కరాచీ: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుడులో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలింది.
విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ స్థానిక టీవీ ఛానల్ జియోకు తెలిపారు. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని అన్నారు. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ-మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్‌తో కలుపుతుంది.
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మహేసర్ మీడియాతో మాట్లాడుతూ తాము పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. గాయపడిన వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. హోం మంత్రి, ఇన్‌స్పెక్టర్ జనరల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారి రాహత్ హుస్సేన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment