online games
-
ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’
భారతీయ ఈస్పోర్ట్స్ రంగంలో ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి క్రాఫ్టన్(Krafton) ఇండియా ఈస్పోర్ట్స్(Esports) ‘రైజింగ్ స్టార్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఈస్పోర్ట్స్ అథ్లెట్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, వారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించనున్నారు. గేమింగ్ నైపుణ్యాలను పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవనశైలి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి పరిశ్రమకు చెందిన కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు అందిస్తారు. వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఈస్పోర్ట్స్ లో దీర్ఘకాలిక విజయాల కోసం బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: గగనతలంలోకి 16.13 కోట్ల మందిరైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి ప్లాట్ఫామ్ల్లో కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేదా సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)కు సంబంధించిన కంటెంట్‌ను క్రమం తప్పకుండా తయారు చేస్తుండాలి. అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు ఉండాలి. -
‘హాని’లైన్ గేమ్స్!
సాక్షి, వరంగల్: ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను అగమాగం చేస్తున్నాయి. కరోనా అనంతరం చాలామంది యువత చేతిలో సెల్ఫోన్లు ఉండడం వల్ల కూడా.. తమకు తెలియకుండానే ఆన్లైన్లో పరిచయమయ్యే ఈ గేమ్‌లకు అలవాటు పడుతున్నారు. తొలుత తక్కువ డబ్బులు చెల్లించి ఆడే ఈ ఆట ద్వారా వందల్లో లాభాలు ఇచ్చి అలవాటయ్యేలా చేసి.. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అప్పులు చేసి.. కుటుంబసభ్యులకు తెలిస్తే పరువు పోతుందోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. 20 రోజుల వ్యవధిలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ యాప్‌లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్ ఆన్లైన్ గేమ్‌తో పాటు.. వివిధ బెట్టింగ్ యాప్‌లలో రూ.ఏడు లక్షల వరకు డబ్బులు పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పు ఇచి్చన స్నేహితులు అడగడంతో తీవ్ర మనోవేదనకు గురై గత నెల 29న హైదరాబాద్‌లోని ఘట్ కేసర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన మరిపట్ల అనుక్ ఆన్లైన్లో పబ్జీలాంటి గేమ్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆన్లైన్ గేమ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో అతడికి దఫాలుగా రూ.ఐదు లక్షలు పంపాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఈ నెల 15న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలతో చాలా మంది యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ కుమారుల కదలికలపై నిఘా వేయడం కనిపిస్తోంది. మృతుల్లో యువతతోపాటు గృహిణులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు గుర్తించాలిడ్రగ్స్, ఆల్కహాల్ లాగే.. ఆన్లైన్ గేమ్, బెట్టింగ్‌లకు యువత త్వరగా అలవాటుపడుతోంది. డబ్బులు ఒకసారి రాకపోయినా.. మరోసారి వస్తాయనుకుంటున్నారు. అది సరికాదని చెప్పినా వినరు. అచేతన స్థితికి వెళ్లిపోయి కొందరు చనిపోతున్నారు. ఇంకొందరు నేరాల బాట పడుతున్నారు. దీన్నే బిహేవియరల్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు ముందే గుర్తించాలి. సైకాలజిస్టుతో థెరపీ, మెడిటేషన్ ఇప్పించాలి. గేమ్‌కు బానిసైన వ్యక్తి అందులోనుంచి బయటకు రావాలని అనుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. – అనూష వినేయత, సైకియాట్రిస్ట్ ముందు సరదాగా.. తర్వాత అలవాటై..సులభ సంపాదన కోసం స్మార్ట్ ఫోన్లో వెతికేవారికి ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్, సైట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఆన్లైన్ గేమ్స్‌ను సరదాగా మొదలెట్టి, ఆ తర్వాత అలవాటు పడి బయటపడలేక జీవితం అగమాగం చేసుకుంటున్నారు. కొందరు అవి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ అని తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్లోనే అప్పులు దొరుకుతుండడం ఈ సమస్యను మరింత పెంచుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. -
ఆశ చూపి బానిసను చేసి..
ధర్మవరం: ఆన్లైన్ మట్కా యాప్‌లతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూ.100 ఖర్చు పెడితే రూ.9వేలు డబ్బు వస్తుందని ఆశకు పోయి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక రుణదాతల ఒత్తిళ్లతో ఊర్లు వదిలి వెళ్లిపోయిన వారు కొందరైతే... అవమాన భారం భరించలేక జీవితం మీద విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పడిన వారి ఉదంతాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, రాప్తాడు నియోజకవర్గాలలో ఆన్లైన్ మట్కా యాప్‌ల ద్వారా జూదం జోరుగా సాగుతోంది. జడలు విప్పుతున్న ఆన్లైన్ మట్కా భూతం ఇటీవల సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, నిరక్షరాస్యుల నుంచి విద్యా వంతుల దాకా ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు 4జీ, 5జీ నెట్‌వర్క్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ మట్కా యాప్‌ల ద్వారా జూదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అత్యాశకుపోయి ప్రజలు ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. అనధికార మట్కా యాప్‌లు అనధికారికంగా రా్రïÙ్టయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా ఆన్లైన్ మట్కా యాప్‌లు నిర్వహిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు సైతం ఇలానే యాప్‌లను నిర్వహిస్తూ మోసం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో మట్కా కింగ్, సత్తా కింగ్ ఏపీ, ఏపీ మట్కా, తిరుమల మట్కా, విజయవాడ మట్కా తదితర యాప్‌లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. వీటి ద్వారా జిల్లాలో రోజూ లక్షలాది రూపాయల టర్నోవర్ జరుగుతున్నట్లుగా సమాచారం. వీటిలో ఏ ఒక్కటికి కూడా అనుమతి లేదు. ఊర్లు వదులుతున్న బాధితులు ఆన్లైన్ మట్కా యాప్‌ల కారణంగా అప్పులు చేసి.. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక జిల్లా వ్యాప్తంగా పలు కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్తున్నాయి. మరికొంత మంది బాహ్య ప్రపంచానికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరెన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కట్టడి కష్టతరం మట్కా జూదం మొత్తం ఆన్లైన్లో జరుగుతుండటంతో పోలీసులు కట్టడి చేయడం కష్టతరమౌతోంది. ఎందుకంటే జూదం ఆడేవారిని గానీ, ఆడించే వారిని గానీ కనుగొనడం సాధ్యం కాదు. అయితే సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్యాప్లు ఇన్స్టాల్ కాకుండా వెబ్సైట్లను బ్యాన్ చేయడం ద్వారా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే ఎంతో మంది పేద, మధ్యతరగతి, యువత జీవితాలను కాపాడిన వారవుతారు.ఉక్కుపాదం మోపుతాంఆన్లైన్ మట్కా జూదం ఆడేవారిని, ఆడించే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ఈ దిశగా ఇప్పటికే ప్రజలకు అవగాహన పెంపొందిస్తున్నాం. సైబర్‌క్రైం సహకారంతో ఆన్లైన్ మట్కా యాప్‌లు, వెబ్సైట్లు నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాం. పేద, మధ్య తరగతి ప్రజలు జూదం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని వ్యసనాలకు దూరంగా ఉండాలి. – వి.రత్న, ఎస్పీ, శ్రీ సత్యసాయి జిల్లాబానిసగా మారుస్తారు ఇలా.. ఆన్లైన్ యాప్‌ల ద్వారా మట్కా నిర్వహిస్తున్న పలు అనధికారిక కంపెనీలు, సైబర్ నేరగాళ్లు పేద, మధ్యతరగతి ప్రజలు, యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ గంట గంటకూ ఫలితాలు వెల్లడిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మట్కా యాప్‌లలో తొలుత లాగిన్ అయిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బు స్వీకరిస్తారు. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, త్రీస్టార్ వంటి పేర్లతో జూదం ఆడిస్తారు.ప్రజలు తాము చెప్పిన నంబర్ తగిలితేనే వారికి యాప్‌ల ద్వారా డబ్బు చెల్లిస్తారు. లక్షలో పది మంది కూడా ఈ యాప్‌ల ద్వారా లబ్ధి పొందరు. అయితే తొలుత చిన్న చిన్న మొత్తాలు వేసిన వారి వివరాలు సేకరించి యాప్‌ల నిర్వాహకులు వారు చెప్పిన నంబర్లే తగిలే విధంగా చేస్తారు. నెమ్మదిగా వారు అలవాటు పడగానే జూదానికి బానిసయ్యే విధంగా మార్చేస్తారు.⇒ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన పట్టుచీరల వ్యాపారి రాము (పేరు మార్చాం) ఆన్లైన్ మట్కా యాప్‌కు బానిసయ్యాడు. రూ.10 వడ్డీకి అప్పు తెచ్చి మరీ మట్కాలో పెట్టాడు. వడ్డీలు కట్టేందుకు రెట్టింపు అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక ఉన్న ఇల్లు, పొలం అమ్మి అప్పులు చెల్లించి బెంగళూరుకు చేరుకుని కూలి పనులు చేసుకుంటున్నాడు. ⇒ జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఆన్లైన్ మట్కా యాప్‌కు అలవాటు పడి బీటెక్ విద్యార్థి శివ తోటి స్నేహితులు, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఎటో వెళ్లిపోయాడు. చివరకు బంధువుల వద్ద ఉన్నాడని తెలుసుకుని తల్లిదండ్రులు రూ.2 లక్షల అప్పులు చెల్లించి తిరిగి తీసుకువచ్చారు. చదువులో ఇంటెలిజెంట్ అయిన శివ ఆన్లైన్ జూదం కారణంగా బాగా వెనుకబడ్డాడు.⇒ బత్తలపల్లి మండలానికి చెందిన వెంకటప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆన్లైన్ మాట్కా యాప్ ద్వారా జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుంటున్నాడు. దీంతో ఆ కుటుంబం దుర్భర పరిస్థితి అనుభవిస్తోంది. పైన చెప్పినవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. -
ఆన్లైన్ గేమింగ్‌కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్‌కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే!
కరీంనగర్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటే.. మరికొందరు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడుతూ అదఃపాతాళానికి పోతున్నారు. క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడిన యువత ఎవరిమాట వినకుండా తయారవుతున్నారు. లక్షల రూపాయలు నష్టపోయి పెద్దలకు చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి దొంగతనాన తీసుకొని అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల పెరిగిపోయాయి.నిత్యం ఆన్లైన్లో..ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్లిమిటెడ్ డాటా ఉండడంతో ఎవరిని చూసిన నిత్యం ఆన్లైన్లోనే ఉంటున్నారు. రమ్మి, క్యాసినో.. తదితర కొత్తకొత్త పేర్లతో అట్రాక్ట్ చేస్తున్న ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చేతిలో ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలా అలవాటుపడ్డ వాళ్లలో కొందరి మానసిక స్థితి సరిగ్గా లేకుండా పోయింది. మరికొందరైతే పెద్దల మాటలకు ఎదురుచెప్పడం, కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటి స్థితికి చేరుకుంటున్నారు.లాభాలు వస్తున్నాయనే ఆశతో..అప్పుడప్పుడే ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టిన వారికి మొదటల్లో చిన్నపాటి లాభాలు ఆశచూపుతారు. ఇలా ఆ గేమ్స్‌కు ఆకర్షితులను చేసి క్రమంగా డబ్బులు గుంజుతుంటారు. జిల్లాలో ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అయితే ఇలా నష్టపోయిన కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నాయి. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడం లేదు.ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయిన వారు ఇలా..వేములవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రైల్వేశాఖలో విధులు నిర్వర్తించేవాడు. సహచరులతో ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. అప్పుల పాలు కావడంతో మానసికంగా కుంగిపోయి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు.ఇటీవల వేములవాడలో రూ.2కోట్లతో ఉడాయించిన పూజారి మహేశ్ కూడా ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడని స్నేహితులు తెలిపారు.వేములవాడకు చెందిన యువకులు రాజు, వెంకటేశ్, రమణ, శ్రీనివాస్.. ఆన్లైన్ గేమ్ పేరుతో క్యాసినో తదితర ఆటలవైపు మొగ్గుచూపారు. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోయారు.అవగాహన కల్పిస్తున్నాం..ఆన్లైన్ గేమ్స్, సైబర్‌క్రైమ్‌లపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ద్వారా గ్రామీణులను చైతన్యం చేస్తున్నాం యువత ఆన్లైన్ గేమ్‌లకు బానిస కావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడాలి. అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్ కూడా వాడొద్దు. అలాంటి గేమ్స్ వాడితే ఆర్థికంగా నష్టపోతారు. ఇలా ంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. – నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీఇవి చదవండి: -
‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.జీఎస్టీ కౌన్సిల్ గతేడాది ఆన్లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్‌లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది. అయితే దీనిపై గేమింగ్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఆన్లైన్ గేమ్‌లు వద్దన్నా.. వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి
కొత్తపల్లి(కరీంనగర్): ఆన్లైన్ గేమ్‌లు వద్దన్నా విననందుకు.. కన్న కొడుకునే తండ్రి కడతేర్చిన దారుణ ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. చేతికొచి్చన ఒక్కగానొక్క కొడుకును తండ్రే పొట్టన పెట్టుకోవడంపై గ్రామస్తులు విస్మయానికి లోనయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన పెరుమాండ్ల జ్యోతి–శ్రీనివాస్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా, కొడుకు పెరుమాండ్ల శివసాయి(21) హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో శుభకార్యం కోసం బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. కాగా, హైదరాబాద్ వెళ్లి ఆన్లైన్ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టొద్దని, ఇక్కడే ఉండాలంటూ తరచూ తండ్రీకొడుకుల మధ్య వాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో భూమి అమ్మాలని శివసాయి ఒత్తిడి తెస్తుండటంతో ఆగ్రహానికి గురైన తండ్రి శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోది కారం చల్లాడు. తీవ్రగాయాలతో శివసాయి మంచంపైనే మృతిచెందగా తండ్రి కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఉపాధి పనులకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్
పరకాల: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చి ంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చి ంది. బాధితుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌస్‌పాషా గుడెప్పాడ్‌లోని జీకే పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గౌస్‌పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేమ్‌కు అలవాటు పడి బంక్‌కు సంబంధించిన రూ.6లక్షలు పొగొట్టాడు. దీంతో బంక్ యజమానులు ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్‌పాషా ఇంటిని రూ.100 స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు. అదే రోజు ఇంటికి చేరుకున్న గౌస్‌పాషా ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకోలేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో క్రిమిసంహారక మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధితుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పరకాల సీఐ రవిరాజుకు ఫోన్‌చేయగా స్పందించలేదు. -
ఆన్లైన్ గేమ్‌ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. కష్టపడకుండా ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు..గెలిస్తే డబ్బు లు మీసొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరైతే .. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారు ఎందరో.. అటువంటి ఈ ఆన్ లైన్ గేమ్‌లపై అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కూడా నిబంధనలు ప్రకటించింది. అయితే తాజాగా గేమింగ్ ఇండస్ట్రీ బాడీ ‘ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్)’ బాధ్యతాయుతమైన గేమింగ్‌ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటగాళ్ల రక్షణకు కట్టుబడి బాధ్యతయుతమైన గేమింగ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు మంచి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా యువతకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా? భారత దేశంలోని మొదటి మూడు ఆన్లైన్ గేమింగ్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ముంబైలో రెండు ఆన్లైన్ గేమింగ్ యునికార్న్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ గేమింగ్‌లపై డాక్టర్లు స్పందిస్తూ బాధ్యతారహితమైన గేమింగ్ వల్ల ఏకాగ్రత తగ్గుతుందని, సులువుగా కోపం, చిరాకు పడడం, దీర్ఘకాలిక ఆందోళన , డిప్రెషన్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. -
చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్లైన్ గేమ్ ఆడి..
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్‌పూర్‌లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్‌కుమార్ యాదవ్ కుమారుడు అంకిత్ యాదవ్‌ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్‌పూర్‌కు చేరుకున్నారు. ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్‌ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్‌ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!?
మహబూబాబాద్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఫోన్ల కారణంగా పిల్లలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే.. యువకులు, ఆపై పడిన వారు పెడదారి పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్లో అనేక క్రీడలకు సంబంధించి బెట్టింగ్‌లకు పాల్ప డడం, రుణాలు తీసుకోవడం, ఆఫర్ల పేరుతో మోసపోతూ దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ, లూడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో పాటు అనేక రకాల ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. కొంత మంది తేరుకొని వీటికి దూరమవుతుంటే చాలా మంది తమ ఆస్తులను విక్రయించుకునే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు, ఆభరణాలు కూడా తనఖాలు పెట్టి జూదం ఆడుతున్నారు. నర్సంపేట పట్టణంలోని ఓ బ్యాంకు అధికారి కొద్ది రోజుల క్రితం బ్యాంకుకు సంబంధించిన డబ్బులతో ఆన్లైన్ గేమ్స్ ఆడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో చివరకు జైలు పాలయ్యాడు. ఇలా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎంతో మంది యువకులు మోసపోతున్నారు. అవగాహన లేక అవస్థలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత నిత్యం స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, యువతకు అవగాహన లేకపోవడంతోనే ఆన్లైన్ గేమ్స్ ఆడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ గేమ్స్‌పై యువతకు అవగాహన కల్పించి ఆయా కుటుంబాలను శోకసంద్రం నుంచి రక్షించాలని పలువురు పేర్కొంటున్నారు. ఆన్లైన్ గేమ్స్‌తో ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి, ధనిక వర్గాలకు చెందిన యువతతో పాటు మధ్య వయసు కలిగిన వారు కూడా ఆన్లైన్ ఉచ్చులో పడుతున్నారు. కష్ట పడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆన్లైన్ క్రీడల్లో పాల్గొంటున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పొందాలనే ఆశతో ఆన్లైన్ జూదం వైపు మరలుతూ చివరకు అప్పులపాలై క్షణికావేశంలో బలవన్మరణలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీటిసంద్రంలో మునుగుతున్నాయి. ఘటనలు..! నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటకు చెందిన బాషబోయిన ఉదయ్(20) ఈ ఏడాది జూన్ 24న అర్ధరాత్రి ఆన్లైన్ గేమ్ ఆడాడు. కాగా, ఉదయ్ మొబైల్ ఫోన్‌కు తల్లి స్వప్న పేరిట బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంది. ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో అదే రోజు ఉదయం జమ అయ్యాయి. రాత్రి ఒంటరిగా ఉన్న ఉదయ్(రమ్మీ) ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా రూ.46 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడిన ఉదయ్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో ఉంటున్న మిట్టపల్లి సాయిబాబా, మమత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు ప్రశాంత్ నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సుజాత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందింది. సాయిబాబా దర్జీ(టైలర్) పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ గేమ్‌తో మోసపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ నవంబర్ 22న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కూడా చదవండి: మృతదేహాల కలకలం! అసలేం జరుగుతుంది? -
డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..
అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్ వ్యసనంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొన్ని సర్వేల ప్రకారం.. 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారు. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నాయట. 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది. ఇదీ చదవండి: ‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదన లేదు’ -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్‌ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్‌లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్‌ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్‌లో మొత్తం డిజిటల్ గేమ్‌లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్‌లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్‌లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
ఆ కంపెనీలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు!
పన్ను ఎగవేతలకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వం సవరించిన జీఎస్టీ చట్టం ప్రకారం..అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే, అప్పటినుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్ అవ్వలేదని సమాచారం. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటివరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపింది. ఆన్లైన్ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేందుకు డిపాజిట్ చేసిన మొత్తం నిధులపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను సైతం వదులుకోవడానికి దారితీసింది. జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించాలని, ఇది విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోతుందని గేమింగ్ సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయినప్పటికీ, రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం అధిక పన్నులతో ముందుకుసాగుతుంది. -
‘నెట్’లో చిక్కుకున్న చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: వానల్లు కురవాలి వానదేవుడా/ వరిచేలు పండాలి వానదేవుడా/..వానా వానా వల్లప్ప...వాకిట తిరుగు చెల్లప్ప/ చెట్టుమీద దెయ్యం/ నాకేం భయ్యం / వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమీ...ఇవన్నీ పల్లెటూళ్లలో చిన్నారులు ఆరుబయట ఆటలు ఆడుకుంటూ పాడుకునే పాటలు. బడి నుంచి ఇంటికొచ్చేసి వీధి కూడలిలోనో, ఇంటిముందో పిల్లలు చేరుకుని ఇలా కబడ్డీ, పైలా పచ్చీస్, ఖోఖో, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకుంటుంటే పెద్దవాళ్లు కూడా ఆ చిన్నారుల్ని చూసి ఆనందపడిపోయేవారు. అదంతా గతం..ఇప్పుడా ఆటల్లేవు పాటల్లేవు...ఆ ఆనందమూ లేదు. ఎందుకంటారా? ఇదిగో ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన అంతర్జాలం(ఇంటర్నెట్)...ఈ మాయ లో పడి నేటితరం పిల్లలు ఆటపాటలూ..ఆనందమూ అందులోనే వెతుక్కుంటున్నారు. నాటితరం ఆటలు శారీరక వ్యాయామానికి, మానసిక వికాసానికి దోహదపడితే నేటితరం ఆన్లైన్ ఆటలు పిల్లల్లో తీవ్ర ఒత్తిడిని, అసహనాన్ని పెంచుతున్నాయి. సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఎంతమంది పిల్లలు ఆన్లైన్లో ఎంత సమయం గడుపుతున్నారు? ఎటువంటివి ఎక్కువగా చూస్తున్నారు? వంటి అంశాలపై ‘లోకల్ సర్కిల్స్’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోభాగంగా దేశవ్యాప్తంగా 46 వేలమంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. తొమ్మిది నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారు ఆన్లైన్లో ఆటలు ఆడటం, టీవీ వీక్షణం, ఓటీటీలు చూడటం వంటి పనుల్లో రోజుకు మూడు గంటలకు పైగానే గడుపుతున్నారని 61% మంది పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా వెల్లడయ్యాయి. (కొందరు తల్లిదండ్రులు ఒకటి కంటే ఎక్కువ అంశాలు గమనించినట్లు చెప్పారు) డిజిటల్ ఎడిక్షన్ కాకుండా చూడాలి ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ల అలవాటు తప్పనిసరైంది. అయితే అది డిజిటల్ ఎడిక్షన్ కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సైబర్ సెక్యూరిటీ అంశాలను వారికి తెలియజెప్పాలి. అవసరం మేరకు చైల్డ్ రిస్ట్రిక్షన్ ఆప్షన్లు ఎనేబుల్ చేసుకోవాలి – డాక్టర్ ప్రజ్ఞా రష్మీ, మానసిక వైద్యురాలు తల్లిదండ్రులు ఓ కన్నేయాలి స్మార్ట్ ఫోన్లలో పిల్లలు ఏ వీడియోలు చూస్తున్నారు? ఎలాంటి గే మ్లు ఆడుతున్నారు ? వంటి విషయాలపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. అవసరం మేరకు మాత్రమే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం ఉత్తమం. – భాను పద్మజ, రిటైర్డ్ టీచర్ -
ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. చివరకు ఇలా..!
రంగారెడ్డి: ఆన్లైన్ గేమ్‌లు, దురలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా, నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు వలస వచ్చి చిరుధాన్యాల వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36) స్థానికంగా బఠాణీలు, మరమరాలు వంటివి విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు. ► రామకృష్ణన్ తరుచూ గోవింద్ షాపు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆన్లైన్ గేమ్‌లు ఆడేవారు. ఇద్దరూ పలు దురలవాట్లకు బానిసయ్యారు. అవసరమైన డబ్బులను సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ► రామకృష్ణన్ తాను చోరీలు చేస్తానని, చోరీ సొత్తును ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని గోవింద్‌కు పురమాయించాడు. రామకృష్ణకు కీసర, కుషాయిగూడ, జవహర్‌నగర్ పరిధిలోని ప్రాంతాలపై అవగాహన ఉండటంతో అక్కడ చోరీలు మొదలెట్టాడు. ► వీరికి అదే ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మహేందర్ పవార్(36), బాలాజీనగర్‌లో జ్యువెలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్న బచ్చు సంతోష్(40) జత కలిశారు. రామకృష్ణన్ చోరీ చేసిన బంగారాన్ని గోవింద్‌కు ఇస్తే.. దానిని అతను మహేందర్ పవార్, సంతోష్‌లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. వచ్చిన డబ్బును నలుగురూ పంచుకొనేవారు. ► రామకృష్ణన్ మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో బైక్‌పై కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి దొంగతనం చేసేవాడు. బంధువుల ఇంట్లోనే దొంగతనం.. మహేందర్ పవార్ తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. ఈ విషయంపై రామకృష్ణన్‌కు సమాచారం ఇచ్చిన అతను బంధువుల ఇంట్లో ఎవ్వరూ లేరని, తాళం వేసి ఉందని చోరీ చేయమని చెప్పాడు. దీంతో రామకృష్ణన్ ఆ ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న బంగారం, వెండి అభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణన్‌పై 22 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీడీసీపీ వెంకట్‌రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
TS Crime News: ఆన్లైన్ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!
కుమరం భీం: నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్ ఆదివాసీ జిల్లా కుమురంభీంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. కఠిన చట్టాలు, పోలీసుల నిఘా ఉన్నా బెట్టింగ్ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చివరికి అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, వాంకిడి వంటి ప్రాంతాల్లోని యువత తరచూ నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌లోని ఓ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ బాయ్‌గా విధులు నిర్వర్తించే ప్రమోద్‌సింగ్ అనే యువకుడు మూడేళ్లుగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దాదాపుగా రూ.2.60 లక్షల వరకు ఆన్లైన్ గేమ్స్‌లో పోగొట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఈ ఆదివారం రాత్రి ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. కంపెనీ మేనేజర్లను డబ్బు విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ నెల 21న కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం సమీపంలో తనకు తానే మందు బాటిల్స్‌తో తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తనపై ముగ్గురు దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. విచారణలో బెట్టింగ్ విషయం బయట పడింది. కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఏడాది నుంచి ఆన్లైన్లో కాక్‌ఫైట్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. చైన్ సిస్టం లాంటి ఈ గేమ్‌లో ఒకరి నుంచి మరొకరు గేమ్ ఆడటం మొదలెట్టారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన నగదు ఈ గేమ్‌లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు ఏకంగా రూ.1.60 కోటికి పైగానే కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి ఎలా విస్తరిస్తుందో తెలియజేస్తున్నాయి. నిఘా ఉన్నా.. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌తోపాటు మూడు ముక్కలాట పేరుతో ముగ్గులోకి దింపి అందినకాడికి దండుకునే ముఠాలపై గట్టి నిఘా పెడుతున్నారు. వరుస బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినా ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. యువకులు, చిరు వ్యాపారులు సైతం బెట్టింగ్ మోజులో పడి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ దందాలు.. ఇప్పుడు జిల్లాలోని అన్ని పల్లెలకూ పాకడం కలవరపెడుతోంది. నేరుగా పరిచయం లేకుండానే సెల్ఫోన్లోనే బెట్టింగ్ యాప్‌లు ఇన్స్టాల్ చేసుకుని యూపీఐ ఐడీలతో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన యాప్‌లను వీపీఎన్ సాయంతో లొకేషన్ మారుస్తూ వినియోగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. కొంత మంది మైనర్లు వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీ ఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. యువత ఈజీ మనీ కోసం కెరీర్‌ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టి పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే.. జిల్లాలో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ మట్కా ఎక్కువగా సాగుతుంది. ఐపీఎల్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనే రూ.లక్షల్లో చే తులు మారుతుంది. ఈ నెలలో ప్రారంభమ య్యే ఆసియా క్రికెట్ కప్‌తోపాటు అక్టోబర్‌లో స్వదేశంలో మొదలయ్యే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువత ను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిన సమయంలో ఆరా తీయాలి. వారికి కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన కార్యక్రమాలకు పంపించాలి. బెట్టింగ్ నిషేధం.. ఆన్లైన్ బెట్టింగ్ నిషేదం. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ జూదంపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడుతాం. ఈ విషయమై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. – కరుణాకర్, డీఎస్పీ, కాగజ్‌నగర్ తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.. యుక్త వయసు పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఎక్కడికెళ్తున్నారు.. ఎం చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి. బెట్టింగ్‌ల వైపు మరలకుండా ఇతర వ్యాపకాలు ఉండేలా చూడాలి. ఇతరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో వారికి వివరించాలి. – రామకృష్ణ, డీఎంహెచ్‌వో అత్యాశతో నష్టం తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించాలనే అనే దురాశ యువతను పక్కాదారి పట్టిస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కాక్‌ఫైట్, తీన్మార్ పేకాట, ఇతర జూదాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆటల్లో రూ.లక్షలు కోల్పోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు తల్లిదండ్రులకు చెప్పలేక.. అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్నాయి. మరో దారి లేకపోవడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఈ ఆన్లైన్ ఆటలకు బానిసవుతున్న వారిలో 18 నుంచి 28 ఏళ్ల వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. -
ఆన్లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ.. వారికి మాత్రమే వర్తింపు
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫాంలలో ఆడే విదేశీ ప్లేయర్లకు కూడా 28% జీఎస్టీ వర్తించనుంది. గేమింగ్ సంస్థలు ఆయా ప్లేయర్ల నుంచి ఈ మొత్తాన్ని మినహాయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, హార్స్ రేస్ క్లబ్‌లు మొదలైన వాటిల్లో బెట్టింగ్‌లపై 28% (జీఎస్టీ) విధించాలని జీఎస్టీ మండలి నిర్ణయించడం తెలిసిందే. -
ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌ను వేరుగా చూడాలి
న్యూఢిల్లీ: గేమింగ్ పరిశ్రమను 28 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని కొన్ని వర్గాలు విభేధిస్తున్నాయి. ఏ గేమ్ అన్న దానితో సంబంధం లేకుండా గేమింగ్ పరిశ్రమ మొత్తాన్ని గరిష్ట పన్ను పరిధిలోకి తీసుకురావడం తెలిసిందే. దీన్ని సుమా రు 120 ఆన్లైన్ క్యాజువల్ స్కిల్ గేమింగ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పన్ను విషయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ నుంచి తమను (స్కిల్ గేమింగ్/నైపుణ్యాలను పెంచుకునేవి) వేరుగా చూడాలని కోరు తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాయి. అంతర్జాతీయంగా ప్రైజ్ మనీతో కూడిన ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై పన్ను అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. లాటరీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్‌తో పోలిస్తే ఆన్లైన్ స్కిల్ గేమింగ్ వినియో గం భిన్నంగా ఉంటుందని వివరించాయి. అలాగే, వ్యాపార నమూనా, సామాజిక ఔచిత్యం వేర్వేరు అని పేర్కొన్నాయి. రియల్ మనీ గేమింగ్ పరిశ్రమలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేది ప్రత్యేక విభాగమని పరిశోధనా సంస్థలైన కేపీఎంజీ, రెడ్‌సీర్ సైతం వర్గీకరించినట్టు తెలిపాయి. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కనుక పరిశ్రమ మనుగడకు వీలుగా తమపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరాయి. -
మీ ఇంట్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అయితే ఈ హెచ్చరిక మీకోసమే!
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్‌ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది. చదవండి: ఫ్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్రూం డోర్ పగులగొట్టి.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్‌లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్‌లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్‌లో పబ్జీ వంటి గేమ్‌లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్‌తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్‌లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్‌కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు. -
ఆన్లైన్ గేమ్‌లతో ఆనందం ఆవిరి.!
విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్‌లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’. విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్‌లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్‌తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్‌తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది. బెట్టింగ్‌కు బలైపోతున్న యువత గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్‌లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్‌లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు. పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్‌లకు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్‌లతో ప్రమాదం పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్లైన్ గేమ్‌లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్లైన్ గేమ్‌ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్‌బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్‌ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
ప్రేమ అంటూ కంచె దాటింది.. కాపురం పెట్టేలోపే..
ఆమెది పాకిస్తాన్. అతనిది భారత్. అతనితో జీవితం పంచుకోవాలని ఉందంటూ.. దాయాది దేశం నుంచి కంచెదాటి భారత్‌లో అడుగుపెట్టింది. వివాహ బంధంతో ఒక్కటై కాపురం పెట్టేలోపే.. ఇక్కడి అధికారులు పసిగట్టి గట్టి షాకే ఇచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన ఇక్రా జివాని(19).. ఆన్లైన్ లూడో ద్వారా యూపీకి చెందిన ములాయం సింగ్(26)కు దగ్గరైంది. ములాయం బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను భారత్‌కు రావాలని.. ఇక్కడే పెళ్లి చేసుకుని కాపురం పెడదామని ఇక్రాకు సూచించాడు ములాయం. అయితే.. ఆమెకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. ఈలోపు ములాయం.. ఆమెను నేపాల్‌కు రమ్మని చెప్పాడు. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె ఖాట్మాండు త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్న ములాయం.. తొలిసారి ఆమెను ప్రత్యక్షంగా చూసి మురిసిపోయాడు. ఆపై ఇద్దరూ ఖాట్మాండులోనే వివాహం చేసుకుని.. అక్కడే వారంపాటు ఉన్నారు. అటుపై సనోలీ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించించింది ఈ జంట. బెంగళూరుకు చేరుకుని.. ఇక్రా పేరును కాస్త ‘రవ’గా అనే హిందూ పేరుగా మార్చేశాడు ములాయం. ఇక.. కాపురం ప్రారంభమైన కొద్దిరోజులకే ఆమె తీరుపై చుట్టుపక్కల వాళ్లకు అనుమానాలు వచ్చాయి. హిందూ అమ్మాయి.. తరచూ నమాజ్ చేయడం ఏంటని షాక్ తిన్నారు చుట్టుపక్కల వాళ్లు. చివరకు పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు ములాయం ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె పేరిట ఉన్న పాకిస్థానీ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఇక్రాకు అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఆమె నుంచి ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందేమోనని యత్నించారు. చివరకు ఆమె ములాయం కోసమే వచ్చిందని, గూఢాచారి కాదని నిర్ధారించుకున్నారు. ఆపై ఆమెకు మానసిక నిపుణులచేత కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆపై ఆమెను అమృత్‌సర్‌కు తరలించారు. అక్కడ సైనికాధికారులు ఆదివారంనాడు అట్టారి సరిహద్దు ద్వారా ఆమెను తిరిగి పాకిస్థాన్‌కు పంపించేశారు. -
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
బీజింగ్: చైనాలో ఆన్లైన్ వీడియో గేమ్‌లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమర్‌ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!! ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్లైన్ గేమర్‌తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్‌లు ఆడిన ఆన్లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు. గేమ్‌లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు. చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్..