సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో గేమ్స్ పేరుతో చైనా యాప్స్ నిధుల మళ్లింపుపై ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో చైనా యాప్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో ఉగ్రవాద కుట్రకోణం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీఎస్ నుంచి ఎన్‌ఐఏ అధికారులు పూర్తి వివరాలను తీసుకున్నారు. రూ. 2వేల కోట్లకు పైగా నగదును సదురు కంపెనీ చైనాకు తరలించినట్లు గుర్తించారు. యాప్స్ పేరుతో భారతీయులు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. అనధికారికంగా వేలకోట్లు చైనాకు కంపెనీలు తరలించినట్లు గుర్తించారు. కాగా.. ఇప్పటికే ఆన్‌లైన్ చైనా యాప్స్‌పై ఈడీతో పాటు ఐటీ విచారణ కొనసాగుతోంది. (దేశ రక్షణ సమాచారం చైనాకు?)
Comments
Please login to add a commentAdd a comment