సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మొన్నటి వరకూ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారంటూ.. పందేలు కట్టిన బుకీలు తాజాగా సీఎం అభ్యర్థిపై భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. మెజారిటీ విషయంలో సర్వేలకన్నా బెట్టింగ్ మార్కెట్ అంచనాలు కచ్చితంగా ఉండడంతో.. సీఎం అభ్యర్థిపై బెట్టింగ్ పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.
గుజరాత్ సీఎం అభ్యర్థి రేసులో ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, నితిన్ పటేల్ ఉన్నారు. విజయ్ రూపానీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. విజయ్ రూపానీ మీద రూ. 1.60, నితిన్ పటేల్ మీద కూడా 1.60 బెట్టింగ్ నడుస్తోంది. ఇక అమిత్ షా మీద రూ. 3, కొత్త వ్యక్తి అవుతాడని రూ. 6 బెట్టింగ్ కాస్తున్నారు.
ఆనందిబెన్ పటేల్ తరువాత అందరూ నితిన్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఎవరూ ఊహించని విధంగా విజయ్ రూపానీ సీఎం అయ్యారు. అలాగే యూపీలో కూడా ఎవరి అంచనాలకు అందకుండా యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠం ఎక్కారు. ఈ నేపథ్యంలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో అమిత్ షా మీద కూడా పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment