bettings
-
టీడీపీ బెట్టింగ్ లపై గోరంట్ల సెటైర్లు
-
బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.!
బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద యాసిడ్‌లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది . బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం ! తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ ! " కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి. కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు . తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య . కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ "కంచులు" గణగణ మోగుతుంటాయి . " ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకిలో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డప్‌లు ఇస్తూ బతికేస్తారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఆత్మ న్యూనతా భావం. ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ? నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది. కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం. నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు . ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎన్నికలు .. క్రికెట్... సినిమా జయాపజయాలు.. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం. ఒక్క సారి గెలిస్తే.. "ఇప్పుడు మనకు సుడి తిరిగింది.. స్టార్స్ కలిసి వస్తున్నాయి.. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు. ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ క్వొశ్చన్.. ఓడిపోయి పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు. అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం. పద్మ వ్యూహం.. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్. జూదంలో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మహా కిక్కు ఇస్తుంది. ముందుగా ఒక పెగ్గు మందుతో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు. బెట్టింగ్ కూడా అంతే. అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది. కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాకా దారితీస్తుంది . "నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్. జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు. బెట్టింగ్ డోపమైన్ "హై" అనేది ఒక సైంటిఫిక్ రూల్. అది ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయి కొంపలు కాలిపోయి ఉంటాయి. మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే. కేసినోకు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు. బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది. బకరాలు నమ్మేస్తారు . బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్‌లో కూడా ఇదే ధ్యాసతో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు, ఆ తర్వాత ఇంకేముంది.. సంసార జీవనంలో చిక్కులే చిక్కులు. బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది. బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పతనం వేగంగా సాగుతుంది. తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోకుండా ఉండేందుకు అబద్దాలు చెప్పడం మొదలెడతారు. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్. డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు . బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు .. బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది . 25ఏళ్ళ లోపు వారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటుంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్. చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు. దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది. మందు తాగితే 15 ఏళ్లకు. గంజాయి కొడితే ఐదేళ్లకు. ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు.. చస్తారు. మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం. కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని.. తస్మాత్ జాగ్రత్త . పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి . 'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి . కష్టపడే తత్వాన్ని నేర్పండి. వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతారా?
కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతాడు!.. నా పందెం ఇంత లే.. గజ్వేల్‌లో ఈటలనే గెలుస్తాడు! అంతకంటే డబుల్ నా పందెం హరీష్‌రావు లాస్ట్ ఎలక్షన్ల వచ్చిన మెజారిటీ ఈసారి క్రాస్ చేస్తాడని నా బెట్ దాటడని నా బెట్ ఖమ్మంలో పువ్వాడ-తుమ్మల పోటీలో గెలుపు ఆయనదే.. బర్రెలక్క ఈ ఎలక్షన్స్‌లో కచ్చితంగా గెలుస్తుందని ఇంత సొమ్ము వేస్తున్నా.. మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ సమయంలోనే పందెం రాయుళ్ల జోరు పెంచారు. గత నెల రోజుల నుంచి ఎలక్షన్ బెట్టింగ్ ఈ తంతు నడుస్తున్నప్పటికీ.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు, కౌంటింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు పందెం కాసే సొమ్ము అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద లీడర్ సాబ్‌ల మీద, తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. కాయ్ రాజా కాయ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల మీద జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. మొత్తం 33 జిల్లాల్లో.. ఎంపిక చేసిన నేతలపైనే పందేలు వేస్తున్నారు. బెట్టింగ్స్ కోసమే సర్వేలు చేయించుకున్న కొందరు.. లక్షల నుంచి కోట్లలో కాస్తున్నారు. ముఖ్య నేతల మీద, మంత్రుల గెలుపోటముల మీద ఓ లెక్క లేకుండా వేస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏపీకి సమీపంలో ఉన్న ప్రాంతాలపై బెట్టింగ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. షాకింగ్ బెట్. ఇంట్రెస్టింగ్ రేటు దుబ్బాకలో రఘునందన్‌రావు గెలుస్తాడా? ఓడిపోతాడా?.. సంగారెడ్డిలో రఘునందన్‌రావు మళ్లీ నెగ్గుతాడా?ఇలా.. ఆప్షన్లతో బెట్టింగులు నడుస్తున్నాయి. కామారెడ్డి, గజ్వేల్ మీద బెట్టింగ్ ముఠాల స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో కేసీఆర్ పోటీ చేస్తుండడమే ప్రధాన కారణమని చెపనక్కర్లేదు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు అనేదానికంటే.. గజ్వేల్‌లో ఈటల నెగ్గుతారనే ఇంకా ఎక్కువ సొమ్ముతో పందెం వేస్తున్నారు. అంతెందుకు విదేశాల నుంచి కూడా యాప్స్ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోందని టాక్. సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్‌రావు గత ఎన్నికల్లో 1 లక్షా 19 వేల మెజారిటీ సాధించారు. ఈసారి ఆ మెజారిటీ రికార్డును దాటేస్తారా? అని పందెం వేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పందెం రాయుళ్లు. ఖమ్మంలో తుమ్మల-పువ్వాడ ఫైట్ మీద, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓడిపోతారని, కేటీఆర్ మెజార్టీ ఎలా ఉండబోతుందని, ఆదిలాబాద్-కరీంనగర్లో బీఆర్ఎస్కు జీరో సీట్లు అని.. ఇలా రకరకాల ఆఫ్షన్లతో పందెలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైసలే కాదు.. పొలిటికల్ బెట్టింగ్‌లో.. డబ్బులే కాదు భూములను కూడా పందెంలో పెడుతున్నారు కొందరు. సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో గెలుపోటములపై లక్షల్లో సొమ్ముతో పాటు పొలాలను కూడా కొందరు తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల బెట్టింగ్ విలువ రూ.10 వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చనేది ఒక అంచనా. -
ఆ రెండు నియోజకవర్గాల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్‌లు.. మరి గెలిచేది ఎవరు?
సిరిసిల్లక్రైం: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, ప్రజల నుంచి అత్యంత స్పందన అచిరకాలంలో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపోటములపై కార్యకర్తలు, అభిమానులు జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌ను భారత్ పాకిస్థాన్ క్రికెట్ పోటీని వీక్షించిన విధానంలో ఓట్ల లెక్కింపును చూసే అవకాశాలున్నాయని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల్లో బెట్టింగ్‌కు ఆజ్యం పలికిన నాయకులు ఉన్నారని, ఇలా బెట్టింగ్ చేసిన వారందరూ ఓట్ల లెక్కింపు జరిగే ఆదివారం ఒకే వేదికగా ఉండి పండుగ చేసుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రచారం చేసిన కేటీఆర్‌కు విజయం కాస్త అటు.. ఇటుగా ఉంటుందనుకుంటున్న వాళ్లు లేకపోలేదు. కానీ వేములవాడలోని త్రిముఖ పోరులు అందరూ ఉద్దండులేనని ఇక్కడి ఫలితాలపై నియోజకవర్గప్రజలు అత్యంత ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో నేతలు హోరాహోరీగా ప్రచారాలు, పార్టీల బడా నేతలు రావడం వంటి వాటితో గెలుపు ఆయా పార్టీ బాధ్యులు ఆసక్తిగా ఎదరుచూస్తూ బెట్టింగ్‌లకు దిగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి విధానాలను పోలీసు అధికారులు ఎలా నియంత్రిస్తారో వేచిచూడాల్సిందే. ఇది చదవండి: ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు -
ఖమ్మంలో బెట్టింగుల హోరు !
సాక్షి,ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పటికే బెట్టింగ్ మార్క్ 100 కోట్లు దాటిందా? పోలింగ్ సమయానికి బెట్టింగులు మరింతగా పెరుగుతాయా? ఏపీకి చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమ గెలుపోటములపై బెట్టింగులు పెట్టవద్దని సూచిస్తున్నారంటూ టాక్ మొదలైంది. ఇంతకీ బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైన ఆ నాలుగు స్థానాల కథేంటో చూద్దాం. పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఖమ్మంలో ఏంజరుగుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పది సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఒకవైపున పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు కూడా అదే రేంజ్లో సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు..రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి అధికార గులాబీ పార్టీ తరపున మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్...కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్యా పోటీ అత్యంత తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ ఇద్దరి గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పది వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపులా బెట్టింగ్ నడుస్తున్నాయి. అయితే మెజారిటీ 30వేలు దాటుతుందని ఓ పార్టీ అభ్యర్థిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టారు. ఇక పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున కందాల ఉపేందర్‌రెడ్డి...కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. ముగ్గురి మధ్య పోటీ టఫ్‌గా ఉంది. అందుకే ఒక్క ఓటుతో గెలుస్తారనేదానిపై ఎక్కువగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోనే బెట్టింగులు వంద కోట్లు దాటాయని టాక్ నడుస్తోంది. ఖమ్మం, పాలేరు స్థానాల తర్వాత..సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. అనూహ్యంగా సత్తుపల్లిలో బెట్టింగ్‌లు భారీగా పెరిగాయి. ఇక్కడ కూడా ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ నడుస్తూ ఉండటమే బెట్టింగులకు కారణం. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులకు సంబంధించి 5 వేల లోపు మెజార్టీతో బయట పడుతారని బెట్టింగ్‌లు కాస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయి పోటీ చేస్తున్నారు. మధిరలో సైతం సీఎల్పీ నేత భట్టి విక్కమార్క గెలుస్తారా లేదా అనేదానిపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. మధిరలో బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్ బరిలో ఉండగా...భట్టి విక్కమార్క కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 10వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపుల నుంచి బెట్టింగ్ లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకి పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. బెట్టింగ్‌లు సైతం అదే స్థాయిలో స్పీడ్ అందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్న దానిపై నిరంతరం -
Illegal betting: చట్ట విరుద్ధంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 జోరుగా సాగుతుండడంతో, మరోవైపు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలు కూడా ఉపందుకుంటున్నాయి. అనధికారిక మార్గాల ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నడుస్తున్నట్టు, ఈ రూపేణా ఏటా రూ.2లక్షల కోట్ల మేర పన్ను ఆదాయాన్ని భారత్ కోల్పోతున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) నివేదిక తెలిపింది. చట్ట వ్యతిరేకంగా నడిచే క్రీడల బెట్టింగ్ మార్కెట్లోకి భారత్ నుంచి ఏటా రూ.8,20,000 కోట్లు వస్తున్నట్టు ఈ ఫోరమ్ అంచనా వేసింది. ప్రస్తుత జీఎస్టీ రేటు 28 శాతం ప్రకారం చూస్తే ఈ మొత్తంపై భారత్ ఏటా రూ.2,29,600 కోట్లు నష్టపోతున్నట్టు తెలిపింది. ఈ తరహా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాల నిరోధానికి నూతన జీఎస్టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. చట్టవిరుద్ధమైన ఆఫ్‌షోర్ బెట్టింగ్ సంస్థల కార్యకలాపాలను గుర్తించేందుకు, అవి భారత్‌లో రిజిస్టర్ చేసుకునేలా చూసేందుకు టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తద్వారా భారత్ నుంచి పెద్ద మొత్తంలో బెట్టింగ్ కోసం నిధులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. లేకుంటే మరింత నష్టం ప్రభుత్వం వైపు నుంచి కఠిన చర్యలు లేకుంటే మరింత ఆదాయ నష్టం ఏర్పడుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. నూతన జీఎస్టీ విధానంతో చట్టపరిధిలో పనిచేసే గేమింగ్ మార్కెట్ బదులుగా చట్ట విరుద్ధంగా పనిచేసే ఆఫ్‌షోర్ బెట్టింగ్ కంపెనీలు ఎక్కువ వృద్ధిని చూడనున్నాయని, ఫలితంగా మరింత పన్ను నష్టం ఏర్పడుతుందని వివరించింది. ఐపీఎల్ సమయంలోనూ పెద్ద మొత్తంలో బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగడాన్ని ప్రస్తావించింది. మన దేశంలో బెట్టింగ్, గేమింగ్‌పై 14 కోట్ల మంది సాధారణంగా పాల్గొంటూ ఉంటారని, ఐపీఎల్ సమయంలో ఈ సంఖ్య 37 కోట్లకు పెరుగుతుందని వెల్లడించింది. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లావాదేవీలపై నిషేధం విధించడంతో చట్ట విరుద్ధంగా భారత్ లోపల, భారత్ నుంచి వెలుపలకు నిధులు తరలింపు కోసం రహస్య పద్ధతులను అనుసరించేందుకు దారితీస్తున్నట్టు వివరించింది. హవాలా, క్రిప్టో కరెన్సీలు, అక్రమ చానళ్లు నిధుల తరలింపునకు వీలు కలి్పస్తూ.. భారత్ దేశ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు విసురుతున్నట్టు పేర్కొంది. ఇలా అక్రమంగా తరలించే నిధులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు, జాతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు వనరులుగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 75 బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లు భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత యూజర్లను ఆకర్షించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది. -
పుంజు భలే రంజుగా! సంప్రదాయం నుంచి సంపాదనగా ‘కోడి పందేలు’
సాక్షి, అమరావతి: బరిలో తలపడే పుంజులు అత్యంత పౌరుషంతో పోరాడుతాయి. ఓడిపోయిన పుంజు తోక ముడిచి బరినుంచి పారిపోతే.. గెలిచిన పుంజు తన యజమాని ఉప్పొంగిపోయేంత గర్వాన్ని ఇచ్చేది. పుంజుల పోరాటం చూపరులకు సైతం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. తొలినాళ్లలో సరదా కోసం మొదలైన పందాలు ట్రెండ్ మార్చుకుంటున్నాయి. ఇప్పుడు కోడి పందాలంటే విశాలమైన మైదానం.. భారీ టెంట్లు.. ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా ప్రత్యేకంగా గ్యాలరీలు.. ఫ్లాష్లైట్ల కాంతులు.. భారీ సంఖ్యలో జన సందోహం నడుమ జాతరను తలపించేలా మారిపోయింది. ప్రత్యేక శిక్షణ పొందిన పుంజులను పహిల్వాన్ మాదిరిగా వాటి కాళ్లకు పదునైన కత్తులు కట్టి బరిలో దించుతున్నారు. రక్తమోడుతున్నా వీరోచితంగా పోరాడి ఒక కోడి గెలిస్తే.. మరో కోడి ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది. సంక్రాంతి మూడు రోజుల్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.వందలాది కోట్లు కోడి పందాల మాటున చేతులు మారుతున్నాయి. తాజాగా ఒకచోట కోడి పందాలు వేసి.. వాటిని సోషల్ మీడియాలో లైవ్‌లో చూపించి బెట్టింగ్‌లు వేసుకునే స్థాయికి చేరింది. అలా మొదలై.. పూర్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందాలు వినోదం కోసం మొదలై వీరోచిత పోరాటాలకు దారితీశాయని చరిత్ర చెబుతోంది. తొలినాళ్లలో అడవి కోళ్లు లేదా పెరటి కోళ్లు పోరాడుకునేలా ప్రేరేపించి వినోదం పొందేవారు. పల్నాడు యుద్ధం (1178–1182) కోడి పందాల్లో తలెత్తిన వివాదం వల్లే సంభవించినట్టు చరిత్ర చెబుతోంది. బొబ్బిలి యుద్ధంలోనూ కోడి పందాలు జరిగాయి. రానురాను కోడి పందాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో జూదం తరహాలో మార్పు చెందాయి. సుమారు రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి అంటే కోడి పందాలు అనేలా మారిపోయాయి. సంక్రాంతి మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాల కోసం ఐదు నెలల ముందు నుంచే ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోడి పుంజులను తీర్చిదిద్దుతారు. వాటి పెంపకానికి రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు -
మునుగోడు: ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్?!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ఒకటికి రెండింతలంటూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ హోటల్స్‌లో తిష్ట వేసిన బుకీలు.. ఈమేరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ అడ్వాన్స్ లు పుచ్చుకుంటున్నారని సమాచారం. డిపాజిట్ సాధించేదెవరు? కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్ సరళిపై ఐపీఎల్ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్‌ను.. బుకీలు రౌండ్ రౌండ్‌కు బెట్టింగ్ నిర్వహణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ వ్యవహారం నడుస్తోంది. -
మునుగోడులో బెట్టింగ్ జోరు.. కోట్లలో లావాదేవీలు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తరహాలో ఉప ఎన్నికపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు మునుగోడు ఎన్నికలను కీలకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. అభ్యర్థులను అంచనా వేస్తూ ఏకంగా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు, నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. మునుగోడుతో పాటు చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో ఏజెంట్లను నియమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో విధంగా బెట్టింగ్‌లు వేస్తూ, ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారని వినికిడి. అయితే మునుగోడులో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ రాయుళ్లపై కన్నేసి ఉంచింది. కాగా ఇప్పటికే మునుగోడు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ, మద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. మంత్రుల వాహనాలతో సహా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చదవండి: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. -
మునుగోడులో బెట్టింగ్‌ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల జయాపజయాలపై అప్పుడే బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో పందేలు కాస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు. రంగంలోకి దిగిన బెట్టింగ్ మాఫియా రూ.కోట్లలో లావాదేవీలు సాగిస్తున్నట్టు సమాచారం. నగదు వసూలు కోసం చౌటుప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించినట్లు తెలిసింది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతరత్రా ఆన్లైన్ మార్గాల్లో దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డిపై రూ.50 వేలు, కూసుకుంట్లపై రూ.30 వేలు, స్రవంతి గెలుపుపై రూ.20 వేల చొప్పున కాస్తున్నట్లు తెలిసింది. గెలుపు కోసం ఎన్ని వేలు బెట్టింగ్‌లో కట్టినా అంతకు రెట్టింపు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మేరకు అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ మాఫియాను గుర్తించే పనిలో పడింది. రూ.16 కోట్లు పట్టివేత? మునుగోడు ఉప ఎన్నికల ఖర్చు కోసం తరలిస్తున్న రూ.16 కోట్ల నగదును పోలీసు అధికారులు పట్టుకున్నారని తెలిసింది. హైదరాబాద్ నుంచి ఓ ప్రధాన పార్టీకి చెందిన డబ్బు వాహనంలో మునుగోడు ప్రాంతానికి రవాణా అవుతుండగా మార్గంమధ్యలో పట్టుబడినట్లు తెలుస్తోంది. -
బెట్టింగ్ సైట్ల ప్రకటనలొద్దు టీవీ చానళ్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: బెట్టింగ్ సైట్లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల ప్రసారంపై కేంద్రం సోమవారం మార్గదర్శకాలను విడుదలచేసింది. ‘ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను వాటికి సంబంధించిన వార్త వెబ్సైట్లను, వాటి ఉత్పత్తులు/సేవల సంబంధ అంశాలను చూపే వాణిజ్య ప్రకటనల ప్రసారం మానుకోండి’ అని న్యూస్ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రైవేట్ శాటిలైట్ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం సూచించింది. ఈ మార్గదర్శకాలు, చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ప్రైవేట్ శాటిలైట్ చానళ్లను కేంద్రం హెచ్చరించింది. వార్తలను ప్రచురించే పబ్లిషర్లకు, డిజిటల్ మీడియాకూ ఇదే తరహా సూచనలిస్తూ విడిగా మార్గదర్శకాలను పంపింది. ‘సొంత న్యూస్ వెబ్సైట్ల మాటున కొన్ని బెట్టింగ్ సంస్థలు తమను తాము అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి. బెట్టింగ్ సంస్థల లోగోలే ఆ న్యూస్ వెబ్సైట్లకూ ఉంటున్నాయి. ఈ వెబ్సైట్లు ఏవీ భారత చట్టాలకు లోబడి అధీకృత యంత్రాంగం వద్ద రిజిస్టర్ కాలేదు. తప్పుడు వాణిజ్య ప్రకటనలు, వార్తలు ప్రసారం చేస్తూ బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు పాల్పడుతున్నాయి. వీటిలో కొన్ని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బ్లాగ్లు, క్రీడా వార్తల వెబ్సైట్లుగా చెలామణి అవుతున్న విషయంపై వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని అప్రమత్తం చేశాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు..
భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టీ20 హైదరాబాద్‌గా ఆదివారం జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్-ఆసీస్ జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. సిరీస్ డిసైడ్ మ్యాచ్‌లో తలపడేందకు ఇరు జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. మరోవైపు ఈ కీలక మ్యాచ్‌పై భారీ బెట్టింగ్ జరుగుతోంది. బాల్ టూ బాల్, ప్రతీ రన్‌కు, వికెట్‌కు బుకీలు బెట్టింగ్ కడుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నారు రూ.వెయ్యి నుంచి రూ. లక్ష వరకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. బుకీలు,మినీ బుకీలుగా రెండు రకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. అధే విదంగా ఆన్లైన్లో లక్షల మంది బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయళ్లపై ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: IND Vs AUS 3rd T20: ఉప్పల్ 'దంగల్'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? -
పాక్‌తో మ్యాచ్.. జోరుగా బెట్టింగ్‌లు, టీమిండియా గెలవాలని పూజలు
ఆసియాకప్ 2022లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొదలవ్వడానికి మరో రెండు గంటల సమయం మాత్రమే ఉంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే అభిమానులకే కాదు బెట్టింగ్ రాయులు కూడా పండుగ చేసుకుంటారు. తాజాగా మ్యాచ్‌ను పురస్కరించుకొని జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. టాస్ భారత్ గెలిస్తే.. బెట్టింగ్ వేసి వ్యక్తి సుమారు వెయ్యి- 5వేల వరకు పొందే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ మొదలయ్యాకా బెట్టింగ్ జోరు మరింత దూకుడుగా సాగడం ఖాయం. ఇక టీమిండియా ఎలాగైనా పాక్‌పై మ్యాచ్ గెలవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు తమ దేవుళ్లను మొక్కుతున్నారు. ఇంకొందరు మాత్రం మరింత ముందుకెళ్లి భారత్ గెలవాలంటూ యాగాలు, హోమాలు, పూజలు చేయడం విశేషం. అంతేకాదు కోహ్లి కూడా సెంచరీ చేయాలని అతని ఫోటోకు అభిషేకాలు చేయడం ఆసక్తిగా నిలిచింది. గత టి20 ప్రపంచకప్‌లో ఇదే వేదికలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ఆ మ్యాచ్‌లో విజయం అందుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా మ్యాచ్ గెలిచి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక మేజర్ టోర్నీల్లో ఎప్పటిలాగే పాకిస్తాన్‌పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు 14 సార్లు తలపడితే 8సార్లు టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా మెషిన్ రన్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుండడం.. అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. చదవండి: Viral Video: బౌలింగ్ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్ పరువు తీశాడు IND Vs PAK Asia Cup 2022: దాయాదుల సమరం.. రికార్డులు, పరుగులు, వికెట్లు చూసేద్దామా! -
కన్నతండ్రి కిరాతకం
కోలారు: జూదాలు, క్షణికావేశాలు అనుబంధాలను ఛిద్రం చేస్తున్నాయి. బెట్టింగ్ విషయాలు ఎక్కడ బయట పెడతాడేమోనని ఏకంగా కన్న కుమారుడినే తండ్రి కిరాతకంగా హత్య చేసిన ఘటన కోలారు తాలూకా శెట్టి మాదమంగల గ్రామంలో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకా మదరకల్లుకి చెందిన నిఖిల్‌కుమార్ (12) హత్యకు గురయ్యాడు. వివరాలు...నిఖిల్ కుమార్ తండ్రి మణికంఠప్ప ఇటీవల జరిగిన ఐపీఎల్లో బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. విషయం అంతా కుమారుడికి తెలుసు. ఎక్కడ బయటకు చెబుతాడేమోనని కుమారున్ని గొంతు నులిమి కోలారు తాలూకా శెట్టి మాదమంగల గ్రామ సమీపంలో చెరువులో పడేసి వెళ్లాడు. ఏమీ తెలియనట్లు చింతామణి పీఎస్‌లో కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మంగళవారం చెరువులో బాలుడి మృతదేహం పడిఉన్నట్లు తెలిసి కోలారు రూరల్ పోలీసులు, చింతామణి పోలీసులకు తెలిపారు. విచారణలో కన్న తండ్రే హంతకుడని తెలుసుకున్న పోలీసులు మణికంఠప్పను అరెస్టు చేశారు. (చదవండి: డ్రగ్స్, మద్యం వల్ల అధిక ఆత్మహత్యలు.. ఆ రాష్ట్రాలే టాప్!) -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు
అమీర్‌పేట: గుజరాత్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా పట్టుబడ్డ వారి నుంచి రూ.1.15 కోట్ల నగదు, సెల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ రాంప్రసాద్‌లు వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన విశాల్ పటేల్, కమలేష్‌రావత్, పటేల్ హితేష్ అంబాల, ధర్మేంద్ర భాయ్‌లు నగరంలోని గౌలిగూడ గురుద్వార, గౌలిపుర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు గుజరాత్ ప్రధాన కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వేసి ప్రచారం చేస్తారు. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్‌ల ద్వారా అతి తక్కువ కాలంలో లక్షలు సంపాదించి ఆపై కోటీశ్వరులుగా ఎదుగుతారని నమ్మిస్తారు. సదరు వెబ్సైట్లో పొందుపర్చిన అందర్ బహార్, ఫుట్‌బాల్, క్రికెట్, సూపర్ ఓవర్, తీన్‌పత్తి వంటి గేమ్‌లను డౌన్లోడ్ చేసుకునే వారికి బెట్టింగ్‌లలో పాల్గొనే వీలు కల్పిస్తారు. కాగా నగరంలో వీరి వలలో పడిన వారినుంచి డబ్బులు తీసుకునేందుకు రాగా..పక్కా సమాచారం మేరకు బీకేగూడ పార్కు వద్ద మాటువేసి పోలీసులు విశాల్ పటేల్, కమలేష్ రావత్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద రూ.2 లక్షలు లభించాయి. వీరిచ్చిన సమాచారంతో గౌలిగూడలో ఒక ఇంటికి వెళ్లి సోదాలు చేయగా లోపల పటేల్ హితేష్ అంబాల కనిపించాడు. ఇతని వద్ద రూ.1.13 కోట్లు లభించాయి. ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నింధితుడు ధర్మేష్ భాయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. (చదవండి: అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై) -
భారత్‌లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్‌పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్‌కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్‌లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్‌పై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్‌ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021 అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్ పాండే..? -
జూదం చట్టబద్ధం.. ఎన్నో లాభాలు! తెరపైకి కొత్త డిమాండ్
దుబాయ్: భారత్‌లో జూదాన్ని (పందేలు/బెట్టింగ్) చట్టబద్ధం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయ రావడమే కాకుండా, ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయని పరిమ్యాచ్ ఇంటర్నేషనల్ (పీఎంఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది. బెట్టింగ్ ఆపరేటర్ల నియంత్రణకు కార్యాచరణ అవసరమని పేర్కొంది. అంతర్జాతీయంగా బెట్టింగ్ ఆపరేటర్లకు కావాల్సిన నైపుణ్య సేవలను పరిమ్యాచ్ ఇంటర్నేషనల్ అందిస్తుంటుంది. ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ పరిమ్యాచ్ బ్రాండ్‌పై హక్కులు ఈ సంస్థకే ఉన్నాయి. ‘‘భారత ఆర్థిక వ్యవస్థకు బెట్టింగ్ గేమ్‌లూ ఊతమిస్తాయని మేము భావిస్తున్నాం. భారత్‌లో జూదాన్ని చట్టబద్ధం చేస్తే మెదటగా సమర్థించేది మేమే’’అని పీఎంఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దిమిత్రి బెలియనిన్ పేర్కొన్నారు. అధిక జనాభా కలిగిన భారత్‌లో దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున పన్ను ఆదాయం సమకూరుతుందంటూ.. మోసపూరిత ఆపరేటర్లను కట్టడి చేసేందుకు సరైన రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. -
Huzurabad Bypoll: బెట్టింగ్ 50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో పాటు ప్రధాన పార్టీలకు ప్రతి ష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై కోట్ల మొత్తంలో పందేలు కాస్తున్నారు. రెండు పార్టీల నాయకులతో పాటు భారీ స్థాయిలో కమీషన్ దండుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. హుజూరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాం తాల్లోనే రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటే ఫలితంపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఈటల.. కాదు గెల్లు రాజకీయ నాయకులు, పార్టీలు, గెలుపు, మెజారిటీ.. ఇలా నాలుగు రకాల బెట్టింగ్‌లకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు తెరలేపారు. ఈటల గెలుస్తాడని లేదు గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని రెండు పార్టీలుగా విడిపోయిన నాయకులు అభ్యర్థులపై రూ.10 లక్షలు చొప్పున బెట్టింగ్‌లు పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవారే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు, విదేశాల్లో ఉన్నవారు సైతం భారీ స్థాయిలో బెట్టింగ్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన కొంతమంది నాయకులు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని రూ.3 కోట్లకు పైగా బెట్టింగ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని మరో పార్టీకి చెందిన నాయకులు రూ.3 కోట్లు పోటీ బెట్టింగ్ కాశారు. మెజారిటీపై బెట్టింగ్.. ఈటల గెలుపుపై గట్టి విశ్వాసంతో ఉన్న ఆయన అభిమానులు ఈ మేరకు భారీ స్థాయిలో పందేలు కాసినట్టు తెలిసింది. 35 వేల పైచిలుకు మెజారిటీతో ఈటల గెలుస్తారని కొందరు బెట్టింగ్ కాయగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 25 వేల మెజారిటీతో గెలుస్తాడని టీఆర్ఎస్ నేతలు పోటీ బెట్టింగ్ కాసినట్టు హుజూరాబాద్‌లో చర్చ జరుగుతోంది. మెజారిటీపై ఒక్క హుజూరాబాద్‌లోనే రూ.10 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్టు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్ఆర్ఐలు కూడా.. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి, సింగపూర్, సౌదీలో ఉన్న వాళ్లు సైతం బెట్టింగ్‌లు కాశారు. జమ్మికుంట, కమలాపూర్, భూపాలపల్లి, హుస్నాబాద్, బెజ్జంకికి చెందిన కొంతమంది ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఈటల, గెల్లు గెలుపుపై బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఈ మేరకు తమ సంబంధీకులను సంప్రదిస్తున్నారు. ఎటు వైపు వేయాలి? ఎంత వేయాలి? మెజారిటీ మీద వేయాలా? లేక కేవలం గెలుస్తారని మాత్రమే వేయాలా? అని ఆరా తీసినట్లు సమాచారం. కొందరు ఏకంగా వాట్సాప్ గ్రూపు పెట్టి రూ.10 లక్షల చొప్పున ఇద్దరు అభ్యర్థులపై బెట్టింగ్‌లు వేశారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో 48 మంది ఉన్నారని తెలిసింది. తగ్గేదే లేదన్న కార్పొరేట్లర్లు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా ఉన్న కొంతమంది లీడర్లు కూడా పోటాపోటీగా బెట్టింగ్‌కు దిగారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న ఎన్నికపై ఎవరు గెలుస్తారన్న దానిపై రూ.20 లక్షల చొప్పున బెట్టింగ్‌కు దిగారు. కరీంనగర్‌లోని ఓ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కాసినట్టు స్థానికుల ద్వారా తెలిసింది. బీజేపీ తరఫున గెలిచిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కొంతమంది ఈటల 40 వేల మెజారిటీతో గెలుస్తారని రూ.10 లక్షల చొప్పున నలుగురు టీఆర్ఎస్ కార్పొరేట్లర్లతో బెట్టింగ్‌లు పెట్టినట్టు చర్చ జరుగుతోంది. -
Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్..?
‘హలో అన్న నేను ఆంధ్రా నుంచి మాట్లాడుతున్నా.. అప్పుడెప్పుడో హైదరాబాద్‌లో కలిశాం.. బాగున్నారా.. మీది హుజూరాబాద్ అసెంబ్లీ కిందకే వస్తుంది కదా.. మీ దగ్గర ఏ పార్టీ గెలుస్తదన్నా.. ఏ టీవీ పెట్టినా మీ గురించే వస్తుంది.. అందాద ఎవరూ గెలిచేలా ఉన్నారు’ అంటూ హుజూరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఫోన్ వచ్చింది. ‘అన్నా ఎందుకే అన్ని అడుగుతున్నావ్ అంటే.. ‘మా దగ్గర మీ ఎన్నిక గురించి బెట్టింగ్ సాగుతుందన్నా.. ఎవరూ గెలిచేలా ఉన్నారో క్లూ ఇస్తే నేను కూడా ఒక చెయ్యి వేస్తా అన్నా’.. ఇటీవల హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తితో ఆంధ్రాకు చెందిన వ్యక్తి ఫోన్లో సంభాషించిన తీరు ఇదీ. అంటే హుజూరాబాద్ ఎన్నికపై బెట్టింగ్‌లు ఎలా జరుగుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాక్షి, కరీంనగర్‌క్రైం: వందకు వెయ్యి.. వెయ్యికి పది వేలు, పదివేలకు లక్ష అంటూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది.. ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది.. ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్లైన్లో రహస్యంగా కొనసాగుతున్నట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు ఆసక్తిగా పాల్గొంటున్నారని సమాచారం. ఇటీవల ఐపీఎల్ కూడా ముగియడంతో పందెరాయుళ్లు ఉప ఎన్నికపై బెట్టింగ్‌ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. 100 కోట్లు దాటిన బెట్టింగ్..? హుజూరాబాద్ ఉపఎన్నికపై గత నెల నుంచే మొదలైన బెట్టింగ్ గడువు సమీపించడంతో మరింత జోరందుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రా నుంచి విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నంతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, నాందెడ్, ముంబయ్ వంటి ప్రాంతాల వారు బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రా నాయకులు ఇక్కడ తెలిసిన వారికి ఫోన్ చేసి ఏ పార్టీ గెలుస్తుంది.. ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయంటూ టచ్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం ఆంధ్రాకు చెందినవారు వాహనాల్లో హుజూరాబాద్‌కు వచ్చి ప్రచార శైలిని చూశారంటే అర్థం చేసుకోవచ్చు ఉప ఎన్నిక ఉత్కంఠ ఏ స్థాయిలో ఉందో. ఆంధ్రాలో ఎక్కువ శాతం ఐపీఎల్ బెట్టింగ్‌లు కట్టినవారు అది ముగియడంతో ఇప్పుడు ఉప ఎన్నికపై దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బెట్టింగ్ విలువ రూ.100 కోట్ల పైగానే దాటినట్లు అంచనా. అంతా ఆన్లైన్లోనే.. హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్ నిర్వహించే బుకీలు ఆన్లైన్లోనే దందా నడుపుతున్నట్లు తెలిసింది. రూపాయికి రూ.10, కొన్ని చోట్ల రూపాయికి రూ.1000 ఇలా కోట్లాది రూపాయాలు బెట్టింగ్ సాగుతోంది. 15 రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఏ నలుగురు కలిసినా ఉప ఎన్నిక గురించి పెద్దస్థాయిలో చర్చిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే సరికి సుమారు 300 కోట్ల బెట్టింగ్‌లు జరుగుతాయని చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా వారం రోజుల తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో.. ఎవరు ఓడుతారో తెలిసేవరకు వేచిచూడాల్సిందే. -
రాత్రికి రాత్రే డబ్బులు మాయం..
మార్గాలు వేరు.. గమ్యం ఒకటే! చదువుకుని ఆర్థికంగా స్థితిమంతులైనవారు కూడా ఇలాంటి మోసాల వలలో చిక్కుంటున్నారు. విలాసవంతమైన జీవనం కోసం కావచ్చు, కోవిడ్ వల్ల వచ్చిన నష్టాల వల్ల కావచ్చు. కారణమేదైనా అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తుంటారు. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ, కొత్త కొత్త మార్గాల ద్వారా యాప్ అప్లికేషన్స్‌ను సెండ్ చేస్తుంటారు. ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అయినవారు మోసపోతుంటారు. మార్గాలు వేరు కానీ, మోసగాళ్ల గమ్యం ఒకటే... జనం దగ్గర డబ్బులు లాగడం. రాధిక (పేరు మార్చడమైనది) గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. తనలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని తెలిపింది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరెవ్వరూ తమలా ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదని తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసింది... ‘‘రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తయ్యాక నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినిగా చేరాను. వచ్చే జీతంలో కొంత ఈఎమ్ఐలకు పోతుంది. మరికొంత అదనపు ఆదాయం కావాలనుకున్నాను. ఈ విషయం గురించి నా స్నేహితులతో మాట్లినప్పుడు ఓ గేమింగ్ యాప్ గురించి చెప్పారు. దాని ద్వారా వాళ్లు రోజూ డబ్బులు సంపాదిస్తున్న విధానం చూసి, నేను ఆ గేమింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాను. మన బదులుగా యాప్ వాళ్లే గేమ్ ఆడి, అందులో వచ్చిన పాయింట్స్ ఆధారంగా మనకు డబ్బులు ఇస్తారు. అందులో జాయిన్ అవాలంటే ఆ యాప్‌లోనే ముందు రూ. 10,000తో అకౌంట్ ప్రారంభించాలి. ఉదయం పెట్టుబడి పెడితే, రాత్రికి రిటన్స్ వచ్చేవి. రోజూ రూ.500 నుంచి రూ.700 వరకు లాభం వస్తుంది. ఏ రోజు డబ్బు ఆ రోజు అకౌంట్లో పడిపోతుంది. అలా వచ్చినప్పుడు 2 నుంచి 3 వేలు అదనంగా మరికొంత ఇన్వెస్ట్ చేయమనే సూచనలు యాప్‌లో కనిపించేవి. నేను నెల రోజులుగా ఆ యాప్ అకౌంట్లో మెంబర్‌గా ఉన్నాను. నా ఫ్రెండ్స్ రెండు నెలలుగా ఇందులో ఉన్నారు. వచ్చిన లాభంలో 40 శాతం ఆ యాప్ పోర్టల్ వారే కమిషన్ రూపేణా కట్ చేసుకుంటారు. కొత్తగా ఎవరినైనా పరిచయం చేస్తే ఆ పర్సంటేజ్ మనీ కూడా మనకే వస్తుంది. నేను అలా మరో ఇద్దరిని పరిచయం చేశాను. యాప్‌లో ఉన్నవారందరినీ టెలీగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ∙∙ రోజూ లాభం చూస్తున్నాను కాబట్టి తర్వాత రూ. 20,000 పెట్టుబడి పెట్టాను. రూ.10,000 కన్నా రూపాయి తక్కువ ఉన్నా ఎలాంటి లాభం రాదు. ఒకసారి ఉదయం నేను డబ్బు అకౌంట్ లో వేసే సమయానికి అమౌంట్ మైనస్‌లోకి వెళ్లింది. ప్లస్‌లోకి రావాలంటే అదనంగా డబ్బు కట్టాలన్నారు. అలా రూ.50,000 వరకు కట్టాను. కానీ, అకౌంట్ మైనస్ చూపిస్తోంది. ఇదే విషయాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా గ్రూప్‌లో ఉన్నవారితో మాట్లాడాను. మరికొందరికి కూడా ఇదే సమస్య వచ్చింది. అయితే, ఇదేదో మిస్టేక్ జరిగింది. కంపెనీ వాళ్లతో మాట్లాడి సెట్ చేస్తాం అన్నారు. మరో రూ.10,000 చెల్లిస్తే 20 శాతం, రూ.20,000 చెల్లిస్తే 50 శాతం, రూ.30,000 చెల్లిస్తే వంద శాతం అమౌంట్ తిరిగి మీ మీ అకౌంట్లలోకి వస్తుంది అని చెప్పారు. నేను దాదాపు అలా లక్షన్నరూపాయల వరకు నా క్రెడిట్ కార్డుల నుంచి యాప్ అకౌంట్లో వేశాను. నాతోపాటు మిగతా వాళ్లు కూడా డబ్బు అకౌంట్లో వేశారు. ముందు రూ.40,000 వేలు అకౌంట్లో చూపించింది, కానీ విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడంతో ‘రాత్రి మొత్తం బెట్టింగ్ జరుగుతుంది, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డబ్బును విత్‌డ్రా చేయడం కుదరదు’ అన్నారు. సరే అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం అకౌంట్ చూస్తే జీరో బ్యాలెన్స్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నుంచి యాప్ పోర్టల్ వాళ్లు ఎగ్జిట్ అయిపోయారు. దేశవ్యాప్తం గా దాదాపు 3 వేల మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం అనే విషయం అర్ధమైంది. రోజుకు రూ.500–రూ.700 వరకు వస్తాయనుకుంటే వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం. ఇలా ఎవరూ ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోకూడదని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని వివరించారు రాధిక. ఆశనే ఆసరా చేసుకొని క్రైమ్ సోషల్‌మీడియాలో బాగా పేరున్నవారిని ఆయుధంగా చేసుకొని, ఇలాంటి మనీ ఫ్రాడ్‌కి తెరలేపుతారు. వారి మాటలను మిగతా వాళ్లు నమ్ముతారనే ఆశే ఇలాంటి ఫ్రాడ్స్‌కి పెట్టుబడి. జనం ఆశను ఆసరా చేసుకొని క్రైమ్ చేస్తారు. సోషల్‌మీడియాలో ఎవరి ద్వారా అయినా సరే.. ► ఏదైనా లింక్ ద్వారా ఏ అప్లికేషన్ మనకు వచ్చినా వాటిని డౌన్లోడ్ చేసుకోకూడదు. ∙ ► యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆండ్రాయిడ్‌లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ ఎపికె ఫైల్స్ అంటారు. ఐఒఎస్లో వచ్చే ఫైల్స్ అన్నీ డిఎమ్‌జెడ్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్‌ని లింక్స్ ద్వారా పంపిస్తారు. సోషల్ మీడియాలో పేరున్నవాళ్లను ఎంచుకొని ఈ యాప్స్ గురించి గొప్పగా చెప్పి, వారిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తారు. పేరున్నవారు, తెలిసినవారు వీటిని చెప్పారు కదా అని నమ్మి ఆ దొంగ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్స్‌లలో డబ్బులు పెట్టించి, గెలిచినట్టుగా 4, 5 సార్లు చూపించి, తర్వాత మైనస్‌లో అకౌంట్ చూపిస్తారు. డబ్బులు మరిన్ని వేస్తే, మరింత మొత్తం వస్తుందని నమ్మబలుకుతారు. ఇలా రూ.5000 నుంచి 10 లక్షల వరకు పోగొట్టుకున్నవారున్నారు. ఈ ఫ్రాడ్స్ వాట్సప్ కన్నా టెలీగ్రామ్ గ్రూప్‌ని ఎంచుకుంటారు. దీనికి కారణం టెలీగ్రామ్‌లో ఎక్కువమందిని గ్రూప్‌గా యాడ్ చేయవచ్చు. ఎంతమంది ఎక్కువ మొత్తంలో చేరితే జనంలో అంత నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటే మోసమూ పెరుగుతుందని గ్రహించి, జాగ్రత్తపడాలి – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
లండన్: వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. విషయంలోకి వస్తే.. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్పద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది. -
గో కార్ట్ నిర్మాణాలను కూల్చేసిన జీవీఎంసీ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ అధికారులు మంగమారి పేట వద్ద స్వాధీనం చేసుకున్న గో కార్ట్ ప్రదేశం అక్రమాలకు.. ఆక్రమణలకు కేరాఫ్‌గా చెప్పుకోవచ్చు. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ఉన్న గో కార్ట్ చిన్నారులు నుంచి యువత వరకు కార్.. గో కార్ట్ పోటీలు నిర్వహిస్తుంటారు. పదినిమిషాల రేస్‌కు 300 నుంచి వసూలు చేసేవారు. ఈ దశలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. నిజానికి వుడా పరిధిలో ఉన్న గో కార్ట్ గ్రూప్ నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీ అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఏళ్ళతరబడి కార్ట్ పోటీలు నిర్వహించడమే కాక అక్కడ రెస్టారెంట్ కూడా కొనసాగిస్తున్నారు. సర్వేనెంబర్ 299, 301 పరిధిలోని దాదాపు నాలుగు ఎకరాల 48 సెంట్ల భూమిలో అక్రమ వ్యవహారం కొనసాగుతున్నట్టు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ దశలో జీవీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. గేమ్ ఆడేందుకు వచ్చిన పర్యాటకుల కోసం అనధికారికంగా కొనసాగిస్తున్న టీ రెస్టారెంట్‌ను కూడా తొలగించారు. ఇదే రీతిన అనధికారిక నిర్మాణాలు అన్నిటినీ తొలగిస్తామని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్డీసీపీ అధికారి వెల్లడించారు. (ఆయన దారి.. జాతీయ రహదారి) కాగా.. గో కార్ట్ నిర్వాహకుడు కాశీవిశ్వనాథ్ వ్యవహారాలపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పలు అనధికారిక వ్యవహారాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగా గో కార్ట్‌తో పాటు రుషికొండ వద్ద టూరిజం ప్రదేశంలో రేవ్ పార్టీ నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు రుషికొండ వద్ద జరిగిన ఓ పార్టీలో మద్యం సేవించిన వ్యవహారంపై 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గో కార్ట్ నిర్వాహకులు కాశీ విశ్వనాథ్ తనయుడు కూడా ఉన్నాడు. ఆ పార్టీ సమయంలో డ్రగ్స్ కూడా వినియోగించిన వ్యవహారంపై ఆరీలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా గో కార్ట్ ప్రదేశంలో కూడా బెట్టింగ్‌లు జరిగినట్టు చాలా వరకూ ఆరోపణలున్నాయి ఈ దశలో ఈ నిర్మాణం తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి : కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అనుచిత విధానాలను అరికట్టవచ్చవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుపరమైన ఆదాయాలు కూడా లభించవచ్చన్నారు. గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) పార్ట్‌టైమ్ సభ్యుడు నీలేష్ షా చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ ఈ మేరకు స్పందించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు దీన్ని చట్టబద్ధం చేసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీన్ని క్రీడలు లేదా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించవచ్చని మంత్రి చెప్పారు. బెట్టింగ్ అన్నది వ్యవస్థాత్మకమైనదని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వారిని గుర్తించేందుకు దీన్ని ఉపయోగించు కోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
బెట్టింగ్‌లపై పోలీస్ బెత్తం
సాక్షి, అమరావతి: సమాజంలో వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిషేధించింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లు నిర్వహించే 135 వెబ్సైట్లపై ఆన్లైన్ నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు. సీఎం ఆదేశాలతో బెట్టింగ్‌లపై పోలీసులు బెత్తం ఝుళిపిస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేసి క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. క్లబ్‌లు, కల్చరల్ క్లబ్‌లు, అతిథి గృహాల్లో పేకాట, కోతాట, గ్యాంబ్లింగ్ వంటివి నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంతో అవి మూతపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా వినకుండా వాటిని నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ఫలితంగా గత ఐదేళ్ల కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. -
ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా, ‘ట్రంప్ విజయం ఖాయం’ అంటూ బ్రిటన్‌కు చెందిన మాజీ బ్యాంకర్ ఒకరు ఏకంగా ఐదు మిలియన్ డాలర్లు (దాదాపు 37.5 కోట్ల రూపాయలు) పందెం కట్టారు. ప్రపంచంలో ఎక్కడా ఏ ఎన్నికలపై ఇంత మొత్తంలో ఒక్కరే బెట్ కాసిన దాఖలాలు ఇంతవరకు లేవని బెట్ నిర్వాహకులే చెబుతున్నారు. సదరు మాజీ బ్యాంకర్ కరీబియన్‌లోని కురకావోలో ఓ బుక్ మేకర్‌తో ఈ పందెం కట్టారట. తాను గుడ్డి అభిమానంతోని ట్రంప్ గెలుస్తాడంటూ బెట్ కట్టలేదని, ట్రంప్ శిబిరంలోని ఇన్సైడర్లతోని సంప్రతింపులు జరిపే కట్టానని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మాజీ బ్యాంకర్ తెలిపారు. (చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివాదాలెన్నో!) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటే ఎన్నికల ముందు సర్వేలో తెలియజేయగా, పోటీ పోటీగా ఉందంటూ పోలింగ్ రోజు అంచనాలు తెలియజేస్తున్నాయి. నిజంగా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే మాజీ బ్యాంకర్‌కు తన కాచిన బెట్కన్నా మూడింతలు అంటే, 11.6 మిలియన్ పౌండ్లు (దాదాపు 112 కోట్ల రూపాయలు) వరిస్తాయి. బైడెన్ గెలుస్తాడని భావించిన బుకీస్ కూడా పోలింగ్ చివరి నిమిషంలో ట్రంప్ గెలిచే అవకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన మరో పౌరుడు బుకీస్ వద్ద బైడన్‌పై 1 మిలియన్ పౌండ్ల బెట్ కాశారు. బుకీస్ ఫెవరైట్ బైడెన్ కనుక ఆయన గెలిస్తే సదరు బ్రిటిష్ పౌరుడికి పది లక్షల పౌండ్లకుగాను పదిహేను లక్షల పౌండ్లు మాత్రమే వస్తాయి. -
కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ– కామర్స్ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ దందాలో పెద్దయెత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా నగర పోలీసులు ఈడీని కోరనున్నారు. చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ– కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్‌యన్ టెక్నాలజీ, డాకీపే, స్పాట్‌పే, డైసీలింగ్ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ల పేర్లతో ఆర్‌ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ– కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్‌ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు. ఈ గేమ్‌కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చేపట్టారు. బెట్టింగ్‌కు సంబంధించిన తొలుత డాకీ పే సంస్థకు వెళుతోంది. అక్కడి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలోకి వెళ్లినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హాంకాంగ్, సింగపూర్‌ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌లో రూ.110 కోట్లు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఈ నగదు బీజింగ్ టీ పవర్ సంస్థ చేరినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్తో పాటు ఇతర పత్రాలను అందిస్తూ ఈడీకి లేఖ రాస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలతో ఈడీకి అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారు. -
ప్రాణం తీసిన బెట్టింగ్ గిల్లీ దండ!
కోరుట్ల: బెట్టింగ్ గిల్లీ దండ ఓ పసివాడి ప్రాణం తీసింది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన వెంటనే కాలనీలో గొడవ జరగగా అదే ఏరియాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని పంచాయితీ చేసి, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 5న కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ఏరియాలో ఓ ప్రజాప్రతినిధితో సహా 10 మంది రెండు గ్రూపులుగా మారి సుమారు రూ.20 వేలు బెట్టింగ్తో గిల్లీ దండ ఆడారు. ఆ సమయంలో అదే ఏరియాలో ఆడుకుంటున్న బాజి ఈశ్వర్(8) కణతకు గిల్లీ గట్టిగా తగిలింది. ఆ పసివాడు అస్వస్థతకు గురవగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మరుసటి రోజే అతను చనిపోయాడు. ఈశ్వర్ మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు గిల్లీతో కొట్టిన వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. ఆ వెంటనే గిల్లీదండ ఆడిన ప్రజాప్రతినిధితో పాటు అదే ఏరియాకు చెందిన మరో ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని పంచా యితీ పెట్టినట్లు తెలిసింది. బాధితులపై ఒత్తిడి చేసి, గిల్లీ దండ ఆడిన వారితో రూ.1.50 లక్షలు పరిహారం ఇప్పించినట్లు సమాచారం. మంచం కోడు తగిలి ఈశ్వర్ మృతి చెందినట్లు బాధిత కు టుంబీకులు చెప్పడంతో ఆ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
బెట్టింగ్స్ @ సైట్స్!
సాక్షి, సిటీబ్యూరో: రెండు వెబ్‌సైట్స్‌కు డిజైన్ చేసి, సబ్–ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, ఆన్లైన్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారి పరారీలో ఉండగా మిగిలిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. వారి నుంచి రూ.3.15 లక్షల నగదు, సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరేడ్మెట్, ఆర్కేపురం ప్రాంతానికి చెందిన చేతన్ దీపక్ భోగాని ఆన్లైన్లో బెట్టింగ్స్ నిర్వహించడానికి కొత్త విధానాన్ని ఆలోచించాడు. గుజరాత్‌కు చెందిన ఓడెవలపర్ సాయంతో (www.rkexch.com , www.fordexch.com) పేర్లతో రెండు సైట్స్ అభివృద్ధి చేశాడు. వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పాటు కంప్యూటర్లోనూ ఓపెన్ చేసే అవకాశం ఉంది. తన దందాలో పందాలు కాసే వారు (పంటర్లు) కీలకం కావడంతో అలాంటి వారిని గుర్తిస్తూ తనకు సహకరించడానికి బోయిన్‌పల్లికి చెందిన రాజేష్ కుమార్, సికింద్రాబాద్‌కు చెందిన నగేష్‌లను సబ్–ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వీరిద్దరూ తమ ప్రాంతాల్లో ఉన్న వారితో పాటు పరిచయస్తులైన యువతను ఆకర్షించేవారు. ఆన్లైన్లో బెట్టింగ్స్‌కు సిద్ధమైన వారి వివరాలు దీపక్‌ను అందించేవాడు. అతను పంటర్లకు కొన్ని యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ క్రియేట్ చేసి ఇచ్చేవాడు. ఆయా పంటర్లు వీటి సహకారంతో ఆ రెండు వెబ్‌సైట్స్‌లోకి ఎంటర్ అవుతారు. వీటి ద్వారా పోకర్, క్యాసినో, టీన్‌పట్టి, త్రీకార్డ్స్... ఇలా మొత్తం 15 రకాలైన ఆన్లైన్ గేమ్స్‌లోకి ఎంటర్ కావచ్చు. వాటి ఆధారంగా ఆన్లైన్లో బెట్టింగ్స్ కాయవచ్చు. ఈ సైట్స్‌లోకి ఎంటర్ అయిన వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పంటర్లు ఆన్లైన్ బదిలీ, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా నిర్వహించేలా దీపక్ డిజైన్ చేశాడు. ఈ లావాదేవీలపై సబ్–ఏజెంట్లకు కమీషన్ ఇస్తుండేవాడు. వీరి వద్ద 60 మంది పంటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ దందా నిర్వహించేందుకుగాను వీరు బోయిన్‌పల్లిలోని రాజేష్‌కుమార్‌కు చెందిన ఫ్లాట్ వినియోగిస్తున్నారు. వీరి వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ బుధవారం దాడి చేశారు. దీపక్ పరారుకాగా మిగిలిన ఇద్దరినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన ‘ఫుల్‌బాటిల్’
సాక్షి, నిర్మల్: క్షణికావేశంలో మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద గ్రామానికి చెందిన షేక్ రసూల్(31) మామడ మండలం అనంతపేట్ గ్రామంలో మేస్రీ్తగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఐదుగురు మేస్త్రీలు కలిసి సోమవారం మద్యం సేవించారు. ఫుల్‌బాటిల్ మద్యాన్ని 15నివిుషాలలో తాగితే రూ.25వేలు ఇస్తామని ఇద్దరు మేస్త్రీలు రసూల్‌తో పందెం కాశారు. దీంతో ఫుల్‌బాటిల్ మద్యాన్ని కూల్‌డ్రింక్స్‌లో కలుపుకుని రసూల్ సేవించాడు. బాటిల్లో సగం వరకు తాగి కింద పడిపోయాడు. అపస్మారకస్థితికి వెళ్లడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రసూల్‌తో కలిసి మద్యం తాగినవారు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలో షేక్ నజూరుబాషా, రత్తయ్యలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రసూల్‌కు భార్యతో పాటు కుమారుడు ఉన్నారు. విషాదం: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆపై.. -
అప్పుచేసి ‘డెత్ గేమ్స్’
ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడి, అప్పులిచ్చే యాప్‌ల ద్వారా రూ.15 లక్షలు తీసుకున్న ఓ యువకుడు.. వాటిని తీర్చే దారిలేక మంచిర్యాలలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ విద్యార్థి బెట్టింగుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సహ విద్యార్థికి చెందిన రూ.30 వేలు దొంగిలించాడు. విషయం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. సాక్షి, హైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు.. అదీ లక్షల్లో అప్పులేంటని సందేహమా? హైదరాబాద్ పరిసరాల్లో బీటెక్, ఇతర ఉన్నత కోర్సులు అభ్యసించే విద్యార్థులతో పాటు యువకులకు ఈ తరహా అప్పులుండటం చాలా ‘కామన్’. ఎం దుకంటే వీరికి అప్పులిచ్చేందుకు పలు యాప్స్ స్మార్ట్‌ఫోన్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఇవి రూ.500 మొదలు దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులి స్తున్నాయి. దీంతో విద్యార్థులు, యువత ఇష్టానుసారం పలు ప్రీపెయిడ్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ.. వేలు, లక్షల్లో పందేలు కాస్తున్నారు. తీరా తిరిగి చెల్లించాల్సిన సమయానికి ఒత్తిడికి గురవుతున్నా రు. తొలుత చేబదులంటూ చిన్నగా అ ప్పులు అలవాటు చేస్తున్న యాప్స్ ఆ మొత్తాలు పెద్దవయ్యాక వేధింపులకు ది గుతున్నాయి. ఈ ఊబి నుంచి బయటపడేందుకు కొందరు దొంగతనాలు చేస్తున్నారు. ఇంకొందరు స్మార్ట్‌ఫో న్లు, ల్యాప్‌టాప్, ఇతర బంగారు ఆభరణాలు అమ్మేస్తూ, వాటిని పోగొట్టుకున్నట్టు ఇంట్లో చెబుతున్నారు. యాప్‌లు అప్పులిచ్చేదిలా.. స్మార్ట్‌ఫోన్‌లో విద్యార్థులకు చిన్న చిన్న మొత్తాల నుంచి భారీగా రుణాలిచ్చేందుకు పలు రకాల యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టూడెంట్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్‌నంబర్, ఈ–మెయిల్, ఫేస్బుక్ ఖాతాల వివరాలు నమోదు చేయాలి. సాధారణ యువకులైతే ఆధార్, బ్యాంకు స్టేట్మెంట్లను ఇవ్వాలి. వాటిని ధ్రువీకరించుకున్న ఆయా యాప్స్.. రూ.500 నుంచి అప్పులివ్వడం ప్రారంభిస్తాయి. అలా మంచి స్కోరు మెయింటైన్ చేస్తే.. 3 నెలల తరువాత రూ.10వేల నుంచి 20 వేల వరకు ఇస్తాయి. అందుకోసం ప్రతీ రూ.1,000 మీద రూ.10 నుంచి రూ.15 వరకు వడ్డీ వసూలు చేస్తాయి. తీరా అదే విద్యార్థి రూ.లక్షల్లో అప్పుచేస్తే.. వెంట నే యాప్స్ నిర్వాహకులు రంగంలోకి దిగుతారు. తొలుత ఫోన్లుచేసి చెల్లించాలని కోరతారు. ఆపై మీ పిల్లాడు అప్పులకు వాయిదాలు చెల్లించడం లేదంటూ కాలేజీకి, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తూ అతనిపై మానసికంగా, సామాజికంగా ఒత్తిడి తెస్తారు. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతు న్న పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అప్పు తీర్చేందుకు ఇంకో అప్పు ఆయా యాప్స్ నుంచి అప్పులు తీసుకుంటున్న విద్యార్థులు, యువత సంఖ్య ప్రస్తుత లాక్డౌన్ కాలంలో పెరిగిపోతోంది. యాప్‌ల అప్పులు తీర్చేందుకు మరోచోట కొత్త అప్పులు చేస్తున్నా రు. ఇదే అదనుగా పలువురు వడ్డీ వ్యాపారులు వీరికి అధిక వడ్డీకి అప్పులిస్తున్నారు. తీర్చకపోతే ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్, మెడలోని బంగారు గొలుసులు, ల్యాప్‌టాప్‌లను లాక్కుంటున్నారు. ఇ లాంటి వ్యవహారాలు పెద్దగా వెలుగులోకి రావట్లే దు. రూ.లక్షల్లో అప్పులు చేసిన విద్యార్థులు వా టిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -
కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు
సాక్షి, బెంగళూరు: రాజకీయాలు, సినిమా, క్రికెట్ ఇలా అన్నింట్లో బెట్టింగుల జోరు నడుస్తూ ఉండడం చూశాం కదా! కానీ కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం అన్నట్లు ఇప్పుడు తాజాగా కోవిడ్–19పై పందెరాయుళ్లు పందేరాలు నడిపిస్తున్నారు. కర్ణాటకలో కోవిడ్–19 విధ్వంసం సృష్టిస్తోంది. కరోనా ప్రారంభంలో నెమ్మదిగా సాగితే ప్రస్తుతం ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చెందుతూ అంతకంతకు విస్తరిస్తోంది. ఇలాంటి కరోనా కేసులపై బెట్టింగులు కూడా బాగానే జరుగుతున్నాయి. హెల్త్ బులిటిన్‌పై ఆధారపడి : కరోనా వైరస్ కేసులు వందల స్థాయి నుంచి వేల స్థాయికి చేరుకున్నాయి. రోజుకి వెయ్యి నుంచి రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, ఈ రోజు ఎన్ని కేసులు నమోదు అవుతాయి? వెయ్యినా లేదా రెండు వేలా అంటూ బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి.. ప్రతి రోజూ సాయంత్రం హెల్త్ బులిటిన్ విడుదల అయిన తర్వాత ఆ సంఖ్యను చూసి ఆ తర్వాత గెలిచిన వ్యక్తి ఖాతాకు నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. క్రికెట్ తరహాలో కోవిడ్ బెట్టింగ్‌లు చాలా చురుకుగా సాగుతున్నాయి. చదవండి: సీఎం సమీక్ష.. పకడ్బందీగా రాబోయే లాక్డౌన్ గ్రామీణ ప్రాంతాల్లోనే : ‘ఈ రోజు కర్ణాటకలో ఎన్ని కోవిడ్ కేసులు నమోదు అవుతాయి? ఏ జిల్లా కోవిడ్ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుంది? ఈరోజు కరోనా మరణాలు ఎన్ని నమోదు అవుతా యి?’ అనే బెట్టింగులు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి బెట్టింగులు ఎక్కువగా పాత మైసూరు, చామరాజనగర, ఇతర స్థలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నా యి. అది కూడా ఈ బెట్టింగ్‌లు కేవలం రూ 100, రూ 500, రూ. 1000 మేర తక్కువ మొత్తంలో జరుగుతుండడం వల్ల పోలీసుల దృష్టికిపెద్దగా రావడం లేదు. చదవండి: 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు -
మన క్రికెటర్లు అవగాహనాపరులు
న్యూఢిల్లీ: బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు, బుకీల సంప్రదింపులపై భారత క్రికెటర్లు జాగరూకతతో వ్యవహరిస్తారని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ అన్నారు. ఈ అంశంపై వారికి తగినంత అవగాహన ఉందని పేర్కొన్నారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే తమకు రిపోర్ట్ చేస్తారని చెప్పారు. ‘సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ద్వారా బుకీలు ఎలా సంప్రదింపులు జరుపుతారనే అంశంపై మన క్రికెటర్లకు పూర్తిగా అవగాహన కల్పించాం. వారికి నేరం జరిగే తీరుపై అవగాహన ఉంది. ఎవరైనా తమను సంప్రదించినప్పుడు వారు వెంటనే మా దృష్టికి తీసుకువస్తారు. మా ఏసీయూ టీమ్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల సోషల్ మీడి యా అకౌంట్లపై, ఆన్లైన్ కాంటాక్ట్‌లపై కన్నేసి ఉంచుతుంది. ఫేక్ ఐడీలతో అభిమానులుగా చెలామణి అయ్యేవారి నిజస్వరూపం ఏదో ఒక సమయంలో బయటపడుతుంది’ అని అజిత్ వివరించారు. -
కాయ్ రాజా కాయ్
నిజామాబాద్, ఆర్మూర్: బల్దియా ఎన్నికలేమో గానీ జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు భారీగానే ఖర్చు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఓట్ల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు.! అయితే, మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉంటే, మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు కూడా బిజీగా మారారు. ఏ వార్డులో ఎవరు గెలుస్తారనే జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల బల్దియా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపోటములపై పందెం కడుతూతమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. అయితే, అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, విజయావకాశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌లోని కొత్తబస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్‌బంగ్లాల వద్ద బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు బెట్టింగ్‌లు కడుతున్నారు. జిల్లాతో పాటు ఆర్మూర్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా జూదం గతంలో విచ్చలవిడిగా సాగిన సందర్భాలున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ బడాబాబుల బిడ్డలే ఎక్కువగా ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపు, ఓటమిలపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం పలాన అభ్యర్థి కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలుపొందుతాడు చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు పందాలు కాస్తున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములతో పాటు చైర్ పర్సన్ పీఠాన్ని ఫలానా వ్యక్తి కైవసం చేసుకుంటాడు కావాలంటే బెట్ కట్టండి అంటూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైంపాస్ వ్యవహారంగా మారింది. -
బెట్టింగ్ హు‘జోర్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకర్షించిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈనెల 21న ఎన్నిక జరగ్గా, గురువారం రానున్న ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొనడంతో పందాలు మొదలయ్యాయి. ఎన్నిక జరగడానికి ఒకట్రెండు రోజుల ముందే ప్రారంభమైన ఈ బెట్టింగులు బుధవారం రాత్రికి తారస్థాయికి చేరాయి. రెండు రాష్ట్రాల్లోని బెట్టింగు రాయుళ్లు వేయి నుంచి లక్షల రూపాయల వరకు బెట్టింగులు కాస్తున్నారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలతో పాటు పోలింగ్ జరిగిన సరళి అధికార టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న పందాలపై భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. సరిహద్దుల్లోనూ ఎక్కువే హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న జిల్లాల్లోనూ బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఉమ్మడి నల్లగొండతోపాటు ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఫలితంపై పందాలు కాస్తున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ హుజూర్నగర్ ఫలితంపై బెట్టింగులు జరుగుతున్నాయి. బుకీలు కూడా రంగ ప్రవేశం చేయడంతో గత రెండు రోజులుగా జోరందుకున్న ఈ పందాల్లో స్థానిక బెట్టింగ్ రాయుళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గెలుపే కాదు...మెజార్టీలపై కూడా ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందనే దానితోపాటు ఆయా పార్టీలకు వచ్చే మెజార్టీల మీద కూడా బెట్టింగులు నడుస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై పందాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ గెలుస్తుందని 100 రూపాయలు బెట్టింగ్ చేస్తే 75 రూపాయలే ఇస్తామని, టీఆర్ఎస్కు 10వేల మెజార్టీ వస్తుందంటే రూపాయికి రూపాయిన్నర, 20వేల మెజార్టీ వస్తుందని పందెం కాస్తే రూపాయికి రెండు రూపాయలు ఇస్తామనే స్థాయిలో బుకీలు, స్థానిక బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్లు ఇస్తున్నారు. అయితే, ఇలాంటి బెట్టింగ్‌లలో పాల్గొనడం చట్టవిరుద్ధమని, ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
బెట్టింగ్ కొంపముంచింది
ఉదయగిరి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జోరుగా జరిగిన బెట్టింగ్‌లో టీడీపీ అభిమానులు, సానుభూతిపరులు తీవ్రంగా నష్టపోయారు. పార్టీ నాయకుల మాటలు నమ్మి గెలుపుపై ధీమాతో అనేకమంది పందేలు కాశారు. జిల్లా అంతటా రూ.50 కోట్లకుపైగా బెట్టింగ్ జరిగినట్టుగా అంచనా. ఫ్యాన్ హవా స్పష్టంగా కనిపించినా టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యంతో కావాలని గెలుపుపై ఊహాగానాలు వ్యాప్తిచేశారు. దీనిని నమ్మిన కొందరు మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, స్థానకంగా నిలబడిన ఎమ్మెల్యేలు గెలుస్తారనే ధీమాతో పందేలు కాశారు. పలువురు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల మెజార్టీపై పందేలు కాసి నష్టపోయారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.5 కోట్లపైగా బెట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయగిరి, దుత్తలూరు, సీతారామపురం, వింజమూరు, కొండాపురం, కలిగిరి, తదితర మండలాలకు చెందిన టీడీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పందేలు కాశారు. అంచనాలు పూర్తిగా తప్పడంతో నాయకులకు కళ్లు బైర్లు కమ్మాయి. అటు రాష్ట్రంలోనూ, ఇటు స్థానిక ఎమ్మెల్యేకు భారీ ఆధిక్యత లభించడంతో పెట్టిన పందెంలో ఓడిపోయారు. ఉదయగిరిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బెట్టింగ్‌ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వింజమూరు మండలంలో ఓ టీడీపీ అభిమాని బెట్టింగ్‌లో రూ.కోటి పోగొట్టుకున్నట్టు సమాచారం. అదేవిధంగా పురుగుమందుల వ్యాపారం చేసే ఓ టీడీపీ అభిమాని రూ.20 లక్షలు వరకు నష్టపోయాడు. వరికుంటపాడు మండలంలో క్రియాశీలకంగా ఉండే ముగ్గురు, నలుగురు టీడీపీ నేతలు బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కావలి కేంద్రంగా ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు సంబంధించి బెట్టింగ్ జోరుగా సాగింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీపై వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో పందెంరాయుళ్లు మునిగిపోయారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని బెట్టింగ్‌ల రూపంలో రూ.కోట్లు పోగొట్టుకున్న టీడీపీ సానుభూతిపరులు ఇప్పటికీ కోలుకోలేకున్నారు. -
కాయ్.. రాజా కాయ్!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్‌పోల్స్ వెలువడేసరికి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘంగా జరిగిన ఎన్నికలు కావడంతో ఇంతకాలం పందెం రాయుళ్లు స్తబ్దుగా ఉన్నారు. కానీ, ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడటంతో పందేలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు పలు తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ జోరుగా పందేలు సాగుతున్నాయి. పలు స్థానాలపై ఇప్పటికే పార్టీల బలాలవారీగా స్పష్టత వచ్చింది. దీంతో ఇక మెజారిటీ ఎంత వస్తుంది.. అన్న అంశాలపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఆరు స్థానాలపై ఉత్కంఠ.. ఇక తెలంగాణలో ఆరు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు వస్తా యని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ప్రతిపక్షాలకు ఒక ట్రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యం లో భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, మల్కాజిగిరి స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలు నువ్వానేనా అన్న తరహాలో సర్వశక్తులూ ఒడ్డాయి. ఆయాస్థానాల్లో అన్ని పార్టీలు విజయంపై ధీమాగా ఉండటం విశేషం. దీంతో ఈ స్థానాలపై పందేలు కాసేందుకు పందెంరాయుళ్లు అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఎంత మెజారిటీ వస్తుంది? అన్న విషయాలపై బెట్టింగులు సాగుతున్నాయి. రూ.1000 నుంచి రూ.లక్షల్లో ఈ బెట్టింగులు సాగడం విశేషం. ప్రభావం చూపని లగడపాటి.. గత తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్–తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తన సర్వేను ప్రకటించాడు. అదేసమయంలో జాతీయ సర్వేలన్నీ రాజగోపాల్ సర్వేకు విరుద్ధంగా ఉన్నా సరే.. మెజారిటీ ప్రజలు, పందెం రాయుళ్లు రాజగోపాల్ సర్వేకే మొగ్గుచూపారు. అదే నమ్మకంతో కోట్ల రూపాయల్లో కూటమి గెలుస్తుందంటూ రెండు రాష్ట్రాల ప్రజలు జోరుగా పందేలు కాశారు. అయితే టీఆర్ఎస్ 88 స్థానాలు గెలవడం, కాంగ్రెస్ కూటమి కేవలం 21 స్థానాలకు పరిమితమవడంతో కథ అడ్డం తిరిగింది. కూటమి గెలుస్తుందంటూ రూ.వందల కోట్లలో పందేలు కాసిన వారు ఘోరంగా ఓడిపోయి.. మొత్తం డబ్బును పోగొట్టుకున్నారు. ఈసారి కూడా అదేరీతిలో లగడపాటి సర్వే ఉండటంతో బెట్టింగుబాబులు లగడపాటి సర్వేను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీఆర్ఎస్, వైసీపీ వైపే.. అన్ని సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ విజయాన్ని ఖరారు చేయడంతో బెట్టింగుబాబులంతా ఈ రెండు పార్టీలవైపే చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల విజయావకాశాలపై హైదరాబాద్‌లోనూ పంటర్లు పందేలు జోరుగా కాస్తున్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది? అన్న విషయాల్లో పందేలు నడుస్తున్నాయి. -
‘ఎగ్సిట్’ ఎవరికి ?
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అందరిచూపు రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాపైనే ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయం పందేలకు వేదికగా మారింది. ఇక్కడ జరిగే పందేల తీరు కూడా అలాగే ఉంటుంది. బెట్టింగ్ మాట వినిపిస్తే చాలు పందెంరాయుళ్లకు కృష్ణా జిల్లానే గుర్తొస్తుంది. పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములపై రూ. కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రూ. 10వేల నుంచి మొదలై.. నలుగురైదుగురు కలిపి పెద్ద మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదేస్థాయిలో కొందరు యువకులు చిన్నపాటి పందేలకు దిగుతున్నారు. పోలింగ్ ముందు వరకు ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాష్ట్రంలో పార్టీలకు లభించే స్థానాలు, జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై ఇవి సాగాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటాపోటీ ఉన్నా.. పోలింగ్ తర్వాత చిత్రం మారిపోయింది. ఎన్నికలు ఏకపక్షంగా సాగాయన్న అంచనాకు రావడం.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పడంతో అప్పటి వరకు అధికారపార్టీ గెలుస్తుందని పందేలు కాసిన పందేంరాయుళ్లు ప్రస్తుతం ఆచితూచి పందేలు కాస్తున్నారు. ఒకటికి పదిసార్లు ఫలితం ఎటువైపు ఉంటుందోనని అన్ని కోణాల్లో ఆలోచించి మరీ ముందుకెళ్తున్నారు. కేవలం మెజార్టీపైనే పందేలు పెద్త ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల తర్వాత జిల్లాలోని పందెంరాయుళ్లతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వంటి మెట్రో నగరాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బడాబాబులు పెందేలు కాసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిగో ఇలా పందేలు.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారం చేజిక్కుంచుకుంటుందని కొందరు.. టీడీపీ తిరిగి అధికారం చేపడుతుందని మరికొందరు పందేలు కాస్తున్నారు. ఫలానా పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని.. మరోపార్టీకి వందసీట్లు దాటుతాయని.. ఇంకో పార్టీకి 5 దాటవని.. మరోపార్టీకి 30 లోపు వస్తాయని ఇలా పందేలు ఊపందుకున్నాయి. జిల్లా విషయానికొస్తే మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు స్థానాలపై పందేలు నడుస్తున్నాయి. ప్రధానంగా శాసనసభ నియోజకవర్గాల విషయానికొస్తే కీలకమైన మైలవరం, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, పెనమలూరు స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపైనా పందేలు కాస్తున్నారు. పందేలకు ప్రత్యేక కేంద్రాలు.. రాజధాని ప్రాంతంలో పందెం రాయుళ్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, జగ్గయ్యపేట, మైలవరం, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో వీరికి షెల్టర్లు వెలిశాయి. ఇవి ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర నగరాల పందెం రాయుళ్లకు కేంద్రాలుగా పనిచేస్తాయి. పందెంరాయుళ్లకు మధ్యవర్తిగా ఉంటూ ఇరుపక్షాల వద్ద సొమ్ము కట్టించుకుని గెలిచిన తర్వాత 10 శాతం కమీషన్ సొమ్మును మినహాయించి మిగిలిన సొమ్మును విజేతలకు అందజేస్తారని తెలుస్తోంది. -
భీమవరంలో పవన్ ఓడిపోతారంటూ భారీ బెట్టింగులు
-
నా పందెమూ అటే..!
వెంకట్రావు(టీడీపీ నేత): ఏంది పాపారావు.. బాగా హుషారుగా ఉన్నావ్.. ఎక్కడ నుంచి వస్తున్నావ్ పాపారావు(సామాన్యుడు): అదా.. చెప్పకూడదులే.. నీకు రుచించదు. వెంకట్రావు: పర్లేదులే పాపారావు చెప్పు.. పాపారావు: మళ్లీ నువ్వు ఎవరితో అనడకూడదంటే చెబుతాను.. వెంకట్రావు: అట్టాగేలే చెప్పు..! పాపారావు: ఏ పార్టీ గెలుస్తుందా అని మన ఊళ్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి కదా.. అక్కడికెళ్లా.. అందరూ ఫ్యాన్ వైపే కాస్తన్నారు.. నాకూ ఆ పార్టీ మీదే నమ్మకం ఉంది..అందుకే నేను కూడా అటే పందెం కట్టొచ్చా. వెంకట్రావు:అదంతా ఉట్టిదేరా..! టీడీపీకి 150 సీట్ల వరకు వస్తాయని బాబు బల్లగుద్దుతున్నారు.. కొన్ని చానళ్ల సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. పాపారావు: ఆ చానళ్లు, బాబు గారి మాటలు నమ్మి.. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా టీడీపీ గెలుస్తుందని పందెం కట్టావా! వెంకట్రావు:ఆఆఆఆ... (తల గోక్కుంటూ) ఎవరికీ చెప్పవుగా..! పాపారావు: చెప్పనులే చెప్పవయ్యా! వెంకట్రావు: ఈ సారి నా పందెం కూడా అటే(వైఎస్సార్ సీపీ) వేశా!ఎలాగూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. ఎంత అభిమానం ఉన్నా జేబులు గుల్ల చేసుకోవడం ఎందుకు? మొన్న ఎలక్షన్లకే చాలా ఖర్చు పెట్టా.. ఆ డబ్బులన్నా రావాలి కదా.. నేనే కాదు మా పార్టీ వాళ్లు చాలా మంది అటే పందెం కట్టారు.. మళ్లీచెబుతున్నా.. ఎవరికీ చెప్పొద్దురో.. కొంప మునిగిద్ది. సాక్షి, గుంటూరు: సార్వత్రిక సమరం ఈ నెల 11న ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఫలితాలు వెలువడటానికి ఇంకా 26 రోజుల సమయం ఉంది. ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులు, ప్రధాన పార్టీల నాయకులు కుటుంబ సభ్యులతో ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని చల్లని ప్రదేశాలకు క్యూ కట్టారు. మరో వైపు ఎండ వేడికి పోటీ పడుతూ రాష్ట్రమంతటా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వేడి రాజుకుంది. చాలా వరకూ బెట్టింగ్ రాయుళ్లు వైఎస్సార్ సీపీకే సై అంటున్నారని.. టీడీపీ వైపు పందెం వేయడానికి నైనై.. అంటున్నారని తెలుస్తోంది. పందేలు జరుగుతాయిలా.. సాధారణంగా రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏపార్టీ ఫామ్ చేస్తుంది.. ప్రభుత్వం ఫామ్ చేసే పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు అదనంగా ఎన్ని సీట్లు వస్తాయి.. కీలక అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎంత మెజార్టీ సాధిస్తుంది.. ఇలా పలు రకాలుగా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తుంటారు. ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్లందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు కాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు కాసే నాథుడే కనిపించడం లేదు. అది మేకపోతు గాంభీర్యమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయు డు తమ పార్టీ 150 స్థానాల వరకు కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. కానీ ప్రజల నాడి మాత్రం వైఎస్సార్ సీపీకే పట్టం కట్టినట్లు స్పష్టం అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు మాటలన్నీ మేకపోతు గాంభీర్యమేనని తెలుగుదేశం పార్టీ నాయకులే గ్రహించారు. అందుకే ఆ పార్టీ గెలుపై ఎవరిలోనూ ధీమా కనిపించడం లేదు. కీలక స్థానాలపై.. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లకు మొదటి స్థానంలో ఉండే జిల్లా టీడీపీ నాయకులు సైతం తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందేలు వేసేందుకు ముందుకు రావడం లేదని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలోని మంగళగిరి, చిలకలూరిపేట, కుప్పం, పులివెందుల, గుడివాడ సీట్లపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నా యి. గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికలు నేర్పిన గుణపాఠం వల్ల కొందరు టీడీపీ తరఫున బెట్టింగ్‌లు వేసేందుకు వెనకాడుతున్నారు. రేటింగ్ ఇస్తామన్నా.. నో.. నో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, కీలక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుపొందుతారని బెట్టింగ్ రాయుళ్లు ఒకటికి ఒకటిన్నర, రెండు చొప్పున రేటింగ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ టీడీపీ ఓటమి ఖాయమని అందరికీ అర్థం కావడంతో ఆ పార్టీ తరఫున బెట్టింగ్ వేసేందుకు చాలా వరకూ వెనుకడుగు వేస్తున్నారట. వైఎస్సార్ సీపీ తరఫున రేటింగ్ ఇస్తుండటంతో కొన్ని సందర్భాల్లో ఆశావహులైన టీడీపీ వర్గీయులు బెట్టింగ్‌కు సరేనని తీరా డబ్బు కలిపే సమయానికి ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
బెట్టింగ్ గాలి!
సిక్సర్ల మోత.. సెంచరీల రికార్డులు.. కళ్లు బైర్లుకమ్మే క్యాచ్‌లు.. నమ్మశక్యం కాని ఫీల్డింగ్.. ఐపీఎల్ వేదికగా సాగుతున్న ఈ ఆశ్చర్యాలు ప్రజల దృష్టిని ఎన్నికల ఉత్కంఠ నుంచి మళ్లించలేకపోతున్నాయి. పోలింగ్ ముగిసి వారం రోజులు గడిచినా.. ఇప్పటికీ అదే చర్చ. ఫలితాలకు నెల రోజులకు పైగా సమయం ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణుల్లో గెలుపోటముల వేడి చెమటలు పట్టిస్తోంది. పనిలో పనిగా కోట్లాది రూపాయల బెట్టింగ్ సాగుతోంది. వైఎస్సార్సీపీ గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఈ పరిస్థితుల్లో పందెంరాయుళ్లు ఆచితూచి అడుగులేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది? మెజార్టీ ఎంత రావచ్చు? గెలుపోటములకు కారణాలు ఏమై ఉంటాయి? క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందా? ఎక్కడ నలుగురు గుమికూడినా ఇదేవిధమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా ఎన్నికలు ముగిసిన నాలుగైదు రోజులకు ఫలితాలు వచ్చేస్తుండగా.. ఈ విడత ఏకంగా 42 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఎవరి అంచనాల మేరకు వారు విశ్లేషణల్లో మునిగి తేలుతుండగా.. బెట్టింగ్ కూడా భారీగా జరుగుతోంది. ఈ నెల 11నపోలింగ్ ముగిసింది. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో గెలుపోటములపై ఓ అంచనా రావడంతో బెట్టింగ్ సొమ్ము భారీగా చేతులు మారుతోంది. మధ్యవర్తులు కూడా ఫోన్లు చేసి మరీ బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయికి తగినట్లుగా వాళ్లు పందెం కాస్తుండటంతో ‘ఫలితం’ ఉత్కంఠ రేపుతోంది. గెలుపోటములపై ఎవరికి వారు ధీమా గత ఎన్నికల్లో టీడీపీ రెండు పార్లమెంట్లతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎన్నికలు ఎలా జరిగినా టీడీపీకే మెజార్టీ సీట్లు వస్తాయనేది ఆ పార్టీ శ్రేణుల వాదన. అయితే ప్రజలంతా మార్పునకు ఓటేశారని, జిల్లాలో జగన్ గాలి వీచిందని, ఈ దఫా జిల్లాలో రాజకీయ వటవృక్షాలు కూడా నేలకొరుగుతాయనేది వైఎస్సార్సీపీ శ్రేణుల ధీమా. ఈ నేపథ్యంలో బెట్టింగ్ జోరందుకుంది. ఎక్కువగా రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, పెనుకొండపైనే భారీ బెట్టింగ్ నడుస్తోంది. ♦ రాప్తాడు ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కచ్చితంగా గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు బెట్టింగ్ కాస్తున్నారు. టీడీపీ నేతలు కూడా గట్టి పోటీ ఉందని, అయితే బొటాబొటీ మెజార్టీతోనైనా శ్రీరాం గెలుస్తాడని బెట్టింగ్‌కు దిగుతున్నారు. పరిటాల ఫ్యామిలీపై వ్యతిరేకత, ప్రకాశ్‌రెడ్డిపై సానుభూతికి తోడు జగన్ గాలితో కచ్చితంగా రాప్తాడులో వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుందనే అభిప్రాయం అధిక శాతం వినిపిస్తోంది. ఈ ఒక్క నియోజకవర్గంపైనే ఇప్పటి వరకూ రూ.10–15కోట్ల బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ 1ః1 పద్ధతిలోనే బెట్టింగ్ నడుస్తోంది. ♦ ధర్మవరంలో కేతిరెడ్డి గెలుపుతో పాటు మెజార్టీపై పందెం కాస్తున్నారు. మరోవైపు వరదాపురం సూరి కూడా తాను గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. ఇక్కడ కూడా 1ః1 చొప్పున బెట్టింగ్ నడుస్తోంది. ♦ తాడిపత్రిలో జేసీ అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిపై గట్టిపోటీ ఉందనే భావనలో ప్రజలు ఉన్నా, నియోజకవర్గంలో మాత్రం కచ్చితంగా పెద్దారెడ్డి గెలవబోతున్నారనే ధీమా కనిపిస్తోంది. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డితో తన అనుచరులు అస్మిత్‌కు ఇబ్బందిగా ఉందని చెబితే, బెట్టింగ్‌కు వచ్చేవాళ్లు ఉంటే తీసుకోవాలని, 30శాతం కమిషన్ ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి గెలుస్తారని బెట్టింగ్‌కు డబ్బులు తీసుకుని వెళితే ‘తర్వాత చూద్దాం’అని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ♦ పెనుకొండలో కూడా ఇప్పటికే రూ.6–8కోట్ల వరకూ బెట్టింగ్ సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. శంకర్‌నారాయణ గెలుస్తారని ఇక్కడ ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోంది. ఎంపీలపైనా భారీగా బెట్టింగ్ ఎంపీ ఎన్నికల్లో ఈ దఫా క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో ఉంది. అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులు బోయ రంగయ్య, గోరంట్ల మాధవ్‌లు గెలుస్తారని ఎక్కువగా పందెం కాస్తున్నారు. గుంతకల్లు, శింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గంలో జితేంద్రగౌడ్, శమంతకమణి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి తదితరులు జేసీ పవన్‌కు సహకరించలేదు. గుంతకల్లులో మధుసూదన్‌గుప్తా ఎంపీ ఓటు తమకు వేయించారనే ధీమాలో జేసీ వర్గం ఉంది. కానీ గుప్తా సహకరించలేదని తెలుస్తోంది. పైగా పార్లమెంట్ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచే పరిస్థితి ఉంది. దీనికి తోడు టీడీపీలోని ‘హార్డ్‌కోర్ బోయ ఓటర్లు’ ఎమ్మెల్యేగా టీడీపీకి ఓటు వేసినా, ఎంపీకి ‘మా వాడు’ అని రంగయ్యకు ఓటేశారు. ఇదే తరహా ఓటింగ్ ‘పురం’ పరిధిలో జరిగింది. మాధవ్ పోటీతో కురబ సామాజికవర్గం మెజార్టీగా వైఎస్సార్సీపీ పక్షాన నిలిచింది. పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటేసిన వారు కూడా ఎంపీకి మాధవ్‌కు ఓటేసినట్లు ప్రచారం నడుస్తోంది. టీడీపీ తరఫున ప్రచారం చేసిన కొంతమంది క్రియాశీల కార్యకర్తలు సైతం ఎంపీగా మాధవ్‌కు ఓటేసినట్లు సమాచారం. దీనికి తోడు ‘పురం’ పార్లమెంట్ పరిధిలో 5 అసెంబ్లీల్లో వైఎస్సార్సీపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఎంపీ కూడా ఆ పార్టీ ఖాతాలో చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ మేరకు ఎంపీ స్థానాలపైనా భారీగా బెట్టింగ్ నడుస్తోంది. బెట్టింగ్‌కు సిద్ధమయ్యే వారు మధ్యవర్తి వద్ద డబ్బులు ఉంచుతున్నారు. గెలిచిన తర్వాత మధ్యవర్తి 10శాతం కమీషన్ తీసుకుని తక్కిన 90శాతం ఇచ్చేలా ఒప్పందం చేసుకుని బెట్టింగ్ కాస్తున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం చేసే వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బెట్టింగ్ కాస్తున్నారు. ఐదు రోజుల నుంచి బెట్టింగ్ హడావుడి ఊపందుకుంది. అయితే ఈ వేడి మరో 30 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ సమయానికి జిల్లాలో వంద కోట్లకు పైగా బెట్టింగ్ జరగొచ్చని అంచనా. అనంతపురంలో 1@5 లెక్కన బెట్టింగ్ అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి గెలుస్తారని బెట్టింగ్‌కు ఆహ్వానిస్తే టీడీపీ తరఫున ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో టీడీపీ గెలుస్తుందనే ధీమా ఉన్నవారు 1ః5 లెక్కన బెట్టింగ్‌కు సిద్ధపడుతున్నారు. ‘అనంత’ గెలిస్తే లక్షన్నరకు లక్ష, చౌదరి గెలిస్తే లక్షన్నరకు లక్ష చొప్పున ఇస్తామని పందెం కాస్తున్నారు. శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి, కదిరిలో వైఎస్సార్సీపీకి అనుకూలంగానే పందెం నడుస్తోంది. ఇక్కడ మెజార్టీపై పందెం జరుగుతోంది. కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిరతో పాటు జిల్లా వ్యాప్తంగా రూ.60కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. -
సీన్ రివర్స్ బెట్టింగులకు బెదురు
పశ్చిమగోదావరి, ఏలూరు (టూటౌన్): గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లను తెలుగుదేశం, అప్పట్లో దాని మిత్రపక్షం బీజేపీ తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే మొత్తం సీట్లను కట్టబెట్టిన జిల్లాకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో జిల్లావాసుల్లో అంతర్మధనం ప్రారంభమైంది. దీని పర్యవసానమే ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచన ప్రతిఒక్కరిలో తలెత్తింది. దీంతో జిల్లాలో సీన్ రివర్స్ అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందువరకూ రాష్ట్రంలో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని, ఈసారీ జిల్లాలో అత్యధిక సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందనే దానిపై బెట్టింగ్‌రాయుళ్లు, పచ్చ చొక్కాల నేతలు కోట్లలో పందాలు కాసేందుకు రెడీ అయ్యారు. అ యితే ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచి వీ రెవరూ నోరు మెదపడం లేదు. పైకి మాదే గెలుపు అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న టీడీపీ గణం లోలోన మాత్రం ఓటమి భయంతో కుంగిపోతున్నారు. దీంతో తమకు అత్యంత సన్నిహితులైన అనుచరగణం వద్ద ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టినా పందాల జోలికి వెళ్ల వద్దంటూ ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఈకారణంగానే వీరు బెట్టింగ్‌లకు దూరంగా ఉంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో పోటాపోటీగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు కొద్ది మొత్తాల్లో పందాలు కాస్తున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బెట్టింగ్‌ల జోరు చాలా తగ్గిందని పందెంరాయుళ్లు అభిప్రాయపడుతున్నారు. పందేలకు దూరంగా.. 2014 ఎన్నికల్లో సాక్షాత్తు ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ నేత ఒకరు స్వయంగా రూ.కోట్లలో పందెం కాసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయన ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్మంతా బెట్టింగ్ ద్వారా మొత్తం రాబట్టుకున్నారనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా ఉండేది. అదే నేత ఈ ఎన్నికల్లో అసలు గెలుస్తానో లేదో అనే అనుమానం రావడంతో తన అనుచరులను పందాలకు దూరంగా ఉండాలంటూ ముందస్తుగా హెచ్చరించారు. ఒకవేళ వేసినా కొద్ది మొత్తంలో కాసుకోండి తప్ప లక్షల్లో పందాలకు దూరంగా ఉండాలంటూ కోరినట్లు సమాచారం. బెట్టింగ్‌లు అంటే మూడో కాలిపై వెళ్లే సదరు నేత సైతం ప్రస్తుతం దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఇదే నియోజకవర్గంలో ఎన్నికల ముందు వరకూ ప్రతి గ్రామంలోనూ పచ్చా చొక్కా నాయకులు, కార్యకర్తలు రూ.లక్షల్లో పందానికి రెడీ అంటూ మీసాలు మెలివేశారు. అవసరమైతే కోసు పందాలకు కూడా రెడీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాజాగా వారంతా సైలెంట్ అయిపోయారు. పరోక్షంగా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో అనే అనుమానం వారిలో వ్యక్తం కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తారుమారైన పరిస్థితి రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కుతాయంటూ బీరాలు పలికిన టీడీపీ నేతలు ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోయారు. గ్రామాల్లో నలుగురు చేరే రచ్చబండలు, హోటళ్లు, కిళ్లీకొట్లు వంటి ప్రాంతాల్లో తారసపడినా తమ పార్టీ బొటాబొటీ మెజార్టీతో అయినా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటివరకూ తామే అధికారంలోకి వస్తున్నామంటూ ప్రగల్భాలు పలికిన ఈ నాయకులు ఇప్పుడు ఇలా మాట్లాడటానికి వారిలో ఉన్న ఓటమి భయమే కారణమని తెలుస్తోంది. వేచి చూచే ధోరణిలో.. జిల్లాలో పందెం రాయుళ్లకు కొదవ లేదు. అది క్రికెట్ మ్యాచ్ అయినా కోడి పందెం అయినా, చివరకూ రాజకీయ పోటీలైనా తెగబడి కోట్లలో పం దాలు కాయటం వీరికి పరిపాటి. జిల్లాలో ఇలా పందాలు కాసే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఎన్నికల తర్వాత వీరంతా మౌనం వహించారు. ముందూ వెనుకా ఆలోచించకుండా పందాలు కాస్తే చేతులు కాల్చుకోవాల్సి వస్తుందనేది వీరి వాదనగా ఉంది. ఇప్పటికే పందెం రాయుళ్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల పరిస్థితులపై బేరీజు వేసుకున్నారు. జిల్లాలో మొత్తం స్థానాలను గతంలో మాదిరిగా ఒకే పార్టీకి కట్టబెట్టే పరిస్థితులు లేవనేది వీరి అభిప్రాయంగా ఉంది. దీంతో గెలుపోటములపై పందాలు కాసేందుకు గతంలో మాదిరిగా బెట్టింగ్ రాయుళ్లు ముందుకు రావడం లేదు. కేవలం గట్టి పోటీ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో వీరు జనాల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్ దగ్గర పడే సమయానికి తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా బెట్టింగ్‌లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
మంగళగిరిలో జోరుగా కాయ్ రాజా కాయ్
-
పోలింగ్ ముగిసింది..పందెం మిగిలింది
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో జిల్లాలో పందేల జోరు ఊపందుకుంది. అభ్యర్థుల విజయావకాశాలతో పాటు ఏపార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు సాధిస్తారు, ఒకవేళ విజయం సాధి స్తే అభ్యర్థుల ఆధిక్యమెంత.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పందేలు కాస్తున్నారు. జిల్లాలోని విజయనగరం పట్టణంతో పాటు గజపతినగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి కేంద్రాలుగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ ప్రక్రి య ముగిసిన మరుక్షణం నుంచే వీరు రంగంలోకి దిగా రు. ఇప్పటికే కోట్లరూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ఉత్కంఠ పోరులో ఎవరు విజయం సాధి స్తారనే విషయంలో రచ్చబండ వేదికలుగా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. పోలింగ్ నిశితంగా గమనిస్తూ రంగంలోకి దిగిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల నడుమ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నందుకు పందెం డబ్బులలో 10 శాతం తీసుకుంటామని ముందే చెబుతూ పందేలు తీసుకుంటున్నారు. పందెం..పరి పరి విధములు గతంలో అధికారంలోకి వచ్చే పార్టీ, విజయం సాధించే అభ్యర్థులపై మధ్యవర్తి సమక్షంలో పై పందేలు కాసేవా రు. ఆ సరదా కాస్తా వ్యసనంగా మారింది. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో తమ అవగాహనతో పాటు సర్వేలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యుల వరకు తమ ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు పందేలు కాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 9అసెంబ్లీ నియోజకవర్గాలపై విస్తృతంగా జరుగుతున్నాయి. విజయనగరం పార్లమెంట్‌తో పాటు ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల గెలుపోటములపై, మరికొన్ని చోట్ల మెజార్టీపై కాస్తున్నారు. పోలింగ్ సరళి పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనాతో కాస్తున్న పందేలకు ప్రాధాన్యతనిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమాతో ఉన్న వారు హెచ్చుపందేలు కాయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక అభ్యర్థి విజయంపై కొందరు ప్రముఖులు రూ.లక్షకు అదనంగా రూ.10 వేలు ఇచ్చే ఒప్పందంతో హెచ్చు పందెం కాసినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో రూ.50 కోట్ల మేర చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది. గ్రామ, మండల స్థాయి నుంచి.. ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలోని పార్టీ కేడర్ అంతే కసిగా పనిచేసింది. ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవాలని ఎత్తుకు, పైఎత్తులు వేస్తూనే ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. రాత్రిపూట ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. బూత్‌స్థాయి పోలింగ్ మేనేజ్మెంట్పై ప్రధాన పక్షాలు దృష్టిసారించడంతో ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రతీ ఇంటి ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటూ గ్రామ, మండలస్థాయిలో వచ్చే మెజార్టీపై కౌంటింగ్‌కి ముందే ఒక అంచనాకు వస్తున్నారు. ఎవరికి వారు తమకే మెజార్టీ వస్తుందనే ధీమాతో గ్రామ, మండలస్థాయిలో వచ్చే ఆధిక్యంపై కూడా పందేలు కాస్తున్నారు. కుదేలవుతున్న సామాన్యులు వాస్తవంగా ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది ఓట్ల లెక్కింపు అనంతరం మాత్రమే తెలుస్తుంది. కొందరు ఆత్మవిశ్వాసం, తమ పార్టీపై ఉన్న అభిమానంతో అవగాహన మేరకు ముందస్తుగా అంచనా వేసుకుంటూ గుడ్డిగా పందేలు కాయడం పరిపాటిగా మారింది. ఎన్నికల జూదంలో ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం ఆర్థికంగా కుదేలవుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆస్తులు పొగొట్టుకుని ఆర్థికంగా చితికిపోయిన వారు ఉన్నారు. అప్పులు చేసి మరీ పందేలు కాస్తున్నారు. విద్యార్థులు, యువత, విద్యావంతులు, వ్యవసాయ కూలీలు కూడా వెనుకాడటం లేదు. -
కాయ్ రాజా.. కాయ్..!
దిల్సుఖ్నగర్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మిగిలింది ఎన్నికల ఫలితాలే.. ఫలితాలకు ఇంకా 42 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు ఆగలేని నాయకులు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. దీంతో రంగంలోని దిగిన బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల సమరంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, ఇష్టం ఉన్నా లేకున్న ముఖంపై రంగు పులుముకొని అందరినీ పేరుపేరునా పిలుస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటు ప్రచారం నిర్వహించారు. మరికొందరు లేని చుట్టరికాన్ని కలుపుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తు చేసిన ప్రచారం పోలింగ్‌తో ముగిసింది. ఇక తేలాల్సింది అభ్యర్థుల భవితవ్యమే. బూతుల వారీగా లెక్కింపులు.. ఆయా లోక్‌సభ సెగ్మెంట్లలో శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ భవితవ్యంపై తమ అనుచరగణంతో బూతుల వారీగా లెక్కలు తెప్పించుకుని సరి చూసుకుంటున్నారు. మరికొంతమంది చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ ఓటమిని ముందుగానే నిర్ణయించుకుని ఎంచక్కా వేసవి విడిదికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. బెట్టింగుల జోరు.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన తమకు విజయం వరిస్తుందని గంపెడాశతో అభ్యర్థులు ఉన్నారు. అయితే ఆయా నియోజక వర్గాల్లోని నాయకులు, చోటామోటా నేతలు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని పెద్ద ఎత్తున బెట్టింగ్లకుపాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్‌లు కార్యకర్తలమధ్య అయితే వేలల్లోనూ మోస్తరి నాయకులమధ్య అయితే లక్షల్లోనూ సాగుతున్నట్లు వినికిడి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. ఎన్నో నెలలుగా ఎంతో కష్టపడి తమ నాయకుని పక్షాన ప్రచారం చేశామని, ఇప్పుడు తమ నాయకుడు ఓడిపోతాడని అవతలి పక్షం వారు లెక్కలు కట్టి తేల్చి చెబుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా బెట్టింగ్‌లు కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. చేవెళ్ల పరిధిలో జోరుగా.. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఎక్కువగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో తమ అభ్యర్థలు గెలిస్తే తమకు పూర్తి సంతోషంతో పాటు డబుల్ దమాకాగా బెట్టింగ్ కట్టిన డబ్బులకు రెండింతలు వస్తాయని లేకపోతే అభ్యర్థి ఓటమితోపాటు తమ డబ్బులు కూడా పోతాయని వాపోతున్నారు. ఈ బెట్టింగ్‌ల విషయం తెలియని అభ్యర్థులు మాత్రం తమ భవితపై ఎన్నో ఆశలతో ఉన్నారు. మరో నలభై రెండు రోజులపాటు ఈ టెన్షన్ అనుభవించక తప్పదు మరి. -
బెట్టింగ్ జోరు.. గెలుపు ఎవరిదో..
ఆర్మూర్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల గెలుపు ఓటములపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపు ఓటములపై ఆన్లైన్లో పందెం కడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లపైనే బెట్టింగ్ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి సారిగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 178 మంది రైతులు నామినేషన్లు వేసిన విషయం విదితమే. కాగా ఈ రైతుల ఓట్లు చీలడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపవచ్చనే చర్చ బెట్టింగ్ రాయుళ్ల మధ్య ప్రధానంగా సాగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, బలహీనతలను పరిశీలించి ఒక అంచనాకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్తబస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్‌బంగ్లాలు బెట్టింగ్ సెంటర్లయ్యాయి. క్రికెట్ బెట్టింగ్‌లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యకిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్ ఆయా పార్టీల అభ్యర్థులపై కాస్తున్నారు. నామినేషన్ల పర్వం పూర్తయిన తరువాత ఈ బెట్టింగ్‌ల జోరు మరింత పెరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో బెట్టింగ్‌ల జోరు సైతం అదే పద్ధతిలో కొనసాగుతోంది. తమ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు ఆన్లైన్లో బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించారు. జిల్లాతో పాటు ఆర్మూర్ ప్రాం తంలో క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా జూదం గతంలో విచ్చలవిడిగా సాగిన సందర్భాలున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డవారు ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపు, ఓటమిలపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం ఫలాన అభ్యర్థి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందుతారు. చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ. ఐదు వేల నుంచి మొదలుకుని రూ. లక్ష వరకు బెట్టింగ్‌లో కాయడం ప్రారంభించారు. రూ. లక్ష బెట్టింగ్ కాసి విజయం సాధిస్తే అతని ప్రత్యర్థి రూ. లక్షకు రూ. రెండు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. ఎంపీ అభ్యర్థుల గెలుపు ఓటములతో పాటు దేశంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది పలానా వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు సైతం స్వీకరిస్తాడంటూ కావలిస్తే బెట్ కట్టండి అంటూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంతో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైంపాస్ వ్యవహారంగా మారింది. ఐదు వేల రూపాయలకు 20 వేల రూపాయలు, లక్ష రూపాయలకు రెండు లక్షల రూపాయలు ఇలా బెట్టింగ్ కాస్తూ తాము గెలుస్తాడని నమ్మిన నాయకుని విజయావకాశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. -
బెట్టింగ్ తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలంగాణ ఫలితాలపై బెట్టింగ్ కాసిన వారి రాతలు మారిపోయాయి. ఒక్కరోజులోనే కోట్ల రూపాయల నోట్ల కట్టలు ఇంటికొచ్చి చేరితే, ఇంకొందరు భారీగా నష్టపోయారు. వీరిలో ఎక్కువశాతం టీడీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కీలక వ్యాపారులు ఉండటం గమనార్హం. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని ఓడిపోతుందని ఓ టీడీపీ ఎమ్మెల్యే రూ.10కోట్లు పందెం కాశారు. ఆమె ఓటమితో సదురు ఎమ్మెల్యేకు ఒక్క రోజులోనే రూ.10కోట్లు వచ్చి చేరింది. అలాగే మరో ఎమ్మెల్యే కూటమి అధికారంలోకి వస్తుందని, సుహాసిని గెలుస్తుందని రూ.7కోట్లు పందెం కాశారు. ఈ మొత్తం డబ్బులు ఆయన కోల్పోయారు. అలాగే జిల్లాలో నోటి దురుసు ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మరో నేత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రూ.4కోట్లు దక్కించుకున్నారు. అలాగే నందమూరి సుహాసిని గెలుస్తుందని రూ.3కోట్లు పందెం కాసి నష్టపోయారు. ఈ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలే రూ.35కోట్ల వరకూ పందెం కాసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు తాడిపత్రి, ధర్మవరం, అనంతపురం, హిందూపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు, కాంట్రాక్టర్లు మరో రూ.15కోట్ల వరకూ బెట్టింగ్ కాశారు. దీంతో రూ.30కోట్ల వరకూ బెట్టింగ్ జరిగి ఉంటుందని ఫలితాల ముందు రోజు ఓ అంచనా ఉన్నా, ఫలితాల తర్వాత చేతులు మారిన డబ్బు రూ.50కోట్ల పైమాటేనని సమాచారం. -
బెట్టింగ్..రంగా
ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గెలుపు ఎవరిదనే మాటే అందరి నోటా వినిపిస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల కోసం మరో 24గంటలు ఎదురు చూడాల్సిందే. జిల్లాలో మాత్రం ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎవరికి వారు గెలుపోటములపై తమ తమ అంచనాలతో జోరుగా విశ్లేషిస్తున్నారు. ఫలితాలపై జోరుగా పందెం కొనసాగుతోంది. సిద్దిపేటజోన్ : ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? ఏ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం బెట్టింగ్ కాస్తున్నారు. రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు తమ స్థాయికి తగ్గట్టుగా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. మరి కొందరు విహార యాత్రలు, విందులు, వినోదాలు ఇచ్చేలా పందెం కాస్తున్నారు. తాము పెట్టిన సొమ్ముకు రెట్టింపుగా రాబట్టుకునేందుకు పందెంరాయుళ్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. జిల్లాలో కీలకమైన స్థానాలు ప్రధానంగా జిల్లాలో కీలకమైన స్థానాలు ఉండడం, అధికారంలో, పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కావడంతో బెట్టింగ్ రాయుళ్లు పందెం కాసేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరు అనే అంశం మొదలుకొని నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే అంశంపై బెట్టింగులు కాస్తున్నారు. వివిధ రకాల ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు, సోషల్ మీడియా పోస్టింగులను బేస్ చేసుకొని బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. జాతీయ చానళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేకు భిన్నంగా లగడపాటి రాజగోపాలు సర్వే వివరాలు పేర్కొనడంపై యువతలో ఆసక్తి నెలకొంది. ఫలానా పార్టీ , ఫలానా అభ్యర్థి విజయం సాధిస్తారని, ఫలానా పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, నియోజకవర్గాల వారిగా ఫలానా అభ్యర్థికి వచ్చే మెజార్టీపై ఎవరికి వారు తమ అంచనాలకు అనుగుణంగా పందెంలో డబ్బులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గజ్వేల్‌లో గెలుపుపై భారీగా.. జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బరిలో ఉండడం, ఆయనకు పోటీగా కూటమి అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి నిలిచిన క్రమంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉందన్న సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి యువత పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. రూ. 10 వేల నుంచి రూ. 5లక్షల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో బెట్టింగ్‌కు దిగడం విశేషం. దుబ్బాక నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై, మెజార్టీపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పొరుగునే ఉన్న జనగామ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు చేర్యాల, కొమురవెల్లిలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అక్కడ బరిలో ఉన్న వారిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మరొకరు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు కావడం విశేషం. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు గెలుపోటములు, ప్రధానంగా మెజార్టీ పైనే బెట్టింగ్ జరుగుతుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా జరిగే బెట్టింగ్ ప్రక్రియ సహజంగా పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా పాకుతోంది. ఆయా మండలాల్లోని కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట స్పెషల్.. లక్ష మెజార్టీపైనే పందెం ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట ప్రస్తుతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గతంలోనే సిద్దిపేట అభ్యర్థి హరీశ్‌రావు రికార్డు స్థాయిలో రెండు సార్లు భారీ మెజార్టీని సాధించి రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు రావడం, షెడ్యూల్ విడుదల నుంచి లక్ష మెజార్టీ లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని నిర్వహించాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడం, అందరి అంచనాలకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరగడంతో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో మెజార్టీపై చర్చ జోరుగా సాగుతోంది. ఓట్లేసి 72 గంటలు దాటినా ఇప్పటికీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అది లక్ష మెజార్టీ పైనే. ప్రధానంగా హరీ«శ్ గెలుపు అంశాన్ని పక్కన బెట్టి స్వంత పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా యువతలో మెజార్టీ ప్రధాన అంశంగా జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. -
కాయ్ రాజా కాయ్
తూప్రాన్: ఎన్నికల ప్రధాన అంకం ముగిసింది. ఊహించని స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ మరోవైపు పలు పార్టీల పొత్తులతో రంగంలోకి దిగిన మహాకూటమి, కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులు తమ సత్తాచాటేందుకు సర్వశక్తులూ వడ్డారు. గెలుపెవరిదో ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఆ గెలుపోటములపై జిల్లాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎగ్జిట్‌పోల్, పోస్ట్‌పోల్ సర్వేలు గందరగోళంగా సృష్టిస్తున్నాయి. ఉన్న రెండు నియోజకవర్గాల్లో పోటీ ఎవరెవరి మధ్య ఉందో ఇప్పటికే తేలిపోయింది. దీంతో మా నాయకుడు గెలుస్తాడంటే మా నాయకుడే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగక గెలుపుపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతన్నారు. ఈ బెట్టింగుల్లో డబ్బు మాత్రమే కాకుండా బంగారం, బైక్‌లు, వింధులు వినోదాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీలిస్తున్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీతో గెలుస్తారనే విషయంపై ఎక్కువగా డబ్బు చేతులు మారనుంది. మెదక్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీకి చెందిన పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి ఒకరేమో ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయని, మరొకరేమో ప్రభుత్వ వైఫల్యాలు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ప్రధానంగా గెలుపు వీరిద్దరి మధ్యే ఉందని నమ్మేవారు లక్షల్లో బెట్టింగులు పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఇరువురి మధ్య పోటీ ఉంది. ఇక్కడ కూడా పోరు రసవత్తరంగా ఉంది. పలువురు కార్యకర్తలు మా పార్టీనే గెలుస్తుందని లక్షల రూపాయలను బెట్టింగ్‌ల్లో పెడుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం.. ప్రధానంగా గజ్వేల్‌లో గెలుపుపై ఆంధ్రప్రదేశ్‌లో కూడా బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మరో వైపు రెండుసార్లు ఒటమి చవిచూసిన కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గజ్వేల్ సీటు రాష్ట్ర స్థాయిలోనే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇక్కడ గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. దీంతో అందరి దృష్టి గజ్వేల్ వైపు ఉంది. ఫలితంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వెయ్యి రూపాయల నుంచి లక్షల వరకు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడం నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది. మరోవైపు లగడపాటి సర్వేతో కాంగ్రెస్‌పార్టీ నాయకుల్లో అధికారం తమదే అంటూ వారు కూడా ఊపుమీద ఉన్నారు. కొందరు పందెం ఓడితె తన వద్ద ఉన్న బంగారం, వాహనాలను బెట్టింగ్ కాస్తున్నారు. మరికొందరు విహారయాత్రలకు తీసుకెళ్తామని, మరికొందరు విందు, వినోదాలను ఏర్పాటు చేస్తామని ఒకరికొకరు హామీలు ఇచ్చుకుంటున్నారు. -
పంటర్లూ నిందితులే!
సాక్షి, సిటీబ్యూరో: ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా నగరంలో బుకీలు సిద్ధమైపోతారు... ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందాలు కాస్తుంటారు. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏవి జరిగినా పందెంరాయుళ్లు పడగ విప్పుతారు... గెలుపోటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్ జోరందుకుంది. కేవలం రాష్ట్రానికి చెంది న వారే కాకుండా పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. పోలింగ్‌కు–కౌంటింగ్‌కు మధ్య మూడు రోజుల వ్యవధి ఉండటంతో జోరుగా పందాలు సాగుతున్నాయి. వీటిపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బుకీలపై (పందాలు అంగీకరించే వారు) మాత్రమే నమోదు చేస్తున్న కేసుల్లో ఇకపై పంటర్లనూ (పందాలు కాసే వ్యకు ్తలు) నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. ఇక్కడ పట్టు బిగిస్తే అక్కడకు... ఎన్నికలు కావచ్చు క్రికెట్ సహా ఇతర క్రీడలు కావచ్చు బుకీలకు–పంటర్లకు మధ్య ‘అవినాభావ సంబంధం’ ఉంటుంది. ఈ జూదం నమ్మకం మీద సాగిపోయేది కావడంతో పరిచయస్తులే ఉంటారు. కొత్తగా బుకీలుగా మారే వారు సైతం గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. వీళ్లు తమ యజమానికి చెందిన కస్టమర్లలో కొందరిని తమ వైపునకు లాక్కుంటారు. వీరి ద్వారా పరిచయమైన వారినే కొత్త కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలో పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి నగరాలు/రాష్ట్రాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్లైన్ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంటర్లకు చెక్ చెబితే తప్ప బెట్టింగ్ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసుల నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారూ ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. పక్కాగా దొరుకుతున్న ఆధారాలు... బెట్టింగ్స్ గ్యాంగ్స్‌ను టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, బెట్టింగ్ స్లిప్స్, పుస్తకాలు తదితరాలు స్వాధీనం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికారులు కొన్ని రికార్డులూ గుర్తిస్తుంటారు. వీటిలో నిందితులు తమ వద్ద పందాలు కానిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లతో పాటు వారు దేనిపై, ఎంత మొత్తం పందెం కాశారనేది నమోదు చేసి ఉంచుతారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్టాప్స్ విశ్లేషిస్తే మరికొందు పంటర్ల పేర్లూ బయటి వస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల్నే ఆధారంగా చేసుకుని పంటర్లనూ నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. నోటీసుల జారీకి అవకాశం... క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో పందాలు కాసే వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్‌కు బానిసలుగా మారారనే విషయం అనేక మంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించి, సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేయడానికి అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఫలితంగా కుటుంబీకులకూ వీరు పంటర్లనే విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. నగరంలో దాడులు ముమ్మరం చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్ళి వ్యవస్థీకృతంగా వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. -
55 దాటతాయి.. పందెం ఎంత?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జోరు కొనసాగుతుందని అన్ని జాతీయ చానళ్ల ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేసినా, కూటమి గెలుస్తుందన్న లగడపాటి జోస్యంతో వందల కోట్ల మేర బెట్టింగులు సాగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. గజ్వేల్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు మెజారిటీ ఎంత? కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుస్తారా? మధిరలో భట్టి విక్రమార్క బయటపడతారా? వీటి మీదే ఇప్పుడు బెట్టింగ్‌లు పెడుతున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగుల్లో పాలు పంచుకుంటున్న ఓ వ్యక్తి, ముంబై కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ సంస్థ నుంచి అందిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముంబై కేంద్రంగా బెట్టింగులు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏపీలో భీమవరం, తిరుపతి, తెలంగాణలోని వరంగల్‌ను ఉపకేంద్రాలుగా చేసుకొని వందల కోట్ల రూపాయల మేర బెట్టింగ్ వ్యాపారం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదాని కంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే బెట్టింగ్‌లు సాగాయి. కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఒక రకమైన బెట్టింగ్‌లు సాగితే, గెలుస్తారనుకున్న అభ్యర్థికి ఎంత మెజారిటీ రావచ్చన్న దానిపైనా బెట్టింగ్‌లు పెట్టారు. ఉదాహరణకు గద్వాలలో డీకే అరుణ గెలుస్తారని బెట్టింగ్‌కు ఎవరైనా ముందుకు వస్తే దానికి అనుబంధంగా ఎంతమెజారిటీ వస్తుందన్న దానిపైన బోలెడు మంది బెట్టింగ్‌లు పెట్టారు. రూపాయికి రెండు రూపాయిలు జాతీయ చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయడానికి ముందు రోజు దాకా టీఆర్ఎస్కు 55 సీట్లు వస్తాయని ఎవరైనా రూపాయి పందెం కాస్తే తిరిగి రూపాయి ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు ఎక్కువగా కనిపించారు. ఎగ్జిట్ పోల్స్ తరువాత టీఆర్ఎస్కు 56 సీట్లు వస్తాయని రూపాయి బెట్టింగ్ కాస్తే అర్ధ రూపాయి మాత్రమే ఇవ్వడానికి ముందుకు వచ్చారు. టీఆర్ఎస్కు 60 సీట్లు వస్తాయని రూపాయి పెడితే అవతల వైపు నుంచి 75 పైసలు ఇస్తామంటున్నారు. టీఆర్ఎస్కు 65 సీట్లు వస్తాయని పందెం కట్టిన వారికి రూపాయికి రూపాయి నడుస్తోంది. ఆ పార్టీకి 66 దాటుతాయని ఎవరైనా రూపాయి పెడితే 2 రూపాయలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు. అదేవిధంగా మహాకూటమికి 40 సీట్లు మించి రావని రూపాయి పెడితే 75 పైసలు, 50 సీట్లు వస్తాయని పెడితే 2 రూపాయలు ఇవ్వడమన్నదాని మీద పందేలు నడుస్తున్నాయి. కూటమికి 55 దాటుతాయని రూపాయి పెడితే 3 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే వెలువరించిన రోజు అర్ధరాత్రి దాకా కూటమికి 55 సీట్లు దాటుతాయంటే రూపాయి పెడితే రూపాయి ఇవ్వడానికి చాలామంది పోటీపడ్డారు. అయితే, లగడపాటి ఎగ్జిట్ పోల్ చేయలేదని, ఒక అంచనాతో సర్వే వివరాలు వెల్లడించారని వార్తలు రావడంతో శనివారం తెల్లవారేసరికి పందాల్లో మార్పు వచ్చింది. టీఆర్ఎస్కు 55 దాటుతాయని పందెం పెట్టినవాళ్లే అధికంగా ఉన్నారు. రేవంత్ గెలుస్తారా? కేసీఆర్ మెజారిటీ ఎంత? టీఆర్ఎస్, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నదాని తరువాత బెట్టింగుల్లో రెండు అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి గెలుస్తారని రూపాయి పెడితే 75 పైసలు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడుతున్నవారు ఉన్నారు. రేవంత్ ఓడిపోతారని రూపాయి పందెం కాస్తే రూపాయి, టీఆర్ఎస్ అభ్యర్థికి 5 వేల మెజారిటీ వస్తుందని బెట్టింగ్ పెడితే రూపాయికి 2 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నవారూ ఉన్నారు. గద్వాలలోనూ అంతే. డీకే అరుణ గెలుస్తుందని పందెం కాసే వారికి రూపాయికి రూపాయి నడుస్తోంది. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు 25 వేల మెజారిటీ రాదని ఎవరైనా రూపాయి పెడితే రూపాయి తిరిగి ఇచ్చేందుకు బెట్టింగులు నడుస్తున్నాయి. కేసీఆర్ మెజారిటీ 50 వేలు వస్తుందని రూపాయి పెడితే 2 రూపాయలు ఇస్తామనే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న బెట్టింగ్‌లు ఆదివారం ఉదయం నుంచి మొదలయ్యాయి. కూటమిప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవరైనా రూపాయి పెడితే 2 రూపాయలు ఇవ్వడానికి బెట్టింగ్ వీరులు ఆసక్తి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూపాయి పెడుతున్న వారికి అర్ధ రూపాయి మాత్రమే ఇస్తామంటున్నారు. బీజేపీ, ఇండిపెండెంట్లు లేదా మజ్లిస్ సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రూపాయి పెట్టిన వారికి రూపాయి ఇస్తామంటున్నారు. -
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు
కోవెలకుంట్ల: పక్క రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయా పార్టీల గెలుపోటములపై బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. కోవెలకుంట్ల కేంద్రంగా పోలింగ్ ముగిసినప్పటి నుంచి పందేలా జోరు ఊపందుకుంది. శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగియగా ఈ నెల 11న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు ఉండటంతో ప్రధాన పార్టీల గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు రూ. లక్షల్లో పందెం కాస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ తరఫున పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు రూ.5 లక్షల వరకు బెట్ కట్టగా, మరికొంత మంది మహాకూటమి విజయం సాధిస్తుందని వారికి ధీటుగా బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో పలుచోట్ల తెలంగాణా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతుండగా మరోవైపు బెట్టింగ్ వ్యవహారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల గెలుపుతోపాటు ఆయా పార్టీల్లో బలమైన అభ్యర్థుల గెలుపు, మెజార్టీపై పందేలు కాశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేటీఆర్, హరీష్‌రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి వంటి ప్రధాన నాయకులకు ఎన్నికల్లో వచ్చే మెజార్టీపై బెట్టింగ్‌లు కడుతున్నట్లు సమాచారం. రూ.5వేల నుంచి రూ.లక్షల్లో పార్టీల గెలుపు, ఓటములపై పందేలు సాగుతున్నాయి. హైదరాబాదులో ఉన్న స్నేహితులు, తెలిసిన వ్యక్తుల నుంచి ఫోన్ల ద్వారా ఎన్నికల సమాచారం రాబట్టుకోవడంతోపాటు పలు చానళ్లు, పత్రికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఆయా పార్టీల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు నిర్వహిస్తుండటం గమనార్హం. పట్టణంతోపాటు డివిజన్లోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. -
బెట్టింగ్ బంగార్రాజులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా బెట్టింగ్ జరుగుతోంది. పోలింగ్ సరళిపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడిని సరిగ్గా అంచనా వేయలేదనే ప్రచారం ఊపందుకోవడంతో అన్ని చోట్లా బెట్టింగ్‌కు తెరలేచింది. అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కూడిన విపక్ష ప్రజాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురైందనే వాదన బలంగా ఉండటం, చాలా చోట్ల అభ్యర్థులు పొటాపొటీగా తలపడటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందన్న అంచనా సర్వత్రా నెలకొంది. దీనికితోడు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలరనే పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండటం ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై పందేలు జోరందుకున్నాయి. అభ్యర్థుల గెలుపోటములతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏమిటనే అంశాలపై బెట్టింగ్ బంగార్రాజులు రంగంలోకి దిగారు. రూ. 5 వేలు మొదలు రూ. 10 లక్షల వరకు పందేలు కాస్తున్నారు. పందెంలో గెలుపొందితే పెట్టిన మొత్తానికి రెట్టింపు, ఆపైన ఇచ్చేలా కొందరు ఆఫర్లు ప్రకటిస్తుండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. సీమాంధ్రలోనూ భారీగా పందేలు... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీమాంధ్ర ప్రాంతం లోనూ తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణలో కంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బెట్టింగ్ మరింతగా సాగుతోంది. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు నగదుతో ఔత్సాహికులు బెట్టింగ్‌లో పాల్గొం టుండగా... కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా ప్లాట్లను కూడా పందెంలో పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఒప్పంద పత్రాలు సైతం రాసుకుంటున్నారు. సాధారణంగా ఆంధ్రా ప్రాంతంలో కోడి పందేలు భారీ స్థాయిలో జరగడం సాధారణమే అయినా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు కూడా అదే స్థాయిలో జరుగుతుండడం గమనార్హం. సీట్లెవరికి..? మెజారీటీ ఎక్కడ? బెట్టింగ్ ప్రక్రియలో వివిధ అంశాలను పేర్కొంటే కేటగిరీలవారీగా పందెం కాస్తున్నారు. ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ ఏమిటనే దానిపైనే ఎక్కువగా బెట్టింగ్ నడుస్తోంది. ఆ తర్వాత ప్రముఖుల గెలుపోటములు, మెజారిటీపై పందెం జోరుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎవరిది పైచేయి అనే అంశంపైనా ఎక్కువ మంది బెట్టింగ్ చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా పోలింగ్ నమోదు కావడంతో పట్టణ ప్రాంతాల్లో సీట్లు, గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు ఏయే పార్టీలకు వస్తాయి... జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు, మెజారిటీ, హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల గెలుపోటములపైనా పందేలు జరుగుతున్నాయి. చూపంతా తెలంగాణపైనే... దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎలక్షన్లను సెమీఫైనల్‌గా భావించిన రాజకీయ పార్టీలు ఆ మేరకు ప్రచారపర్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి సిద్ధమయ్యాయి. మొత్తంగా అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారథులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని టీఆర్ఎస్ ముందుకెళ్లగా... అధికార పార్టీని పడగొట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పోరాడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు ఎక్కువ సీట్లు గెలవాలని నిర్ణయించిన బీజేపీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో ఎవరికి వారు తీవ్రంగా శ్రమించినప్పటికీ... ఓటరు నాడి మాత్రం అంతుచిక్కలేదు. ఉత్తరాదిలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఎన్నికల ఫలితాలపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం తేలకపోవడంతో దేశమంతా రాష్ట్ర ఫలితాలపైనే ఆసక్తి చూపుతోంది. -
కాయ్ రాజా కాయ్
ఢీఅంటే ఢీ.. అంటున్న దిగ్గజాలపై, పోటాపోటీగా.. తలపడుతున్న ఉద్దండులపై, నువ్వా, నేనా.. అన్నట్లుగా సాగుతున్న బలమైన నేతలపై, హోరాహోరీగా.. ప్రచారంలో దూసుకుపోతున్న హేమాహేమీలపై, రికార్డు విజయాలతో జోరుమీదున్న గెలుపువీరులపై బెట్టింగ్‌లు జోరుగా, భారీగా సాగుతున్నాయి. అభ్యర్థులు సై అంటే సై అంటుంటే, వారి అనుచరులు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఎన్నికల రణరంగంలో ఉత్కంఠ పెరుగుతున్నకొద్దీ బెట్టింగ్‌లు తారాస్థాయి చేరుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ, ప్రతిపక్షపార్టీ నేతలను ఉత్కంఠకు గురి చేస్తుంటే అనుచరులు మాత్రం పోటా పోటీగా తమ నేతలపై బెట్టింగ్‌లు కడుతున్నారు. గెలుపు తమదంటే తమదేనని కోట్ల రూపాయల్లో కాయ్ రాజా కాయ్ అంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్.. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులపై కూడా బెట్టింగులు జోరందుకున్నట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఈ సెగ్మెంట్లలో పోటీ రసవత్తరం నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. వరుసగా ఎనిమిదోసారి గెలిచేందుకు జానారెడ్డి వ్యూహాలు రచిస్తుంటే, ఆయన విజయపరంపరకు అడ్డుకట్ట వేయగలనని నర్సింహయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనితో వీరి గెలుపుపై రూ.కోట్లలో బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది. హుజూర్నగర్: ఇక్కడ బరిలో ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నారై సైదిరెడ్డి మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సైదిరెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గట్టిపోటీ ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నల్లగొండ: ఐదోసారి గెలిచి మరోసారి సత్తా చాటుకో వాలని సీనియర్ నేత కోమట్రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ హాట్సీటుపైనా రూ.2 కోట్ల మేర బెట్టింగ్‌లు కడుతున్నట్టు నల్లగొండ జిల్లా కేంద్రంలో చర్చ నడుస్తోంది. కొడంగల్: రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మధ్య నెలకొన్న పోటీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్థానంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీనితో దాదాపు రూ.5 కోట్ల వరకు ఇరు పార్టీల నేతల బెట్టింగ్ కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాల: కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణకు ఆమె మేనల్లుడు, టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా బెట్టింగ్‌లు మాత్రం ఇరువైపులా భారీస్థాయిలో జరుగుతున్నాయి. కర్నూల్ ప్రాంతం నుంచి కూడా వీరిద్దరిపై భారీస్థాయిలో బెట్టింగులు పెట్టినట్టు తెలుస్తోంది. జగిత్యాల: జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేపైనా బెట్టింగ్ కాస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ మధ్య పోరు ఉధృతంగా ఉంది. టీఆర్ఎస్ను గెలిపించేందుకు ఎంపీ కవిత శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ జిల్లాలో గెలిచిన ఏకైక సీటు జగిత్యాల. ఈ ఇద్దరు అభ్యర్థులపై లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. మంథని: మాజీమంత్రి శ్రీధర్‌బాబు, టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మధ్య పోరు నువ్వా నేనా.. అన్న స్థాయి లో ఉంది. ఎవరు గెలుస్తారన్నదానిపై అనుచరుల్లో ఉత్కంఠ రేకెత్తి స్తోంది. దీన్ని బెట్టింగ్ రాయుళ్లు అదునుగా చేసుకొని రూ.లక్షలు పందెం కాస్తున్నట్టు తెలిసింది. రామగుండం: సింగరేణి ప్రాంతంలోని రామగుండం అసెంబ్లీ స్థానంపై పందెం ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కోరుకంటి చందర్ ఈసారి ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్, మక్కాన్‌సింగ్ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. వీరి గెలుపుపై సింగరేణి, ఎన్టీపీసీ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో బెట్టింగ్ ముఠాలు భారీస్థాయిలో కాయ్ రాజా కాయ్ దందాకు తెరలేపాయి. కరీంనగర్: ఈ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంపై జిల్లాలో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. అభ్యర్థుల అనుచరులు కూడా భారీగా బెట్టింగులు కడుతున్నట్టు తెలిసింది. ఖమ్మం: ఈ అసెంబ్లీ బరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పువ్వాడ అజయ్‌కుమార్, నామా నాగేశ్వర్రావు తలపడుతున్నారు. వీరిద్దరూ వ్యాపారప్రముఖులు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ స్థానం ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరిపై బెట్టింగులు భారీ స్థాయిలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. సనత్‌నగర్, శేరిలింగంపల్లి: ఈ స్థానాలపై కూడా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో క్రితంసారి టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, అరికెపూడి గాంధీలు టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రస్తుతం వీరు టీఆర్ఎస్ తర ఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థానాల్లో టీడీపీ నుంచి కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. -
కాయ్.. రాజా కాయ్!
సాక్షి,ఆర్మూర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అభ్యర్థుల ఖరారు నుంచే పందెంరాయుళ్లకు పండగ మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటి నుంచే బెట్టింగ్ జరుగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికలు, అభ్యర్థుల ప్రచారం, విజయవకాశాలపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపోటములపై పందెం కడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడం, నామినేషన్ల పర్వం ముగియడం బెట్టింగ్ మరింత జోరందుకోనుంది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, బలహీనతలపై ప్రజలు, రాజకీయ విశ్లేషకుల మధ్య ప్రధానంగా చర్చ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ బెట్టింగ్ జోరు కొనసాగుతోంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, గోల్‌బంగ్లా వద్ద బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్ ఆయా పార్టీల అభ్యర్థులపైనే కాస్తున్నారు. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఈ బెట్టింగ్‌ల జోరు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో బెట్టింగ్‌ల జోరు సైతం అదే రీతిలో పెరుగుతున్నట్లు సమాచారం. తమ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించారు. ఆర్మూర్ ప్రాంతంతో పాటు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా, జూదం విచ్చలవిడిగా సాగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ బడాబాబుల బిడ్డలు ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపోటములపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం ఫలానా అభ్యర్థి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందుతాడు చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ.5వేల నుంచి మొదలు కొని రూ.లక్ష వరకు పందెం కాస్తున్నారు. రూ. లక్ష బెట్టింగ్ కాసి, విజయం సాధిస్తే అతని ప్రత్యర్థి రూ.లక్షకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములతో పాటు రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు సైతం స్వీకరిస్తాడంటూ.. కావలిస్తే బెట్ కట్టండి అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైం పాస్ వ్యవహారంగా మారింది. రూ.5 వేలకు రూ.20 వేలు, రూ.లక్షకు రూ.2 లక్షలు.. ఇలా బెట్టింగ్ కాస్తూ తాము గెలుస్తాడని నమ్మిన నాయకుని విజయావకాశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. -
రూపాయికి రూపాయిన్నర!
కాదేదీ కవితకనర్హం అన్నట్లు కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం అంటున్నారు పందేల రాయుళ్లు. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించగానే పార్టీలు, లీడర్లు, ఓటర్లు, మీడియాతో పాటు బెట్టింగ్ వీరుల జోరు మొదలైంది. షెడ్యూల్ ప్రకటన నుంచి అభ్యర్ధుల ఎంపిక, గెలుపు, ఓటమి, మెజార్టీ ఇలా ప్రతి అంశంపై కోట్ల రూపాయల బెట్టింగులు జరుగుతున్నాయి. పందెంరాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ కాక పుట్టిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు తాజా ఎన్నికలు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్న వేళ పందెంకోళ్లు శివాలెత్తుతున్నాయి. వివిధ సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారు?, ఎంత మెజార్టీ రావచ్చు?, ఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు? అంటూ ప్రతి అంశంపై బెట్టింగ్ వీరులు పందెం కాస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అనుకూలంగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా బెట్స్ నడుస్తున్నాయి. ‘‘మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌కు అవకాశాలు తక్కువ. ఛత్తీస్‌గఢ్‌లో కూడా కమలానిదే వికాసం. రాజస్థాన్ ఒక్కటే కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల బెట్టింగ్‌లు క్రికెట్‌ని మించిపోయాయి. అభ్యర్థుల ఖరారైతే మార్కెట్లో జోష్ ఇంకా పెరుగుతుంది. పందెంలో తేడాలు కూడా రావచ్చు’’అని బుకీ ఒకరు చెప్పారు. ఈ సారి బెట్టింగ్‌లకు హైటెక్ హంగులు కూడా అద్దుకున్నాయి. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే కాదు మొబైల్ యాప్స్, వెబ్ సైట్లల ద్వారా కూడా పందేలు కాసే అవకాశం ఉంది. దీంతో కూర్చున్న చోట నుంచి కదలకుండా తమకు ఇష్టమైన పార్టీపై పందెం కాస్తున్నారు. ఆన్లైన్లోనే ఎక్కువగా పందేలు సాగుతూ ఉండడంతో వాటిని కట్టడి చేయడం కూడా పోలీసులకు సవాల్‌గా మారింది. ‘‘ఆన్లైన్ బెట్టింగ్ రూపంలో కేఫ్‌లు, బహిరంగ ప్రదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పందేలు కాస్తున్నారు. అందుకే వారిని పట్టుకోవడం కాస్త కష్టంగా మారింది’’అని మధ్యప్రదేశ్ డిఐజీ ధర్మేంద్ర చౌదరి చెప్పారు. ఆన్లైన్ వ్యవహారాలపైన కూడా ఓ కన్నేసి ఉంచామని ఏ చిన్న క్లూ దొరికినా దాడులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సైబర్ సెల్ మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్‌పై నిరంతర నిఘా పెట్టిందన్నారు. ఇలా బెట్ చేస్తారు.. గెలుస్తుందన్న అంచనాలున్న పార్టీపై పందెం కట్టి గెలిస్తే కేవలం ఒక్క శాతం లాభం వస్తుంది. అదే ఓడిపోతుందన్న పార్టీపై పందెం కట్టి గెలిస్తే వందకు వంద శాతం, ఒక్కోసారి వందకు రెండొందల శాతం చొప్పున లాభం వస్తుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుస్తుందని రూ. 10 వేలు కడితే పందెం రాయుడికి వచ్చే లాభం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. అంటే మొత్తం రూ. 11 వేలు తిరిగి వస్తుంది. అదే కాంగ్రెస్‌పై రూ. 4,400కి పందెం కాస్తే ఏకంగా 10 వేలు చేతికొస్తుంది. అంటే 5,600 రూపాయలు లాభం అన్నమాట. విజయావకాశాలను బట్టి బెట్టింగ్ రేట్లు మారుతుంటాయి. అంతా లాభమేనా... బెట్టింగ్ వదులుకోలేని వ్యసనం. దీనికి అలవాటుపడ్డవాళ్లు ఉన్నదంతా ఊడ్చి మరీ పందేలు కాస్తూ ఉంటారు. రేసుల్లో పాల్గొనేవాళ్లు చేసినట్లు చాలా లెక్కలు కట్టి పందేలు కడుతుంటారు. అలాగని కట్టిన లెక్కలన్నీ ఫలిస్తాయా? అంటే చెప్పలేం. చాలాసార్లు బెట్టింగ్‌ల్లో ఓటమే ఎదురవుతుంటుంది. లాభాలు వస్తే పరిమితంగా, నష్టం వస్తే అపరిమితంగా ఉండడం బెట్టింగ్స్‌లో సహజం. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది బీజేపీ ఓడిపోతుందంటూ కోట్లరూపాయల పందెం కాశారు. చివరకు సర్వస్వాన్ని కోల్పోయారు. మరి ఈసారి బెట్టింగ్ ఎన్ని చిత్రాలు చేస్తూందో చూడాలి. ఫలోది.. పందెంలో అందెవేసిన చెయ్యి ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటే చాలు.. ఆ ఊళ్లో పందేలు మొదలైపోతాయి. వర్షం ఎంత కురుస్తుంది ? ఎంతసేపు కురుస్తుంది ? రోడ్లు జలమయం అవుతాయా ? నాలాలు పొంగి ప్రవహిస్తాయా? ఇలా వాన లాంటి విషయం చుట్టూనే కాసుల జడి వాన కురుస్తూ ఉంటుంది. అలాంటిది ఎన్నికల సీజన్ వచ్చిందంటే వేరే చెప్పాలా ? రాజస్థాన్‌లోని ఫలోదిలో ఎక్కడలేని హడావుడి కనిపిస్తుంటుంది. జోధ్‌పూర్‌కు 120 కిలో మీటర్ల దూరంలో ఉండే ఆ పట్టణంలో జనాభా లక్ష వరకు ఉంటుంది. ఆ పట్టణ ప్రజలకు పందెం అంటే ఎంతో సరదా. అక్కడ ఐపీఎల్ సీజన్లో 2,500 నుంచి 3 వేల కోట్ల రూపాయల వరకు చేతులు మారుతుంటాయి. అలాంటిది ఎన్నికల సీజన్లో ఐదారువేల కోట్లవరకు బెట్టింగ్‌లు జరగవచ్చని అంచనా. ఈ ఊరల్లో బుకీలకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ఫలోదిలో దాదాపుగా 20–25 మంది పెద్ద బుకీలు ఉన్నారు. -
బెట్టింగ్‌లో ఓటమి.. గుండెపోటుతో మృతి
సాక్షి, గుంటూరు(పెదకాకాని) : గుంటూరులో పెదకాకాని రోడ్డులోని హెచ్ఆర్సీ క్లబ్లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందేల నిర్వహణ క్లబ్లో బెట్టింగ్ ఆడేందుకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి పెదకాకాని వెళ్లే రోడ్డులో గత కొన్నేళ్లుగా గుర్రపు పందేలు (హార్స్ రేసింగ్ క్లబ్) ఆడుకునే సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రధాన నగరాలలో నిర్వహించే గుర్రాల పందేలు ఈ క్లబ్లో ఏర్పాటు చేసిన డిస్ప్లేపై కనిపిస్తుంటాయి. తమ డబ్బులను కాయిన్లుగా మార్చుకుని పందేలు కాసుకుంటూ ఉంటారు. తెనాలి తాలూకా చినరావూరు గ్రామానికి చెందిన శ్రీదర్ అలియాస్ రమేష్ గుర్రుపు పందేంలో రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలానికి పెదకాకాని ఎస్ఐ కె. ఆరోగ్యరాజు సిబ్బందితో చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
‘అయినవాళ్ల’ కేసుల మాఫీకి ఒత్తిళ్లు..
