Loukyam
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
నో కంపేరిజన్!
గోపీచంద్ మంచి మాస్ హీరో... ఫ్యామిలీ హీరో. ‘లౌక్యం’తో తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడాయన కుటుంబ సమేతంగా అందరూ చూసే విధంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. దాదాపు పదకొండేళ్ల క్రితం గోపీచంద్‌తో ‘యజ్ఞం’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.యస్. రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. రెజీనా కథానాయిక. గోపీచంద్ హోమ్ బేనర్ లాంటి భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను రవికుమార్ చౌదరి చెబుతూ - ‘‘మా కాంబినేషన్లో వచ్చిన ‘యజ్ఞం’తో ఈ చిత్రాన్ని కంపేర్ చేయలేం. ఎందుకంటే, ఆ జానర్ వేరు.. ఇది వేరు. ఇది మంచి ఎమోషన్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. గోపి మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది. ఆయన కెరీర్లో అత్యంత భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే. మళ్లీ మా కాంబినేషన్లో ఓ హిట్ గ్యారంటీ. ఈ చిత్రకథ, కథనం బాగా కుదిరాయి కాబట్టే, ఇంత నమ్మకంగా చెబుతున్నాను. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రం షూటింగ్‌ని శరవేగంగా చేస్తున్నాం. ‘యజ్ఞం’తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, రవికుమార్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
మళ్లీ ‘లౌక్యం’
‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లౌక్యం’ బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ దగ్గర పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని జీ తెలుగు చానల్ మరోసారి ఈ ఆదివారం 6 గంటలకు ప్రసారం చేస్తోంది. -
యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!
‘‘దాదాపు ఏడాదిన్నర పాటు ‘లౌక్యం’ చిత్ర కథపై కసరత్తులు చేశాం. దానికి తగ్గ ప్రతిఫలం లభించింది. గోపీచంద్‌కి ఇది సొంత సంస్థ లాంటిది. విదేశాల్లో ఈ చిత్రం పాటలు చిత్రీకరించినప్పుడు గోపీచంద్ తానే నిర్మాతలా, ప్రొడక్షన్ మేనేజర్లా దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు చిత్ర నిర్మాత వి. ఆనందప్రసాద్. గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లౌక్యం’ చిత్ర అర్ధశతదినోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘ఇన్నాళ్లూ నేను లౌక్యంగా మాట్లాడింది లేదు. కానీ, ఈ చిత్రం చూసిన తర్వాత మాట్లాడక తప్పడం లేదు. ఈ ఎంటర్టైన్మెంట్ మూవీలో గోపీచంద్ అద్భుతంగా నటించాడు. రకుల్ అందంగా ఉంది. కోన వెంకట్, గోపీమోహన్ వినోదానికి మారుపేరు అనిపించుకున్నారు ‘అన్నమయ్య’ చిత్రానికి నా దగ్గర పని చేసిన శ్రీవాస్ ఈ చిత్రాన్ని గొప్పగా తీశాడు’’ అన్నారు. యాభై రోజుల పండగలు చూసి ఎన్నాళ్లయ్యిందో... ఇలాంటి వేడుకలు చాలా జరగాలని కోరుకుంటున్నానని శ్రీకాంత్ చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం రూపొందడానికి ప్రధాన కారకుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఈ మూడూ సినిమాకి ప్లస్ అయ్యాయి. శ్రీవాస్ చాలా లౌక్యంగా ఈ చిత్రం తీశాడు’’ అన్నారు. హీరోయిన్ని బాగా చూపించావని రాఘవేంద్రరావుగారు ప్రశంసిస్తే, దాసరిగారు అభినందిస్తూ మా యూనిట్ అందరికీ పుష్పగుచ్ఛాలు పంపించారని శ్రీవాస్ చెప్పారు. పంపిణీదారులుగా మారిన తనకు, శ్రీధర్ సీపాన, శ్రీవాస్‌కు ఈ చిత్రం మంచి అనుభూతిని మిగిల్చిందని రచయిత కోన వెంకట్ తెలిపారు. ఈ వేడుకలో అన్నేరవి, రచయిత శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. -
మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!
ప్రముఖ దర్శక-నిర్మాత దాసరి నారాయణ రావు పరోక్షంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోందని, పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులను తాను చూడలేదని, ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని అన్నారు. చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు కావాలని అడిగితే ''సినిమా రెడీ చేసి పెట్టుకో, వారం గ్యాప్ వస్తే వేసుకో, ఎప్పుడు ఖాళీ వస్తే అప్పుడు వేస్తాం'' అని అంటున్నారని చెప్పారు. 'లౌక్యం' సినిమా అద్భుతమైన వసూళ్లతో ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారన్నారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని, దాంతో మళ్లీ 'లౌక్యం' చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారని చెప్పారు. రామ్‌చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం గురించే దాసరి విమర్శించారని ఫిల్మ్‌నగర్ టాక్. 'లౌక్యం' మూవీ సెప్టెంబరు 26న విడుదలైంది. 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబరు 1న విడుదలైంది. దీనిని దృష్టిలోపెట్టుకొనే దాసరి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గతంలో కూడా ఒక సందర్బంలో దాసరి, రామ్‌చరణ్ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత దాసరి గానీ, రామ్ చరణ్ గానీ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు 'లౌక్యం' సినిమా బాగా ప్రదర్శిస్తున్నప్పటికీ రామ్‌చరణ్ చిత్రం కోసం దానిని థియేటర్లలో ఎత్తివేయడంతో దాసరి ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. ** -
మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!
-
టాలీవుడ్ లో రౌడీయిజం నడుస్తోంది: దాసరి
‘‘ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న నీచమైన పరిస్థితిని మునుపెన్నడూ నేను చూడలేదు’’ అని దర్శక - నిర్మాత డా. దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. నాగశౌర్య, అవికా గోర్ జంటగా రూపొందిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల రవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోంది. పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ‘లౌక్యం’ సినిమా అద్భుతమైన వసూళ్ల రాబడుతూ, ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదు. దాంతో మళ్లీ ‘లౌక్యం’ చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు’’ అన్నారు. సినిమా పరిశ్రమకు వారసులే కాదు ఎవరైనా రావొచ్చని దాసరి అన్నారు. ‘‘వారసులు రావడం తప్పు కాదు. కానీ, సినిమా మీద సినిమా తీసి వాళ్లను జనాల మీద రుద్దడం తప్పు. ‘అసలు ప్రస్తుతం పరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. థియేటర్లు దక్కించుకోవడం ముఖ్యం’’ అని దాసరి పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు కేఎం. రాధాకృష్ణన్, దర్శకుడు నంద్యాల రవి తదితరులు పాల్గొన్నారు. -
ఇండస్ట్రీలో రౌడీలు రాజ్యమేలుతున్నారు!!
-
షూటింగ్ లకు గోపిచంద్ స్వల్ప విరామం!
చెన్నై: 'లౌక్యం' చిత్ర విజయంతో మంచి ఊపు మీద ఉన్న టాలీవుడ్ నటుడు గోపిచంద్ నటనకు స్వల్ప విరామం ప్రకటించారు. కారణం గోపిచంద్ భార్య రేష్మా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడమే. ఇటీవలే శ్రీమంతం జరపుకున్న తన భార్యకు కొంత సమయాన్ని కేటాయించడానికి షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు. గత కొద్ది వారాలు లౌక్యం చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఆరోగ్యం, బాగోగులతోపాటు తన భార్య రేష్మలో మానసిక ధైర్యాన్ని నింపడానికి కొన్ని వారాలు విరామం తీసుకుంటున్నట్టు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత సంవత్సరం గోపిచంద్ వివాహం రేష్మతో జరిగింది. లౌక్యం విజయం తర్వాత మరో చిత్రంలో నటించేందుకు గోపిచంద్ ఓకే చెప్పినట్టు సమాచారం. -
'బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు'
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను చకిలగింతలు పెట్టిన నటుడు పృథ్వీరాజ్ . గోపిచంద్ హీరోగా తాజా విడుదలైన 'లౌక్యం' చిత్రంలో పృథ్వీరాజ్ టీవీ యాంకర్ పాత్రలో ఒదిగిపోయారు. 'బాయిలింగ్ స్టార్ బబ్లూ' పాత్రలో పృథ్వీ ఇరగదీశాడంటూ అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పాత్రలో ఒదిగిపోయి తీరు... డైలాగులు పలికిన విధానంతోపాటు నటన అద్భుతంగా ఉన్నాయని పృథ్వీని సీని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. పృథ్వీ పాత్ర లౌక్యం చిత్రానికే హైలైట్ అని ప్రేక్షక్షులు తెలుపుతున్నారు. గోపిచంద్, రుకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించి లౌక్యం గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు. సినిమా మధ్యమధ్యలో ఎక్కడైనా కాస్త ఇబ్బందిగా అనిపించినా వెంటనే మళ్లీ పృథ్వీ రంగప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని సినిమా రివ్యూలు కూడా చెబుతున్నాయి. -
సినిమా రివ్యూ: లౌక్యం
దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు? పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. డైలాగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్రహ్మానందం, పృథ్వీ కామెడి సెకండాఫ్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, కథనాలు మ్యూజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్: గోపిచంద్‌కు వెంకీ పాత్ర రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. సాంకేతికవర్గాల పనితీరు: అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. ముగింపు: కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది. బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. -రాజబాబు అనుముల -
అందుకే మా జిల్లాలో నేనే పంపిణీ చేస్తున్నా
‘‘భవ్య క్రియేషన్స్ సంస్థలో నేను చేసిన ‘వాంటెడ్’ ఆశించిన ఫలితం సాధించలేదు. అందుకే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మళ్లీ ఆ సంస్థలో సినిమా చేద్దామనగానే.. ఈసారి నిర్మాతగా ఆనందప్రసాద్‌గారు సంతృప్తిపడే సినిమా ఇవ్వాలనుకున్నాను. చాలా కథలు విన్న తర్వాత శ్రీధర్ సీపాన చెప్పిన కథ బాగా నచ్చి, అంగీకరించాను. ఈ కథకు దర్శకుడిగా శ్రీవాస్ అయితే బాగుంటుందనుకున్నాం. ఆ తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్‌లను పిలిపించి స్క్రీప్‌ప్లే తయారు చేయించాం. ఇందులో నాది చాలా మంచి పాత్ర’’ అని గోపీచంద్ చెప్పారు. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘లౌక్యం’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ వేడుకలో శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘ ‘లౌక్యం’ కథ వినగానే హిట్ అనే నమ్మకం కలిగి చేశాం. గోపీచంద్‌తో మంచి కుటుంబ కథా చిత్రం తీయాలనే ఆశయంతో చేసిన సినిమా ఇది. ఆయన మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది. నేనీ చిత్రాన్ని తూర్పు గోదావరి జిల్లాలో పంపిణీ చేయబోతున్నాను’’ అన్నారు. గోపీచంద్‌తో తనకిది తొలి చిత్రమని, ఆయన కెరీర్లో ‘ది బెస్ట్’ సినిమా ఇదని, ఈ చిత్రం మీద నమ్మకంతో గుంటూరులో విడుదల చేస్తున్నానని రచయిన కోన వెంకట్ చెప్పారు. గోపీచంద్‌తో చేసిన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించడం ఖాయమని ఆనందప్రసాద్ అన్నారు. బ్రహ్మానందం, అన్నే రవి, అనూప్ రూబెన్స్, శ్రీధర్ సీపాన, రఘు, వెట్రి, పృథ్వీ, అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. -
'లౌక్యం' టీంతో సాక్షి చిట్‌చాట్
-
ఎవ్వరూ ఎవ్వరికీ బ్రేకివ్వలేదు!
-
అలా చేస్తే.. వాళ్ళకే ప్రమాదం!
-
శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించిన కోన వెంకట్!
సినిమా పరిశ్రమలో విభేదాలు సర్వ సాధారణమే. అయితే తాజాగా మాటల రచయిత కోన వెంకట్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య విభేదాలు చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీశాయి. ఈ చర్చకు కారణం వీరద్దరూ సుమారు 10 సంవత్సరాలు కలిసి పనిచేసి టాలీవుడ్ కు విజయవంతమైన చిత్రాలను ఆందించారు. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన 'ఆగడు' చిత్రానికి కోన వెంకట్ మాటలు అందించలేదు. ప్రస్తుతం కోన వెంకట్ 'లౌక్యం' చిత్రానికి మాటలు రాశారు. లౌక్యం చిత్ర ప్రమోషన్ సందర్బంగా సాక్షి టెలివిజన్ లో చిట్ చాట్ చేస్తూ శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించారు. శ్రీను వైట్లతో నా ట్రావెల్ పది సంవత్సరాలు. మేమిద్దరం కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించాం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఫ్రెండ్లీగా విడిపోయాం. నాకు శ్రీను లైఫ్ ఇవ్వలేదు. నేను శ్రీనుకి లైఫ్ ఇవ్వలేదు. సత్య చిత్రంతో నేను హిట్ సొంతం చేసుకున్నారు. 'ఆనందం' లాంటి మంచి చిత్రాన్ని అందించారు. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని కోన వెంకట్ తెలిపారు. -
ఆ విలువ తెలుసు కాబట్టే గుర్తింపిచ్చారు!
-
లౌక్యం మూవీ వర్కింగ్ స్టిల్స్
-
లౌక్యం మూవీ పోస్టర్స్
-
లౌక్యం మూవీ న్యూ స్టిల్స్
-
లక్ష్యం కోసం లౌక్యం
‘‘కృష్ణుడి బుద్ధిబలం, కర్ణుడి గుండెబలం, భీముడి కండబలం... ఈ మూడూ ఒక్కడిలోనే ఉంటే వాడెలా ఉంటాడో, ‘లౌక్యం’లో గోపీచంద్ అలా ఉంటాడు. సందర్భానుసారం స్పందించడం ఇందులో గోపీచంద్ పాత్ర ప్రత్యేకత. ఆ స్పందించే తీరులోని విభిన్న అంశాలే ఈ చిత్రానికి హైలైట్స్’’ అంటున్నారు దర్శకుడు శ్రీవాస్. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర దశలో ఉంది. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘గోపీచంద్‌లోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో యాక్షన్ అబ్బురపరిచేలా ఉంటుంది. క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అనూప్ రూబెన్స్ మంచి పాటలు ఇచ్చారు. వచ్చేవారం పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్‌పై స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించిన మూడు పాటలతో షూటింగ్ పూర్తయిందని, గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, కథనం: కోన వెంకట్, గోపీమోహన్, కెమెరా: వెట్రి, కూర్పు: శేఖర్. -
గోపీచంద్ 'లౌక్యం' టీజర్
-
లౌక్యం మూవీ స్టిల్స్
-
స్విస్‌లో రొమాన్స్
గోపీచంద్‌ని ఆయుధంగా చేసుకొని తొలి సినిమాతోనే అనుకున్న ‘లక్ష్యం’ని సూటిగా చేధించారు. దర్శకుడు శ్రీవాస్. గట్స్ ఉన్న కుర్రాడిగా ‘లక్ష్యం’లో గోపీచంద్ అభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. మళ్లీ వీరిద్దరి కలయిక అనగానే... మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు మామూలే. ఈ దఫా గోపీచంద్‌ని ‘లౌక్యం’ గల కుర్రాడిగా చూపించబోతున్నారు శ్రీవాస్. సాధ్యమైనంతవరకూ ఎలాంటి సమస్యనైనా లౌక్యంతో అధిగమించేయడం గోపీచంద్ పాత్ర ప్రత్యేకత. బుద్ధిబలంలో కృష్ణుడైతే.. కండబలంలో భీముడన్నమాట. గోపీచంద్ కోసమే అన్నట్లుగా ఈ పాత్రను తయారు చేసుకున్నారు శ్రీవాస్. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘స్వీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. అనూప్ స్వరాలు క్లాస్‌తో పాటు మాస్‌ని కూడా ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ఈ నెల 20 నుంచి గోపీచంద్, రకుల్ప్రీత్లపై స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించే మూడు రొమాంటిక్ సాంగ్స్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ, సెప్టెంబర్ తొలివారంలో పాటలను, మూడో వారంలో సినిమాను విడుదల చేస్తామనీ ఆనందప్రసాద్ తెలిపారు. -
సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు...
‘‘ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇది’’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లౌక్యం’. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఐటెమ్ సాంగ్‌ను హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. ‘సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు’ అనే చంద్రబోస్ విరచిత గీతాన్ని శంకర్ నృత్య దర్శకత్వంలో గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్, హంసానందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, సంపత్‌రాజ్, ప్రగతి తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి కుటుంబ తరహా వినోదాత్మక చిత్రమిది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్ కాంబినేషన్లో నేను చేస్తున్న సినిమా ఇది. యూరప్‌లో 3 పాటలు చిత్రీకరించబోతున్నాం. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘సరైన పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందుతున్న సమయంలో ఇందులో నాకు మంచి పాత్ర దొరికింది. నాతో తొలి సినిమా చేసిన నాయికలే కాదు, నాయకులు కూడా విజయం సాధించారనడానికి నాగార్జున, గోపీచంద్లే ఉదాహరణ’’ అని చంద్రమోహన్ చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సంపత్‌రాజ్, ప్రగతి, హంసానందిని తదితరులు మాట్లాడారు. -
గోపీచంద్, హంసానందిని లౌక్యం ఐటమ్ సాంగ్ స్టిల్స్
-
లౌక్యం గల కుర్రాడు
లౌక్యం, చాకచక్యం కలగలిస్తే ఆ కుర్రాడు. సాధ్యమైనంతవరకూ సమస్యను బుద్ధిబలంతోనే అధిగమించడం అతని స్టైల్. అలా సాధ్యం కాకపోతే... అప్పుడు అతనిలోని మరో మనిషి బయటకొస్తాడు. వాడికి బుద్ధిబలంతో పని లేదు. మదపుటేనుగులను సైతం మట్టి కరిపించగల కండబలం వాడి సొంతం. ఇక సమస్యలన్నీ పలాయనం చిత్తగించాల్సిందే. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో గోపీచంద్ పాత్ర చిత్రణ ఇలాగే ఉంటుంది. ఈ సినిమాకు ‘లౌక్యం’ అనే పేరును ఖరారు చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘గోపీచంద్ ‘లక్ష్యం’తోనే నా కెరీర్ మొదలైంది. మళ్లీ ఆయనతో సినిమా అంటే.. అంచనాలు అధికంగా ఉంటాయి. దానికి తగ్గట్టే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. హీరో పాత్రకు తగ్గట్టుగా ‘లౌక్యం’ అనే పేరును ఖరారు చేశాం. ఆగస్ట్ 5 నుంచి పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. గోపీచంద్, హంసానందినిపై ప్రత్యేక గీతంతో పాటు, హీరోహీరోయిన్లపై ఫారిన్లో పాటలను తీస్తాం. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన బాణీలను అందించారు. సెప్టెంబర్ తొలివారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.