ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చంపేశాడు | brutal murder In the balijapalle | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. చంపేశాడు

Published Mon, Jul 4 2016 1:01 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

brutal murder In the balijapalle

 సదుం మండలం బలిజపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కడతేర్చాడో కసాయి భర్త. వివరాలు..సదుం మండలం బలిజపల్లెకు చెందిన గణేశ్(26), మదనపల్లె మండలం తురకపల్లికి చెందిన రేష్మ(23)ను పెద్దలు ఒప్పుకోకపోయినా 2009లో మతాంతర వివాహం చేసుకున్నాడు.

 

వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. తరచూ గొడవపడుతుండేవారు. మరి ఏమైందో ఏమో కానీ గత నెల 12 వ తేదీన గణేశ్, అతని తండ్రి రెడ్డి స్వామి, పెదనాన్న వెంకట రమణ కలిసి రేష్మను కత్తితో పొడిచి చంపారు. అనంతరం వారి పొలాల్లో ఉన్న ఓ నీటి కుంటలో పూడ్చి పెట్టారు. ఈ విషయం రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చిపెట్టిన చోటుకు తీసుకెళ్లి శవాన్ని వెలికి తీశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement