డాక్టర్‌ గారు డ్యాన్స్‌ చేశారు! | Dr Darshini Reshma Pradeep dance video on viral | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ గారు డ్యాన్స్‌ చేశారు!

Published Sun, May 28 2023 12:30 AM | Last Updated on Sat, Jul 15 2023 3:23 PM

Dr Darshini Reshma Pradeep dance video on viral - Sakshi

పని ఒత్తిడిలో ఉన్న వారికి హాబీలే రిలాక్సేషన్‌. కర్నాటకలోని మంగళూరుకు చెందిన దర్శిని రేష్మా ప్రదీప్‌ డాక్టర్‌ కావాలనుకొని డ్యాన్సర్‌ కాలేదు. డాక్టర్‌ కావాలనుకున్న కలను నిజం చేసుకున్న దర్శిని ఎంత బిజీగా ఉన్నాసరే, తనలోని ‘నృత్యకళ’ను కాపాడుకుంటోంది. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసు తేలిక చేసుకోవడానికి ఆమె అనుసరించే మార్గం.. డ్యాన్స్‌. షారుక్‌ఖాన్‌ హీరోగా చేసిన ‘రా.వన్‌’ సినిమాలోని పాపులర్‌ సాంగ్‌ ‘చెమ్మక్‌ చెల్లో’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియో క్లిప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

‘ఐ లవ్‌ దిస్‌ పార్ట్‌ ఆఫ్‌ ది సాంగ్‌’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియోక్లిప్‌ 2.5 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘చెమ్మకు చెల్లో’ సాంగ్‌ సంగతి ఎలా ఉన్నా... దర్శిని డ్యాన్స్‌ స్టెప్పులను చూస్తుంటే మన ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా కులికే కుందనాలబొమ్మ’ వీణ స్టెప్పులు గుర్తుకొస్తున్నాయి. ‘గుడ్‌ డ్యాన్సింగ్‌’ ‘వాట్‌ ఏ లవ్లీ డ్యాన్స్‌’... మొదలైన కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement