శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించిన కోన వెంకట్!
సినిమా పరిశ్రమలో విభేదాలు సర్వ సాధారణమే. అయితే తాజాగా మాటల రచయిత కోన వెంకట్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య విభేదాలు చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీశాయి. ఈ చర్చకు కారణం వీరద్దరూ సుమారు 10 సంవత్సరాలు కలిసి పనిచేసి టాలీవుడ్ కు విజయవంతమైన చిత్రాలను ఆందించారు. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన 'ఆగడు' చిత్రానికి కోన వెంకట్ మాటలు అందించలేదు. ప్రస్తుతం కోన వెంకట్ 'లౌక్యం' చిత్రానికి మాటలు రాశారు. లౌక్యం చిత్ర ప్రమోషన్ సందర్బంగా సాక్షి టెలివిజన్ లో చిట్ చాట్ చేస్తూ శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించారు.
శ్రీను వైట్లతో నా ట్రావెల్ పది సంవత్సరాలు. మేమిద్దరం కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించాం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఫ్రెండ్లీగా విడిపోయాం. నాకు శ్రీను లైఫ్ ఇవ్వలేదు. నేను శ్రీనుకి లైఫ్ ఇవ్వలేదు. సత్య చిత్రంతో నేను హిట్ సొంతం చేసుకున్నారు. 'ఆనందం' లాంటి మంచి చిత్రాన్ని అందించారు. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని కోన వెంకట్ తెలిపారు.