
ఆత్యహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి రేష్మా
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీలో గురవారం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి కథనం..కాలనికీ చెందిన అమీర్ 2వ కుమారై రేష్మా(17) ఇంటర్ మీడియట్ పూర్తి చేసింది. అయితే అదే వీధిలోని ఇమ్రాన్(27) రేష్మాకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఇమ్రాన్‌కు ఇది వరకే వివాహమై ఒక కుమారై కూడా ఉందని తెలుసుకున్న రేష్మా తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. అయితే ఇమ్రాన్ తాను రెండో వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాడు.
అయితే రేష్మా తల్లిదండ్రులు దీనికి ఇష్టపడలేదు. రెండవ భార్యగా వద్దంటూ కుమార్తెకు నచ్చచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్ రూంలో రేష్మా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన రేష్మాను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రొంపిచెర్ల ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment