ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి, అప్పులిచ్చే యాప్‌ల ద్వారా రూ.15 లక్షలు తీసుకున్న ఓ యువకుడు.. వాటిని తీర్చే దారిలేక మంచిర్యాలలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ విద్యార్థి బెట్టింగుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సహ విద్యార్థికి చెందిన రూ.30 వేలు దొంగిలించాడు. విషయం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది.
సాక్షి, హైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు.. అదీ లక్షల్లో అప్పులేంటని సందేహమా? హైదరాబాద్ పరిసరాల్లో బీటెక్, ఇతర ఉన్నత కోర్సులు అభ్యసించే విద్యార్థులతో పాటు యువకులకు ఈ తరహా అప్పులుండటం చాలా ‘కామన్’. ఎం దుకంటే వీరికి అప్పులిచ్చేందుకు పలు యాప్స్ స్మార్ట్‌ఫోన్లో సిద్ధంగా ఉన్నాయి. ఇవి రూ.500 మొదలు దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులి స్తున్నాయి. దీంతో విద్యార్థులు, యువత ఇష్టానుసారం పలు ప్రీపెయిడ్ గేమ్స్, ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడుతూ.. వేలు, లక్షల్లో పందేలు కాస్తున్నారు. తీరా తిరిగి చెల్లించాల్సిన సమయానికి ఒత్తిడికి గురవుతున్నా రు. తొలుత చేబదులంటూ చిన్నగా అ ప్పులు అలవాటు చేస్తున్న యాప్స్ ఆ మొత్తాలు పెద్దవయ్యాక వేధింపులకు ది గుతున్నాయి. ఈ ఊబి నుంచి బయటపడేందుకు కొందరు దొంగతనాలు చేస్తున్నారు. ఇంకొందరు స్మార్ట్‌ఫో న్లు, ల్యాప్‌టాప్, ఇతర బంగారు ఆభరణాలు అమ్మేస్తూ, వాటిని పోగొట్టుకున్నట్టు ఇంట్లో చెబుతున్నారు.
యాప్‌లు అప్పులిచ్చేదిలా..
స్మార్ట్‌ఫోన్లో విద్యార్థులకు చిన్న చిన్న మొత్తాల నుంచి భారీగా రుణాలిచ్చేందుకు పలు రకాల యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే స్టూడెంట్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్‌నంబర్, ఈ–మెయిల్, ఫేస్‌బుక్ ఖాతాల వివరాలు నమోదు చేయాలి. సాధారణ యువకులైతే ఆధార్, బ్యాంకు స్టేట్‌మెంట్లను ఇవ్వాలి. వాటిని ధ్రువీకరించుకున్న ఆయా యాప్స్.. రూ.500 నుంచి అప్పులివ్వడం ప్రారంభిస్తాయి.
అలా మంచి స్కోరు మెయింటైన్ చేస్తే.. 3 నెలల తరువాత రూ.10వేల నుంచి 20 వేల వరకు ఇస్తాయి. అందుకోసం ప్రతీ రూ.1,000 మీద రూ.10 నుంచి రూ.15 వరకు వడ్డీ వసూలు చేస్తాయి. తీరా అదే విద్యార్థి రూ.లక్షల్లో అప్పుచేస్తే.. వెంట నే యాప్స్ నిర్వాహకులు రంగంలోకి దిగుతారు. తొలుత ఫోన్లుచేసి చెల్లించాలని కోరతారు. ఆపై మీ పిల్లాడు అప్పులకు వాయిదాలు చెల్లించడం లేదంటూ కాలేజీకి, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తూ అతనిపై మానసికంగా, సామాజికంగా ఒత్తిడి తెస్తారు. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురవుతు న్న పిల్లలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
అప్పు తీర్చేందుకు ఇంకో అప్పు
ఆయా యాప్స్ నుంచి అప్పులు తీసుకుంటున్న విద్యార్థులు, యువత సంఖ్య ప్రస్తుత లాక్‌డౌన్ కాలంలో పెరిగిపోతోంది. యాప్‌ల అప్పులు తీర్చేందుకు మరోచోట కొత్త అప్పులు చేస్తున్నా రు. ఇదే అదనుగా పలువురు వడ్డీ వ్యాపారులు వీరికి అధిక వడ్డీకి అప్పులిస్తున్నారు. తీర్చకపోతే ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్, మెడలోని బంగారు గొలుసులు, ల్యాప్‌టాప్‌లను లాక్కుంటున్నారు. ఇ లాంటి వ్యవహారాలు పెద్దగా వెలుగులోకి రావట్లే దు. రూ.లక్షల్లో అప్పులు చేసిన విద్యార్థులు వా టిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment