ఓటీటీలో 'మ్యాడ్‌' ఫేమ్‌ అనంతిక థ్రిల్ల‌ర్ సినిమా | Mad Fame Ananthika Sanilkumar Raid Movie Telugu Version OTT Release Date Confirmed, Check Streaming Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'మ్యాడ్‌' ఫేమ్‌ అనంతిక థ్రిల్ల‌ర్ సినిమా

Published Thu, Oct 17 2024 11:42 AM | Last Updated on Thu, Oct 17 2024 12:56 PM

Ananthika Sanilkumar Raid Movie Streaming Date Locked

'మ్యాడ్‌' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్‌కుమార్‌ తమిళ్‌ నటించిన రైడ్‌ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ కానున్నడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రంగా గతేడాదిలో థియేటర్‌లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది.  ఈ సినిమాలో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్‌గా నటించిగా.. విక్రమ్‌ ప్రభు హీరోగా మెప్పించారు.

రైడ్‌ టైటిల్‌తో కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్‌ 19 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.  క‌న్న‌డలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన సూపర్‌ హిట్‌ సినిమా 'త‌గారు'కు రీమేక్‌గా రైడ్ తెరకెక్కించారు.

అనంతిక సనీల్‌కుమార్‌ కోసమే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకుల ఆసక్తిచూపుతున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌తో మ్యాడ్‌ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఆదరణే లభించింది. ఆమె చేతిలో మ్యాడ్‌ స్క్వేర్‌, 8 వసంతాలు మూవీస్‌ ఉన్నాయి. తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేక‌ర్స్  వంటి భారీ బ్యానర్‌లో ఆమె ప్రధాన పాత్రలో ఛాన్స్‌ దక్కించుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement