మన పురాణాల్లో ప్రతి దేవుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, అష్టదిక్పాలకులతో సహా అక్కడక్కడ అరుదైన దేవాలయాలు ఉన్నాయి. కానీ వర్ష దేవుడికి ప్రత్యేకంగా ఆలయం ఉన్నట్లు విన్నారా..?. మహా అయితే వర్షాలు రావాలని యజ్జ యాగాదులు వంటిటి చేయడం చూశాం. కానీ ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఆరాధించడం గురించి విన్నారా..?. మరీ ఇది ఎక్కడుందంటే..?
అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం ఇది. ఈ ఆలయం మనదేశంలో లేదు. పాకిస్తాన్‌లోని కరాచీ తీరంలోని మనోరా దీవిలో ఉంది. ఇక్కడి సింధీ ప్రజలు వరుణదేవుడిని భక్తిగా ‘ఝూలేలాల్’ పేరుతో కొలుచుకుంటూ ఉంటారు.
ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలిపే ఆధారాలేవీ లేవు. సింధ్ రాష్ట్రంలోనిభిరియా పట్టణానికి చెందిన సేఠ్ హర్‌చంద్‌మల్ దయాల్ దాస్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తోంది.
(చదవండి: ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!)
Comments
Please login to add a commentAdd a comment