ప్రేమ, పెళ్లి, విడాకులు! | jeelakarra bellam movie releases on 27th april | Sakshi
Sakshi News home page

ప్రేమ, పెళ్లి, విడాకులు!

Published Tue, Apr 26 2016 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

ప్రేమ, పెళ్లి, విడాకులు!

ప్రేమ, పెళ్లి, విడాకులు!

నేటి తరం యువతీయువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు కలిసుండాల్సిన వాళ్లు తీరా చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. తద్వారా బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? దీనికి పరిష్కారం ఏమిటి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జీలకర్ర -బెల్లం’. అభిజీత్, రేష్మ జంటగా శ్రీచరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘కామెడీ, క్రైమ్, రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం ద్వారా యువతకు మంచి సందేశం ఇస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది. ఈ నెల 29న మా సినిమాను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.

 ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య అహం వల్ల ఎలాంటి సమస్యలొచ్చాయి. చివరకు ప్రేమ గెలిచిందా? అహం గెలిచిందా? అన్నదే ఈ చిత్ర కథాంశం. సంగీతాన్ని ఆదరించినట్టు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని హీరో అభిజీత్ పేర్కొన్నారు. హీరోయిన్ రేష్మ, మాటల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమేరా: చిట్టిబాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement