
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది.
వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్‌స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్‌ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్‌లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్‌లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్‌ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్‌జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు.
మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది.
చదవండి: ఫ‍్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్‌రూం డోర్ పగులగొట్టి..
Comments
Please login to add a commentAdd a comment