Rajasthan 16 Years Boy Bowling Practice Video Impresses Rahul Gandhi, Goes Viral - Sakshi
Sakshi News home page

Rahul Gandhi: బాలుడి బౌలింగ్‌కు రాహుల్‌ గాంధీ ఫిదా

Published Thu, Jul 28 2022 9:57 AM | Last Updated on Thu, Jul 28 2022 11:11 AM

Video Of A 16 Years Boy Bowling Impresses Rahul Gandhi - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌ రాజ్‌సమంద్‌ జిల్లాలోని నందేస్క్రిప్ట్‌ గ్రామానికి చెందిన ఓ బాలుడి ప్రతిభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్‌ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అతడి కలలు నిజం చేసేందుకు సాయం అందించాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను కోరారు. దీపక్‌ శర్మ అనే వ్యక్తి  పోస్టును షేర్‌ చేశారు రాహుల్‌. అందులో 16 ఏళ్ల భరత్‌ సింగ్‌ అనే కుర్రాడు.. చేల వల కట్టి బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 

‘దేశంలోని నలుమూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను కోరుతున్నాను.’ అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రాహుల్‌ గాంధీ. ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు సీఎం గెహ్లోత్‌.‘తప్పకుండా.., ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన సాయం చేస్తాము’ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement