సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరుసగా ఆరేళ్లపాటు విద్యుత్ వినియోగం పెరగ్గా, 2020–21లో స్వల్పంగా తగ్గింది. 2014–15లో 39,519 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్ వినియోగం, క్రమంగా పెరుగుతూ 2019–20 నాటికి 58,515 ఎంయూలకు చేరింది. 2020–21లో 57,006 ఎంయూలకు పడిపోయింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ విధించడంతో పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు మూతపడటమే ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment