ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.
జీఎస్టీ కౌన్సిల్ గతేడాది ఆన్‌లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్‌లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అంతేకాదు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది.
అయితే దీనిపై గేమింగ్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
జీఎస్టీ కౌన్సిల్ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment