
టెక్కలి రూరల్(శ్రీకాకుళం): సంబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన నక్కల్ల మణికంఠ(18) అనే విద్యార్థి ఆదివారం రాత్రి తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.మణికంఠ ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో తన గదికి వెళ్లి తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
యువకుడు గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు హుటాహుటిన అతడిని కిందకు దించి టెక్కలి జిల్లా ఆస్పత్రి తరలించారు. వైద్యుడు మధు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థి తండ్రి నాగభూషణ్ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. విద్యార్థి మృతికి ఆన్‌లైన్ గేమ్సే కారణమని స్థానికులంటున్నారు. టెక్కలి ఎస్‌ఐ ఎన్ కామేశ్వరరావు టెక్కలి ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment