అహ్మదాబాద్: అక్రమ నిఘా వ్యవహారం దుమారం లేపడంతో గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి స్పందించక తప్పలేదు. ఆ అంశంపై గుజరాత్ ప్రభుత్వం సోమవారం ద్విసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ హైకోర్టుకు చెందిన రిటైర్డ్ మహిళా జడ్జి సుగ్నాబెన్ భట్ నేతృత్వంలోని ఈ కమిషన్3 నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. ‘ఒక మహిళకు భద్రత కల్పించిన విషయంలో వచ్చిన ఆరోపణలపై ఒక విచారణ సంఘాన్ని నియమించాం’ అని ఆర్థిక మంత్రి నితిన్ పటేల్ తెలిపారు. మోడీకి సన్నిహితుడైన మాజీ మంత్రి అమిత్‌షా మౌఖిక ఆదేశాలపై ఒక మహిళపై పోలీసులు అక్రమంగా నిఘా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.