కర్నూలు : ‘వాళ్లు నా అనుచరులు. నన్ను నమ్ముకుని పార్టీలో ఉన్నారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే డబ్బు కావాలి. అందుకోసం మట్కా నిర్వహించుకుంటున్నారు. వాళ్లింటి వైపు వెళ్లొద్దు.’ – ఇదీ కర్నూలులోని పోలీసులకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన ఆదేశం. ♦ అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో వారు నిఘా ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుని సోదరుడు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి.. ‘వాళ్లు మావాళ్లే. వారి జోలికి వెళ్లొద్దు’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ♦ పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని ఓ వ్యాపారి రెండు లారీల్లో వేరే రాష్ట్రానికి తరలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద గస్తీ పోలీసులు పట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు సదరు బియ్యం వ్యాపారి దగ్గరరూ.4 లక్షలు దండుకుని.. పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేసి లారీలను విడిపించాడు. కేసు కూడా మాఫీ చేయించాడు. ♦ నందవరం మండలం పెద్దకొత్తిలి గ్రామ సర్పంచ్ ఇరుపాక్షిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉంటూ ప్రజల్లో మంచి పట్టు సాధించారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి చేసి ఇరుపాక్షిరెడ్డికి సంబంధించిన ట్రాక్టర్లు, పొక్లెయిన్లు సీజ్ చేయించి అక్రమంగా కేసు పెట్టించారు. దాన్ని మాఫీ చేసేందుకు టీడీపీలోకి బలవంతంగా చేర్పించుకున్నారు. ♦ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతి కోసం రెండు నెలల క్రితం కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ భాస్కర్‌రెడ్డితో పాటు మరికొంతమందిపై అక్రమ కేసులు బనాయించారు. ఖాకీలపై అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువయ్యిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శాంతిభద్రతల పరిరక్షణ, పేదలకు భరోసా కల్పించడంలో పోలీసు శాఖ పాత్ర చాలా కీలకం. రాగద్వేషాలకు, కుల మతాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల విధి. ఆ దిశగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై అధికార పార్టీ నేతల పెత్తనం రోజురోజుకూ మితిమీరుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అక్రమార్కులకు వంత పాడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకూడదంటూ అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. అనుంగులు, అయినవాళ్ల లబ్ధి కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆరు నూరైనా తాము చెప్పినట్లే వినాలంటూ పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారు. కాదంటే బదిలీపై వెళ్లాల్సి వస్తుందంటూ బాహాటంగానే బెదిరిస్తున్నారు. ♦ ఇదెక్కడి చోద్యం! వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నప్పుడు బాధితులు స్టేషన్‌కు చేరడం, పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఇక్కడే నేతలు జోక్యం చేసుకుంటున్నారు. అన్యాయంగా వ్యవహరించిన తమ వారివైపే మొగ్గు చూపాలని నిబంధన విధిస్తున్నారు. వైరివర్గం తప్పు లేకున్నా వారిపై అక్రమ కేసులు బనాయించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. కర్నూలు నగరంలోని డీవీఆర్ హోటల్ వద్ద రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులు ఉమాకాంత్ అనే యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి చేసి.. బాధితుడిపైనే సంబంధం లేని వ్యక్తితో ఎస్సీ కేసు నమోదు చేయించారు. అలాగే పార్టీ మారిన ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కర్నూలు నగరానికి చెందిన ఇంద్రసేనారెడ్డి అనే యువకుడు ‘ఎవరి పుణ్యాన గెలిచి పార్టీ మారావు’ అని ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి పెంచి ఆ యువకునిపై కేసు నమోదు చేయించి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆలూరు మండలం హత్తి బెళగల్లో ఇటీవల క్వారీలో భారీ పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. క్వారీని బంద్ చేయించాలని ఐదు నెలల క్రితమే గ్రామస్తులు ధర్నా చేశారు. అయితే.. అధికార పార్టీకి చెందిన క్వారీ యజమాని శ్రీనివాస చౌదరి పోలీసులపై ఒత్తిడి చేసి.. ఆందోళనకు దిగిన మల్లికార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు పెట్టించారు. అప్పటి ఎస్ఐ ధనుంజయతో వారిని తీవ్రంగా కొట్టించి జైలుకు కూడా పంపిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అసాంఘిక శక్తులకు నేతల అండ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కూడా అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పటి నుంచే ఫోన్ల పరంపర ఆరంభమవుతోంది. బెట్టింగ్, మట్కా, ఇసుక మాఫియా వంటి వాటిల్లో కూడా అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. పలు కేసుల్లోని నిందితులు ‘రాజకీయ’ ఆశ్రయం పొందడం, నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం పరిపాటైంది. ఆలూరుకు చెందిన ఐదుగురు యువకులు ఆదోని పట్టణంలోని బంగారు షాపులో పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. వారు ఆ నియోజకవర్గ నాయకుడిని ఆశ్రయించడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. బంగారు షాపు యజమానితో రాజీ కుదిర్చి పెట్టిన కేసు మాఫీ చేయించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో మూడు మాసాల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి పెంచి సంఘటనకు ఎలాంటి సంబంధం లేని మాజీ కార్పొరేటర్ అమృతరాజుపై హత్యాయత్నం కేసు పెట్టించారు. కాదంటే బదిలీ బహుమానం తమ మాట వినని పోలీసులపై బదిలీ వేటు తప్పదంటూ నేతలు బాహాటంగానే ప్రకటిస్తుండటం గమనార్హం. ఏ శాఖలో అయినా బదిలీలు అనివార్యమే. అయితే.. పోలీసు శాఖలో ఇది కాస్తా ఎక్కువగా ఉంటోంది. దీన్నే అదునుగా ఎంచుకుని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఏటా బదిలీల సీజన్లో నేతల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అత్యున్నత స్థాయి అధికారుల దృష్టికి తమ జాబితాలు తీసుకెళ్లి పంతం నెగ్గించుకోవడం జిల్లాలో ఆనవాయితీగా మారింది. తన మాటకు విలువ ఇవ్వలేదన్న అక్కసుతో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి.. డీఎస్పీ పి.ఎన్.బాబును పట్టుబట్టి బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం యనగండ్లతో పాటు బనగానపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి అనుమతించడంపై ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టించి డీఎస్పీపై బదిలీ వేటు వేయించడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఇదే తరహాలో కర్నూలు డీఎస్పీ ఖాదర్ బాషాను కూడా స్థానిక ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. కేవలం తొమ్మిది మాసాలకే ఆయనపై బదిలీ వేటు పడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బాషాను ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేయించినట్లు విమర్శలున్నాయి. ఏడాది క్రితం డి.వి.రమణమూర్తి స్థానంలో ఐపీఎస్ అధికారి విశ్రాంతి పాటిల్ కర్నూలు డీఎస్పీగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టకముందే డైరెక్ట్ ఐపీఎస్ అధికారి తమకు వద్దని అడ్డుకున్నారు. మొత్తంగా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించి కిందిస్థాయి యంత్రాంగానికి భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీల సందర్భంగా ఫలాన సర్కిల్ లేదా స్టేషన్‌కు పోస్టింగ్ కావాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జ్ నుంచి లేఖ తెచ్చుకోవాలని ఉన్నతాధికారులే స్వయంగా ఎస్ఐ, సీఐలకు సూచిస్తుండటం గమనార్హం. -
‘పాన్‌షాప్‌లను జూద అడ్డాలుగా మారుస్తారా..?’
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్ వంటి జనాదరణ కలిగిన క్రీడల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సులపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆదాయం సమకూర్చుకునేందుకు బెట్టింగ్ సంస్కృతిని ప్రోత్సహించడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారి ఏఎన్ఐతో మాట్లాడుతూ... వివాదాస్పదమైన ఈ నిర్ణయం క్రీడలతో పాటు సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ను చట్టబద్దం ద్వారా చేయడం ద్వారా దేశంలోని ప్రతీ పాన్షాప్ను జూదానికి అడ్డాగా మార్చాలనుకుంటున్నారా అంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి అనుచిత నిర్ణయాల వల్ల సమాజంపై ఎటువంటి ప్రభావం పడుతుందో ఒకసారి ఆలోచించాలంటూ హితవు పలికారు. కాగా లా కమిషన్(21వ) తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ వెల్లడించింది. వీటితోపాటు క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. -
వాట్సాప్‌లో బెట్టింగ్!
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ మొదలుకాగానే బెట్టింగ్ జోరు మళ్లీ మొదలైంది. రోజూ వందల కోట్ల రూపాయల పందేలు జోరుగా జరిగిపోతున్నాయి. బుకీలు, సబ్–బుకీలు వాట్సాప్ గ్రూపులు పెట్టి మరీ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో నిఘా ఎక్కువగా ఉండటంతో.. ‘సెట్టింగు’లన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అకౌంట్ల నిర్వహణకు మాట్రిక్స్ సాఫ్ట్‌వేర్‌ను.. ఆర్థిక లావాదేవీల కోసం ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, పేటీఎం వంటి యాప్స్‌ను వాడుతున్నారు.. ఇలా వ్యవస్థీకృతంగా బెట్టింగ్ దందా సాగిస్తున్న నాలుగు ముఠాలకు హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. గట్టి నిఘా పెట్టి.. 12 మందిని అరెస్టు చేశారు. పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సోమవారం ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఇక్కడ హడావుడి లేకుండా.. సాధారణంగా బెట్టింగులు నిర్వహించే బుకీలు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. టీవీలు, సెట్‌టాప్ బాక్సులు, ల్యాప్‌టాప్‌లు, హాట్‌లైన్ బాక్సులు వంటివి అవసరమవుతాయి. బెట్టింగ్ స్థావరాలపై పోలీసులకు సమాచారం అందడానికి ఇవి కారణంగా మారుతాయి. దీంతో ప్రస్తుతం ప్రధాన బుకీలు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్‌లలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, మంగళ్‌హాట్, కాచిగూడ, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో సబ్–బుకీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సబ్–బుకీలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి.. అందులో బెట్టింగ్ నిర్వహిస్తారు. ఈ గ్రూపులు ఇంటర్నెట్ ద్వారా ప్రధాన బుకీ వద్ద ఉండే ల్యాప్‌టాప్‌లోని మ్యాట్రిక్స్ అనే సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఒక్కో మ్యాచ్ పూర్తయిన తరవాత సదరు ల్యాప్‌టాప్ నుంచి బ్యాలెన్స్ షీట్ తీస్తారు. ఎవరెవరు ఏ టీమ్‌పై పందెం కాశారు, రేషియో ఎంత, గెలుపోటములను బట్టి ఎవరికి ఎంత చెల్లించాలి, ఎవరి నుంచి ఎంత వసూలు చేయాలన్న వివరాలన్నీ వస్తాయి. ఇందులో పంటర్ల పేర్ల స్థానంలో మాత్రం బుకీలు, సబ్–బుకీలు ఇచ్చిన కోడ్ నేమ్స్ వస్తాయి. బెట్ఫేర్, లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ ఏర్పాట్లతో.. సాధారణంగా బుకీలు తమకు పరిచయస్తులైన పంటర్ల నుంచే బెట్టింగులు అంగీకరిస్తారు. ముందుగా ఒక్కో పంటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. ఆపై వారికి కొన్ని నంబర్లు ఇస్తారు. మ్యాచ్ ప్రారంభవడానికి ముందు పంటర్లు బుకీలకు ఫోన్ చేసి స్ట్రైక్ తెలుసుకుంటారు. ఏ టీమ్‌పై ఎంత చొప్పన పందెం నడుస్తోందో తెలియజేయడాన్ని స్ట్రైక్ అంటారు. అంటే బలహీనంగా ఉన్న జట్టుపై పందెం కాసిన పక్షంలో... ఆ జట్టు గెలిస్తే కట్టిన సొమ్ముకు రెండు నుంచి నాలుగింతలు ఇస్తారు. అదే బలమైన జట్టుపై పందెం కాస్తే... కేవలం రెట్టింపుగానీ, అంతకన్నా తక్కువగానీ ఇస్తారు. ఈ స్టైక్ తెలుసుకున్న పంటర్లు తాము ఏ టీమ్‌పై పందెం కాస్తున్నామో చెబుతారు. స్ట్రైక్స్ తెలుసుకోవడానికి ప్రత్యేకంగా బెట్ఫేర్ అనే వెబ్సైట్ కూడా పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో బుకీలంతా కలసి లైవ్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. హరియాణా కేంద్రంగా ఉన్న ఈ నెట్‌వర్క్‌లో ప్రధాన భాషలన్నింటిలో.. ఎప్పటికప్పుడు జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన రేషియో, ఫేవరెట్ టీమ్, ఫేవరెట్ ప్లేయర్ తదితరాలను ప్రధాన, సబ్–బుకీలకు అందుబాటులో ఉంచుతారు. దీనికోసం ఒక్కొక్కరు నెలకు రూ.4 వేల చొప్పున రుసుము చెల్లిస్తుంటారు. ఫేస్బుక్ ద్వారా సలహాలు, సూచనలు.. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి అనేకమంది అనలిస్టులు ఫేస్బుక్ ద్వారా పంటర్లకు అందుబాటులో ఉంటారు. తమ చిరునామా, ఇతర వివరాలను బయటపడనీయని వారు.. ఆ మ్యాచ్‌లో ఎవరు ఫేవరేట్, తీరు తెన్నులు, గెలుపోటములు ఎలా ఉంటాయి? వంటి అంశాలపై ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సలహాలు ఇస్తుంటారు. ఇందుకోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.100 నుంచి రూ.1,000 వరకు ఆన్లైన్లో వసూలు చేస్తుంటారు. పందాలు కాయడానికి ఫేవరెట్స్‌ను మాత్రం నిర్ణయించేది చేసేది బుకీలే. టాస్ ఎవరు గెలుస్తారనే దానిపై రూ.1,000 పందెం కాసి గెలిస్తే.. గెలిచిన వ్యక్తికి రూ.1,900 చెల్లిస్తారు. ఫేవరెట్ టీమ్, క్రీడాకారుడిపై రూ.1,000 పందెం కాసి.. గెలిస్తే రూ.1,400 ఇస్తారు. ఫలానా ఓవర్లో, లేదా కొన్ని ఓవర్లలో ఇన్ని పరుగులు చేస్తారనే ‘సెషన్స్’పై రూ.1,000 పందెం కాసి గెలిస్తే రూ.2వేలు చెల్లిస్తారు. ఈ ఐపీఎల్ సీజన్లో టాస్, ఫేవరెట్, సెషన్స్ మీదే ఎక్కువగా పందాలు సాగాయి. చిక్కింది వీరే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ముంబై కేంద్రంగా ఉన్న ప్రధాన బుకీలు పి.మహేష్, ఆర్.చిరాన్ల కింద పనిచేస్తున్న సబ్–బుకీలు, ఏజెంట్లయిన మహేష్ మనియాల్, ఎస్.సాయికుమార్, రాజ్‌కుమార్, వినోద్.. – గోవా కేంద్రంగా దందా నడుపుతున్న ప్రధాన బుకీ ప్రకాశ్‌సింగ్ కింద పనిచేస్తున్న ఎన్.ముఖేశ్‌సింగ్, సి.శ్రీనివాస్, కునాల్‌సింగ్, సుర్జీత్‌సింగ్.. – రాజస్థాన్‌లో కేంద్రం నడిపిస్తున్న ప్రధాన బుకీ రాకేశ్, రాజుల కింద పనిచేస్తున్న వినయ్ మోదీ, పిట్టీ ప్రీతేష్.. – ఈ మూడు గ్యాంగులతో పాటు మరో గ్యాంగుకు చెందిన జి.ఉపాధ్యాయను పోలీసులు పట్టుకున్నారు. వీరిందరి నుంచి రూ.15.5 లక్షల నగదు, 22 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.7.27 లక్షలను ఫ్రీజ్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. -
కాయ్ రాజా కాయ్
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఎన్నికలు సమీపించే కొద్దీ బెట్టింగ్ రాయుళ్లు పేట్రేగిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. పలువురు బుకీలు అదే పనిలో మునిగిపోయారు. రాష్ట్రంలో బుకీలు తమ దందాను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రతి పార్టీకి ఒక్కో రేటు పెట్టి బుకీలు బెట్టింగులకు తెరదీస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల బెట్టింగ్ మార్కెట్ దాదాపుగా రూ. 800 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్‌ల్లో కూడా పలు ట్విస్టులు, మార్పులు కొనసాగుతున్నాయి. ఇటీవల పలు ప్రీ పోల్ సర్వేలు కర్ణాటకలో హంగ్ వస్తుందంటూ పేర్కొనడంతో 95 పైసల వరకు రేటు పడిపోయినట్లు సమాచారం. ప్రీ పోల్ సర్వేల ముందు వరకు బెట్టింగులన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ 113 స్థానాల్లో గెలుస్తుందనే ఊహగానాల మధ్య ఆ పార్టీకి సానుకూలంగా బెట్టింగ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ మీద రూ. 10 బెట్టింగ్ వేస్తే ఆ పార్టీ గెలిస్తే అదనంగా రూ. 11 ఇస్తారు. ఆ రేటు ప్రకారమే బీజేపీకి బెట్టింగ్ నడిచింది. అదే కాంగ్రెస్ గెలిస్తే ప్రతి రూపాయికి అదనంగా రూ. 2.5 దక్కుతుంది. అదే జేడీఎస్ గెలుస్తుందని రూ. 1 బెట్టింగ్ వేస్తే దానికి అదనంగా రూ. 6 అందజేయనున్నట్లు సమాచారం. బుకీల లెక్కప్రకారం ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అతి ఎక్కువ స్థానాలు గెలుచుకునే పార్టీగా ఉండబోతోందని సమాచారం అందుతోంది. అయితే బెట్టింగ్ రాయుళ్లకు విరుద్ధంగా సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలవబోతున్నట్లు సర్వేలు నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్లవద్దని పోలీసు శాఖ ప్రజలకు సూచిస్తుంది. బెట్టింగ్ రాయుళ్ల వివరాలు తెలిసిన వారు సమాచారం అందజేయాలని పోలీసులు తెలిపారు. -
ఐపీఎల్ హోరు..బెట్టింగ్ జోరు
జిల్లాను ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ ఫీవర్ ఆవహించింది. మారుమూల గ్రామాలు మొదలు పట్టణాలు, విజయవాడ నగరం వరకు ప్రస్తుతం క్రికెట్ పందేలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అమాయకులను టార్గెట్‌గా చేసి ఈజీ మనీ ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ఇప్పటికే బుకీలు బుసలు కొడుతున్నారు. గతంలో క్రికెట్ పందేలు నిర్వహించి ఆర్థికంగా నష్టపోయి పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రికెట్ పందేలు కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి పందేలు నివారించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఈ నెల 7 నుంచి మే 27వ తేదీ వరకు సాగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి 20 మ్యాచ్‌లను అడ్డుపెట్టుకుని రూ.కోట్లు కొల్లగొట్టే పనిలో బుకీలు నిమగ్నమయ్యారు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే అత్యాశతో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్థితిమంతులు, కూలీలు, ఆటోడ్రైవర్లు బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయి బలైపోతున్నా స్పందించే నాథుడే లేడు. ఈ వ్యవహారంలో చివరికి బుకీలు మాత్రం పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటుండగా.. బెట్టింగ్‌రాయుళ్లు మాత్రం బికారులుగా మారిపోతున్నారు. జిల్లాలో మూడేళ్లుగా బెట్టింగ్‌ల పర్వం విచ్చలవిడిగా సాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కూడా బుకీలు మరింత పెట్రేగే ప్రమాదం ఉందంటూ వందలాది కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఐపీఎల్ ఫీవర్ దెబ్బకు పందెం రాయుళ్లు గజగజలాడిపోతున్నారు. గత ఏడాది ఇదే ఫీవర్‌కు గురైన అనేక మంది ఆర్థికంగా నలిగిపోయి కట్టుబట్టలతో బజారునపడ్డారు. కొంత మంది ఐపీఎల్ మహమ్మారిని తప్పించుకునేందుకు ఊళ్లు సైతం వదిలి వెళ్లిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో భారీగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్‌ల వ్యవహారాన్ని అరికట్టే విషయంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు విఫలమయ్యారని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేక్షకపాత్ర వహిస్తున్నారే గానీ చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బందరులోనే తొలిమ్యాచ్కురూ.కోటికిపైగానే బెట్టింగ్... ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ సిరీస్‌లో తొలి రోజు జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క బందరులోనే రూ.కోటికిపైగా బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. తొలి రోజు బెట్టింగ్‌ల్లో ఎక్కువ మంది జేబులు ఖాళీ చేసుకోగా బుకీలకు మాత్రం కాసుల వర్షం కురిసినట్లు సమాచారం. తొలిరోజు మ్యాచ్‌లోనే బెట్టింగ్ రాయుళ్లు లక్షలకు లక్షలు చేతులు కాల్చుకోగా బుకీలు పెద్ద మొత్తంలో దోచుకున్నారని తెలిసింది. ప్రతి అంశంపై పందెమే... సిరీస్ ప్రారంభానికి 30 రోజుల ముందు నుంచే ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుంది... ఏ జట్టు విజయం సాధిస్తుంది, ఏయే జట్లు ఫైనల్‌కు చేరతాయి... సిరీస్‌లో ఏ ప్లేయర్ ఎక్కువ స్కోరు చేస్తాడు.. ఏ ప్లేయర్ అత్యధిక వికెట్లు.. తీస్తాడు... సిరీస్‌లో ఎవరు ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు దక్కించుకుంటారు...మ్యాన్ ఆఫ్ ది సిరీస్ఎవరు గెలుచుకుంటారు.. అత్యధిక సిక్స్‌లు, ఫోర్లు ఎవరు కొడతారు... పవర్‌ప్లేలో ఏ జట్టు గెలుస్తుంది... వంటి ప్రతి అంశంలోనూ బెట్టింగ్‌లు రూ.కోట్లలో జరిగినట్లు తెలుస్తోంది. తొలి రోజు మ్యాచ్‌కే రూ. కోటికిపైగా బెట్టింగ్‌లు జరిగితే మరో 50 రోజులు పాటు జరగనున్న 59 మ్యాచ్‌లకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నడుస్తాయోననే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. బెట్టింగ్‌ల దెబ్బకు ఎన్ని వందల కుటుంబాలు వీధినపడతాయనే ఆందోళన అనేక మందిలో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా రూ.వంద కోట్లకుపైగానే బెట్టింగ్‌లు నడుస్తాయని పలువురు అంటున్నారు. పోలీసులను ప్రసన్నం చేసుకుంటూ.... జిల్లాలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న క్రికెట్ బుకీలకు పోలీసుల ఆశీస్సులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ల ముందే రూ.కోట్ల పందేలు జరుగుతున్నా పోలీసులు కళ్లు లేని కబోదుల్లా వ్యవహరించటం ఏంటంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. బందరులో జరుగుతున్న బెట్టింగ్‌లకు సంబంధించి ఒకప్పుడు దివాళా తీసిన బుకీలు సైతం తిరిగి అదే మార్గంలో రూ.లక్షలు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో బుకీల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసిన వ్యక్తుల్లో కొందరు ఈ ఏడాది డైరెక్ట్ బుకీలుగా అవతారమెత్తినట్లు సమాచారం. బందరులో సుమారు 50 నుంచి 75 మంది వరకు డైరెక్టు, సబ్‌బుకీలు ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయినాæ బుకీలపై పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. -
ఐపీఎల్.. బెట్టింగ్ ఫుల్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌ల కోసం జిల్లాలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 7 నుంచి మే 27 వరకు ఫైనల్ మ్యాచ్‌తో సహా 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ 11వ ఎడిషన్ 51 రోజుల పాటు జరగనుంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు సమాయాత్తం అవుతున్నారు. జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతాయి. నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. దీనికోసం బుకీలు అపార్ట్మెంట్లు, లాడ్జీలు వేదికగా చేసుకుని పెద్దెత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తారు. ఐపీఎల్ పేరుతో జిల్లాలో రూ.వందల కోట్లకు పైగానే చేతులు మారే అవకాశం ఉంది. క్రికెట్ బుకీలు ప్రధానంగా యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. యువత టార్గెట్‌గా.. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, గణపవరం, ఉండి, ఏలూరు, నరసాపురం కేంద్రాలుగా చేసుకుని బెట్టింగ్‌లు జరుగుతాయి. అక్కడ బుకీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సబ్‌బుకీలు బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. భీమవరం, తణుకు నుంచి నేరుగా ముంబైతో సంబంధాలు ఏర్పాటుచేసుకుని పెద్దెత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్‌కు, ప్రతి ఓవర్‌కు ఇంతని బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. విలాస జీవితానికి అలవాటుపడిన యువతను టార్గెట్ చేసుకుని క్రికెట్ బుకీలు పెద్దెత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తమను ఎవరూ ఏం చేయలేరని, ఇప్పటికే అధికారులను ‘మేనేజ్’ చేసుకున్నామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. సాంకేతిక దన్నుతో.. గతంకన్నా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు రావడంతో బెట్టింగ్ రాయుళ్లకు సులభతరమైంది. గతంలో టీవీలు, సెల్ఫోన్లు, లాప్‌టాప్‌లు ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. తాజాగా జియో నెట్వర్క్, హాట్‌స్టార్ అనే యాప్, ఐపీఎల్ కోసం ప్రత్యేక యాప్‌లు రావడంతో క్రికెట్ బెట్టింగ్ మరింత సులభతరమైంది. అంతేగాక ఆన్లైన్ అకౌంట్ల ద్వారా బెట్టింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హాట్ స్టార్ యాప్ ద్వారా లైవ్ క్రికెట్ అతి తక్కువ రూపాయలతో అందిస్తుండటంతో దీనిని వినియోగించుకుని కూడా బెట్టింగ్‌లు జోరుగా సాగే అవకాశం ఉంది. మెట్టలో జోరుగా.. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం, మండలంలోని పుట్లగట్లగూడెం, లక్కవరం, జంగరెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, కామవరపుకోట, బయ్యనగూడెం, రామానుజపురం, యర్నగూడెం తదతర ప్రాంతాలు కేంద్రంగా పెద్దెత్తున క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి మండల, గ్రామీణ ప్రాంతాల బుకీలు సంబంధాలు ఏర్పాటు చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.. ఇదిలా ఉంటే కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు పొలాల్లో, అతిథి గృహాలను కేంద్రంగా చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ పేరుతో యువత లక్షలాది రూపాయలు కోల్పోయి, ఆయా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఛిన్నాభిన్నం అవుతున్న దాఖలాలు ఉన్నాయి. గతంలో క్రికెట్ బెట్టింగ్‌లో లక్షలాది రూపాయలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. అయినా పట్టించుకున్న వారే లేరు. -
నిషేధాన్ని తొలగించండి
కోల్‌కతా: రాజస్తాన్ రాయల్స్ మాజీ సహ యజమాని రాజ్‌కుంద్రా తను క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా విధించిన నిషేధాన్ని తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 2013 సీజన్ ఐపీఎల్లో ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతంలో రాజ్‌కుంద్రాతో పాటు చెన్నై జట్టుకు చెందిన గురునాథ్ మయ్యప్పన్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో బీసీసీఐ వీరిద్దరిపై జీవితకాల నిషేధం విధించింది. అయితే కుంద్రా ఇటీవల ఢిల్లీ పోలీసులను సమాచార హక్కు చట్టం ద్వారా సంప్రదించగా... బెట్టింగ్‌కు పాల్పడినట్లు తనపై ఎలాంటి సాక్షాధారాలు లభించలేదని సదరు వర్గాలు తెలిపాయి. దీంతో తాను నిర్దోషినని క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని రాజ్‌కుంద్రా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలన్నాడు. ‘దేశంలో చాలామంది బెట్టింగ్ చేస్తున్నారు. మ్యాచ్‌లపై బెట్టింగ్ లేకుంటే 80 శాతం మంది ప్రజలు క్రికెట్ చూడటం మానేస్తారు. ఇది గ్యారెంటీ! ఒక మ్యాచ్‌పై రూ 4000 నుంచి 5000 కోట్ల బెట్టింగ్ జరుగుతోంది. దీన్ని చట్టబద్ధం చేస్తే పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది’ అని రాజ్‌కుంద్రా అభిప్రాయ పడ్డాడు. -
జయం మనదేరా!
పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎటు చూసినా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. డబ్బులు బాగా ఎక్కువైన వాళ్లే కాదు... బాగా తక్కువైన వాళ్లు కూడా అప్పు చేసి మరీ బెట్టింగ్‌లో డబ్బులు కాస్తున్నారు. ఇంతకీ బెట్టింగ్ దేని మీద? క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మీద కాదు. ఇండియా–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ మీద కూడా కాదు. కుందేలు, తాబేలు పరుగు పందెం మీద! కూకట్‌పల్లిలో కుందేళ్ల సమావేశం జరుగుతోంది. ‘‘ఇది మన జాతి ఆత్మగౌరవ సమస్య. అప్పుడెప్పుడో మన ముత్తాత చేసిన మిస్టేకుకు ఇప్పటికీ పరువు పోతూనే ఉంది. ముత్తాత చేసిన తప్పు... మన చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. ఈసారి ఎలాగైనా సరే మనమే గెలవాలి!’’ అన్నది ఒక కుందేలు. ‘‘అవునూ... అవునూ’’ అని గట్టిగా అరిచాయి సాటి కుందేళ్లు. మరోవైపు తార్నాకలో తాబేళ్ల సమావేశం జరుగుతోంది.‘‘మన ముత్తాత తెలివి గురించి ఇప్పటికీ పిల్లలకు గొప్పగా చెబుతుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో కూడా మన ముత్తాత పేరు పదే పదే మారుమోగిపోతుంటుంది. ఈసారి కూడా మనమే గెలవాలి. మన తాబేలు జాతి కీర్తిని శాశ్వతం చేయాలి’’ అంటూ సాటి తాబేళ్లను ఉద్దేశించి మైక్ అందుకొంది ఒక తాబేలు. ‘గెలుపెవరిది?’ అనే టాపిక్‌పై ‘నీల్సన్–వీల్సన్’ సంస్థ పెద్ద సర్వే నిర్వహించింది. 70 శాతం మంది మళ్లీ తాబేలే గెలుస్తుందని చెప్పారు. 20 శాతం మంది ఈసారి కుందేలు గెలుస్తుందని చెప్పారు. 10 శాతం మాత్రం ‘ఎవరి చేతిలో ఏముంది? అంతా దైవాధీనం’ అన్నారు.‘కుందేలు తెలుపు... కుందేలుదే గెలుపు’ అని కుందేళ్లు ప్రచారం ప్రారంభించాయి. ‘తాబేలుకు ఉంది డిప్ప.... కుందేలు చేతిలో చిప్ప’ అని తాబేళ్లు ప్రచారం మొదలెట్టాయి. పరుగుపందెం జరిగే రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ నుంచి పరుగు పందెం మొదలైంది. పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు ఎవరు ముందుగా చేరుకుంటే వారే విజేత. తాబేలు ఎప్పటిలాగే తన స్టయిల్లో మెల్లగా పరుగు మొదలు పెట్టింది. మరోవైపు కుందేలు మెరుపువేగంతో దూసుకుపోతుంది. ఆయాసం వచ్చి ఒక చోట ఆగింది కుందేలు. వెనక్కి తిరిగిచూసింది. తాబేలు జాడే లేదు. ఆకలి అయినట్లు అనిపించి అటు వైపు చూసింది. ‘ప్యారడైజ్ బిర్యానీ హౌస్’ కనిపించింది. కుందేలుకు నోరూరింది. ‘‘గడ్డి తినీ తినీ బోర్ కొడుతుంది. ఈరోజు బిర్యానీ లాగించేద్దాం’’ అనుకుంటూ ఈల వేసుకుంటూ బిర్యానీ హౌస్‌కు వెళ్లింది. కొద్దిసేపటి తరువాత బయటికి వచ్చిన కుందేలు మళ్లీ పరుగందుకుంది. ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’ వరకు వచ్చిన కుందేలుకు నిద్ర ముంచుకొచ్చింది. ‘‘ఒక కునుకు తీసి వెళతాను. ఎనర్జీ వస్తుంది. ఆ తాబేలు వచ్చేదా చచ్చేదా!’’ అనుకుంటూ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్‌లోని గడ్డిలో పడకేసింది కుందేలు. సీన్ కట్ చేస్తే...తాబేలు పంజగుట్ట సర్కిల్ దాటింది. మరోవైపు కుందేలు జాడేలేదు.‘తార వెలుగుతుంది... తాబేలే గెలుస్తుంది’లాంటి నినాదాలు పంజగుట్ట ఫ్లైఓవర్ అదిరేలా మారుమోగుతున్నాయి.ఇంకో అయిదారు అడుగులు వేస్తే....తాబేలే గెలుస్తుందనగా.... విల్లు నుంచి దూసుకొచ్చిన బాణంలా తాబేలు వెనక నుంచి దూసుకు వచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిల్చొంది కుందేలు. అందరూ షాక్ అయ్యారు. ‘కుందేలు గెలిచింది...చరిత్రను తిరగ రాసింది’ నినాదం మిన్నంటింది.‘‘మీరు గెలుస్తారని ఎవరూ ఊహించలేదు. మీరు ఎక్కడో గుర్రు పెట్టి నిద్రపోయుంటారని అందరూ అనుకున్నారు. మీ విజయరహస్యం ఏమిటి?’’ మైక్‌లు కుందేలు మూతి ముందు పెట్టి అడిగింది మీడియా.‘‘నేను మ్యాథ్స్ స్టూడెంట్ను కావడం బాగా కలిసొచ్చింది. నేను గుర్రు పెట్టి నిద్ర పోయిన మాట వాస్తవమేగానీ... తగిన జాగ్రత్తలు తీసుకొని మరీ నిద్ర పోయాను. తాబేలు సగటు వేగం ఎంతో నాకు తెలుసు. అది క్లాక్ టవర్ నుంచి పబ్లిక్‌స్కూల్ వరకు రావడానికి ఎంత సమయం పడుతుందో క్యాలిక్లేట్ చేసుకొని ఆ సమయానికి నా సెల్ఫోన్లో అలారం సెట్ చేశాను. నా అంచనా తప్పలేదు. తాబేలు పబ్లిక్ స్కూల్ దగ్గరకు రాగానే అలారం మోగింది. నిద్ర లేచాను. తాబేలును ఫాలో అయ్యాను. తాబేలు గతాన్ని నమ్ముకుంది. నేను టెక్నాలజీని నమ్ముకున్నాను’’ అసలు విషయం చెప్పింది కుందేలు. రెండు రోజుల తరువాత...‘‘ఏం నత్తబావా... బొత్తిగా కనిపించడం లేదు’’ ఒక ఇరానీ చాయ్ హోటల్ దగ్గర కనిపించిన నత్తను అడిగింది తాబేలు.‘‘నత్తారింటికి దారేది!æ... అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉన్నానులే. అది సరేగానీ, పరుగు పందెంలో చిత్తుగా ఓడిపోయావట కదా! నాతో పందెం కాసే దమ్ముందా?’’ అని సవాలు విసిరింది నత్త.‘‘చివరికి నీకు కూడా లోకువైపోయానా! నీతో పందేనికి నేను రెడీ’’ అని సవాలు స్వీకరించింది తాబేలు. మరుసటి రోజు...సేమ్ ప్లేస్.... క్లాక్ టవర్ నుంచి పంజగుట్ట పోలీస్‌స్టేషన్ వరకు.తాబేలు వీరకసితో పరుగు మొదలు పెట్టింది. నత్త తన స్టయిల్లోనే అతి మెల్లగా పరుగు మొదలుపెట్టింది.బేగంపేట పోలీస్‌స్టేషన్ వరకు వచ్చిన తాబేలు వెనక్కి తిరిగిచూసింది. నత్త జాడే లేదు. ఉత్సాహంతో మరింత వేగంగా పరుగందుకుంది. కొద్దిసేపటి తరువాత పంజగుట్ట సర్కిల్ దగ్గరకు రానే వచ్చింది.పెద్ద షాక్! అప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిల్చొని విక్టరీ సింబల్ చూపిస్తోంది నత్త!!‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’ అంటూ మీడియా నత్త ముందు మైకులు పెట్టింది.‘‘విజయం అనేది నిజం. ఇక రహస్యం అనేది రహస్యంగానే ఉండాలి’’ అని లౌక్యంగా బదులిచ్చింది నత్త. మరుసటిరోజు...నత్త మెడలో పూలమాల వేసి అభిమానులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అమీర్‌పేట దగ్గర....‘‘అవును బావా.... నువ్వు గెలవడం ఇప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ఏంటి సీక్రెట్?!’’ అని నత్త చెవిని దగ్గరకు తీసుకొని అడిగింది బామ్మర్ది నత్త.‘‘ఏం లేదు బామ్మర్ది... విక్టరీ సింబల్ చూపింది నేను కాదు... నా తమ్ముడు పాపారాయుడు! అచ్చం నాలాగే ఉంటాడు. మేమిద్దరం ట్విన్స్. మా పోటీ మొదలు కావడానికి ముందే... పాపారాయుడు పంజగుట్టలో ఒక సందులో నక్కాడు. తాబేలు రావడానికి ముందు... పోలీస్‌స్టేషన్ ముందు నిల్చొని విక్టరీ సింబల్ చూపాడు. నాలాగే ఉంటాడు కాబట్టి.... అందరూ నేనే అనుకున్నారు. అదీ విషయం’’ అని తన విజయరహస్యం చెప్పింది బావ నత్త! – యాకుబ్ పాషా -
ఆడేదెవరైనా గెలుపు అతడిదే!
హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పేకాటలో గెలుపెవరిదో పసిగట్టి ఆపై బెట్టింగ్ జరిపే ముఠాను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఊస నాగప్రవీణ్ కుమార్ (31) బీటెక్ పూర్తి చేశాడు. యూసఫ్‌గూడలో నివసించే అతడు కొద్దికాలంగా యాదగిరినగర్‌లో హైటెక్ పేకాట శిబిరాన్ని నిర్వహి స్తున్నాడు. పేకాట శిబిరంలపై పోలీసులు దాడి చేయ గా విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. పేకాటలో ఎవరు గెలుస్తారో ముందుగా చెప్పే టెక్నాలజీ ఉన్న సెల్‌ఫోన్‌ను ఢిల్లీ నుంచి రూ.28 వేలకు ప్రవీణ్ కొనుగోలు చేశాడు. దీనిద్వారా గెలుపొందే వ్యక్తిపై బెట్టింగ్ నిర్వహించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకునేవాడు. పోలీసులు ప్రవీణ్, ఇంటి యజమాని అజయ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. రూ. 38 వేల నగదును, ఐదు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు. టెక్నాలజీ పనితీరు ఇదీ.. ప్రవీణ్ కొనుగోలు చేసిన సెల్‌లోని డిజైన్డ్ కార్డ్ స్కానర్ ముందుగా పేకముక్కల్ని స్కాన్ చేస్తుంది. ఒక్కొక్కరికీ మూడు పేకముక్కల చొప్పున పంచే తీన్‌పత్తా ఆటలో ముందుగా సీక్వెల్ వచ్చిన వారు గెలుపొందుతారు. పంచిన పేకలు ఎవరెవరికి వెళ్లాయో సెన్సర్ల ద్వారా విశ్లేషించుకుని వరుస నంబర్లు (సీక్వెల్) ఎవరికి వచ్చిందన్న విషయాన్ని సంఖ్యల ద్వారా కొత్త టెక్నాలజీ చెప్పేస్తుంది. -
మట్కా కనికట్టు.. బతుకు తాకట్టు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఐజయ్య (పేరు మార్చాం) మట్కా జూదానికి బానిసయ్యాడు. జహీరాబాద్‌లోని ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ.. వచ్చిన డబ్బంతా ‘మెయిన్ ముంబై’ మట్కాలో పెట్టాడు. అడ్డగోలు వడ్డీకి అప్పులు చేసి కూడా పందేలు కాశాడు. కానీ ఇప్పటివరకు రూపాయి గెలుచుకున్నది లేదు. చివరికి ఉన్న రెండెకరాల పొలం అమ్ముకున్నాడు. ... వీరే కాదు.. తెలంగాణ పల్లెల్లో వేలకొద్దీ కుటుంబాలు మట్కా జూదానికి చిన్నాభిన్నమవుతున్నాయి. చెమటోడ్చి సంపాదించిన నాలుగు రాళ్లను మాయదారి మట్కానే మింగేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దు జిల్లాల్లో ఈ జూదం జోరుగా సాగుతోంది. మన రాష్ట్రంలో మట్కాపై నిషేధం ఉన్నా... ఆ రెండు రాష్ట్రాల్లో దానికి చట్టబద్ధత ఉంది. దీంతో ఇక్కడివారు సరిహద్దులు దాటివెళ్లి మరీ పందేల్లో పాల్గొంటున్నారు. కొందరు ఇక్కడి నుంచే ఫోన్ల ద్వారా పందేలు కాస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మహారాష్ట్రలో మట్కాకు అడ్డా అయిన ‘ఉమ్మర్గ’ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ మట్కా ఆడుతున్న వారిలో తెలుగువారే ఏకంగా 80 శాతం వరకు ఉండడం గమనార్హం. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి తెల్ల బట్టలు.. మాసిన గడ్డంతో ఉన్న ఈ పెద్దాయన జీవితమంతా జూదంతోనే పండిపోయింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌కు చెందిన ఆయన.. భార్య పుట్టింటి నుంచి తెచ్చిన బంగారు నగలు, వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిని మట్కాకే తగలేశాడు. చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలేసి వచ్చి మట్కాకు కేంద్రమైన ఉమ్మర్గ (మహారాష్ట్ర)లో మకాం పెట్టాడు. వారానికి రూ.రెండున్నర వేల జీతంతో మట్కా చీటీలు రాసే పని చేస్తున్నాడు. లక్షన్నర మందికిపైగా.. మట్కా జూదం కేవలం సరిహద్దు జిల్లాల్లోనే కాకుండా ఇటీవల ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించింది. రాష్ట్రం నుంచి రోజుకు సగటున 1.5 లక్షల మంది మట్కా పందేలు కాస్తున్నట్లు అంచనా. ఇందులో 50 వేల మంది వరకు సరిహద్దులు దాటి మహారాష్ట్ర పట్టణాల్లో ప్రత్యక్షంగా జూదంలో పాల్గొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో..జూదరులు మట్కా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అక్కడ చట్టబద్ధమే.. మహారాష్ట్రలో మట్కాకు చట్టబద్ధత ఉంది. మెయిన్ ముంబై, రాజధాని నైట్, న్యూముంబై దబ్రా, సెంట్రల్ ముంబై, శుభలక్ష్మి, న్యూవర్లీ, రాజధానిడే, కల్యాణి.. ఇలా రకరకాల పేర్లలో వందకుపైగా మట్కా కంపెనీలు జూదం నిర్వహిస్తున్నాయి. అన్నీ కూడా నిరుపేదలు, దినసరి కూలీలు, మధ్యతరగతి వారు టార్గెట్‌గా నడుస్తున్నవే. ఇందులో రోహణ్ ఖత్రీ అనే వ్యక్తి నడిపిస్తున్న మెయిన్ ముంబై, కల్యాణ్ మట్కా కంపెనీలకు 75 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ రెండు ఆటలను కూడా అంతా పనులు ముగించుకొని ఇంటికొచ్చే వేళల్లో నిర్వహిస్తుంటారు. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత కూడా మట్కా ఆడుతున్నారు. అంకెలు, సంఖ్యల మాయాజాలం! మెయిన్ ముంబై, కల్యాణ్ కంపెనీలు రోజుకు ఒక ఆట నిర్వహిస్తాయి. 00 నుంచి 999 వరకు సంఖ్యల ఆధారంగా ఈ జూదం నడుస్తుంది. ఒక్కో ఆటలో ప్యానల్, సింగిల్, జోడీ, డబుల్ ప్యానల్ అనే విభాగాలు ఉంటాయి. ప్యానల్‌ను కూడగా వచ్చిన చివరి సంఖ్యను సింగిల్ అని పిలుస్తారు. ఆట ఓపెన్ కాకముందు ప్యానల్‌కు పందెం కాస్తే విజేతలకు ప్రతి రూ.10కి రూ.1,400 ఇస్తారు. డబుల్ ప్యానల్ గెలిస్తే రూ.2,400, సింగిల్ నంబర్ గెలిస్తే రూ.95, జోడీ గెలిస్తే రూ.950 చొప్పున చెల్లిస్తారు. చాలా మంది జోడీ నంబర్ మీద పందెం కాస్తుంటారు. ఆట ఓపెన్ అయిన రెండు గంటల్లో ముగుస్తుంది. ఒక్కో ఆటలో 6 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు పాల్గొంటారని మట్కా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాలు, ఖానాపూర్, జిన్నింగ్ ఏరియాల్లో, ఖుర్షిద్‌నగర్, ఆదిలాబాద్‌లోని తాంసి బస్టాండ్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, న్యాల్కల్ మండలం రాజోల్, సంగారెడ్డి పట్టణం, నారాయణఖేడ్, సమీప గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద, మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా్ణ, మన్ననూరు, ఆత్మకూరు, నారాయణపేట మండలాల్లో మట్కా జూదం సాగుతున్నట్లుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇక హైదరాబాద్, వరంగల్‌తో సహా అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. మొత్తంగా రోజుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు అంచనా. టెక్నాలజీతో విస్తృతమై.. ఒకప్పుడు కోడి పందాల తరహాలో ఒకచోట గుంపులుగా చేరి చీటీలపై నంబర్లతో సాగిన మట్కా దందా... సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బాగా విస్తృతమైంది. మొబైల్ ఫోన్లో యాప్‌లు, ఎస్సెమ్మెస్‌ల స్థాయికి చేరింది. ఎక్కడున్నా, ఎక్కడి నుంచైనా మట్కా ఆడేలా వీలు ఏర్పడింది. ఇక తెలంగాణలో ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపడంతో జూదం ఆడేవాళ్లు మట్కావైపు మళ్లారు. పేకాట క్లబ్బులు నిర్వహించడంలో అనుభవమున్న వారు మట్కా ఏజెంట్లుగా మారిపోయారు. పందెం రాయుళ్ల నుంచి రూ.2 వేలు రుసుము తీసుకుని ఏడాది పాటు సభ్యత్వం ఇస్తున్నారు. పందెం డబ్బు చెల్లించడం కోసం బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి, గెలిస్తే బహుమతి డబ్బు ఇవ్వడం కోసం జూదరుల ఖాతా నంబర్లు తీసుకుంటున్నారు. పందెం కాయాలనుకుంటే.. నిర్వాహకుల ఖాతాలో డబ్బులు వేసి, ఫోన్ చేసి ‘మట్కా’ ఓపెనింగ్ నంబరో, ప్యానల్ నంబరో, జోడీ నంబరో చెబితే నోట్ చేసుకుంటారు. గెలిస్తే పందెం కాసినవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. పందెం కాయడం సులువుగా మారిపోవడంతో మట్కా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు చాలా మంది దీని మాయలో పడిపోతున్నారు. రాష్ట్రం నుంచి లక్ష మందికిపైగా సభ్యత్వం తీసుకున్నట్లు మహారాష్ట్రలోని ఉమ్మర్గలో ఉన్న మట్కా నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఊరూరికీ ఏజెంట్ల వ్యవస్థ ముంబై మాఫియా కనుసన్నల్లో నడిచే మట్కా జూదం ఏజెంట్ల వ్యవస్థ మీద ఆధారపడి కొనసాగుతోంది. ప్రతి పట్టణంతో ఇద్దరు ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని.. వారు సేకరించే పందెం సొమ్ము నుంచి 10 శాతం కమీషన్‌గా ఇస్తున్నారు. ఈ ఏజెంట్ల మీద పర్యవేక్షణకు మునీంలు, వారిపై పట్వారీలు.. అలా అధినేత వరకు ఉంటారు. వారికి వేర్వేరుగా కమీషన్లు ఉంటాయి. 1 రాష్ట్రం నుంచి మొదలై.. మట్కా జూదం జరుగుతున్న తీరును గుర్తించడం కోసం ‘సాక్షి’ బృందం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ముందుగా జహీరాబాద్‌లో ఒక ఏజెంట్‌ను కలవగా.. ఆ సమయంలో న్యాల్కల్ మండలం రాజోల్లో జోరుగా పందేలు సాగుతాయని వెల్లడించాడు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామానికి వెళుతుండగా పొలిమేరల్లోనే పందాల గుంపు కనిపించింది. అటువైపు వెళ్లేసరికి పందెం రాయుళ్లు, నిర్వాహకులు అడవిలోకి వెళ్లిపోయారు. అక్కడ జెరప్ప అనే వ్యక్తి, అతని అనుచరులు కలసి మట్కా జూదం నిర్వహిస్తుంటారని.. ప్రతి రోజూ మూడు నాలుగు వందల మంది పందేలు కాస్తుంటారని స్థానికుడొకరు వెల్లడించారు. 2 ఉమ్మర్గ.. పందాలకు అడ్డా అనంతరం ‘సాక్షి’ బృందం మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ పట్టణం మట్కాకు ముంబై తర్వాత రెండో రాజధానిగా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రం నుంచి చాలా మంది ప్రత్యక్షంగా మట్కా పందేలు కాయడం కోసం ఉమ్మర్గకు వెళుతుంటారు. ఉమ్మర్గ పట్టణం, సమీప గ్రామాల్లో కలిపి 150 వరకు లాడ్జీలు ఉండగా... ఇందులో పది పదిహేను మాత్రమే సాధారణ లాడ్జీలు. మిగతావన్నీ బెట్టింగ్ అడ్డాలే. వాటిల్లోకి ఉచితంగా వెళ్లవచ్చు. డబ్బులు తీసుకుని భోజనం, మద్యం కూడా సమకూర్చుతారు. అసలు ఈ పట్టణ జనాభాలో 40 శాతం మంది మట్కా ఏజెంట్లేనని, సుమారు 1,000 మంది ఏజెంట్లు ఉంటారని స్థానికులు చెప్పారు. ఇక్కడి లాడ్జీల్లో చాలా వరకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారని వెల్లడించారు. ‘సాక్షి’ బృందం ఓ స్థానిక సహాయకుడిని తోడు తీసుకుని పందేలు కాసే ఓ లాడ్జీలోకి వెళ్లింది. అందులో పది పన్నెండు చిన్న గదులు ఉండగా.. అంతా పందెం రాయుళ్లతో కిక్కిరిసి ఉన్నాయి. వారిలో 80 శాతం మంది తెలుగు వారే కనిపించారు. 20–30 మందితో మాట్లాడగా.. వారంతా హైదరాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చినట్టు చెప్పారు. రూ. 50 నుంచి రూ. 500 వరకు పందేలు కాస్తున్నారు. 3 పందెం కోసమంటూ వెళ్లి.. తర్వాత ఉమ్మర్గ పట్టణంలోని మహాదేవుని రోడ్డు ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల మరో లాడ్జిలోకి పరిశీలన బృందం వెళ్లింది. అక్కడ దాదాపు 30 గదులు ఉండగా.. అన్నింటిలోనూ తెలుగు వాళ్లు కనిపించారు. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, కూలీల వరకు అందరూ వారిలో ఉండడం గమనార్హం. ఒక్కసారి ఇక్కడికి వస్తే వారం రోజుల వరకు ఉంటారని గదులు శుభ్రం చేసే వ్యక్తి వెల్లడించాడు. ‘సాక్షి’ బృందం కూడా పందెం ఆడటానికంటూ ఆ లాడ్జిలోని ఒక గదిలోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. వారికి నమ్మకం కలిగించడానికి రూ.100, రూ.50 పందేలు కూడా కాసింది. ఫలితం వచ్చే సమయం దాకా అక్కడున్నవారితో మాటలు కలిపి.. వివరాలు సేకరించింది. 4 మట్కా చీటీలు రాసేది తెలుగువాళ్లే.. ఆ లాడ్జి నిర్వహించే ఏజెంట్ వద్ద క్లర్కుగా పనిచేసే వ్యక్తిని ‘సాక్షి’ బృందం పలకరించగా.. అతను తన పేరు ‘ఎన్.రాజ్’ అని చెప్పాడు. ఉమ్మర్గ, పర్భణి, ధర్మపురి, నాందేడ్ తదితర ప్రాంతాల్లోని మట్కా కేంద్రాలకు తెలుగు వారే ఎక్కువగా వస్తారని వెల్లడించాడు. అందువల్ల కచ్చితంగా తెలుగు వచ్చిన వారినే ఏజెంటుగా, చీటీలు రాసే క్లర్కుగా తీసుకుంటారని చెప్పాడు. క్లర్కుకు వారానికి రూ. 2.5 వేలు జీతంగా ఇచ్చి భోజనం పెడతారని తెలిపాడు. ఫోన్ ద్వారా పందేలు కాయవచ్చని చెబుతూ.. ఆ ఫోన్ నంబర్లు కూడా రాసి ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని.. గెలిస్తే తాము కూడా ఖాతాలో జమ చేస్తామని చెప్పాడు. 5 పెద్ద ఏజెంట్‌పై ఆరా.. మట్కా కంపెనీల్లో నంబర్‌వన్ అయిన ‘మెయిన్ ముంబై’లో భారీగా పందెం కాస్తామని, ఆ స్థాయి ఏజెంట్ ఎవరని సాక్షి బృందం ఆరా తీసింది. దాంతో ఓ మధ్యవర్తి రూ.300 తీసుకుని.. పెద్ద ఏజెంట్ నిర్వహించే లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్ పేరు రతన్ భాయ్ అని చెప్పాడు. బృందం ఆయనను కలవగా.. తెలుగువారని తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించారు. భారీగా పందెం కాస్తామంటే ఐదు నుంచి 10 నంబర్ల మీద పెడితే మంచిదని సలహా కూడా ఇచ్చాడు. బ్యాంకులో డబ్బు వేసి.. ఫోన్‌కాల్, ఎస్సెమ్మెస్ ద్వారానైనా మట్కా స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పాడు. ఫోన్ నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లకు కాల్ చేస్తే.. బ్యాంకు ఖాతాల నంబర్లు ఎస్సెమ్మెస్ చేస్తానన్నాడు. దీంతో పని ముగిసిన బృందం.. సరేనంటూ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. -
ఏపీలో హైదరాబాద్ రేస్ క్లబ్‌కు అనుమతి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హైదరాబాద్ రేస్ క్లబ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కర్నూలులో రేస్ కోర్స్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ రేస్ క్లబ్ ద్వారా గుర్రపు పందేలు, బెట్టింగులు నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలోనే రెండు రాష్ట్రాలోన్లూ ప్రస్తుతం బెట్టింగ్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ రేస్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు కూడా. -
పల్లెసీమపై సంక్రాంతి సంతకం
సాక్షి, అమరావతి: సంప్రదాయానికి మారుపేరైన సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్లలో ఒక కొత్త వెలుగు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ జనుల మదిలో వెలుగులు పూయించే సమయం... చలిపులి ధాటికి దుప్పట్లో ముసుగుతన్నిన పల్లెలిప్పుడు పండుగ సంబరాలు జరుపుకుంటున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాల సమయాన పురివిప్పి ఆడే నెమళ్లలా పులకిస్తున్నాయి. ఆత్మీయులు, రక్తసంబంధీకుల రాకతో పెద్దల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లులతో పల్లెలు ఇపుడు కళకళలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల్లాగే జీవన శైలిలో చోటుచేసుకుంటున్న వింత పోకడలతో పండుగ సంబరాలూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. దూరం భారమైనా...దగ్గరవాలనే తపన చాలామంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర చోట్ల స్థిరపడ్డారు. వేలాది మంది అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్,సింగపూర్‌లో ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. వీరంతా మూడు రోజుల పండుగ కోసం పల్లెదారి పట్టారు. హైదరాబాద్ నుంచే వేలమంది రాష్ట్రంలోని సొంత ఊర్లకు తరలారు. బస్సులు, రైల్వేస్టేషన్లు వారం రోజులుగా కిటకిటలాడాయి. ఎంత ఖర్చయినా సరే సంక్రాంతికి రావాల్సిందే. అత్మీయతలు, అనుబంధాలు పెనవేసుకోవాల్సిందే. ఈ పండుగ ఏ దేవుడికీ సంబంధించినది కాదని, అందరినీ కలిపే ఒక వేడుకని విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఎం.ఎ.మోహన్‌రావు చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన కొడుకులు, కోడళ్లను చూసి ఆయన మురిసిపోతున్నారు. ఆత్మీయల కోసం తపన ఇంటినిండా బంధుగణం ఉందంటే కోట్లున్నా అంత సంతోషముండదు. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల కోసం చాలామంది పట్టణాలకు అక్కడ్నుంచి వీలైతే విదేశాలకూ వెళ్లారు. చాలామందికి డబ్బు సంపాదిస్తున్నా ఆప్యాయతలు లేక పలకరింపు కోసం తపిస్తున్నారు. ఆత్మీయ పలకరింపులు, అనురాగ బంధాల మేళవింపులతో ఏడాదికొక్కసారైనా రాములోరి గుడిపంచన కూర్చుని మనసు విప్పి మాట్లాడే మాటలు కాలిఫోర్నియా, న్యూయార్క్‌లో చూసిన బహుళ అంతస్థుల మేడలకన్నా మిన్న. సంక్రాంతి పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నామని కర్నూలు జిల్లా సంజామలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. ‘‘మా చిన్నప్పుడు సంక్రాంతి అంటే ఎంతో సందడి. గంగిరెద్దుల సందడి, అక్షయ పాత్రతో హరిదాసు పాటలు, గంటలతో జంగాల పొగడ్తలు ఉండేవి. ఇళ్ల ముందు పోటీలు పడి ముగ్గులు పెట్టేవాళ్లం. అంత సందడి ఇపుడు లేదు.’’ అని శ్రీకాకుళం జిల్లా కె.కెరాజపురానికి చెందిన శంభాన వెంకటనారాయణమ్మ అన్నారు. పనిలో పనిగా పెళ్లిచూపులు కూడా.. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు సంక్రాంతికి ఇంటికొస్తారు. నిజానికి ఇప్పుడు ముహూర్తాలు లేకున్నా పెళ్లి చూపులు మాత్రం కానిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సుధీర్‌కు ఇలా సంక్రాంతికి వచ్చినప్పుడే పెళ్లిచూపులు జరిపి తరువాత వివాహం చేశారని వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం మబ్బుచింతలపల్లెకు చెందిన ఎల్.రామసుబ్బారెడ్డి చెప్పారు. పల్లెల్లో ఆటపాటలు, పందేల సందడి.. విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గంలో భోగి రోజు నుంచి ప్రారంభమయ్యే తీర్థాల సందర్బంగా యడ్ల బండ్ల పోటీలు, పోతుల పందాలు, సంగిడిరాళ్ల పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వినోదం విషయానికొస్తే పొట్టేలు పందేలు ఒక్కటే చెప్పుకోదగినవి. ఇందుకు అనుమతి లేకపోవడంతో వంగర, వీరఘట్టం మండలాల్లో, విజయనగరం సరిహద్దుల్లో గుట్టుగా నిర్వహిస్తున్నారు. పచ్చని కోనసీమలో జరిగే ప్రభల తీర్థాల కోసం రాష్ట్ర నలు మూలల నుంచి తరలివస్తారు. పంటచేలు, కాలవలను దాటుకుని వచ్చే ప్రభలను చూసేందుకు జనం పోటెత్తుతారు. ముఖ్యంగా కొబ్బరి కేంద్రమైన అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం వెనుక నాలుగున్నర దశాబ్ధాలకుపైగా చరిత్ర ఉంది. ఎటువంటి ఆలయం లేని ఇక్కడ 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. కర్నూలు జిల్లా జొహరాపురంలో నిర్వహించే బండలాగుడు పోటీలు అందరిలో ఉత్సాహాన్ని నింపుతాయి. అహోబిలంలో జరిగే పారువేట ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణ. ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, హరివరం తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చే పల్లె వాసులు ఈ పారువేట ఉత్సవాల్లో పాల్గొంటారు. గిరకబండి పోటీలు, ఎద్దులతో బండలాగుడు పోటీలలో పల్లె వాసులు పాల్గొని ఆనందంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా తీర్థాల్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఒకప్పుడు గోదావరి జిల్లాలకే పరిమితమైన కోడిపందేలు ఇపుడు విశాఖ గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. ముత్యాలమ్మపాలెం బీచ్ మొదలుకొని భీమిలి బీచ్ వరకు పతంగుల పండుగ నిర్వహిస్తున్నారు. భారీగానే పండుగ వ్యాపారం సంక్రాంతి పండగ నేపధ్యంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారం బాగానే జరిగిందని అంటున్నారు. వస్త్ర వ్యాపారానికి ఉత్తరాంధ్రలోనే పేరెన్నికగన్న విజయనగరంలో సుమారు రూ.170 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల వస్త్ర మార్కెట్‌కు కేంద్రమైన రాజమహేంద్రవరం, కాకినాడ, ద్వారపూడి, ఇతర పట్టణాల్లో గడిచిన ఐదారు రోజుల్లో సుమారు రూ.80 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. నోట్ల కష్టాలు లేకుంటే వ్యాపారం ఇంకా బాగా జరిగేదని అంటున్నారు. కర్నూలుజిల్లాలో పండుగ ముగ్గుల రంగుల అమ్మకాలే రూ.2 కోట్ల మేర జరిగినట్టు తెలుస్తోంది. చిత్తూరుజిల్లాలో ఈ ఏడాది వస్త్ర దుకాణాలు, గృహోపకరణాలు, బంగారు, నిత్యావసర సరుకులు ఇలా మార్కెట్లో రూ.230 నుంచి రూ.250 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మాట్లాడటం అంటే మద్యమే తరాలు మారినంత మాత్రాన తలరాతలు మారతాయా? అంటారు. కానీ అంతరాలు మాత్రం ఖచ్చితంగా మారుతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతికి దూరప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఆటపాటలతో, ఆత్మీయ పలకరింపులతో సందడి చేసేవారు. అంతా చావిడి వద్ద గుమికూడేవారు. ఇప్పుడు పదిమంది కుర్రాళ్లు కలవాలంటే మద్యం సీసా వారధిగా మారింది. ఆటవిడుపు అంటే మద్యం అన్నట్లుగా మారింది. అన్నాదమ్ములు, అల్లుళ్లు పక్కపక్కనే కూర్చుని చీర్స్ చెప్పుకుంటున్నారు. కొన్నిచోట్ల కనుమరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే మద్యం ప్రవాహం రాత్రి పదిగంటల వరకూ కొనసాగుతూనే ఉంటుంది. బలాబలాలు బేరీజు వేసుకోవటానికి మద్యపానాన్ని కొలబద్ధగా మార్చుకోవటం కొత్త ట్రెండ్‌కు అద్దం పడుతోంది. -
గెలుపు బీజేపీదే.. కానీ!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు... ఈ దఫా బెట్టింగ్ మార్కెట్‌ను కూడా టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకాన్ని సత్తార్ మార్కెట్ వ్యక్తం చేస్తున్నా.. మెజారిటీపై ధీమాను ప్రకటించడం చేయడం లేదు. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల మొదటి దశకు రెండు రోజులు మాత్రమే గడువుండడంతో పందెం రాయుళ్లు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు ఈ ఎన్నికల ఫలితాలపై దాదాపు రూ. 500 నుంచి 600 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. బెట్టింగ్ మార్కెట్ అంచనాలు, వివిధ సర్వేల మేరకు.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం అంత ఆషామాషీ కాదని తెలుస్తోంది. ఒకవేళ భారతీయ జనతాపార్టీ గెలిచినా.. కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికలు మోదీ-అమిత్ షా ద్వయానికి అతి పెద్ద పరీక్షలా నిలిచాయని మరికొందరు చెబుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి 101 నుంచి 103 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా. అలాగే కాంగ్రెస్ పార్టీకి 71 నుంచి 73 సీట్లు రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుకీ రేట్ బీజేపీ 110 సీట్లు గెలుస్తుందన్న అంశంపై ఒకటిన్నర రూపాయి, 125 సీట్లకు పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ. 3.50, అలాగే 150కి పైగా గెలుస్తుందన్న బెట్టింగ్‌కు రూ.7 బుకీ రేట్గా ఉంది. అలాగే కాంగ్రెస్ 99-100 సీట్లకు బుకీ రేట్ రూ.3, 75 సీట్లకు రూపాయి 10 పైసలు ఉంది. అలాగే ఎన్నికల తరువాత విజయ్ రూపానీ ముఖ్యమంత్రి అవుతాడన్న అంశంపై 44 పైసలు, నితిన్ పటేల్ సీఎం అనే దానిపై 55 పైసలును బుకీలు రేట్గా పెట్టారు. బుకీల రేటును బట్టి బీజేపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. బీజేపీ విజయం సాధిస్తే మరోమారు విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. -
గుజరాత్.. బీజేపీదే!
సాక్షి, జైసల్మీర్ : గుజరాత్ ఎన్నికల్లో పలు సర్వేలతో పాటు.. బీజేపీనే విజయం సాధించే అవకాశాలున్నాయని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్ అనూహ్య ఫలితాల నేపథ్యంలో మెజారిటీ సీట్లపై పందెం రాయుళ్లు ఆచితూచి వ్యహరిస్తున్నట్లు బెట్టింగ్ మార్కట్ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయాలు, ప్రధాని మోదీ పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని. బికనీర్, ఫలోదిలోని బెట్టింగ్ మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకీ 107 నుంచి 110 సీట్లు లభించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 71 సీట్లు రావచ్చని బెట్టింగ్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకీ 192 నుంచి 200 సీట్లు వస్తాయని పందెం రాయుళ్లు భారీగా పందెం కాశారు. అనూహ్య ఎన్నికల ఫలితాలతో బెట్టింగ్ రాయుళ్లు భారీగా నష్టపోయారు. గుజరాత్లో కూడా విన్నింగ్ ట్రెండ్ బీజేపీకే అనుకూలంగా ఉందని.. అయితే సీట్ల విషయంలో కొంత అనిశ్చితి నెలకొందని బుకీలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 115 దక్కించుకుంది. కాంగ్రెస్ 68 సీట్లతో ప్రతిపక్షంలో నిలిచింది. ప్రస్తుత గుజరాత్ ఎన్నికల్లో ట్రెండ్స్ రోజురోజుకూ మారుతున్నాయని బుకీలె చెబుతున్నారు. బీజేపీ గెలుపుపై సందేహాలున్నా.. మెజారిటీ పందెం రాయుళ్లు మాత్రం కాషాయ పార్టీపైనే బెట్టింగ్ చేస్తున్నారని బుకీలు తెలిపారు. బెట్టింగ్ మార్కెట్లో బీజేపీ గెలుపుపై రూ. 50 పైసలు, కాంగ్రెస్‌పై రూ.2 బెట్టింగ్ నడుస్తోందని బుకీలు తెలిపారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే ..
న్యూఢిల్లీ: పందెం, జూదంను చట్టబద్ధం చేస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు వాటికి అలవాటు పడే అవకాశం ఉందని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్వీర్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు. తత్ఫలితంగా నేరాల సంఖ్య పెరిగిపోతుందనీ, సమాజం గాడి తప్పుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆలిండియా గేమింగ్ సమిట్–2017’లో జస్టిస్ బల్వీర్ మాట్లాడారు. ‘దేశంలో నాలుగింట ఒక వంతు జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. వారి ఆదాయం చాలా తక్కువ. జూదం, బెట్టింగ్‌కు వారు ఆకర్షితులు అయ్యే అవకాశాలు పుష్కలం. అదే జరిగితే పర్యవసానాలు మొత్తం సమాజంపై పడతాయి. ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేరాలు, హింస పెరుగుతాయి’ అని ఆయన వివరించారు. దేశంలో క్రికెట్ పందేలను చట్టబద్ధం చేసే అంశాన్ని న్యాయ కమిషన్ పరిశీలిస్తోంది. -
కాయ్ రాజా కాయ్...
- పల్లెపల్లోనూ ‘బెట్టింగ్’ బంగార్రాజులు – రూ. లక్షల నుంచి రూ. కోట్లలోకి... - విజేతలకు ఆన్లైన్లోనే పేమెంట్లు – విస్తృత నెట్‌వర్క్‌తో వల విసురుతున్న బృందాలు – పెడదారి పడుతున్న యువత – ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు ప్రధాన పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు పల్లెలనూ పట్టి పీడిస్తోంది. ధనవంతుల మధ్య సాగే లావాదేవీలు సామాన్య, మధ్య స్థాయి వర్గాలనూ భాగస్వామ్యులుగా చేస్తున్నాయి. విద్యార్థులు కూడా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్లైన్ల ద్వారా ఈ జోరు ఊపందుకుంటోంది. రాజమహేంద్రవరం క్రైం: క్రికెట్ బెట్టింగ్ ఒకప్పుడు డబ్బున్నవారికే పరిమితమయ్యేది. ఇప్పుడు పేద, మధ్య తరగతి యువత కూడా ఈ ఊబిలో కూరుకుపోతోంది. జిల్లాలో ప్రధాన నగరాలైన కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర పట్టణాలతోపాటు క్రమేపీ పల్లెలకు కూడా పాకింది. క్రికెట్ మ్యాచ్ చూడడమంటే ఒకప్పుడు వినోదం ... ప్రస్తుతం విస్తృతమైన నెట్‌వర్క్‌తో వ్యాపారంగా మారిపోయింది. ప్రతి మ్యాచ్‌కు చిన్నపాటి గ్రామం నుంచి కూడా లక్షల్లో నగదు చేతులు మారుతోందంటే ఏ స్థాయిలో ఈ వ్యాపారం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. .విస్తృత నెట్‌వర్క్‌తో... బెట్టింగ్ బృందాలు విస్తృతమైన నెట్‌వర్క్‌తో ముందుకు సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఖాళీగా ఉన్న యువతను నెలవారీ జీతాలతో ఎంపికచేసుకుంటున్నాయి. వెయ్యికి రూ.50 కమీషన్‌పై బెట్టింగ్ వసూళ్ళు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని ఒక చిన్న మండలం నుంచే ఇటీవల జరిగిన ఒక కీలక మ్యాచ్‌కు సంబంధించి రూ.85 లక్షలు చేతులు మారినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు.. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. ఒకప్పుడు ఒక గదిలో భారీగా సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటి సరంజామాతో బెట్టింగ్ నిర్వహించేవారు. అయితే ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని మొబైల్ బెట్టింగ్ బృందాలు రంగ ప్రవేశం చేశాయి. వీళ్ళు తరచూ ప్రదేశాలు మార్చుతూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు కోట్లలో... ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్, వైద్య కళాశాల విద్యార్థులు ఈ బెట్టింగ్‌లలో జోరుగా పాల్గొనేలా బెట్టింగ్ ముఠాలు పావులు కదుపుతున్నాయి. గెలిచే జట్లుపైన, ఆ జట్టులో అత్యధిక స్కోర్ సాధించే క్రికెటర్‌పైనా, సిక్సర్లు, ఫోర్లుపైనా బెట్టింగ్‌లు కడుతుంటారు. ఫోన్ ద్వారా సాగే ఈ బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్ ద్వారా పేమెంట్లు మార్పిడి జరుగుతోంది. సకాలంలో డబ్బులు చెల్లించని వారిని బుకీలు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ వేధింపులను తాళలేక గత ఏడాది రాజమహేంద్రవరంలోని మెయిన్ రోడ్డులో హోల్ సేల్ ప్లాస్టిక్ వ్యాపారి కుమారుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. .అధికంగా అర్బన్ జిల్లాలోనే... రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో మూడు పోలీస్ స్టేషన్లలో మూడు బెట్టింగ్ ముఠాలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. - వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీవై కాలనీ వద్ద ఒక భవనంలో బెట్టింగ్ ముఠా స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి రూ. 1.60 లక్షలు, 8 సెల్ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. - టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్కట్ తోటలో ఒక క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ . 92 వేలు నగదు, ఒక సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనం, స్వాధీనం చేసుకున్నారు. - త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాస్కర నగర్లో ఒక దంత వైద్యుడి ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ 1.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
ఢిల్లీ నుంచి బెట్టింగ్ రేషియో
ఐపీఎల్ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా దందా ఇరువురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సిటీబ్యూరో: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.84 లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతానికి చెందిన గజానంద్ ఉపాధ్యాయ, బేగంబజార్‌కు చెందిన అతడి స్నేహితుడు సందీప్ టక్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బుకీలుగా మారారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఫోన్ల ద్వారా పరిచయస్తులు, స్నేహితుల నుంచి పందాలు అంగీకరిస్తున్నారు. ఈ బెట్టింగ్ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్డేట్స్ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశవ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన బుంటి భాయ్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.నాలుగు వేలు చొప్పున చెల్లించేవారు. దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలకు బుంటి భాయ్ లాంటి వాళ్ళు రేష్యోలు చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకుంటుంటారు. కేవలం రూ.లక్ష లోపు పందాలను మాత్రమే గజానంద్, సందీప్ అంగీకరిస్తారు. పందెం రాయుళ్లు అంతకంటే ఎక్కువ మొత్తం బెట్టింగ్ కాయాలని కోరితే... వారిని కింగ్ కోఠి ప్రాంతానికి చెందిన లడ్డూ కచువకు పరిచయం చేసి కమీషన్ తీసుకునేవారు. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి వీరి దందాపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ నేతృత్వంలో ఎòౖÜ్సలు ఎ.సుధాకర్, కె.శ్రీనివాస్, ఎస్.సైదాబాబు దాడులు నిర్వహించి నిందితులు గజానంద్, సందీప్‌లను అరెస్టు చేశారు. పరా>రీలో ఉన్న నిందితులు బుంటి భాయ్, లడ్డూ కోసం గాలిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. -
చిరు-బాలయ్య సినిమాలకు హై అలర్ట్
-
‘అగ్ర’ సినిమాలకు హై అలర్ట్
సినిమాల రిలీజ్‌లపై డీజీపీ స్థాయిలో పోలీస్‌శాఖ అప్రమత్తం అభిమానులపై డేగకన్ను నేడు చిరు ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ రేపు బాలయ్య ‘శాతకర్ణి’ విడుదల భారీ అంచనాలు, జోరుగా బెట్టింగ్‌లు సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఖైదీ నంబర్ 150 సినిమా బుధవారం విడుదల కాగా, గౌతమీపుత్ర శాతకర్ణి గురువారం రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో కోడి పందేలపై నెలకొన్న ఉత్కంఠత కంటే ఇద్దరు అగ్రహీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవి నటించిన సినిమాపై ఆయన అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన అభిమానుల్లోనూ అదే స్థాయిలో ఆసక్తి కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌ను జనవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. పోలీసుల హై అలర్ట్... చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కేవలం సినిమా హీరోలే కాకుండా రాజకీయాలతో ముడిపడిన వారు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ సినిమాల రిలీజ్ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా రాజకీయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సినిమాల రిలీజ్ నేపథ్యంలో తొలిసారిగా డీజీపీ స్థాయి అధికారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్పీలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన డీజీపీ నండూరి సాంబశివరావు థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. హద్దుమీరొద్దంటూ అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. భారీగా బెట్టింగ్‌లు.. సంక్రాంతికి కోడి పందేల కంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైనే ప్రధానంగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం. ఖైదీ నంబర్ 150 సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. బాలకృష్ణ సినిమా కూడా వంద కోట్లు వసూలుపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. దీంతో తొలి షో బ్లాక్ టిక్కెట్ రేటు ఎంతకు అమ్ముడుపోతుంది. ఎన్ని థియేటర్లలో ఎన్ని షోలు ప్రదర్శిస్తారు. వారం రోజుల్లో ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుంది. ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌లు ఊపందుకోవడం గమనార్హం. -
కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
ఆచంట: కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 19 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కోళ్లు, రూ. 2,650 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 12 నాటు కత్తులు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పడమంచలలో ఆదివారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. కోడి పందాలు ఆడుతున్న వారితో పాటు బెట్టింగ్ నిర్వహించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. -
బెట్టింగ్స్ వయా బ్యాంక్ అకౌంట్స్!
* ఐదేళ్లుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా * దాడి చేసి ముగ్గురిని పట్టుకున్న ఎస్ఓటీ కాప్స్ * రూ.9 లక్షల నగదు, రెండు ల్యాప్టాప్స్ స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు తెలివిమీరుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎక్కడా పంటర్లు ‘ప్రత్యక్ష సంబంధాలు’ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠాను మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ.9 లక్షల నగదు, ల్యాప్టాప్స్, టీవీ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఈ.రామ్చంద్రారెడ్డి తెలిపారు. బెట్టింగ్స్ సాంకేతిక పరిభాషలో పందాలు నిర్వహించే వాళ్లను బుకీలని, పందాలు కాసే వ్యక్తుల్ని పంటర్లనీ అంటారు. సికింద్రాబాద్‌లోని సింధి కాలనీకి చెందిన పి.మహేష్‌బాబు నేతృత్వంలో హస్మత్‌పేట్‌కు చెందిన మహేష్‌కుమార్, రసూల్పురవాసి బి.కిరణ్‌కుమార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ త్రయం దాదాపు ఐదేళ్లుగా బెట్టింగ్ దందా నిర్వహిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జిత్తు ద్వారా ఎప్పటికప్పుడు బెట్టింగ్ రేట్లు తెలుసుకోవడంతో పాటు ఫోన్స్ కనెక్టింగ్ బాక్స్ల్నీ సమీకరించుకున్నారు. ఈ ముగ్గురూ బెట్టింగ్స్ నిర్వహణలో ఏ కోణంలోనూ పోలీసుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్‌బాబు మల్కాజ్‌గిరిలోని వాణి నగర్లో నివసించే తన రెండో భార్య ఫ్లాట్‌నే డెన్‌గా మార్చుకున్నాడు. అక్కడే టీవీ, ల్యాప్టాప్స్, ఫోన్లు తదితరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు బుకీలు ఇతడికి సహకరిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి ఫోన్ల ద్వారా బెట్టింగ్స్ అంగీకరిస్తున్న ఈ ముఠా... అందుకు సంబంధించిన డబ్బును నేరుగా తీసుకునేదికాదు. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడం, వాటి ద్వారానే బదిలీ చేయడం చేసేది. ఈ గ్యాంగ్ ఉప్పల్‌లో జరుగుతున్న మంగళవారం నాటి ఐపీఎల్ మ్యాచ్ కోసం బెట్టింగ్స్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్ఓటీకి సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం వాణినగర్‌లోని ఫ్లాట్‌పై దాడి చేసి మహేష్‌బాబు, మహేష్ కుమార్, కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న జిత్తు కోసం గాలిస్తోంది. -
మేకలు..కోళ్లతో బెట్టింగ్ !
జెడ్పీ, టీపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ దందా సాక్షి, బెంగళూరు: మేకలు, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, బాతులు కాదేదీ బెట్టింగ్‌కి అనర్హం. అవును ప్రస్తుతం కర్ణాటకలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా పంచాయతీలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు (మంగళవారం) వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. సాధారణంగా బెట్టింగ్ అంటే డబ్బు లేదంటే నగలు ఎక్కువగా పందెం కాస్తుంటారు. కానీ, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల సంగ్రామం వేడి ఎక్కువగా గ్రామాల్లోనే కనిపిస్తుండడంతో ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. డబ్బు, నగలే కాదు ఇంట్లోని మేకలు, గొర్రెలు, బర్రెలు ఇలా పశుసంపద కూడా బెట్టింగ్‌లో పెట్టేస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఇక ఈ బెట్టింగ్ దందా కూడా మామూలుగా సాగడం లేదండోయ్. సాధారణంగా బెట్టింగ్‌లో పందెం కాసే వాళ్లకు పందెంలో గెలిస్తే రెండింతలు మొత్తాన్ని అందజేస్తామనే ఆఫర్ ఉంటుంది. కానీ ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో బెట్టింగ్ మొత్తం కూడా భారీగా పెరిగిపోయింది. పందెం గెలిచిన వాళ్లకు ఏకంగా మూడింతలు మొత్తాన్ని అందజేస్తామంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్ ఇస్తున్నారంటే బెట్టింగ్ దందా ఎంత జోరుగా సాగుతోందో అర్ధమవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫలానా పార్టీ ఎన్ని జిల్లా, తాలూకా పంచాయితీ స్థానాలను గెలుచుకుంటుందనే అంశంపై బెట్టింగ్‌లు కాసే వాళ్లు కొందరైతే, తమ తమ గ్రామాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారు? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారు? అనే అంశంపై బెట్టింగ్‌లు కాసే వాళ్లు మరికొందరు. ఏది ఏమైనా ఈ బెట్టింగ్‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో, అసలు జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ స్థానాలతో సత్తా చాటుతారో తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. -
వ్యవస్థీకృతంగా బెట్టింగ్ దందా
గుట్టురట్టు చేసిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు నానాటికీ తెలివి మీరుతున్నారు. మూస ధోరణి నుంచి హైటెక్ పంథాలోకి మారిన వైనం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన ఎం.సంతోష్ మరో అడుగు ముందుకు వేశాడు. బెట్టింగ్స్ కోసం ఓ బ్రాంచ్ ‘ఆఫీస్’ సైతం ఓపెన్ చేశాడు. వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి కథనం ప్రకారం... కాచిగూడకు చెందిన వ్యాపారి సంతోష్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బెట్టింగ్ దందా ప్రారంభించాడు. తమ ప్రాంతానికే చెందిన వినోద్, శ్యామ్‌సుందర్ కసత్లతో కలిసి ఇసామియాబజార్‌లో డెన్ ఏర్పాటు చేసుకుని పరిచయస్థులైన పంటర్లు (పందాలు కాసే వ్యక్తులు) నుంచి ఫోన్లపై బెట్టింగ్స్ స్వీకరిస్తున్నాడు. సుల్తాన్‌బజార్ ప్రాంతంలోనూ మరో ‘బ్రాంచ్ ఆఫీస్’ ఓపె న్ చేసిన ఇతగాడు దాని నిర్వహణ బాధ్యతల్ని నాంపల్లికి చెందిన ప్రైవే ట్ ఉద్యోగి అరుణ్ శర్మకు అప్పగించాడు. ఆశిష్ అగర్వాల్, రాజు లు రెండు ప్రాంతాల్లోని బెట్టింగ్ నిర్వాహకులకు సహకరిస్తున్నారు. వీరికి సంతోష్ నెలకు రూ.ఆరు వేల నుంచి రూ.8 వేల జీతం ఇస్తున్నాడు. బెట్టింగ్ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్డేట్స్ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన అగర్వాల్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.3 వేలు చొప్పున చెల్లిస్తున్నాడు. సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ నేపథ్యంలో సంతోష్ తన ‘రెండు కార్యాలయాల్లోనూ’ జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, ఎ.రవికుమార్, ఎస్.శేఖర్‌రెడ్డి తమ బృందాలతో శనివారం రెండుచోట్లా దాడులు చేశారు. సంతోష్‌తో పాటు వినోద్, శ్యామ్, అరుణ్, ఆశిష్‌లను అరెస్టు చేసి టీవీ, సెల్టాప్ బాక్స్, సెల్ఫోన్లతో పాటు రూ.1.25 లక్షల నగదు, బెట్టింగ్ చీటీలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు లు కేసును స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగించారు. -
రూ.100 కోట్ల కోఢీ!
కోడిపందేల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున పందేలు నిర్వహించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని పలుప్రాంతాలలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కోడిపందేలతోపాటు యాథావిధిగా గుండాట, పేకాట, కోత ఆటలను కూడా నిర్వహించేందుకు పందెగాళ్లు సిద్ధమవుతున్నారు. మొత్తంగా పందేలలో రూ.100కోట్లు చేతులు మారనున్నాయని అంటున్నారు. - పాలకొల్లు టౌన్ సిద్ధమవుతున్న బరులు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా ఐ.భీమవరం, వెంప, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పూలపల్లి, కలగంపూడి, కొప్పాక ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తారు. ఇక్కడేగాకుండా అనేక చిన్న గ్రామాల్లో సైతం పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. బరుల్లో కోడి పుంజు సామర్థ్యాన్ని బట్టి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఒక పందెం జరుగుతుంది. వీటితోపాటు పందేలు చూడడడానికి వెళ్లేవారు ఒక్కొక్క పందెంపై రూ.పది లక్షల వరకు పై పందేలు వేస్తుంటారు. కోడిపందేలపై ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు పండగ మూడురోజులు ప్రత్యేక ఏర్పా ట్లు చేసుకుని ఈ ప్రాంతాలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కోడిపందేల ముసుగులో నిర్వహించే గుండాట, కోత ఆటల్లో సామాన్య, మధ్యతరగతిప్రజలు పెద్ద ఎత్తున పందాలు కాస్తుంటారు. వీళ్లలో నష్టపోయేవారు అధికంగా ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాలోని కోడిపందేల బరులకు హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, బెంగళూరు, తమిళనాడు నుంచి అనేకమంది ప్రముఖులు వస్తుంటారు. ఇప్పటికే పండగ మూడురోజులు బస చేయడానికి పందేలు జరిగే ప్రాంతాల్లోని లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా పందేలకు కోళ్లను సిద్ధం చేసేవారు జిల్లాలో సుమారు 40 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. వీరు ప్రధానంగా ఢీకొట్టే నెమలి, డేగ, పచ్చకాకి, పింగళి, రసింగ్, కేతువ వంటి పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోడిపుంజు సామర్థ్యాన్ని బట్టి పందెంగాళ్లు వారి నుంచి కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన కోడిపందేల బరుల్లో దింపుతారు. కుక్కుటశాస్త్రం ప్రకారం కొనుగోళ్లు పందేల నిర్వాహకులు చాలామంది కుక్కుటశాస్త్రాన్ని అనుసరిస్తారని చెబుతున్నారు. పందెం జరిగే రోజు తిధిని బట్టి ఏ కోడిపుంజు గెలుస్తుందో అంచనా కట్టి రూ.లక్ష ల్లో కొనుగోలు చేసి మరీ పం దేలు కాస్తారని చెబుతున్నారు. జిల్లాలో కోడిపందేల నిర్వాహకులు రూ.లక్షలు ఖర్చుచేసి భారీ టెంట్లు, బరులు ఏర్పాటు చేస్తారు. సంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి కోడిపందేలు జరగాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు ఎంత అడ్డుకోవాలని చూసినా జిల్లాలో అన్నిప్రాంతాల్లో సంక్రాంతి 3 రోజులు కోడిపందేలు జరిగి తీరతాయని నిర్వాహకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆస్తుల తనఖాకూ సిద్ధం కోడిపందేల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్తులను వడ్డీ వ్యాపారులకు తనఖా పెడుతుంటారు. గత ఏడాది యలమంచిలి మండలంలో ఒక వ్యక్తి రూ.లక్షల్లో పందేలు కాసి చివరకు చేతులు కాల్చుకుని తనకున్న ఎకరం పొలాన్ని అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించాడు. డెల్టాప్రాంతంలో కోడిపందేల రాయుళ్ల ఆస్తులు తనఖాలు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. భీమవరం కేంద్రంగా ఈ దందా నడుస్తోందనేది బహిరంగ రహస్యం. కాగా, కోడి పందేల ముసుగులో దొంగనోట్ల చలామణీ కూడా విచ్చలవిడిగా సాగుతుంది.