mad
-
మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!
మార్చి అంటేనే పరీక్షల సీజన్. నెల చివర్లో తప్పితే మిగతా రోజుల్లో సినిమాలు సరిగా రిలీజ్ కావు. కానీ ఈ సారి మాత్రం స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు 10 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా పలు రీ రిలీజులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏంటవి? వాటి సంగతేంటి?మార్చి తొలివారంలో కింగ్ స్టన్, ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు నారి అనే తెలుగు మూవీ రాబోతుంది. వీటిలో 'ఛావా'పైనే అంచనాలు ఉన్నారు. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మూవీకి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)రెండో వారంలో నాని నిర్మించిన 'కోర్ట్', కిరణ్ అబ్బవరం 'దిల్ రుబా', హిందీ మూవీ 'డిప్లమాట్' విడుదలవుతాయి. వీటిలో దేనిపైన పెద్దగా అంచనాల్లేవు.మూడో వారంలో ఇప్పటివరకైతే ఏ సినిమాలు లేవు. నాలుగో వారంలో మాత్రం లూసిఫర్ సీక్వెల్ 'ఎల్ 2: ఎంపురన్' మార్చి 27న, నితిన్ రాబిన్ హుడ్ 28న, మ్యాడ్ స్క్వేర్ 29న థియేటర్లలోకి వస్తాయి. వీటిలో మ్యాడ్ 2పైనే కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')మార్చి 28న పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందని నిర్మాతలు అంటున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అయ్యే అవకాశాలు అస్సలు లేవని చెప్పొచ్చు. అలానే మార్చిలోని సినిమాలకు హిట్ టాక్ వస్తే లాభాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే!వీటితో పాటు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సలార్ లాంటి సినిమాలు కూడా ఇదే నెలలో రీ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం) -
రెట్టింపు వినోదం
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ కాంబినేషన్లోనే రూపొందిన హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్ (2023)’కు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.తొలి భాగానికి కూడా వీరే నిర్మాతలనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ‘‘ప్రేక్షకులు ఊహించినదానికంటే రెట్టింపు వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
దుమ్ముదులిపేసిన మ్యాడ్ స్క్వేర్ ఐటెం పాప ‘రెబా మోనికా జాన్’ (ఫోటోలు)
-
ఓటీటీలో 'మ్యాడ్' ఫేమ్ అనంతిక థ్రిల్లర్ సినిమా
'మ్యాడ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్‌కుమార్ తమిళ్ నటించిన రైడ్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానున్నడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా గతేడాదిలో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్గా నటించిగా.. విక్రమ్ ప్రభు హీరోగా మెప్పించారు.రైడ్ టైటిల్‌తో కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'తగారు'కు రీమేక్‌గా రైడ్ తెరకెక్కించారు.అనంతిక సనీల్‌కుమార్ కోసమే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకుల ఆసక్తిచూపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌తో మ్యాడ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఆదరణే లభించింది. ఆమె చేతిలో మ్యాడ్ స్క్వేర్, 8 వసంతాలు మూవీస్ ఉన్నాయి. తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్లో ఆమె ప్రధాన పాత్రలో ఛాన్స్ దక్కించుకుంది. -
మ్యాడ్ బ్లాక్‌బస్టర్ అవుతుంది
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయం అవుతూ, సాయి సౌజన్య సహ–నిర్మాతగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఓ ముఖ్య అతిథిగా హాజరైన దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ ట్రైలర్ నిజంగానే మ్యాడ్‌గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్లలా లేరు. ‘మ్యాడ్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. మరో అతిథి సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ స్టోరీ లైన్ నాకు తెలుసు. సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గుంటూరు కారం’ సెట్స్‌లో ‘మ్యాడ్’ ప్రస్తావన విన్నాను. ‘మ్యాడ్’ చిత్రం ‘మ్యాడ్’గా ఉంటుందట’’ అన్నారు శ్రీ లీల. ‘నా ఫ్రెండ్ అనుదీప్ లేక΄ోతే నేను లేను’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
యూత్‌ఫుల్ మ్యాడ్ – నాగవంశీ
‘‘మ్యాడ్’ యూత్‌ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్‌లు, ట్విస్ట్‌లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
మ్యాడ్తో ఎంట్రీ!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలు చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కష్ణన్ బి. -
మీ ఇంట్లో పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అయితే ఈ హెచ్చరిక మీకోసమే!
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్‌ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది. చదవండి: ఫ్లైట్‌లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్రూం డోర్ పగులగొట్టి.. -
మా సినిమా చూడకుండా కామెంట్స్ చేయకండి
MAD Movie Pre Release Event: ‘‘సినిమా విడుదల ముందు వరకే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉంటుంది. చిన్న సినిమా అయినా బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. ‘మ్యాడ్’ మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత టి. రామ సత్యనారాయణ అన్నారు. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతావర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా చూసి, బాగుంటే తోటివారికి కూడా చెప్పండి’’ అన్నారు. ‘‘మేమంతా చాలా నమ్మకంతో ‘మ్యాడ్’ చేశాం. మా మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుండటం హ్యాపీ’’ అన్నారు మాధవ్ చిలుకూరి. ‘‘మా సినిమా చూడకుండా కామెంట్స్ పెట్టకండి.. సినిమా చూశాకే స్పందించాలని నా విన్నపం’’ అన్నారు రజత్ రాఘవ్. ‘‘కరోనా టైమ్‌లో మా చిత్రం ద్వారా ఓ 50 మందికి ఉపాధి కల్పించాననే సంతృప్తి ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా చేసే నమ్మకం వస్తుంది’’ అన్నారు నిర్మాత కృష్ణారెడ్డి. -
కైలాష్ ఖేర్ ‘సూఫీ పాట’కి మంచి స్పందన
ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్‌లో అందరినీ ఆకర్షించిన మ్యాడ్ మూవీ తాజాగా ఓ సుఫీ పాటతో తన ప్రత్యేకతను చాటుకుంది. తెలుగు పాటల్లో చాలా అరుదుగా కనిపించే సుఫీ పాట ‘మ్యాడ్’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘బందిషీ ఖాతల్ దిల్ కీ’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ పాడారు. ఈ పాటతో కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. మోహిత్ రెహ్మానిక్ స్వరపరచిన ఈ సుఫీని శ్రీమాన్ శ్రీమనస్వి రచించారు. మోదెల టాకీస్ బ్యానర్‌పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మాతలుగా.. లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం వేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ‘కైలాష్ ఖేర్ ఈ పాటను పాడటానికి ఒప్పుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశంలో ఈ పాట వస్తుంది. కథలోని ఫీల్కి సుఫీ పాట అయితే కొత్తగా ఉంటుందని అనుకున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ చాలా బాగుంది. కైలాష్ ఖేర్ పాట విన్నాక మాకు చాలా సంతోషంగా ఉంది’ అని డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని అన్నారు. -
‘ ఆ మంత్రిని పిచ్చోడని అంటున్నారు’
పశ్చిమ గోదావరి జిల్లా : టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఈ నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన బీజీపీ నేత మాణిక్యాల రావు మీద టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మండిపడ్డారు. మంత్రి మాణిక్యాల రావును ఆయన నియోజకవర్గ ప్రజలు పిచ్చోడని అంటున్నారని బాపిరాజు ఎద్దేవా చేశారు. నిట్‌కు సంబంధించి శంకుస్థాపన సమయంలో వేసిన శిలాఫలకం మినహా ఇప్పటి వరకూ ఒక్క రాయి కూడా వేయలేని అసమర్ధుడు మంత్రి మాణిక్యాల రావు అని సంబోధించారు. మంత్రి గారి అనుచరుల వల్లే అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఆరుగోలను గ్రామంలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమంలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తాడేపల్లి గూడెం, నల్లజర్ల మండలాల్లో జరిగిన అభివృద్ధి దేశవ్యాప్తంగా మరెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాను అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. -
ఆలస్యంగా నిద్రిస్తే పిచ్చెక్కే ప్రమాదం!
లండన్ : ఆలస్యంగా నిద్రపోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అర్ధరాత్రి దాటేదాకా టీవీలు, స్మార్ట్ఫోన్లతో గడిపి ఆ తర్వాత ఎప్పటికో పడుకోవడం.. తెల్లారి ఆలస్యంగా నిద్రలేచి హడావుడి పడడమూ నిత్యకృత్యమే! ఇలా ఆలస్యంగా నిద్రించేవాళ్లకు పిచ్చెక్కే ప్రమాదం ఉందని బ్రింగ్హాటన్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్ర చాలకపోతే అనారోగ్యాలు పాలయ్యే ప్రమాదం ఉందనే విషయం తెలిసిందే! దీంతోపాటు హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు, మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని తెలిపారు. ఈమేరకు మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 మందిని వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది. ఈ అధ్యయనంలో వాళ్ల మానసిక అనారోగ్యానికి కారణం నిద్రలేమి అని తేలిందట! ఇక నిద్రలేమితో ఎదురయ్యే ఇతర అనారోగ్యాలు.. రాత్రి సరిగా నిద్రించకపోతే ఉదయం లేవగానే చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, హింసాత్మక ఆలోచనలు, భయం లేకపోవడం, పొంతనలేని వాగుడు, ఆత్మహత్య ఆలోచనలూ చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. -
మతిస్థిమితం లేని గర్భిణి ఆత్మహత్య
శెట్టూరు: మాకొడికి తండాకు చెందిన మతిస్థిమితం లేని సుగాలి లలితమ్మ (32) అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జానకమ్మ తెలిపిన మేరకు... లలితమ్మకు కర్ణాటకలోని పావగడ తాలూకా పళకహళ్లికి చెందిన రాజానాయక్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కిందట తొలికాన్పులో అనారోగ్యంతో బిడ్డ పుట్టి మరణించాడు. ప్రస్తుతం లలితమ్మ ఏడు నెలల గర్భిణి. మతిస్థిమితం లేని ఈమె మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు శెట్టూరు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
– నలుగురికి తీవ్ర గాయాలు వలిగొండ : మండలంలోని ప్రొద్దటూరులో ఆదివారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి నలుగురి తీవ్రంగా గాయపరి చింది. గాయపడిన వారిలో దుబ్బ నర్సింహ, స్వామి, రాజయ్య, సాయి ఉన్నారు. వీరిలో నర్సింహ, స్వామిని 108లో, రాజయ్య, సాయిని ప్రైవేట్ వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కోరంటి వైద్యశాలకు తరలించారు. కుక్క మనుషులతో పాటు పది గేదెలు, ఒక మేకను కరిచింది. దీంతో గ్రామస్తులు కుక్కను వెంటాడి చంపేశారు. కాగా, బాధితులను జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, మాద శంకర్, తుమ్మల వెంకట్‌రెడ్డి, వంగాల భిక్షపతి పరమార్శించారు. -
రైల్వే స్టేషన్లలో చిరుతపులుల సంచారం!
ముంబై: 'లోకల్ రైల్వే స్టేషన్లలో చిరుత సంచారం' వార్తలు ముంబై వాసులను కాసేపు హడలగొట్టేశాయి. వేలమంది జనం, సాయుధ రైల్వే పోలీసుల నడుమ రైల్వే స్టేషన్ లో చిరుతపులి సంచారం సాధ్యమేనా? అనుకుంటూ యధావిధిగా స్టేషన్లకు వెళ్లినవారికి నిజంగానే పులల చిత్తరువులు కనిపించాయి. ఖర్, బోరీవ్యాలీ లోకల్ స్టేషన్ ఫ్లాట్ ఫామ్ మెట్లపై ఠీవిగా నిల్చున్న చిరుతపులి బొమ్మలు చూసి అవాక్కయిన ప్రయాణికులు.. వాటిని గీసినవాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంత అందంగా కుదిరాయా చిత్తరువులు. ఒక్క చిరుతపులేకాదు జీబ్రా, ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని చెట్లు తదితర బొమ్మలు స్టేషన్ గోడలపై అలరిస్తున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేందుకు మేక్ ఎ డిఫరెన్స్(ఎంఏడీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ చిత్తరువుల పనిని చేపట్టింది. ఒక్క రైల్వే ష్టేషన్లేకాక నేషనల్ హైవేలు, బీచ్ లు, పార్కుల వంటి పబ్లిక్ ప్లేసెస్ లోనూ అందమైన బొమ్మలు ఫ్రీగా గీసిపెట్టేందుకు సిద్ధమవుతోంది ఎంఏడీ. ఖర్, బోరీవ్యాలీ స్టేషన్లలో కనువిందు చేస్తోన్న ఈ చిత్రరాజాలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. -
'చంద్రబాబుకు ఆ పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరింది'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి కాస్తా పీక్ స్టేజ్‌కి చేరిందని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు, తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అథితులకు వాళ్ల సొంత హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేసి ప్రజలు, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతున్నారని బత్తుల ఆరోపించారు. -
రోజు రోజుకు పెరుగుతున్న కల్లు బాదితులు
-
‘పవనిజం’ సినిమా స్టిల్స్
-
సైకో చేష్టలతో ఇబ్బంది పడ్డ రోగులు
-
దిగ్విజయ్ సింగ్‌కు మతిభ్రమించింది: మైసూరా
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆ పార్టీ బుధవారం ఖండించింది. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ... దిగ్విజయ్ సింగ్ మాటలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల్లోని అన్ని అంశాలను పరిగణలో తీసుకోవాలని, అలాగే అందరికి సమన్యాయం చేయాలని గతంలో దిగ్విజయ్ సింగ్‌ను కలసినప్పుడు సూచించామని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్‌కు చెప్పామన్నారు. ఆల్‌పార్టీ మీటింగ్‌లో తాము చెప్పిన విషయాలను షిండే పక్కనపెట్టారని మైసూరారెడ్డి ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడటం దౌర్బాగ్యమని మైసూరారెడ్డి పేర్కొన్నారు. -
దిగ్విజయ్ సింగ్‌కు మతిభ్రమించింది: మైసూరా