Reshma
-
ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే.. జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
అప్లికేషన్ ఫామ్‌లో అడ్జస్ట్మెంట్ కాలమ్.. క్యాస్టింగ్ కౌచ్‌పై నటి
సినిమా ఇండస్ట్రీలో అడవాళ్లు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య క్యాస్టింగ్ కౌచ్. నీకు ఛాన్స్ ఇస్తాం సరే, మరి నువ్వు మాకేమిస్తావు?.. కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు.. ఇలాంటి సూటిపోటి మాటలు అడుగడుగడునా వినిపిస్తూనే ఉంటాయి. ఎందరో నటీనటులు ఇటువంటి అడ్డంకులు దాటుకుని ముందుకు వచ్చినవాళ్లే! అందులో ఒకరు బుల్లితెర నటి రేష్మ ప్రసాద్. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లోనూ కాంప్రమైజ్ అడుగుతారని చెప్పుకొచ్చింది. గుర్తింపు రాని చిన్న రోల్స్‌కు సైతం కాంప్రమైజ్.. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా సాధారణ విషయమైపోయింది. గదిలోకి రావడానికి అడ్జస్ట్ అవుతావా? అని చాలా సింపుల్‌గా అడిగేస్తారు. కొన్ని అప్లికేషన్ ఫామ్స్‌లో అయితే అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉంటోంది. ప్రధాన పాత్రలకే కాదు, సైడ్ క్యారెక్టర్లు, అసలు గుర్తింపు రాని చిన్నాచితకా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతులు భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఒప్పుకునేవరకు ఒత్తిడి.. లొంగిపోయా అప్లికేషన్ ఫామ్‌లో అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకోవడం లేదని రాసినా సరే మళ్లీ అదే టాపిక్ తీసుకొచ్చి ఒత్తిడి చేస్తారు. మంచి పాత్ర కోసం, ఫేమ్ కోసం, కన్న కలలు సాకారం చేసుకోవడం కోసం ఆ ఒత్తిడికి లొంగిపోతాం. గతంలో నేను కూడా ఓసారి ఒత్తిడి తట్టుకోలేక నా కెరీర్ కోసం అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకున్నాను. ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో వాస్తవంగా ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. తెరపై తమను తాము చూసుకోవాలని ప్రయత్నాలు చేసేవారికి ఇప్పటికైనా మంచి వాతావరణం కల్పించాలి' అని కోరుతోంది రేష్మ. చదవండి: ఓటీటీలో 13 సినిమాలు, సిరీస్‌ల సందడి.. ఏవేవి ఎక్కడ స్ట్రీమింగ్ అంటే.. -
డాక్టర్ గారు డ్యాన్స్ చేశారు!
పని ఒత్తిడిలో ఉన్న వారికి హాబీలే రిలాక్సేషన్. కర్నాటకలోని మంగళూరుకు చెందిన దర్శిని రేష్మా ప్రదీప్ డాక్టర్ కావాలనుకొని డ్యాన్సర్ కాలేదు. డాక్టర్ కావాలనుకున్న కలను నిజం చేసుకున్న దర్శిని ఎంత బిజీగా ఉన్నాసరే, తనలోని ‘నృత్యకళ’ను కాపాడుకుంటోంది. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసు తేలిక చేసుకోవడానికి ఆమె అనుసరించే మార్గం.. డ్యాన్స్. షారుక్‌ఖాన్ హీరోగా చేసిన ‘రా.వన్’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘చెమ్మక్ చెల్లో’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సాంగ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోక్లిప్ 2.5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘చెమ్మకు చెల్లో’ సాంగ్ సంగతి ఎలా ఉన్నా... దర్శిని డ్యాన్స్ స్టెప్పులను చూస్తుంటే మన ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా కులికే కుందనాలబొమ్మ’ వీణ స్టెప్పులు గుర్తుకొస్తున్నాయి. ‘గుడ్ డ్యాన్సింగ్’ ‘వాట్ ఏ లవ్లీ డ్యాన్స్’... మొదలైన కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు. -
అవకాశాలు రావడం లేదంటూ నటి ఆవేదన
'మసాలా పాదం' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తమిళ నటి రేష్మ పసుపులేటి. పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి సీరియల్ చేస్తున్న ఆమె తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదని వాపోయింది. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది. 'నాకు లోకేశ్ కనగరాజన్ సినిమాలో నటించాలనుంది. కానీ ఆయన్ను ఎలా సంప్రదించాలో తెలియడం లేదు. ఎవరైనా నన్ను ఆయన దగ్గరకు చేర్చండి. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతోంది.. కానీ సరైన అవకాశాలు లేవు. మా కంటే కొత్తగా వచ్చినవారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. దాన్ని నేను పూర్తిగా తప్పుపట్టడం లేదు. కానీ ఇది నిజంగా అన్యాయం. ఈ అసమానతలు లేని సిస్టమ్ రావాలి' అని ట్వీట్ చేస్తూ దానికి కొన్న ఫోటోలు జత చేసింది రేష్మ. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇప్పటిదాకా నటించింది చాలులే.. నిన్ను టీవీలో చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది నేరుగా చూస్తే ఏమైపోవాలో!పైగా నీకంత యాక్టింగ్ కూడా రాదు. ముందు నీ వృత్తి మార్చుకో' అని సెటైర్లు వేస్తున్నారు. Wanna be a part @Dir_Lokesh I don’t know how to get to him. Someone hook up a sista #pro #ontheprowl #beenintheindustry12years someone’s gotta do me rite I mean the new bees get more opportunities than us. No offence but it’s https://t.co/mzW9lpLfRw gotta change y’all ❤️ pic.twitter.com/KeJHQOmhjF — Reshma Pasupuleti (@reshupasupuleti) January 24, 2023 చదవండి: అతియా- రాహుల్ పెళ్లి.. ఆడి కారు, లక్షల విలువైన బైకు, ఫ్లాట్.. ఇంకా.. -
ఆకుపచ్చ ధనం
పచ్చగా కళకళలాడటం అంటే ఏమిటో రేష్మా రంజన్‌కు తెలుసు. అందుకే తృప్తినివ్వని గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఏం చేసింది? తనకిష్టమైన మొక్కలు పెంచింది. మట్టి, నీరు, కుండీ, ఆకు, ఎరువు... ఇవి ఎలా ఉపయోగిస్తే ఇంటి మొక్కలు అందంగా అద్భుతంగా ఉంటాయో బాగా తెలుసుకుంది. వాటినే వీడియో పాఠాలు చేసింది. ‘ప్రకృతీస్ గార్డెన్’ పేరుతో వందలాది వీడియోలు చేసింది. పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఏర్పడ్డారు. రేష్మా దిశా నిర్దేశంలో ఇళ్లల్లో మొక్కలు పెంచుతున్నారు. వారు హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల వచ్చే ఆదాయంతో రేష్మా పచ్చగా ఉంది. జార్ఘండ్‌లోని బొకారోలో రేష్మా రంజన్ ఇంటికి వెళితే చిన్న సైజు వనంలో అడుగు పెట్టినట్టు ఉంది. దాదాపు 2000 అందమైన, రకరకాల కుండీల్లో వందలాది రకాల మొక్కలు కనిపిస్తాయి. కొత్తిమీర, పొదీనాతో మొదలు ఆపిల్, అవకాడో వరకూ రేష్మా కుండీల్లో సృష్టించనిది అంటూ ఏదీ లేదు. ఒక కుండీలో ఉల్లిపాయలు పెరుగుతుంటాయి... మరో కుండీలో అనాసపళ్లు... ఇంకో కుండీలో చిలగడ దుంపలు, మరో కుండీలో నేతి బీరకాయలు... ఇక పూలైతే లెక్కే లేదు. వాటి మధ్య కూచుని వీడియోలు చేస్తుంటుంది రేష్మా. కేవలం తను పెంచి చూసిన మొక్కల గురించే ఆమె మాట్లాడుతుంది. ఆ అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు కాబట్టే ఆమెకు పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ► బాల్యం ముఖ్యం బాల్యంలో ఏర్పరిచే మంచి ప్రభావాలు వారికి జీవితాంతం ఉంటాయి అనడానికి రేష్మ రంజన్ ఒక ఉదాహరణ. రేష్మాది బొకారో అయినా ఐదో క్లాస్ వరకూ బీహార్‌లోని పల్లెలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. తాతయ్య ఇంట్లో విపరీతంగా చెట్లు. ‘దారిన పసిబిడ్డను వదిలి వెళ్లిపోతే చూసినవారు ఎలా కలత చెందుతారో ఎవరైనా ఏదైనా మొక్కను పారేసి ఉంటే మా తాత అంత కలత చెందేవాడు’ అంటుంది రేష్మా. అతడు ఎక్కడ ఏ మొక్క నిర్లక్ష్యంగా పడేసి ఉన్నా తెచ్చి ఇంట్లో దానికి ప్రాణం పోసేవాడు. రేష్మా మూడో క్లాసు పాసై నాలుక్కు వెళుతున్నప్పుడు మూడు మొక్కలు తెచ్చి వీటిని నువ్వే పెంచాలి అని చెప్పాడు తాతయ్య. ‘అయితే నేను మరీ అతిగా పెంచి ఎక్కువ నీళ్ళు, ఎక్కువ ఎరువు వేసేసి వాటిని చంపేశాను’ అని నవ్వుతుంది రేష్మా. ఆ గుణపాఠం నుంచి బాల్యంలోనే మొక్కలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకుంది. ‘అదే మొక్కల మీద నా ప్రేమకు అంకురం’ అంటుంది రేష్మా. ► ఉద్యోగంలో అసంతృప్తి ఇంటర్ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐ.సి.ఏ.ఆర్) నుంచి అగ్రికల్చర్ సైన్స్ డిగ్రీ చేసిన రేష్మా ఆ వెంటనే అగ్రికల్చర్ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ‘2015లో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైన ఉద్యోగం అనుకున్నాను. నా పని రైతులకు వారి పంట పోషణలో సాయం చేయడం. కాని నా లాంటి చిన్న పిల్ల చెప్తే వినడం ఏమిటి అనుకునేవారో లేదా వారి సంప్రదాయ జ్ఞానం మీద విశ్వాసమో కాని నేను చెప్పే సూచనలు రైతులు వినేవారు కాదు. అంతేకాదు మట్టిని బట్టి, విత్తును బట్టి పంటలో మార్పు చేర్పులు చెప్తే లక్ష్యం చేసేవారు కాదు. ఆ అసంతృప్తి నాకు ఉండేది. మరోవైపు ఉద్యోగం వల్ల నేను స్వయంగా మొక్కలు పెంచలేకపోయేదాన్ని. అదే సమయంలో నా చదువును చూసి ఫ్రెండ్స్ ఫలానా మొక్కలు ఎవరు వేయాలి... ఫలానా తీగను ఎలా పెంచాలి... అని సలహా అడిగేవారు. ఈ అన్ని సమస్యలకు సమాధానంగా ఉద్యోగం మానేసి యూట్యూబ్ చానల్ మొదలెట్టాను’ అంటుంది రేష్మా. ► పదివేల మంది అనుకుంటే ‘నేను మొక్కలు, తీగలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు, ఇండోర్ ప్లాంట్లు... వీటన్నింటిని ఎలా పెంచారో, కేర్ తీసుకోవాలో చెప్తే నాలాగే మొక్కలను ఇష్టపడే ఒక పదివేల మంది అయినా ఫాలో కాకపోతారా అనుకున్నాను. సహజ పద్ధతిలో గులాబీ పెంచడం ఎలా? అనేది నా మొదటి వీడియో. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. పది వేల మంది అనుకుంటే రెండు మూడేళ్ల లోనే లక్ష మంది అయ్యారు. 2016 నుంచి నా పాఠాలు కొనసాగితే 2022 చివరకు పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. ప్రొడక్ట్ ప్రమోషన్స్ కోసం వచ్చే వారి వల్ల కాని, యూట్యూబ్–ఫేస్బుక్ పేజ్ వల్ల కాని నాకు నెలకు లక్ష నుంచి లక్షన్నర ఆదాయం వస్తోంది’ అంటుంది రేష్మా. ఒక పనిలో పూర్తిగా నైపుణ్యం ఉంటే ఆ పనిలో ఆనందం, ఆదాయం రెండూ పొందవచ్చు. మీకు బాగా మొక్కలు పెంచడం వస్తే రేష్మాలా యూట్యూబ్ చానల్ నడపొచ్చు. బాగా మొక్కలు పెంచాలని ఉంటే ఆమె చానల్ ఫాలో కావచ్చు. ‘అందరూ మొక్కలు పెంచితే ప్రపంచం పచ్చగా మారడానికి ఎక్కువ టైమ్ పట్టదు’ అని రేష్మా చెప్పే మాట అందరూ వినాలి. ► అందమైన ఇల్లు మొక్కలు ఎలా అంటే అలా పెంచడం కాదు. వాటిని అందమైన కుండీల్లో అందమైన అరల మీద పెడితే వచ్చే అందాన్ని కూడా రేష్మా చెబుతుంది. సహజంగా ఎరువుల్ని, క్రిమి సంహారకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపుతుంది. సేంద్రియ విధానాలు కూడా చూపుతుంది. ఇండోర్ ప్లాంట్స్ ఎలా శుభ్రం చేయాలి అనే ఆమె వీడియో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవారంతా చూడతగ్గది. ‘వాల్ డెకరేషన్’గా గోడలకు కుండీలు బిగించి ఎలాంటి మొక్కలు పెంచాలో చూపుతుంది. ఇంకా ఆమె చెప్పే విషయాలు అనంతం. -
వీడియో లీక్.. వేరొకరైతే ఆత్మహత్య చేసుకునేవాళ్లు: నటి
సోషల్ మీడియా వల్ల ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉంటాయి. ఏ సమాచారాన్నైనా, ఎక్కడి నుంచైనా క్షణాల్లో అందరికీ చేరవేస్తుంది సోషల్ మీడియా. అందులో పనికొచ్చేవాటితో పాటు ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటో, ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి. వీటిలో ఏది అసలో, ఏది అబద్ధమో తెలియక తికమకపడుతుంటారు జనాలు. కొందరైతే నటీమణులపై ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వారిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. అలా గతంలో తమిళ నటి రేష్మ పసుపులేటిపై కొందరు మార్ఫ్డ్ వీడియో చేసి నెట్లో వదిలారు. తాజాగా దీనిపై రేష్మ స్పందిస్తూ.. 'రేష్మ పసుపులేటి హాట్ వీడియో అని ఓ వీడియో వైరల్ అయింది. అది సుచీలీక్స్ పేరిట వచ్చిందని ఉంది. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నా చెల్లి ఫోన్ చేసి నీ వీడియో లీక్ అయింది అని చెప్పింది. నేను షాకయ్యాను. అసలు నేను ఊర్లోనే కాదు కదా ఇండియాలోనే లేను. కనీసం నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు, అలాంటప్పుడు నా వీడియో ఎలా లీకవుతుంది? అమ్మే.. చెల్లితో ఫోన్ చేయించిందని అర్థమైంది. నాన్న సినీ నిర్మాత, తాతయ్య కూడా నిర్మాతే, అన్నయ్య ఒక నటుడు.. ఇలా అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. అదంతా ఫేక్ అండ్ మార్ఫ్డ్ వీడియో అని పసిగట్టారు. నా స్థానంలో వేరొకరు ఉంటే మెంటల్ టార్చర్‌తో కుమిలిపోయేవాళ్లు. ఆ వీడియోను నాకు పంపించమని చెల్లికి చెప్పాను. నా శరీరం గురించి నాకు తెలుసు కదా! అందులో ఉన్న అమ్మాయి నాకంటే అందంగా ఉంది. అందరం నవ్వుకున్నాం. కానీ నా స్థానంలో ఇంకో అమ్మాయి ఉండుంటే ఆత్మహత్య చేసుకునేది!' అని చెప్పుకొచ్చింది రేష్మ. కాగా జిగర్తాండ హీరో బాబీ సింహా చెల్లెలే రేష్మ. మసాలా పాదం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం భాగ్యలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. గతంలో తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. చదవండి: రష్మికతో విజయ్ న్యూఇయర్ ట్రిప్, ఫోటో వైరల్ ఆ ఇద్దరినీ షాపింగ్‌కు తీసుకెళ్తా: ప్రభాస్ -
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. భార్యపై అనుమానంతో...
సాక్షి, బళ్లారి: పెళ్లై సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కట్టుకున్న భార్య శీలంపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసు విచారణలో ఆలస్యంగా వెలుగు చూసింది. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా గంగొండనహళ్లికి చెందిన మోహన్ కుమార్(24) అనే వ్యక్తి తన భార్య రేష్మా(20)ను దారుణంగా హత్య చేసి, శవాన్ని ఆడవిలో పారవేసి పరారయ్యాడు. ఈ ఘటనపై రేష్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసేవాడని, తన కూతురిని హత్య చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి మోహన్ కుమార్‌ను పట్టుకుని విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు. భార్యను దారణంగా హత్య చేసి, బంధువులకు, గ్రామస్తులకు అనుమానం రాకుండా చిక్కమగుళూరు జిల్లా అజ్జంపుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఆడవిలో పాతిపెట్టి భార్య కనిపించడం లేదని నమ్మించేందుకు ప్రయత్నించిన మోహన్ కుమార్ చివరకు కటకటాల పాలయ్యాడు. చదవండి: (ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య) -
చిట్టివలస టూ అమెరికా.. రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక
తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: చిట్టివలస శివారులో అధునాతన వసతులతో ద్రోణాచార్య స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ విలేజీ నిర్మాణం జోరందుకుంది. నగరానికి చెందిన వైద్యులు సీహెచ్ శ్రీనివాసరావు, రమణ, ఉపాధ్యాయుడు శ్రీనివాసరాజు, వ్యాపారవేత్త ప్రకాష్‌లు సంయుక్తంగా పది ఎకరాలలో దీనిని నిర్మిస్తున్నారు. 4,5,6,7 తరగతులు చదువుతున్న విద్యార్థులు 120 మందితో ఇంటర్ వరకు విద్యతో పాటు ప్రొఫెషనల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎండాడ, పీఎం పాలెంలలో చిన్న అకాడమీలను నడిపిన అనుభవంతో ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఇందుకు గాను అమెరికాకు చెందిన నాలుగు స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాలతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను అమెరికాలో టెన్నిస్, క్రికెట్లో ఆడుతూ ఉపాధి పొందే దిశగా మూడేళ్ల కాంట్రాక్ట్‌తో పంపించనున్నారు. చిట్టివలస శివారులో రూపొందుతున్న స్పోర్ట్స్ విలేజ్ ప్రొఫెషనల్స్‌తో శిక్షణ స్పోర్ట్స్ విలేజ్‌లో క్రికెట్, టెన్నిస్‌కు ఆట స్థలాలు సిద్ధంగా కాగా సంక్రాంతి తరువాత నుంచి బాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్‌పూల్, వ్యాయామశాల, అథ్లెటిక్ల కోసం 220 మీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. మార్చి నుంచి పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ విలేజ్‌లో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. క్రీడలలో శిక్షణతో పాటు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారు చేసేందుకుగాను అనుబంధంగా కేరళ నుంచి ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాల నుంచి కోచ్‌లు, డైటిషియన్, ఫిజయోథెరపిస్ట్లు, వార్డెన్లను అందుబాటులో ఉంచుతారు. స్పోర్ట్స్ విలేజ్‌లో తరగతి గదులు రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక స్పోర్ట్స్ విలేజీకు నగరానికి చెందిన చల్లారపు రేష్మ అనే విద్యార్థిని ఏడాది క్రితం అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన లిండ్సే విల్సన్ కళాశాలకు రూ.కోటి ఉపకార వేతనంతో ఎంపికయింది. ఈమె గతంలో ఇంటర్మీడియట్ చదువుతుండగా టెన్నిస్‌లో నేషనల్ గోల్డ్‌మెడల్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలలో గోల్డ్, సిల్వర్ పతకాలు వరుసగా రెండేళ్లు గెలుచుకుంది. ఐసీఎస్ఈ నిర్వహించిన టెన్నిస్ పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. స్పోర్ట్స్ విలేజ్‌లో క్రికెట్ స్టేడియమ్ ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా ఎదగాలని ఏడాదికి 3 వేల డాలర్ల ఉపకార వేతనంతో లిండ్సే విల్సన్ కళాశాలలో నాలుగేళ్ల టెన్నిస్ కోర్సు శిక్షణకు ఎంపికయ్యాను. ఇంకా మూడేళ్ల శిక్షణ ఉంది. తరువాత ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ ద్వారా అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొవాలనేది లక్ష్యం. చివరిగా ఇక్కడి స్పోర్ట్స్ విలేజ్‌లో టెన్నిస్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా మరింత మందిని తయారు చేస్తాను. –చల్లారపు రేష్మ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చవచ్చు.. ప్రస్తుతం అమెరికాలో టెన్నిస్‌కు ఆదరణ చాలా బాగుంది. రానున్న రోజులలో అక్కడ క్రికెట్‌పై బాగా దృష్టి సారించనున్నారు. రానున్న కాలంలో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే అవకాశం ఉంది. మా దగ్గర చేరే పరిమితమైన విద్యార్థులకు విద్యతో పాటు వారికి ఇష్టమైన క్రీడలలో తరీ్ఫదు ఇచ్చి నేరుగా అమెరికాలో ఆడుతూ ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తున్నాం. ప్రొఫెషనల్ క్రీడాకారుల తయారీ లక్ష్యంగా ఈ విలేజ్‌ను ఏర్పాటు చేశాం. –డి.ప్రకాష్, వ్యవస్థాపక భాగస్వామి స్పోర్ట్స్ విలేజ్ నుంచి అమెరికాలో కెంటకీ రాష్ట్రంలో లిండ్సే విల్సన్ కళాశాలలో రూ.కోటి ఉపకారవేతనంతో టెన్నిస్ శిక్షణకు ఎంపికైన రేష్మ -
సీనియర్ నటుడి భార్య కన్నుమూత
సాక్షి, చెన్నై: నటి రేష్మా అలియాస్ శాంతి(42) శ్వాస సంబంధిత సమస్యతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. తొలుత పాజిటివ్ అని, ఆ తదుపరి నెగెటివ్‌గా భిన్న ఫలితాలు వచ్చాయి. అయితే ఆమెకు శ్వాస సమస్య తీవ్రం కావడంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. కాగా కార్తీక్ హీరోగా తెరకెక్కిన 'కిళక్కు ముగం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రేష్మా పలు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు. సీనియర్ నటుడు రవిచంద్రన్ కుమారుడు హంసవర్ధన్‌ను వివాహం చేసుకుని తన పేరును శాంతిగా మార్చుకున్నారు. వీరికిద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చదవండి: రంగంలోకి సాయి ధరమ్‌తేజ్.. రిపబ్లిక్ డబ్బింగ్ షురూ.. -
Gopichand: హీరో గోపీచంద్ భార్య ఎవరో తెలుసా?
Happy Birthday Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా నిలదొక్కుపోవడానికి చాలానే కష్టపడ్డాడు. తొలి సినిమా ‘తొలివలపు’ ఫ్లాప్ కావడంతో గోపీచంద్ డైలామాలో పడ్డాడు. మళ్ళీ ఎలాగోలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని విలన్ పాత్రలు చేయడానికి ఒప్పుకున్నాడు. తేజ దర్శత్వంలోతెరకెక్కిన ‘జయం’సినిమాలో విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత వర్షం, నిజం సినిమాల్లోనూ విలన్‌గా మెప్పించాడు. యజ్ఞం సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావడంతో గోపీచంద్ ఇక వెనుదిరిగి చూసూకోలేదు. ‘రణం, లక్ష్యం, గోలీమార్ అంటూ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ ‘సిటీమార్’, ‘పక్కా కమర్షియల్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక గోపీచంద్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన వివాహం 2013లో రేష్మతో జరిగింది. రేష్మ ఎవరో కాదు.. ప్రముఖ హీరో శ్రీకాంత్ కు స్వయానా మేనకోడలు. శ్రీకాంత్ సొంత అక్క కూతురిని గోపీచంద్ కి ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె అమెరికాలో చదివింది. ఆమె ఫోటో చూసి ఇష్టపడిన గోపిచంద్.. సీనియర్ యాక్టర్ చలపతిరావుతో సంబంధం మాట్లాడమని చెప్పాడట. ఆయన శ్రీకాంత్ దగ్గర పెళ్లి విషయాన్ని ప్రస్తావించి ఒప్పించాడట. గోపీచంద్ తన కంటే మంచోడు అని.. కళ్లు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చని స్వయంగా హీరో శ్రీకాంత్ చెప్పడంతో వీరి పెళ్లి పీటలమీదకు చేరిందట. వీరికి ఇద్దరు కొడుకులు. తన భార్య కోరిక ప్రకారం వారికి 'విరాట్ కృష్ణ', 'వియాన్' అనే పేర్లు పెట్టామని ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్ చెప్పాడు. -
రెండవ భార్యగా ఒప్పుకోనందుకు..
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక ఇందిరమ్మ కాలనీలో గురవారం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి కథనం..కాలనికీ చెందిన అమీర్ 2వ కుమారై రేష్మా(17) ఇంటర్ మీడియట్ పూర్తి చేసింది. అయితే అదే వీధిలోని ఇమ్రాన్(27) రేష్మాకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఇమ్రాన్‌కు ఇది వరకే వివాహమై ఒక కుమారై కూడా ఉందని తెలుసుకున్న రేష్మా తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. అయితే ఇమ్రాన్ తాను రెండో వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాడు. అయితే రేష్మా తల్లిదండ్రులు దీనికి ఇష్టపడలేదు. రెండవ భార్యగా వద్దంటూ కుమార్తెకు నచ్చచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో బెడ్ రూంలో రేష్మా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన రేష్మాను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రొంపిచెర్ల ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
పుట్టింటికి రా తల్లీ
ముంబైలో పని చేస్తున్న కేరళ నర్సులు తమ కాన్పు సమయంలో పుట్టింటికి వెళ్లాలని అనుమతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్లో వారి ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు తప్పేలా లేవు. ముప్పై ఏళ్ల రేష్మ అనిష్ ముంబై ఎం.జి.ఎం హాస్పిటల్లో నర్సు. ఇప్పుడామెకు ఎనిమిదో నెల. కాన్పు కోసం తన పుట్టిల్లయిన కేరళలోని పతానంతిట్టతుకు మార్చి 27న ఆమె ప్రయాణం పెట్టుకుంది. ఉద్యోగంలో అనుమతుల చికాకు లేకుండా ఏకంగా ఆ ఉద్యోగానికి రాజీనామాయే చేసింది. అంతా సరిగ్గా జరిగి ఉంటే ఆమె ఇప్పుడు తన పుట్టింట్లో అమ్మ ఆలనాపాలనలో ఉండాల్సింది. కాని లాక్డౌన్ వల్ల అంతా గందరగోళంగా మారింది. ‘నా పుట్టింటికి వెళ్లడానికి ఈ–పాస్ కోసం మహరాష్ట్ర డి.జి.పికి అప్లై చేశాను. కాని ఇప్పటి వరకు సమాధానం లేదు’ అని రేష్మ అంది. ముంబై నుంచి కేరళ చేరుకోవడానికి ఇప్పుడు ఆమె సొంత ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటోంది. ఎంత ఖర్చయినా అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్లాలనుకుంటోంది. అయితే దీనికి కూడా చిక్కులొచ్చేలా ఉన్నాయి. మహారాష్ట్ర అంబులెన్సుకు ఎంత ఈ–పాస్ ఉన్నా ఇతర రాష్ట్రాలు లోనికి రానివ్వాలని లేదు. ముఖ్యంగా కర్నాటక ఇలాంటి అంబులెన్సులను కూడా ఆపేస్తోంది. ‘ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. పైగా అంబులెన్స్ డ్రైవర్ 14 రోజుల క్వారెంటైన్లో వెళ్లాల్సి రావచ్చు’ అని రేష్మ అంది. రేష్మ భర్త ఉద్యోగరీత్యా నైజీరియా వెళ్లి అక్కడ లాక్డౌన్లో చిక్కుకుని ఉన్నాడు. ‘తలా ఒక చోట ఉన్నాం. ఎప్పుడు కలుస్తామో’ అని అతను అన్నాడు. బాంబే హాస్పిటల్లో పని చేస్తున్న అతిరదేవి కూడా కాన్పుకు కేరళలోని తన పుట్టిల్లు కొట్టాయంకు వెళ్లాల్సి ఉంది. అంబులెన్సు మాట్లాడితే 50 వేలు డిమాండ్ చేశారు. దానికీ సిద్ధపడినా పోలీసుల అనుమతి ఇంకా రాలేదు. మరో కేరళ నర్సు సమస్య గమనించదగ్గది. ఆమెకు మొదటి గర్భం నిలువలేదు. ఇప్పుడు వచ్చిన రెండో గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పుట్టింటికి వెళ్లడం ముఖ్యమని అనుకుంటోంది. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. కాన్పు సమయం స్త్రీలకు కుటుంబం నుంచి ముఖ్యంగా పుట్టింటి నుంచి చాలా ఆలంబన అవసరమైన సమయం. ముంబైలో నర్సులుగా పని చేస్తూ ప్రస్తుతం గర్భవతులైన పదుల సంఖ్యలోని కేరళ స్త్రీలు తాము ఈ సమయంలో ఎక్కడ పుట్టింటికి చేరుకోలేమో అని ఆందోళన చెందుతున్నారు. -
కాంగ్రెస్ నాయకురాలి అనుమానాస్పద మృతి..!
బెంగుళూరు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడెకనూర్ మృతి చెందారు. గురువారం రాత్రి అదృశ్యమైన ఆమె శుక్రవారం శవమై కనిపించారు. బసవనబాగేవాడి తాలుకాలో కృష్ణానదిపై నిర్మించిన కొల్హార్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై గాయాలున్నాయని.. ఇది హత్యా, ఆత్మహత్యా తెలియాల్సి ఉందని ఏసీపీ బీఎస్ నేమెగౌడ్ చెప్పారు. దర్యాప్తు మొదలు పెట్టామని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన రేష్మా రాత్రయినా ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేసి ఉండడంతో కుంటుంబ సభ్యులు కొల్హార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. రేష్మా మృతదేహం, పక్కన ఆమె ఫైల్ ఫోటో మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడి కారులో ఆమె వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ విజయపుర జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన రేష్మా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరహిప్ప నియోజకవర్గం పోటీచేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ మరోమారు టికెట్ కేటాయించకపోవడంతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న రేష్మా ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాణాలు కొల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మరణంపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. -
రేపటి ఫన్డేలో...
యాసిడ్ టెస్ట్ గదిలో ఫ్యానుకు తాడును వేలాడదీసే ప్రయత్నంలో ఉంది రేష్మ. సమయానికి అక్కడికి తల్లి రావడంతో ప్రాణాలు దక్కాయి. పెద్దగా ఎప్పుడూ మాట్లాడని తండ్రి ఈసారి నోరు విప్పాడు.‘‘వ్యవసాయం అంత తేలిగ్గాదమ్మా. నకిలీ విత్తనాలు, కల్తీ మందులు, గిట్టుబాటు కాని ధర... ఇవన్నీ ఒక ఎత్తయితే అవసరానికి కురవని వానలు, పంట చేతికొచ్చే సమయంలో ముంచుకొచ్చే తుపాను ఒక ఎత్తు... ఈ లెక్కన నేను ఇప్పటికి వందసార్లు ఆత్మహత్య చేసుకోవాలి’’ అన్నాడు. యాసిడ్ దాడికి గురై, నరకం అనుభవించిన మోడల్ రేషమ్ఖాన్ తిరిగి ఎలా నిలదొక్కుకోగలిగిందో, నలుగురికి ఎలా ఆదర్శంగా నిలిచిందో కూడా చెప్పాడు.తండ్రి మాటలతో ప్రభావితమైన రేష్మ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఆమె జీవితంలోకి రణధీర్ వచ్చాడు. ఇప్పుడు రేష్మాకు మరో పెద్ద సవాలు ఎదురైంది. ఆ సవాలును ధైర్యంగా ఎదుర్కొందా? పిరికితనంతో నీరుగారిపోయిందా?‘యాసిడ్ టెస్ట్’ కథలో చదవండి. నాలుగు రోజులు తెల్లవారుజామున పెద్దగాలి రేగింది. మసక చీకటి తొలగిపోయింది. మూడోరోజు ప్రారంభమైంది.‘‘నా జీవితంలో మూడోరోజు అనాలా? లేకపోతే నరకంలో మూడురోజులు అనాలా?’’ అనుకున్నాడు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సైనికుడు ఐవనోవ్. బతుక్కి దూరంగా, చావుకి అతి దగ్గరగా ఉన్నాడతడు.‘మరణమా ఎక్కడున్నావ్, దయచూడు’ అని ప్రార్థించాడు కూడా. ఆయన మొర గాలిలో కలిసిపోయింది.యుద్ధంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఒక సైనికుడి మానసిక సంఘర్షణ...రష్యన్ కథ ‘నాలుగు రోజులు’లో చదవండి. సాయిపథం ఒక పెద్ద నాగుపాము కప్పను మింగడానికి ప్రయత్నిస్తుంటే, సాయి ఆ రెండిటి దగ్గరకు వెళ్లి...‘‘వీరభద్రప్పా! అనుక్షణం భయంతో జీవిస్తున్నా నీకు సిగ్గులేదా... చినబసప్పా! ఇంకా వాడితో ఆనాటి వైరం పోలేదా...’’ అన్నాడు. అంతే...కప్పని పాము వదిలేసింది. కప్ప ఎగిరిపోవడం, పాము పారిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సాయి స్వయంగా చెప్పిన కథ ‘నేటి ఈ వైరం ఏనాటిదో’లో చదవండి. ఇంకా... నక్కజిత్తుల క్యాన్సర్ (వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ముఖచిత్రకథనం), కలాన్ని, గళాన్ని ఆయుధంగా చేసుకున్న గరిమెళ్ల జీవితకథ (్ర«ధువతారలు), ‘గుణసుందరి కథ’ సినిమాలో కొత్తపదాలతో పింగళి సృష్టించిన పాట గురించి సీనియర్ నటి రక్తకన్నీరు సీతమ్మ మాటల్లో (పాటతత్వం)...ఇంకా మిమ్మల్ని ఆకట్టుకునే మరెన్నో శీర్షికలు రేపటి ఫన్డేలో చదవండి... -
‘పానగల్’ రిజర్వాయర్‌లో ఇద్దరు విద్యార్థినుల గల్లంతు
నల్లగొండ క్రైం: పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో గురువారం ఇద్దరు విద్యార్థినులు గల్లంతయ్యారు. రంగా రెడ్డి జిల్లా ఆమనగల్‌కు చెందిన హబీబ్ ఉన్నీసా అలియాస్ రేష్మా(18) నల్లగొండలోని చర్లపల్లి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (టీటీసీ) చదువుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరుకు చెందిన శ్రావణి (17) హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్‌లోని కృష్ణ వేణి ఉమెన్స్ జూనియర్ కళాశాలలో చదువుతోంది. అంతకు ముందు ఇదే కాలేజీలో హబీబ్ ఉన్నీసా ఇంటర్ చదివింది. ఆ సమయంలో వీరిద్దరూ రూమ్మెట్స్ కావడం వల్ల మంచి స్నేహితులయ్యారు. పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రావణి ల్యాబ్ పని ఉందని తండ్రి వెంకటేశంతో కలసి గురువారం చౌటుప్పల్‌లో నెట్ సెంటర్ వద్దకి వెళ్లింది. అనంతరం నల్లగొండలో హబీబ్ ఉన్నీసా ఉంటున్న ప్రైవేట్ హాస్టల్ వద్దకు వచ్చింది. తర్వాత ఇద్దరూ కలసి పానగల్ ఉదయ సముద్రంలోకి దూకినట్లు ఆనవాళ్లు, సూసైడ్ నోట్ లభిం చడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
డబుల్ హ్యాపీ
వినాయకచవితి పండగ సెలబ్రేషన్స్ నటుడు గోపీచంద్ ఇంట్లో ఒక రోజు ముందే మొదలయ్యాయి. గురువారం పండగ రోజు డబుల్ అయ్యాయి. ఇంతకీ... విషయం ఏంటంటే... గోపీచంద్ రెండోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘బేబి బాయ్‌కి తండ్రి అయ్యాను. పండగను మించిన సంతోషం కలుగుతోంది’’ అని గోపీచంద్ పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం రేష్మాను వివాహం చేసుకున్నారు గోపీచంద్. ఈ దంపతులకు 2014లో కలిగిన మగ సంతానానికి విరాట్ కృష్ణ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికోస్తే... ఇటీవల ‘పంతం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు గోపీచంద్. ఇప్పుడు గోపీచంద్ హీరోగా కుమార్ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో ఓ సినిమా రూపొందనుందని టాక్. అలాగే దర్శకుడు సంపత్ నంది వినిపించిన ఓ స్టోరీ లైన్‌కు గోపీచంద్ ఇంప్రెస్ అయ్యారట. -
భర్త చేతిలో నటి దారుణహత్య
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మహిళా ఆర్టిస్టులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరో నటి-సింగర్ భర్త చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ దారుణం పాక్‌లోని ఖైబర్ ఫంక్తుఖ్వాలో చోటుచేసుకుంది. నటి రేష్మ పలు సినిమాల్లో నటించారు. గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తకు రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలున్నాయని పోలీసులు తెలిపారు. కాగా, రేష్మ హత్య ఈ ఏడాది మహిళా ఆర్టిస్టులపై జరిగిన 15వ ఉదంతం(దాడి) కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్ సంబల్ ఓ ప్రైవేట్ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే. -
సీ పైలట్
ఆకాశంలో విమానాల్ని చక్కర్లు కొట్టించడం..పట్టాల మీద రైళ్లను రయ్యిన పరుగులెత్తించడం..రోడ్ల మీద బస్సుల్ని లాఘవంగా తిప్పడం..ఈ మూడు దారులలో మహిళలు ఇప్పటికే నైపుణ్యాన్ని ప్రదర్శించారు.ఇప్పుడు కొత్తగా సముద్రం నుంచి పోర్ట్‌కి ఓడల్ని నడుపుతోంది!ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగాచెన్నైకి చెందిన రేష్మా నీలోఫర్ సాగర్..ఐలాండ్ నుంచి కోల్‌కతా పోర్టుకి నౌకల్ని నడుపుతూ రికార్డు సృష్టించింది. రోడ్డు మీద ఉన్నట్లే సముద్రంలోనూ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇసుక తిప్పలు, చిన్న చిన్న రాతి గుట్టలు.. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ ఓడను ఒడ్డుకు చేర్చాలి. అందువల్లే సముద్రం నుంచి పోర్ట్‌కి ఓడను నడపడం చాలా కష్టమైన పని. ఈ ఓడలు నడిపే పైలట్‌కి ‘యాక్సిడెంట్ జరగకుండా చూడగలను’ అనే నమ్మకం లేకపోతే ఈ పని చేయలేరు. చిన్న చిన్న మలుపులు తిప్పడానికే ఎంతో నైపుణ్యం ఉండాలి. ఓడలను నియంత్రించడం అంత సులువైన విషయం కాదు. మగవారికే అసాధ్యమైన ఈ ప్రొఫెషన్లోకి తొలిసారిగా రేష్మా నీలోఫర్ వచ్చారు. ప్రపంచంలోనే తొలి సీ పైలట్‌గా గుర్తింపు పొందారు. చెన్నైలో జన్మించిన రేష్మా నాటికల్ సైన్సెస్‌లో బి.ఎస్.సి. డిగ్రీ చేసి, కోల్‌కతా పోర్ట్ ట్రస్టులో శిక్షణ తీసుకున్నారు. ఏడాది పాటు క్యాడెట్‌గా పనిచేశారు. ‘డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ కాంపిటెన్సీ’ సర్టిఫికెట్ అందుకున్నారు. గ్రేడ్ త్రీ, పార్ట్ వన్ పూర్తి చేసి, గ్రేడ్ త్రీ పైలట్‌గా మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వహించబోతున్నారని మెరైన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జెజె బిశ్వాస్ అంటున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ కాంపిటెన్సీ అయ్యాక.. చిన్న చిన్న వస్తువులు ఉన్న ఓడలు నడిపి, అనుభవం çసంపాదించారు రేష్మ. ఆ తర్వాత ‘పనామాక్స్ వెజల్స్’ ఉండే పెద్ద పెద్ద ఓడలను నడిపారు. 300 మీటర్ల పొడవు ఉండే ఈ ఓడలలో, 70,000 టన్నుల సరుకు ఉంటుంది. సముద్ర గర్భం నుంచి కోల్‌కతా పోర్ట్‌కి ప్రతిరోజూ సామాన్లు చేరవేస్తారు రేష్మ. ఆవిడ ప్రయాణించే దూరం 223 కిలో మీటర్లు. హుగ్లీ మీదుగా ప్రయాణించే 148 కిలోమీటర్ల ప్రాంతమంతా అనేక మలుపులు, అడ్డంకులతో నిండి ఉంటుంది. కోల్‌కతా లేదా హల్దియా నుంచి వచ్చే ఓడలు.. సాగర్ ఐలాండ్‌లో ఉండే పైలట్‌తో దారిలో ఉండే అడ్డంకుల గురించి కమ్యూనికేట్ అవ్వాలి. సముద్రంలో అనేక ఇసుక దిబ్బలు, కొండరాళ్ల మలుపులు ఉంటాయి. అవి బాగా ఇబ్బంది కలిగిస్తాయి. ఓడ వాటిని తప్పించుకుంటూ వెళ్లాలి. అక్కడ యుక్తితో తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. ఎంత నేర్పు ప్రదర్శించినా తప్పించుకోలేకపోతారు. ఇందుకు కావలసినదల్లా అనుభవమే. రేష్మను చూసి చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు. సముద్రంలో పనిచేయడం ఆడవారికి ఎంతవరకు క్షేమమా? అని. అందుకు రేష్మ ‘ఈత వస్తే సముద్రం గురించి భయపడవలసిన అవసరం లేదు’ అంటారు. అంత తేలికేం కాదు సీ పైలట్‌ని మారిటైమ్ పైలట్ అని కూడా అంటారు. వీళ్లు ఇరుకుగా ఉండే నీటి ప్రాంతం.. అంటే హార్బర్స్, నదీ ముఖ ప్రాంతం వంటి ప్రదేశాల నుంచి సరుకులను చేరవేస్తారు. సాధారణంగా వీరికి షిప్ కెప్టెన్‌గా, కష్టమైన ప్రదేశాలలో షిప్‌ను హ్యాండిల్ చేసిన అనుభవం ఉండాలి. అంటే అక్కడి లోతు ఎంత, గాలి ఎంత శక్తితో ఏ దిశగా ప్రయాణం చేస్తోంది, అలలు ఆటు మీద ఉన్నాయా, పోటు మీద ఉన్నాయా... వంటి విషయాలలో అనుభవం ఉండాలి. వీటన్నిటినీ అలవోకగా దాటేస్తున్నారు రేష్మ. – రోహిణి -
సోదరుడి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడని..
భూపాలపల్లి: జిల్లాలో కలకలం రేపిన చిన్నారి రేష్మపై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. తన సోదరుడి చావుకు కారణమయ్యాడనే అక్కసుతో తండ్రిపై కక్ష కట్టి అభం శుభం ఎరుగని చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4 తేదీన పుట్టినరోజు నాడే ఏడేళ్ల చిన్నారి రేష్మ హత్యకు గురై మృతదేహంగా కనిపించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి(గోరి)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవళిక కుమార్తె రేష్మ ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. గత ఆదివారం రాత్రి గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్ కళాకారులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శబ్దాన్ని విన్న రేష్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రేష్మ కోసం వెతికారు. రాత్రి ఒంటిగంట వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజు బంధువులు గ్రామంతోపాటు గ్రామ పరిసరాల్లో గాలించారు. మరుసటి రోజు రాజు సోదరుడు సదయ్య ఓ గడ్డివాములో రేష్మ మృతదేహం గుర్తించి సమాచారం అందించాడు. విచారణ చేపట్టిన పోలీసులు రేష్మ మృతికి కారకుడైన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఆ చిన్నారిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. కనకం శివ సోదరుడు కుమార్ ప్రేమ విషయంలో రేష్మ తండ్రి రాజు అడ్డు పడటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో రాజు పై కక్ష పెంచుకున్న శివ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. -
ఏడేళ్ల బాలిక దారుణ హత్య
భూపాలపల్లి: ఏడేళ్ల బాలిక హత్యకు గురై పుట్టినరోజు నాడే మృతదేహంగా కనిపించిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి(గోరి)లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవళికకు కుమార్తె రేష్మ(7) ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ఆదివారం రాత్రి గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్, కళాకారులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శబ్దాన్ని విన్న రేష్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూడగా బాలిక కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రేష్మ కోసం వెతికారు. రాత్రి ఒంటిగంట వరకు వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో రేగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం రాజు బంధువులు గ్రామంతోపాటు గ్రామ పరిసరాల్లో గాలించారు. రాజు సోదరుడు సదయ్య ఓ గడ్డివాములో రేష్మ మృతదేహం గుర్తించి సమాచారం అందించాడు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సోమవారం రేష్మ పుట్టిన రోజు కాగా ఆదివారం తల్లి ప్రవళిక, రేష్మ పరకాలకు వెళ్లి కొత్త దుస్తులు, కేక్‌ను తీసుకొచ్చారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన రోజునే రేష్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..
-
అందమైన ఆత్మవిశ్వాసం
ఆసిడ్ బ్యూటీ ఇన్ న్యూయార్క్ దాక్కోవాల్సింది దాడికి గురైనవారు కాదు. దాడి చేసినవారు. బహిష్కృతులు కావలసింది బాధితులు కాదు. బాధించినవారు. బూడిదలో నుంచి ఫీనిక్స్‌లు మాత్రమే లేవవు. రేష్మా వంటి ఆడపిల్లలు కూడా ఎగురుతారు. రెక్కల్లో బలం గుండెల్లో ధైర్యం ఊపిరి నిండా ఆత్మవిశ్వాసం... జీవితం చూపుడు వేలు ఆడిస్తే రేష్మా దాని వైపు చూపుడువేలు ఆడించింది. ‘ఎస్... ఇది నా జీవితం... నువ్వు ఓడించలేవు... ఖబడ్దార్’... అంది! మొన్నటి సెప్టెంబర్ 8న న్యూయార్క్‌వాసులు ఒక గొప్ప సౌందర్యాన్ని చూశారు. ముఖం కాలి, ఒక కన్ను లొత్తబోయి, చూడ్డానికే కలవరం కలిగే ఒక ముఖం ఉన్న అమ్మాయి ఎంతో ధైర్యంతో ర్యాంప్‌వాక్ చేయడం వాళ్లు చూశారు. ఒక్క క్షణం ఆశ్చర్యం. ఒక్క క్షణం కలవరం. మరు నిమిషం హర్షాతిరేకాలతో కరతాళధ్వనుల తాకిడి. ‘రేష్మా... రేష్మా’... గ్యాలరీ నుంచి ప్రోత్సాహకరంగా అరుపులు. ఆసిడ్ దాడికి ముందు రేష్మ- బ్యూటీ. ఆసిడ్ దాడి తర్వాత కూడా బ్యూటీనే. ఆసిడ్ బ్యూటీ. గాయం దేహాన్ని ఛిద్రం చేసుండొచ్చు. కాని ప్రయాణాన్ని కాదు. ఇది రేష్మ కథ. నా పేరు రేష్మా. మాది ఉత్తరప్రదేశ్. మా అక్క, నేను అక్కడే పుట్టాము. మా నాన్న మా జీవనం కోసం ముంబై వచ్చాడు. అక్క పెళ్లి ఉత్తరప్రదేశ్‌లోనే జరిగింది. అయితే అక్కకూ బావకూ భేదాభిప్రాయాలు వచ్చాయి. అక్క మా దగ్గరకు వచ్చింది. చిన్న కుటుంబ సమస్యే అనుకున్నాము. కాని మా బావ తీవ్రంగా మా అక్క మీద పగ పట్టాడని మాకు తెలియదు. 2014లో ఒక రోజు నేను, మా అక్క చాలా రోజులైందని మా సొంత ఊరు వెళ్లాము. బంధువులను కలిసి స్టేషన్లో రైలు కోసం నిలబడి ఉన్నాము. ఒక్కసారిగా కొంతమంది మమ్మల్ని చుట్టు ముట్టారు. ఏం జరుగుతున్నదో తెలిసేలోపే నా ముఖం భగ్గున మండింది. లక్షలాది గాజు పెంకులు దిగబడిన బాధ. తీవ్రమైన మంట. జ్వలనం. ఆసిడ్... ఆసిడ్... మా అక్క పెద్దగా కేకలు వేసింది. వచ్చినవాళ్లు తొట్రుపడి పారిపోయారు. వారిలో మా బావ ఉన్నాడని తర్వాత తెలిసింది. వాస్తవానికి వాళ్లు వచ్చింది మా అక్క మీద దాడి చేయడానికి. కాని ఇద్దరం బురఖాలలో ఉండటంతో నేనే మా అక్క అనుకున్నారు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నరకం మొదలైంది ఆసిడ్ దాడి తర్వాత నరకం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. నాన్న సంపాదన అంతంత మాత్రం కావడంతో బంధువులంతా తలా కొంత వేసుకుని నాకు చికిత్స చేయించారు. అయితే కనీసం పది లక్షలు ఉంటేనే కాని ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి చేయడం సాధ్యం కాదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆడపిల్ల బతుకు నాశనం కాకూడదని తెలిసిన వాళ్లంతా అంత డబ్బూ పోగేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయించారు. కాని నాకు తెలియదు. ఆ సర్జరీలన్నీ పూర్తిగా ధ్వంసమైపోయిన నా ముఖాన్ని కనీసం మానవ ముఖంగా చూపించడానికి చేసిన ప్రయత్నం మాత్రమేనని! ఆసిడ్ దాడి నుంచి కోలుకున్న రేష్మా ఖురేషీ వీడియోల ద్వారా బ్యూటీ టిప్స్ చెబుతున్నారు. ఆమె ‘లిప్‌స్టిక్’ గురించి చెప్పిన వీడియోను 15 లక్షల మంది వీక్షించారు. ఇదే కాదు ఇండియన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ ఆధ్వర్యంలో రేష్మా ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటున్నారు. నా జీవితం మారింది సర్జరీ పూర్తయిన తరువాత ఒక రోజు నా ముఖాన్ని నన్ను చూసుకునే అనుమతి ఇచ్చారు. చూసుకున్నాను. పెద్దగా ఆర్తనాదం చేశాను. దేవుడా... ఎందుకిలా చేశావు అని గుండెలు బాదుకుని ఏడ్చాను. నా ముఖం ముఖంలా లేదు. అసలది ఏ ముఖమూ కాదు. నా రెండు కళ్లు ఉండవలసిన స్థానంలో లేవు. ఒక కన్ను పూర్తిగా పోయింది. ముడతలు పడిన ముఖం. కందిపోయిన చర్మం. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఏంచేస్తారు? నేను అదే చేద్దామనుకున్నాను. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. నేను మానసికంగా కుంగిపోవడం చూసిన మా అక్క, మా తల్లిదండ్రులు నన్ను ముంబైలోని ‘మేక్ లవ్ నాట్ స్కార్స్’ అనే సంస్థకు తీసుకువెళ్లారు. ఆ సంస్థ వారు నాకు కౌన్సెలింగ్ చేశారు. నాలో ఎంతో మార్పు తీసుకువచ్చారు. ఆ సంస్థలో వలంటీరుగా చేరాను. వారు గతంలో రేఖ అనే ఆసిడ్ బాధితురాలికి చికిత్స చేయించారు. ఆమె పరిచయం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. రేఖ, నేను ఇద్దరం ఒకరికొకరం ఆలంబనగా నిలిచాం. క్రమంగా నేను ఇప్పుడు ఆ సంస్థ నిర్వహించే ప్రచార కార్యక్రమంలో మోడల్ని అయ్యాను. ఆసిడ్ దాడి చట్టం ప్రకారం ఆసిడ్ దాడి చేసిన వారికి కనీసం పది సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. రేష్మా విషయంలో ఆమె బావను అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని బెయిల్ మీద విడుదల చేశారు. మరో ఇద్దరికి మాత్రం శిక్ష విధించారు. వారే స్ఫూర్తి... ‘మేక్ లవ్ నాట్ స్కార్స్’ సంస్థ వారి మాటలు నాకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఆసిడ్‌ను బహిరంగంగా అమ్మకూడదని ‘ఎండ్ ఆసిడ్ సేల్’ పేరిట ఉద్యమం చేశాను. 2013లో సుప్రీంకోర్టు ఆసిడ్‌ను నిషేధించిందని మనకు తెలుసు. కాని ఇప్పుడు అన్ని ప్రదేశాలలోను విచ్చలవిడిగా దొరుకుతోంది. చట్టం చేయడం కంటే ఆ చట్టాన్ని అమలు చేయడమే ముఖ్యమని నా ప్రచారం సాగుతున్నది. మరపురాని సంఘటన... ఫ్యాషన్ వీక్... న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ నుంచి నాకు ఆహ్వానం అందింది. సెప్టెంబరు 8, గురువారం నాడు నేను అక్కడ ర్యాంప్ వాక్ చేశాను. అందరి కెమెరాలు నన్ను చూసి క్లిక్ క్లిక్‌మన్నాయి. ఆ షోలో నాకు ప్రసంగించే అవకాశాన్ని ఇచ్చారు. నాకు తెలుసు... ఇది వ్యక్తిగత ప్రసంగం కాదని... నా మాటలు బాధితురాలైన ప్రతి స్త్రీకి ఉత్తేజాన్ని ఇవ్వాలని. అందుకే ఇలా అన్నాను- ‘ఆసిడ్ దాడి జరిగినా సరే న్యూయార్క్‌కు రావడం, అందునా అందానికి విలువ ఇచ్చే వేదిక మీద ఆత్మవిశ్వాసమే అందం అని చాటి చెప్పగలగడం నాకు సంతోషంగా ఉంది. ఇతర ఆసిడ్ బాధితులు నన్ను చూడాలని, నా ద్వారా ప్రేరణ పొందాలని కోరుకుంటున్నాను. మన గురించి మనం తెలుసుకోవడమే అందంతో సమానం. మాలాంటి వాళ్లం జీవితాన్ని గడపడానికి ఎంతో ధైర్యం కావాలి. కాని అదేమీ పెద్ద కష్టం కాదని చెప్పదలుచుకున్నాను. మిగిలిన ఆసిడ్ బాధితులను కూడా నా లాగే ధైర్యంగా బయటకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. వారు ఏది చేయగలరో ఆ పని చేయమని పిలుస్తున్నాను’ అని ఉద్విగ్నంగా ప్రసంగించాను. ఇది నా జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తాను. అందరూ నా మాటలను స్వాగతిస్తూ పెద్దగా చప్పట్లు కొట్టారు. అవి ప్రపంచమంతా వినపడాలని నా కోరిక. - డాక్టర్ వైజయంతి -
గాల్లో వేలాడుతూ వెరైటీగా పెళ్లి
ముంబయి: పెద్దలు కుదిర్చిన వివాహాన్నే నలుగురు మెచ్చుకునేలా చేసుకోవాలని అనుకుంటారు. అదే ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం కూడా తోడైతే ఆ ప్రేమికుల ఆలోచనలకు హద్దుంటుందా.. వారి పెళ్లి చేసుకునే విధానం గురించి కనే కలలకు లెక్కంటూ ఉంటుందా.. గాల్లో తేలే ఆనందంతో ఎగిరి గంతేయరూ. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రేమ జంట గాల్లోకి ఎగిరి గంతేయడమే కాదు.. అదే గాల్లోనే ఉండి ఏకంగా దండలు మార్చేసుకున్నారు. అది కూడా దాదాపు 90 మీటర్ల ఎత్తుల్లో గాల్లో వేలాడుతూ. మహారాష్ట్రలోని కోలాపూర్ కు చెందిన జెహదీర్, రేష్మా అనే ఇద్దరికి ట్రెక్కింగ్ అంటే ఎంతో పిచ్చి. అలా ట్రెక్కింగ్ కు వెళ్లే క్రమంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. అదే ప్రేమను గాల్లోకి తీసుకెళ్లారు. పెద్దలను పెళ్లికి ఒప్పించి ఓ రోప్ వే ద్వారా 90 మీటర్ల ఎత్తులో వేలడుతూ దండలు మార్చుకున్నారు. తన ప్రియురాలి కోరిక మేరకు అతడు ఇలా ప్లాన్ చేశాడంట. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చంపేశాడు
సదుం మండలం బలిజపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కడతేర్చాడో కసాయి భర్త. వివరాలు..సదుం మండలం బలిజపల్లెకు చెందిన గణేశ్(26), మదనపల్లె మండలం తురకపల్లికి చెందిన రేష్మ(23)ను పెద్దలు ఒప్పుకోకపోయినా 2009లో మతాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతుండేవారు. మరి ఏమైందో ఏమో కానీ గత నెల 12 వ తేదీన గణేశ్, అతని తండ్రి రెడ్డి స్వామి, పెదనాన్న వెంకట రమణ కలిసి రేష్మను కత్తితో పొడిచి చంపారు. అనంతరం వారి పొలాల్లో ఉన్న ఓ నీటి కుంటలో పూడ్చి పెట్టారు. ఈ విషయం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చిపెట్టిన చోటుకు తీసుకెళ్లి శవాన్ని వెలికి తీశారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ...
ఎలుకల మందు తాగి సీసీఎస్‌కు వచ్చిన గర్భిణి జేసీపీ ఛాంబర్ ముందు కుప్పకూలిన వైనం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన అధికారులు హైదరాబాద్: భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ఏడు నెలల గర్భిణి మంగళవారం ఎలుకల మందు తాగి సీసీఎస్‌కు వచ్చిం ది. సంయుక్త పోలీసు కమిషనర్ (జేసీపీ) ఛాంబర్ వద్ద ఆమె కుప్పకూలడంతో పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా ధర్నారం గ్రామానికి చెందిన రేష్మ (27) అదే గ్రామానికి చెందిన అక్తర్ అహ్మద్(29)ను ఆరేళ్ల క్రితం ప్రేమించి, మతాంతర వివాహం చేసుకుంది. ప్రస్తుతం అక్తర్ సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుండగా... వీరు జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి లో ఉంటున్నారు. రేష్మ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. నాలుగేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగిం ది. రెండేళ్లుగా భర్త అక్తర్ కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో రేష్మ తల్లిదండ్రులు రూ.3 లక్షల వరకు చెల్లించారు. అదనపు కట్నం కోసం అక్తర్ వేధింపులు ఎక్కువ కావడంతో రేష్మ ఈనెల 20న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్తర్ కు కౌన్సెలింగ్ ఇచ్చారు. కొన్నాళ్లు మంచిగా ఉన్న అక్తర్ మళ్లీ కట్నం పాతపంథానే అనుసరించాడు. దీంతో రేష్మ మంగళవారం సీసీఎస్‌లోని మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడానికి ఓ సహాయకుడితో కలిసి వచ్చింది. సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావును కలిసేందుకు ఆయన ఛాంబర్ వద్ద వేచి ఉన్న ఆమె మంచినీళ్లు తాగేందుకు వెళ్తూ కుప్పకూలిపోయింది. అక్కడున్న పోలీసు అధికారులు హుటాహుటిన ఆమె వద్దకు వచ్చి సపర్యలు చేశారు. ఇంతలో ఆమెతో వచ్చిన వ్యక్తి రేష్మ ఎలుకల మందు తాగిందని చెప్పడంతో హుటాహుటిన కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఎలుకల మందు బయటికి తీయడానికి ప్రయత్నించగా రేష్మ సహకరించలేదు. రేష్మ ఏడు నెలల గర్భవతి కావడంతో ఉస్మానియా వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, అయితే గర్భిణి కావడంతో రెండు రోజులు అబ్జర్వేషన్ తర్వాతే పూర్తి వివరాలు చెప్పగలమని ఉస్మానియా ఆసుపత్రి సీఎంఓ ధనుంజయ తెలిపారు. రేష్మ విషయంపై జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంటకరెడ్డిని వివరణ కోరగా... ‘ఈ నెల 20న తన భర్త కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, లుక్ఔట్ నోటీసులు సైతం జారీ చేశాం. అక్తర్ ఆచూకీ కోసం ఎస్సై విజయ్‌కుమార్ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశాం’ అని అన్నారు. -
సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి గిరాకీ ఉంటుంది. పైగా సమ్మర్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు విజయ్ శ్రీనివాస్ ‘జీలకర్ర-బెల్లం’ చిత్రాన్ని తెరకెక్కించి నట్లున్నారు. అభిజిత్, రేష్మ,జంటగా ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే... కథ ఏంటంటే... రాహుల్ (అభిజిత్), మైథిలి (రేష్మ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. జీవితంలో బాగా స్థిరపడేంత వరకూ పిల్లలు వద్దనుకుంటారు. కొంత కాలం వీరి జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకసారి ఇద్దరూ చిలుకూరి బాలాజీ టెంపుల్‌కు వెళదామను కుంటారు. చివరి నిమిషంలో రాహుల్‌కు ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో అతను ఆఫీసుకు వెళిపోతాడు. దాంతో టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పటినుంచి మైథిలి మనసులో భర్త మీద వ్యతిరేకమైన ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న భావన మైథిలి మనసులో నాటుకుపోతుంది. కట్ చేస్తే... వీళ్లిద్దరి జీవితంలోకి అమృత అనే పాప ఎంటరవుతుంది. వ్యాపారంలో బిజీగా ఉండే అమృత తల్లిదండ్రులు ఆమెని నిర్లక్ష్యం చేస్తారు. దాంతో రాహుల్, మైథిలీలకు క్రమంగా అమృత దగ్గరవుతుంది. సడన్‌గా అమృత క్యాన్సర్‌తో చనిపోతుంది. పిల్లలు వద్దనుకున్న మైథిలికి మరో షాక్. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. మళ్లీ రాహుల్-మైథిలీల మధ్య అగాథం ఏర్పడుతుంది. ఈ దూరం తొలగిపోయి ఇద్దరూ ఎలా దగ్గరయ్యారు? అన్నది మిగతా కథ. ‘‘మీ పెళ్లిపుస్తకం మీరే రాస్కోవాలి, చదువుకోవాలి, మీరే దిద్దుకోవాలి’’ అని హీరోయిన్ తండ్రి పాత్రలో సూర్య పలికే సంభాషణలు ఆకట్టుకుంటా యి. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి. చిన్నచిన్న గొడవలతో దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదనే కథాంశంతో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. -
ప్రేమ, పెళ్లి, విడాకులు!
నేటి తరం యువతీయువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కలిసుండాల్సిన వాళ్లు తీరా చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తద్వారా బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? దీనికి పరిష్కారం ఏమిటి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జీలకర్ర -బెల్లం’. అభిజీత్, రేష్మ జంటగా శ్రీచరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘కామెడీ, క్రైమ్, రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం ద్వారా యువతకు మంచి సందేశం ఇస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది. ఈ నెల 29న మా సినిమాను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య అహం వల్ల ఎలాంటి సమస్యలొచ్చాయి. చివరకు ప్రేమ గెలిచిందా? అహం గెలిచిందా? అన్నదే ఈ చిత్ర కథాంశం. సంగీతాన్ని ఆదరించినట్టు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని హీరో అభిజీత్ పేర్కొన్నారు. హీరోయిన్ రేష్మ, మాటల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమేరా: చిట్టిబాబు. -
ఆస్పత్రిలోనే చిట్టితల్లి
♦ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రేష్మా ♦ వదిలించుకున్న కర్కశ తల్లిదండ్రులు ♦ వారం గడిచినా ఆచూకీ లేని కన్నవారు ♦ విచారణలో తీవ్ర జాప్యం పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ పాపం.. ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చింది. తల్లిదండ్రుల చేతుల్లోనే నరకం అనుభవించింది. సిగరెట్ వాతలను భరించింది.. దండించినా మౌనంగా ఉండిపోయింది. రక్తం కక్కేలా చితక బాదినా కిమ్మనలేదు. అభంశుభం తెలియని ఈ చిన్నారిని హింసిస్తున్న విషయం వారం రోజుల క్రితం వెలుగు చూసింది. పాపను వదిలించుకునేందుకు ఇదే మంచి మార్గమని భావించారు కన్నతల్లి, మారుతండ్రి. జాగ్రత్తగా నడుచుకోవాలని అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వగా అన్నింటికి సరేనంటూ తలూపారు. ఆ మరుసటి రోజు నుంచే జాడలేకుండా పోయారు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఈ చిన్నారి అమాయకపు చూపులు ప్రతిఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ చిన్నారి భవిష్యత్తు ఏమిటో పోలిసులు, అధికారులకే తెలియాలి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెప్పిన మాట వినడం లేదని.. నాలుగేళ్ల చిన్నారి రేష్మా పట్ల కర్కశంగా వ్యవహరించారు తల్లిదండ్రులు చక్రవర్తి, రజియా సుల్తానా. ఈ విషయం ఈనెల 18న వెలుగు చూడడంతో పోలీసుల కన్నుగప్పి పరారయ్యారు. వారం రోజులు గడిచినా ఈ కేసు విషయంలో పురోగతి లేదు. ఇప్పటికే వారిని అరెస్టు చేయాల్సిన బొల్లారం పోలీసులు రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారు. ఏ పాపం తెలియని చిన్నారి రేష్మా అలియాస్ ప్రియాంక మాత్రం అనాథగానే సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి చికిత్స పొందుతోంది. చిన్నారిని చూసేందుకు చిన్నారి సొంత తండ్రిగాని, తల్లి లేదా తల్లితరఫు బంధువులు ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందే పాపకు సపర్యలు చేస్తున్నారు. ఒంటి నిండా సిగరెట్‌తో వాతలు ఇంకా తగ్గనేలేదు. ముఖం మీద గాయాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గుంటూరు పట్టణం రామారెడ్డి రెండో వీధికి చెందిన రాధిక అలియాస్ రజియా సుల్తాన్ (పాప తల్లి) ఆరు నెలల కిందటే భర్త హబీబ్ కళ్లుగప్పి చక్రవర్తితో రహస్యంగా వచ్చినట్టు సమాచారం. జిన్నారం మండలం పోచమ్మబస్తీలో కాపురం పెట్టి పసిపాపపై పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్ తరువాత పాపతోపాటు ఒక రోజు ఆసుపత్రిలో ఉన్న రజియా సుల్తానా మరుసటి రోజు ఎవరికి చెప్పాపెట్టకుండా తన ప్రియుడు చక్రవర్తితో కలిసి పరారైంది. వారు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసుల వద్ద సమాచారం లేదు. రేష్మా కేసు విషయంలో పోలీసులు మొదటి నుంచీ ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాపను తీవ్రంగా గాయపరిచిన వారిని అదుపులోకి తీసుకోకుండా కేవలం కౌన్సెలింగ్‌తోనే వదిలేశారని.. ఇదే వారు పారిపోవడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. రజియా సుల్తానా, చక్రవర్తి ఇచ్చిన తప్పుడు సమాచారంతో పోలీసులు బోల్తా పడ్డారు. ‘సాక్షి’ అసలు గుట్టు విప్పడంతో మేల్కొన్న పోలీసులు.. విచారణ పేరుతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వారిని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు తెలియక పోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. ఎప్పుడు అరెస్టు చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు రేపు..మాపు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి బొల్లారం పోలీసులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది. ఈ పోలీసు స్టేషన్ పరిధిలో పసిపిల్లలపై దాష్టికాన్ని ప్రదర్శించి, దారుణంగా హింసించడం ఇది రెండోసారి. ఇదే స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న జాకీర్ హుస్సేన్ దంపతులు హైదరాబాద్‌కు చెందిన సబా అనే పసిపాపను తీసుకొచ్చి చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఇదే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన పట్ల ఉదాసీనతతో వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కోలుకోవడానికి సమయం పడుతుంది.. రేష్మా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆహారం తీసుకుంటోంది. పాప పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. చర్మంపై ఉన్న కాల్చిన గాయాలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఇవి పూర్తిగా తగ్గడానికి ఇంకొంత సమయం పడుతుంది. - డాక్టర్ శ్రావ్య -
భార్యను తనతో పంపాలని అడిగితే..
బంజారాహిల్స్ : తన భార్యను తనకు అప్పగించాలని అడిగినందుకు మద్యం సీసాతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరాంనగర్‌లో నివసించే సబీల్(23) చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. అయిదేళ్ల క్రితం రేష్మతో పెళ్లయింది. ఒక కూతురు కూడా ఉంది. అయితే ఏడాది క్రితం విజయవాడకు చెందిన రెడ్డినాయుడు(23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి విజయవాడకు వెళ్లి పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టారు. తన భార్యను అప్పగించాల్సిందిగా సబీల్ ఎన్నోసార్లు రెడ్డినాయుడును వేడుకున్నాడు. కనీసం కన్నకూతురు చూడటానికైనా అంగీకరించాలని విజ్ఞప్తి చేశాడు. అయినాసరే నాయుడు, రేష్మ ఇద్దరూ ఒప్పుకోలేదు. సోమవారం రాత్రి శ్రీరాంనగర్‌లో తన అత్త ఇంట్లో ఉంటున్న కూతురిని చూసేందుకు సబీల్ వెళ్లగా అక్కడే నాయుడు మద్యం తాగుతూ ఉన్నాడు. ఒక్కసారిగా సబీల్‌ను చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యను అప్పగించాల్సిందిగా సబీల్ కోరగా తాగుతున్న మద్యం బాటిల్‌తో తలపై బలంగా మోదాడు. దీంతో సబీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. -
పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. జొన్నవాడ గ్రామానికి ప్రవల్లిక(27) తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకుంది.ఈ ఘటనలో లాస్య(5), రేష్మ(2) అనే చిన్నారులతో పాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. అంటూ వెంటపడి..!
పాతపట్నం: ఊరెళ్లడానికి బయలుదేరిన తల్లి వెంట అమ్మా అమ్మా అంటూ వచ్చిన చిన్నారి హఠాత్తుగా బస్సుకింద పడి నలిగిపోయింది. అప్పటికే బస్సు ఎక్కిన ఆ కన్నతల్లితోపాటు డ్రైవర్ కూడా ఆ చిన్నారి రాకను గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. మండలంలోని తెంబూరు గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణోదయ ప్రయివేట్ బస్సు కింద పడి ఆదే గ్రామానికి చెందిన తృను కృష్ణారావు, తులసీ మొదటి సంతానమైన తృను రేష్మ(3) మృతి చెందింది. పర్లాకిమిడి నుంచి తెంబూరు మీదుగా టెక్కలి వెళ్తున్న అరుణోదయ ప్రయివేట్ బస్సు తెంబూరు కండ్రవీధి ఆగగా, రేష్మ తల్లి తులసి వారి కన్న వారింటికి టెక్కలి వెళ్లడానికి బయలుదేరింది. రోడ్డు ఇంటికి దగ్గరగా ఉండడంతో పాప పరుగెత్తి వచ్చింది. తల్లి బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి అమ్మా అమ్మా అంటూ.. ఏడ్చుకుంటూ వచ్చింది. అలా ఏడ్చుకుంటూ పరుగున వచ్చిన రేష్మ బస్సు కింద పడిపోయినా డ్రైవర్ కూడా గమనించకపోవడంతో చక్రాల కింద నలిచి విగతజీవిగా మారింది. కృష్ణారావు, తులసీలకు ఇద్దరు కుమార్తెలు కాగా, అందులో పెద్దమ్మాయి రేష్మ. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు హెచ్‌సీ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్యం .. ఓ మధురానుభూతి
రేష్మా.. ఈ రోజుల్లో ఫేం.. వెండితెర వర్ధమాన నటి. బాల్యం సింగరేణి కార్మికవాడల్లోనే గడిపింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆమె ‘సాక్షి’తో ముచ్చటింది. రేష్మ తండ్రి హరిదాస్ రాథోడ్ వృత్తి రిత్యా సింగరేణి అధికారి. ఇల్లెందు స్వగ్రామం కాగా జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. బాల్యస్మృతులు ఆమె మాటల్లోనే.. ఇల్లెందు బాల్యం మరువలేని అనుభూతి. నా బాల్యమంతా ఇల్లెందులోనే గడిపాను. సింగరేణి బొగ్గు బావుల్లో పని చేసే కార్మికులు, బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే విధానం గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకునేదాన్ని. బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుందని అంటుంటే అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది. మా నాన్న పాల్వంచలోని కేటీపీఎస్కు తీసుకెళ్లేవారు. తరచూ కుటుంబంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవాళ్లం. భద్రాచలం రాములవారిని దర్శించుకోవడం, గోదావరి స్నానాలు చేయడం, పర్ణశాలను సందర్శించడం చిన్నప్పుడు భలేగా ఉండేది. పాపికొండలు, అక్కడి అడవులు, పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఎంతో హాయి గొలిపేది. అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్, కిన్నెరసాని ప్రాజక్టు అందాలను తిలకించటం ఆనందంగా ఉండేది. ఇల్లెందులో మా కార్మిక వాడ గ్రామాలకు భిన్నంగా ఉండేది. అన్ని వాడలకు రోడ్లు, చెట్లు, పార్కులు, కరెంటు, ఇతర సదుపాయాలు ఉండే వి. సెలవు రోజుల్లో సరదాగా స్నేహితులతో షటిల్, క్యారం, చెస్ ఆటలు ఆడుతూ బాల్యాన్ని ఎంజాయ్ చేశాను. -
కుమార్తెలకు నిప్పంటించి తండ్రి ఆత్మహత్య
ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వికలాంగులకాలనీలో దారుణం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ తండ్రి నిద్రిస్తున్న కుమార్తెలపై కిరోసిన్ పోసి నిప్పంటించి తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు కుమార్తెలు రేష్మ(11), రహీమా(6)లుమ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి అన్వర్ బాషా(38) చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. వివరాలు.. వికలాంగుల కాలనీలో నివాసముంటున్న అన్వర్ బాషా గురువారం రాత్రి తన భార్యతో గొడవ పడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవస్థీకృతమైన సంరక్షణ ఇది ఓ తల్లి ఆలోచన
మహిళా విజయం: రేష్మా పుట్టిల్లు బెంగళూరు... అత్తిల్లు హైదరాబాద్. యూఎస్‌లో ఉద్యోగం చేస్తూ ఓ పాపాయికి తల్లయ్యారు... ఇండియాకి వచ్చిన తర్వాత... రెండో బిడ్డను కన్నప్పుడు... ఆమె ముందు ఓ సవాల్ నిలిచింది. ఫలితంగా... ‘వియ్ కేర్’ ఆవిర్భవించింది. ‘‘నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. నాన్న డెంటిస్ట్, అమ్మ స్పెషల్ ఎడ్యుకేటర్(ప్రత్యేకమైన పిల్లలకు శిక్షణనిచ్చే టీచర్). నేను ‘వియ్ కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ను ప్రారంభించడానికి నా స్వీయానుభవమే కారణం. నేను పెళ్లి చేసుకుని అమెరికాలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పాప పుట్టింది. తనను డే కేర్ సెంటర్లో వదిలి ఉద్యోగం చేసుకున్నాను. బాబు పుట్టే నాటికి ఇండియాకి వచ్చేశాం. సత్యంలో సీనియర్ బిజినెస్ లీడర్‌గా ఉద్యోగం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత బాబును డే కేర్‌లో ఉంచడానికి అనువైన సెంటర్ కనిపించలేదు. ఆఫీసులో ఉన్నా ఇంటి గురించి, బిడ్డ గురించే ఆలోచన. బాబు కోసం ఉద్యోగంలో విరామం తీసుకోవాల్సి వచ్చింది. నాలాగ ఎందరో మహిళలు పిల్లల గురించి కెరీర్‌ను కోల్పోతున్నారనిపించింది. పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరినా కెరీర్ గ్రాఫ్‌లో పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. ఎదుగుదల, ప్రమోషన్ వంటి వాటికి దూరమవుతుంటారు. మహిళల్లో ఎక్కువ మంది పెద్ద స్థాయికి వెళ్లకపోవడానికి వారిలో నైపుణ్యం లేకపోవడం కాదు. పిల్లల కోసం తీసుకునే గ్యాప్ పెద్ద అగాధంగా మారుతోందనిపించింది. దాంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వియ్ కేర్’ను ప్రారంభించాను. ఐటీ ఉద్యోగాల్లో ఒత్తిడి, ఎక్కువ పని గంటలు ఉంటాయి కాబట్టి వారి మీదనే దృష్టి పెట్టాను. హైదరాబాద్‌లో తొలి సెంటర్‌ని గచ్చిబౌలిలో ఈ నెల ఆరవ తేదీన ప్రారంభించాను. - రేష్మా శ్రీనివాస్, ఎం.డి, వియ్‌కేర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యమైన సర్వీసే నా సక్సెస్! మొదటి సెంటర్‌ని బెంగళూరులో 2008లో హరిణి అనే పాపాయితో ప్రారంభించాను. ఆ ఏడాదిలోనే 60 మందికి చేరింది. డే కేర్‌తోపాటు ప్రీస్కూల్ కూడా నిర్వహించడంతో ఎక్కువ మందికి ఉపయుక్తంగా ఉంటోంది. ప్రస్తుతం ఆరు వారాల నుంచి పన్నెండేళ్ల వయసున్న పిల్లలు దాదాపుగా వెయ్యి మందికి పైగా మా సెంటర్లలో పెరుగుతున్నారు. మూడు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఉదయం ఎనిమిది గంటలకంతా వదిలేసి వెళ్తారు. వారికి పాలు, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిండ్లు, రాత్రి భోజనం అన్నీ పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లల డాక్టర్లు సూచించిన విధంగా ఇస్తాం. స్కూలు నుంచి వచ్చిన వారికి రిఫ్రెష్మెంట్, తినిపించడం, హోమ్ వర్క్ కూడా ఇక్కడే. దాంతో పేరెంట్స్ పిల్లలతో గడిపే కొద్ది సమయం కూడా క్వాలిటీగా గడుపుతున్నారు. హైదరాబాద్‌లో మరికొన్ని సెంటర్లను పెట్టిన తర్వాత వియ్‌కేర్ సేవలను చెన్నైకి విస్తరించాలనుకుంటున్నాను. ఆరు వారాలనే నియమం... పిల్లలు పుట్టిన తర్వాత ఆరు వారాల వరకు తల్లి స్పర్శను ఆస్వాదిస్తే ఇక వారు తల్లిని మర్చిపోరని నిపుణులు నిర్ధారించారు. ఆయాలు, నర్సుల చేతిలో ఎంతకాలం పెరిగినా తల్లి స్పర్శను గుర్తించగలగడానికే ఈ నియమం. రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి manjula.features@sakshi.com -
ఐకేపీ వీవోఏల ప్రదర్శన, ధర్నా
ఖమ్మం మయూరిసెంటర్: వేతన బకారులు విడుదల చేయాలన్న డిమాండుతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తున్న ఐకేపీ గ్రామ దీపికలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఐకేపీ వీవోఏల ఉద్యోగ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా ధర్నా చౌక్‌కు ప్రదర్శకులు చేరుకున్నారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా నాయకురాలు రేష్మా అధ్యక్షతన జరిగిన ఈ ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వీవోఏలపట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదని అన్నారు. వీరికి ప్రభుత్వం 17 నెలల వేతనాలు ఇవ్వాల్సుందన్నారు. వీటిని వెంటనే విడుదల చేయూలని అడిగేందుకు వెళుతున్న వీరిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం, లాఠీచార్జి జరపడం అప్రజాస్వామికమని అన్నారు. ఇన్ని నెలలపాటు వేతనాలు రాకపోతే గ్రామ దీపికలు ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. వీరికి ఆహార భద్రత కార్డులను రద్దు చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. వీరికి బకారుు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని, లేదా సంబంధిత మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ దీపికలకు ఐదువేల రూపాయల వేతనం ఇస్తామన్న ఎన్నికల హామీని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. గ్రామ దీపికలపట్ల మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. వేతన బకారుులు వెంటనే విడుదల చేయాలని, వేధింపులు మానుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.నరసింహారావు, ఉపాధ్యక్షులు గణపతి, టి.లింగయ్య, నాయకులు నీరజ, అరుణ, ఫణిరాజు, మోహన్‌రావు, బషీర్, టి.వెంకటేశ్వరరావు, నీలాద్రి, పద్మ, రాణి, వసంత, జయ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్యూట్ లవ్‌స్టోరీ
ప్రిన్స్, రేష్మీ జంటగా సూర్య చక్ర ఫిలింస్ పతాకంపై తాడి గనిరెడ్డి, కె. భువనేశ్వరి నిర్మిస్తున్న ‘నువ్వక్కడ నేనిక్కడ’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘అందాల రాముడు’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పి. లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రం ఉంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇందులో ఓ ముఖ్య పాత్రను బ్రహ్మానందంగారు చేస్తున్నారు. ఈ నెల 26న చిత్రీకరణ మొదలుపెడతాం.’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: జోషి, సంగీతం: చిన్ని చరణ్, ఎడిటింగ్: నందమూరి హరి. -
మా నాన్నే పుట్టారు!
గోపీచంద్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన భార్య రేష్మ మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ‘‘‘లౌక్యం’ విజయోత్సాహంలో ఉన్న మా ఇంట బాబు రాక ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. మా నాన్నే పుట్టారు’’ అని గోపీచంద్ సంబరపడిపోయారు. నేటి భారతం, ప్రతిఘటన, రేపటి పౌరులు లాంటి ఎన్నో సంచలన చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడే గోపీచంద్ అనే విషయం తెలిసిందే. -
షూటింగ్ లకు గోపిచంద్ స్వల్ప విరామం!
చెన్నై: 'లౌక్యం' చిత్ర విజయంతో మంచి ఊపు మీద ఉన్న టాలీవుడ్ నటుడు గోపిచంద్ నటనకు స్వల్ప విరామం ప్రకటించారు. కారణం గోపిచంద్ భార్య రేష్మా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడమే. ఇటీవలే శ్రీమంతం జరపుకున్న తన భార్యకు కొంత సమయాన్ని కేటాయించడానికి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు. గత కొద్ది వారాలు లౌక్యం చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఆరోగ్యం, బాగోగులతోపాటు తన భార్య రేష్మలో మానసిక ధైర్యాన్ని నింపడానికి కొన్ని వారాలు విరామం తీసుకుంటున్నట్టు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత సంవత్సరం గోపిచంద్ వివాహం రేష్మతో జరిగింది. లౌక్యం విజయం తర్వాత మరో చిత్రంలో నటించేందుకు గోపిచంద్ ఓకే చెప్పినట్టు సమాచారం. -
వాళ్లు కూడా మనుషులే...!
‘‘దేవుని సృష్టిలో ఆడ, మగ మాత్రమే కాదు, మూడో తెగ కూడా ఉంది. వాళ్లను రకరకాల పేర్లతో పిలుస్తోంది సమాజం. వాళ్లను మనుషుల్లో ఒకరిగా గుర్తించని పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. హిజ్రాలూ మనుషులే, వారికీ మనోగతాలుంటాయి... వ్యథలుంటాయి... ఆత్మాభిమానాలుంటాయని తెలిపే కథాంశంతో మేం తెరకెక్కించిన సినిమానే ‘థర్డ్ మేన్’’ అని హెచ్.ఎం.ఇమ్రాన్ (ఇంద్రమోహన్) చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో నటుడు పృధ్వీ హిజ్రాగా కీలక పాత్ర పోషించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 80 మంది హిజ్రాలు ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘హిజ్రాలకు కూడా చట్ట సభల్లో సమాన హక్కు కల్పించిన ఈ శుభ సందర్భంలో మా సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. ఇందులో మూడు పాటలు కూడా ఉంటాయి. ఇది నేను ఆత్మసంతృప్తి కోసం మాత్రమే తీసిన సినిమా. దీనికి ప్రభుత్వం నుంచి కూడా తగు గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ నెల రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. అలైఖ్య, పూజా, యాన, మల్లిక, షమ, రేష్మ, శ్రీదేవి, టీనా తదితర హిజ్రాలు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, సంగీతం: బొంబాయి బోలే, కెమెరా: ప్రసాద్ కొల్లి. -
యువతి దారుణ హత్య
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: బియ్యం తెస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరిన ఓ యువతి హత్యకు గురైంది. ఈ ఘటన రామచంద్రాపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉండే రేష్మ(20) ఏడో తరగతి వరకు చదువుకొని ఇంట్లోనే ఉంటుంది. ఆమె తల్లి షమీం భర్తతో విడిపోయి రామచంద్రాపురం పట్టణానికి వచ్చి జీవిస్తున్నారు. షమీం పారిశ్రామికప్రాంతంలోని ఓ పరిశ్రమలో హౌస్‌కీపింగ్ డిపార్టమెంట్లో పనిచేస్తుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా రేష్మా పెద్ద కూతు రు. మంగళవారం మధ్యాహ్నం బియ్యం తెస్తానని ఇంట్లో వారికి చెప్పి రేష్మ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఇదిలాఉండగా బుధవారం తెల్లవారుజామున భెల్ టౌన్‌షిప్‌లోని హోలిక్రాస్ జూనియర్ కళాశాల వెనక ముళ్ల పొదల్లో దారుణ హత్యకు గురై కనిపించిది. మృతదేహాన్ని చూసిన భెల్ పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రవీందర్‌రెడ్డి, వెంకట్, లోకేష్‌లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రేష్మ తలపై బలమైన ఆయుధంతో మోది హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేష్మ దుస్తులు కూడా సక్రమంగా లేకపోవడంతో ఈ హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రేష్మ మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కవిత సందర్శించారు. క్లూస్ టీం సం ఘటన స్థలానికి సందర్శించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు జరుపుతామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
పాక్ జానపద గాయనీ రేష్మా మృతి
పాకిస్థానీ ప్రముఖ జానపద గాయనీ రేష్మా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం లాహోర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె గత కొద్ది కాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతు నెలరోజులు క్రితం కోమాలో వెళ్లారని జియో టీవీ ఆదివారం వెళ్లడించింది. భారతదేశంలోని బికనీర్‌లోని బంజారా కుటుంబంలో రేష్మా జన్మించారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యానంతరం రేష్మా కుటుంబం పాక్ వలస వెళ్లి, కరాచీ నగరంలో స్థిరపడింది. జానపద గాయనీగా రేష్మా పాకిస్థానీయుల మనసులను చోరగున్నారు. -
అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడు
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: అదనపు కట్నం తెచ్చివ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను గొంతుకోసి, ఇంటికి తాళాలు వేసి పరారైన ఘటన బుధవారం మదనపల్లెలో వెలుగుచూసింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఎదురుగా పటేల్ రోడ్డుకు చెందిన ఖాదర్‌బాషా, రజియా దంపతుల కుమార్తె రేష్మ(22)ను సైదాపేటకు చెందిన ఇస్మాయేల్ కుమారుడు ఆటోడ్రైవర్ మహ్మద్‌జానీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన పెళ్లి చేశారు. వివాహ సమయం లో రూ.60వేల నగదు, 5తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. పెళ్లికి రూ.2లక్షలు ఖర్చు చేశారు. వారు కొంతకాలం సైదాపేటలోనే కాపురమున్నారు. నెలరోజుల క్రితం ఎగువకురవంకకు మారారు. మహ్మద్‌జానీకి మొబైల్ షాపు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిం ది. అదనపు కట్నం తేవాలని భార్యను వేధింపులకు గురిచేశాడు. కుమార్తె కాపురం సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికొచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులు ఎంతో కొంచెం ఇచ్చి పంపేవా రు. తనకు రూ.2లక్షలు తెచ్చిస్తేనే కాపురానికి రావాలని భార్యను పుట్టింటికి పంపించాడు. రెండు రోజులైనా భార్య రాకపోవడంతో ఆదివారం సాయంత్రం అత్తగారింటికి వెళ్లి వెంట తీసుకెళ్లాడు. డబ్బు విషయమై రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహించిన జానీ కత్తితో భార్య గొంతుకోసి హత్య చేశాడు. ఆ రో జు రాత్రి అక్కడే గడిపి ఇంటికి తాళాలు వేసుకుని నేరుగా అత్తగారింటికెళ్లాడు. ఇంటి బాడుగ కట్టాలని రూ.2వేలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు మంగళవారం సాయంత్రం కిటికీలో నుంచి చూడగా రేష్మ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృ తురాలి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని బిడ్డ మృతదేహంపై పడి బోరున విలపించా రు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ వంశీధర్‌గౌడ్, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తహశీల్దారు శివరామిరెడ్డి పంచనామా నిర్వహించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుకోసం బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు మొబైల్ షాపు పెట్టుకోవాలని డబ్బు తె మ్మని బిడ్డను పదేపదే ఇంటికి పంపేవా డు. పెళ్లి చేసి మేము అప్పటికే అప్పుల్లో ఉన్నాం. నిదానంగా ఆలోచిద్దామని చెప్పి ఇంటికి పంపాం. ఆ దుర్మార్గుడు డబ్బు కోసమే మా బిడ్డ గొంతుకోసి హత్య చేశాడు. వాడికీ అదే శిక్ష వేయాలి. - మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు