పాకిస్థానీ ప్రముఖ జానపద గాయనీ రేష్మా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం లాహోర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె గత కొద్ది కాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేష్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతు నెలరోజులు క్రితం కోమాలో వెళ్లారని జియో టీవీ ఆదివారం వెళ్లడించింది.
భారతదేశంలోని బికనీర్లోని బంజారా కుటుంబంలో రేష్మా జన్మించారు. 1947లో భారత్కు స్వాతంత్ర్యానంతరం రేష్మా కుటుంబం పాక్ వలస వెళ్లి, కరాచీ నగరంలో స్థిరపడింది. జానపద గాయనీగా రేష్మా పాకిస్థానీయుల మనసులను చోరగున్నారు.