మతిస్థిమితం లేని గర్భిణి ఆత్మహత్య
శెట్టూరు: మాకొడికి తండాకు చెందిన మతిస్థిమితం లేని సుగాలి లలితమ్మ (32) అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జానకమ్మ తెలిపిన మేరకు... లలితమ్మకు కర్ణాటకలోని పావగడ తాలూకా పళకహళ్లికి చెందిన రాజానాయక్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కిందట తొలికాన్పులో అనారోగ్యంతో బిడ్డ పుట్టి మరణించాడు. ప్రస్తుతం లలితమ్మ ఏడు నెలల గర్భిణి. మతిస్థిమితం లేని ఈమె మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు శెట్టూరు ఎస్‌ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకున్నారు.