
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ పైపలైన్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ ప్రైవేటు బ్యాంకు భవనం భారీగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతి చెందగా, 13 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ధ్వంసమైన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment