జయకుమార్(ఫైల్)
పాడేరు: ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయిన ఓ యువకుడు ఆదివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాడేరు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్(19) పబ్జీ గేమ్‌తో పాటు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు.
మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన జయకుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు.
సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జయకుమార్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి గ్రామానికి చేరుకొని.. కుటుంబసభ్యులను పరామర్శించారు.
చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది..
Comments
Please login to add a commentAdd a comment