సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు... | Hamsanandini shakes a leg with Gopichand | Sakshi
Sakshi News home page

సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు...

Published Tue, Aug 5 2014 11:32 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు... - Sakshi

సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు...

‘‘ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇది’’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లౌక్యం’. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఐటెమ్ సాంగ్‌ను హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.
 
 ‘సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు’ అనే చంద్రబోస్ విరచిత గీతాన్ని శంకర్ నృత్య దర్శకత్వంలో గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్, హంసానందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, సంపత్‌రాజ్, ప్రగతి తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో గోపీచంద్ మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి కుటుంబ తరహా వినోదాత్మక చిత్రమిది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్ కాంబినేషన్‌లో నేను చేస్తున్న సినిమా ఇది.
 
  యూరప్‌లో 3 పాటలు చిత్రీకరించబోతున్నాం. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘సరైన పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందుతున్న సమయంలో ఇందులో నాకు మంచి పాత్ర దొరికింది. నాతో తొలి సినిమా చేసిన నాయికలే కాదు, నాయకులు కూడా విజయం సాధించారనడానికి నాగార్జున, గోపీచంద్‌లే ఉదాహరణ’’ అని చంద్రమోహన్ చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సంపత్‌రాజ్, ప్రగతి, హంసానందిని తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement