ముఖ్యమంత్రి గెలుపు.. ముందంజలో డిప్యూటీ | Vijaya Rupani wins Rajkot Constituencey in Gujarat Elections | Sakshi

ముఖ్యమంత్రి గెలుపు.. ముందంజలో డిప్యూటీ

Dec 18 2017 9:50 AM | Updated on Mar 18 2019 9:02 PM

Vijaya Rupani leads In Gujarat Elections - Sakshi

గాంధీనగర్‌ : హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ పోరులో రాజ్‌కోట్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ విజయం సాధించారు. అయితే, ఈ విజయం ఆయన్ను కలవరపాటుకు గురి చేసిందనడంలో సందేహం లేదు. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పలుమార్లు ఆధిక్యంలోకి వచ్చారు. విజయం సాధించిన రూపానీ, ఇంద్రనీల్ రాజ్యగురుల మధ్య తేడా పెద్దగా ఏమీ లేదు. మరోవైపు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌లు వెనుకంజలోకి వెళ్లి తిరిగి పుంజుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి మెహసానా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. భావ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి జీతూ వాఘాణీ వెనుకంజలో ఉన్నారు. మరోవైపు రాధన్‌పూర్‌ నియోజకవర్గంలో ఓబీసీ నేత అల్పేష్‌ ఠాకూర్‌, వడ్గాంలో దళిత నేత జిగ్నేష్‌ మెవానీలు ముందంజలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement