సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు... ఈ దఫా బెట్టింగ్ మార్కెట్‌ను కూడా టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకాన్ని సత్తార్ మార్కెట్ వ్యక్తం చేస్తున్నా.. మెజారిటీపై ధీమాను ప్రకటించడం చేయడం లేదు. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల మొదటి దశకు రెండు రోజులు మాత్రమే గడువుండడంతో పందెం రాయుళ్లు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు ఈ ఎన్నికల ఫలితాలపై దాదాపు రూ. 500 నుంచి 600 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది.
బెట్టింగ్ మార్కెట్ అంచనాలు, వివిధ సర్వేల మేరకు.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం అంత ఆషామాషీ కాదని తెలుస్తోంది. ఒకవేళ భారతీయ జనతాపార్టీ గెలిచినా.. కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికలు మోదీ-అమిత్ షా ద్వయానికి అతి పెద్ద పరీక్షలా నిలిచాయని మరికొందరు చెబుతున్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు
- ఈ ఎన్నికల్లో బీజేపీకి 101 నుంచి 103 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా.
- అలాగే కాంగ్రెస్ పార్టీకి 71 నుంచి 73 సీట్లు రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బుకీ రేట్
- బీజేపీ 110 సీట్లు గెలుస్తుందన్న అంశంపై ఒకటిన్నర రూపాయి, 125 సీట్లకు పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ. 3.50, అలాగే 150కి పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ.7 బుకీ రేట్‌గా ఉంది.
- అలాగే కాంగ్రెస్ 99-100 సీట్లకు బుకీ రేట్ రూ.3, 75 సీట్లకు రూపాయి 10 పైసలు ఉంది.
- అలాగే ఎన్నికల తరువాత విజయ్ రూపానీ ముఖ్యమంత్రి అవుతాడన్న అంశంపై 44 పైసలు, నితిన్ పటేల్ సీఎం అనే దానిపై 55 పైసలును బుకీలు రేట్‌గా పెట్టారు.
- బుకీల రేటును బట్టి బీజేపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఏర్పడింది.
- బీజేపీ విజయం సాధిస్తే మరోమారు విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment