడే లేడని పలువురు వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సొంత ఊళ్లకైనా పంపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుజరాత్‌లో గురువారం ఒక్కరోజే 116 కరోనా కొత్త కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 378కి చేరింది. ఇదే క్రమంలో రెండు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 19కి చేరింది.
(చదవండి: కష్టమే..అయినా తప్పదు - ఇటలీ ప్రధాని)
Comments
Please login to add a commentAdd a comment