షూటింగ్ లకు గోపిచంద్ స్వల్ప విరామం!
షూటింగ్ లకు గోపిచంద్ స్వల్ప విరామం!
Published Thu, Oct 9 2014 1:24 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
చెన్నై: 'లౌక్యం' చిత్ర విజయంతో మంచి ఊపు మీద ఉన్న టాలీవుడ్ నటుడు గోపిచంద్ నటనకు స్వల్ప విరామం ప్రకటించారు. కారణం గోపిచంద్ భార్య రేష్మా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడమే. ఇటీవలే శ్రీమంతం జరపుకున్న తన భార్యకు కొంత సమయాన్ని కేటాయించడానికి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు. గత కొద్ది వారాలు లౌక్యం చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.
ఆరోగ్యం, బాగోగులతోపాటు తన భార్య రేష్మలో మానసిక ధైర్యాన్ని నింపడానికి కొన్ని వారాలు విరామం తీసుకుంటున్నట్టు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత సంవత్సరం గోపిచంద్ వివాహం రేష్మతో జరిగింది. లౌక్యం విజయం తర్వాత మరో చిత్రంలో నటించేందుకు గోపిచంద్ ఓకే చెప్పినట్టు సమాచారం.
Advertisement
Advertisement