Sriwass
-
గోపీచంద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీకి వచ్చేస్తోన్న రామబాణం!
మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. (ఇది చదవండి: బాలీవుడ్లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! ) మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..) -
గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం' మూవీ రివ్యూ) ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 5 తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్విటర్ వేదికగా వీడియోలను పంచుకున్నారు. (ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!) -
గోపీచంద్ సినిమా టైటిల్ గురించి బాలకృష్ణ ని అగిడితే...
-
రామబాణం బడ్జెట్ రుమౌర్స్ ఫై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్
-
డిరైక్టర్ శ్రీవాస్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
'రామబాణం'తో వస్తున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్బంగా గోపీచంద్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్కీ అనే పవర్ఫుల్ పాత్రలో గోపీచంద్ లుక్ ఆకట్టుకుంటోంది. 'విక్కీస్ ఫస్ట్ యారో' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రామబాణంలో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. ఈ వీడియో చూస్తే ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైట్స్ చూస్తే పూర్తి యాక్షన్‌ను తలపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు బలమైన కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నామని అర్థమవుతోంది. విక్కీస్ ఫస్ట్ యారో వీడియో ప్రేక్షకుల్లో అంచనాలను భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 వేసవి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
‘జీరో’ని నమ్ముకున్న హీరో.. గోపీచంద్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
ఆసెంటిమెంట్ను వదలను అంటున్నాడు మాచోస్టార్ గోపీచంద్. తన అపజయాలకు బ్రేక్ వేయాలి అంటే..పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. నెక్ట్స్ సినిమాకు కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఇంతకీ..మాచో స్టార్ సెంట్ మెంట్ ఏంటి అంటారా? ‘సున్నా’. ఇప్పుడు ఈ హీరో జీరోని నమ్ముకుంటున్నాడు. గోపీచంద్ కు జయం,వర్షం సినిమాలు విలన్ గా పేరు తీసుకువస్తే,యజ్నం,రణం,లక్ష్యం,సాహసం,లౌక్యం లాంటి సినిమాలు హీరోగా నిలబెట్టాయి. ఈ సినిమాలన్ని గోపి హిట్ లిస్ట్‌లోకి వచ్చాయి. గోపీకి గుర్తింపు తెచ్చిన సినిమాల టైటిల్స్ చివరలో సున్నా ఉండటం విశేషం. సున్నా టైటిల్స్ తో ఎండ్ అయినా సినిమాలు..హిట్ కావటంతో..గోపీచంద్ కూడా ఇది సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు. టైటిల్స్ చివరలో సున్నా లేకుండా ఒంటరి,వాంటెడ్, జిల్,ఆక్సిజన్,చాణక్య ,అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలలో నటించాడు .ఈ సినిమాలన్ని డిజాస్టర్ లిస్ట్‌లోకి ఎక్కాయి. ఇలా సున్నా టైటిల్ తో ఎండ్ అయిన సినిమాలు విజయం సాధించటంతో..తన రాబోతున్న సినిమాకు కూడా పేరు చివరలో సున్నా వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశాడు. గోపీచంద్ ప్రస్తుతం..శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం,లౌక్యం లాంటి హిట్లు వచ్చాయి .ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ చివరలో సున్నా వచ్చేలా..రామ బాణం టైటిల్ ఫిక్స్ చేశారట. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు,ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి గోపీచంద్ నమ్ముకున్న సున్నా సెంటిమెంట్ వర్కౌట్ అయి..రామ బాణం విజయం సాధిస్తుందో లేదో చూడాలి. -
Gopichand 30: గోపిచంద్, శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ‘లక్ష్యం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమైయ్యారు శ్రీవాస్. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చి న మరో చిత్రం ‘లౌక్యం’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో హాట్రిక్ ఫిల్మ్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ కెరీర్లో ఇది 30వ చిత్రం. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. విభిన్నమైన జానర్ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. గోపీచంద్ 30వ చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్‌ను గమనిస్తే..కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి మరియు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్ కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. ఈ అంశాలు గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ థర్డ్ ఫిల్మ్‌పై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్ ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వం వహిస్తున్న‘పక్కా కమర్షియల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన 30వ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకు గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. We are happy to associate with the sensational hattrick combo @YoursGopichand & @DirectorSriwass for #Gopichand30. Produced by @vishwaprasadtg, co-produced by @vivekkuchibotla under @peoplemediafcy banner. A complete family entertainer, Shoot begins soon! pic.twitter.com/5W6X3WwSkJ — People Media Factory (@peoplemediafcy) July 14, 2021 -
దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం
సాక్షి, రాజమండి: టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ, హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఇటీవల మరణించారు. (ప్రముఖ దర్శకుడికి పితృవియోగం) -
బెల్లంకొండ కెరీర్ బెస్ట్ ‘సాక్ష్యం’
యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సాక్ష్యం. జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన శ్రీనివాస్ కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. పుల్ రన్లో ‘సాక్ష్యం’ బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాల రికార్డ్లను తిరగరాస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యంగ్ హీరో తొలి చిత్రం అల్లుడు శీను పుల్‌రన్‌లో 70 కోట్ల గ్రాస్ వసూళు చేయగా జయ జానకి నాయక దాదాపు 80 కోట్ల గ్రాస్ సాదించింది. ఇప్పుడు సాక్ష్యం ఆ రెండు చిత్రాల కలెక్షన్లు దాటేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. పంచ భూతల నేపథ్యంలో యాక్షన్ డ్రామగా తెరకెక్కిన సాక్ష్యం సినిమా బీసీ సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సాయి శ్రీనివాస్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా లో జగపతి బాబు, మీనా, శరత్ కుమార్, జయప్రకాష్, అశుతోష్ రానా, రవికిషన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘సాక్ష్యం’ మూవీ రివ్యూ
టైటిల్ : సాక్ష్యం జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అశుతోష్ రానా సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్ దర్శకత్వం : శ్రీవాస్ నిర్మాత : అభిషేక్ నామా అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమాతో సూపర్ హిట్ సాధించి మంచి ఫాంలో ఉన్నాడు. అదే జోరులో శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యం సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి బెల్లంకొండకు సక్సెస్ అందించిందా..? ఇప్పటి వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాతో భారీ యాక్షన్ చిత్రాలను కూడా డీల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడా..? కథ ; రాజు గారు (శరత్‌కుమార్) స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతంలో ఉండే పెద్ద మనిషి. అదే ప్రాంతంలో ఉండే మును స్వామి (జగపతి బాబు) అతని తమ్ముళ్లు చేసే అన్యాయాలను ఎదిరిస్తుంటారు. ఇది సహించలేని మునుస్వామి మొత్తం రాజుగారి కుటుంబాన్ని చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి తీసుకెళ్లి కాశీలో వదిలేస్తాడు. (సాక్షి రివ్యూస్) పిల్లలు లేని శివ ప్రకాష్ (జయ ప్రకాష్) దంపతులు ఆ పిల్లాడికి విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. శివ ప్రకాష్‌కు విదేశాల్లో వ్యాపారాలు ఉండటంతో విశ్వా కూడా అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. అడ్వంచరస్ లైఫ్‌ను ఇష్టపడే విశ్వా రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అక్కకు తోడుగా ఉండేందుకు అమెరికా వచ్చిన సౌందర్య లహరి(పూజ హెగ్డే) ప్రవచనాలు చెపుతుండగా చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇండియన్ ట్రెడిషన్ పై తాను చేసే ఓ వీడియో గేమ్ కు సాయం చేయమని సౌందర్యను అడుగుతాడు. సౌందర్య.. వాల్మీకి (అనంత శ్రీరామ్) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో ఓ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్ చెప్తాడు. అదే సమయంలో విశ్వ, సౌందర్యలు చిన్న అపార్థం కారణంగా విడిపోతారు. సౌందర్య ప్రేమకోసం ఇండియా వచ్చిన విశ్వను పంచభూతాలు ఎలా నడిపించాయి..? తనకు తెలియకుండా తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని విశ్వ ఎలా అంతమొందించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు మంచి పరిణితి చూపిస్తున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యంలో మరింతగా మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్ లు ఇరగదీశాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాకు తనవంతుగా పూర్తి న్యాయం చేశాడు. సౌందర్య లహరి పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. నటనపరంగా ఓకే అనిపించినా గ్లామర్, లుక్స్‌తో సూపర్బ్ అనిపించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా జగపతి బాబు మరోసారి తన మార్క్ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మంచి విలనిజం పండించారు. జగపతి బాబు తమ్ముళ్లుగా నటించిన అశుతోష్ రానా, రవికిషన్‌లు కూడా తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, రావూ రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; పంచభూతాలే ప్రతీకారం తీర్చుకుంటాయన్న డిఫరెంట్ (ఫాంటసీ) కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు గత చిత్రం జయ జానకీ నాయకతో వచ్చిన మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో కథ నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్ చేసిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నడిపించాడు. (సాక్షి రివ్యూస్)హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కథనం మధ్యలో స్పీడు బ్రేకర్లలా మారి ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అభిషేక్ నామా ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; కథనం మధ్యలో ఇబ్బంది పెట్టే పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కన్ఫామ్ చేసిన ‘సాక్ష్యం’ టీం
సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. గతం కొద్ది రోజులుగా సాక్ష్యం సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో జంతువులు, పక్షులను వినియోగించినందున సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ సాక్ష్యం టీం సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. -
‘సాక్ష్యం’ మూవీ స్టిల్స్
-
‘సాక్ష్యం’ ఆడియో వేడుక
‘జయ జానకి నాయక’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బెల్లకొండ శ్రీనివాస్. తన తదుపరి చిత్రంగా ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ ప్రొడ్యుసర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా ఆడియో వేడుకను జూలై 7న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. పంచభూతాలే సాక్ష్యం అంటూ ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఒక్క పాటకు ఐదుగురు దిగ్గజాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఐదుగురు గాయకులు కలిసి ఆలపిస్తున్నారు. పంచభూతల నేపథ్యంలో వచ్చే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, ఏసుదాసు, హరిహరన్, కైలాష్‌ఖేర్, బాంబే జయశ్రీ లు పాడటం విశేషం. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూన్ 14నే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినా.. గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు. శరత్‌కుమార్, మీనా, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో విజయాన్ని నమోదు చేయటం ఖాయం అని భావిస్తున్నారు. -
ఒక సినిమా.. ఐదు క్లైమాక్స్‌లు
జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఐదు క్లైమాక్స్‌లను ప్లాన్ చేశారట. పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రతీ ఫైట్ క్లైమాక్స్ అనిపించేంత భారీగా తెరకెక్కించారు. యాక్షన్ కొరియెగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఒక్క ఫైట్‌ను ఒక్కో థీమ్‌తో డిఫరెంట్‌గా రూపొందించారట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా శరత్ కుమార్, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సాక్ష్యం’ నుంచి సౌందర్య లహరి సాంగ్
బడా నిర్మాత బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ హీరోకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ యువ హీరో మొదట్నుంచీ స్టార్ హీరోయిన్లతోనే జతకడుతున్నారు. గతేడాది జయ జానకి నాయకా అంటూ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈరోజు (మే 4) సినిమాలోని మొదటి సాంగ్‌ను రిలీజ్ చేశారు. లహరి ..లహరి..అంటూ సాగే ఈ మెలొడిసాంగ్ను అందమైన లొకేషన్లో తెరకెక్కించినట్లు లిరికల్ వీడియో సాంగ్ చూస్తే తెలుస్తోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత సారథ్యంలో... జితిన్, ఆర్తిలు ఆలపించారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. -
‘సాక్ష్యం’ మొదటి సాంగ్ విడుదల
-
‘సాక్ష్యం’ టీజర్ విడుదల
-
‘సాక్ష్యం’ టీజర్ వచ్చేసింది..!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. భారీ బడ్జెట్ తో అదే స్థాయి తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకుండానే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనువిందు చేయనున్నాయి. సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సాక్ష్యం టీజర్ ఎప్పుడంటే..!
జయ జానకి నాయక సినిమా తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకుండానే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనువిందు చేయనున్నాయి. సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘సాక్ష్యం’ శాటిలైట్ రైట్స్‌కు రికార్డ్ ప్రైజ్
జయ జానకి నాయక సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు బిజినెస్ పరంగానూ సాక్ష్యం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న సాక్ష్యం సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్ సృష్టించింది. దీంతో థియేటర్ హక్కలు కాకుండానే 13కోట్లకు పైగా బిజినెస్ సాధించింది సాక్ష్యం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనువిందు చేయనున్నాయి. ఈ సీన్స్‌కు సంబంధించిన ఫుటేజ్ చూసిన జీ న్యూస్ సంస్థ ఇంత భారీ మొత్తం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మే 11న ‘సాక్ష్యం’
‘జయ జానకి నాయక’ సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 11 రిలీజ్ కానున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ప్రేమికుల రోజు సందర్భరంగా రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయటం మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన భారీ సెట్లో క్లైమాక్స్‌కు సంబంధించిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. శ్రీవాస్ అందించిన కథా కథనాలపై మాకు చాలా నమ్మకముంది. హీరో శ్రీనివాస్ కూడా సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. పూజాతో చేసిన రొమాంటిక్ సీన్స్ తో పాటు అడ్వంచరస్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ అమెరికా వెళ్లనుంద’ని తెలిపారు. -
‘ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి’
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల లుక్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా రివీల్ చేశారు చిత్రయూనిట్. దాదాపుగాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26నే రిలీజ్ చేయాలని భావించినా వాయిదా పడింది. తాజాగా హీరోహీరోయిన్ల లుక్‌ను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రేమికుల రోజే కరెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ ఈ రోజు (ఫిబ్రవరి 14) ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి అనే కాన్పెప్ట్ తో రూపొందించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మరో స్టార్ హీరోయిన్‌తో..!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతోనే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్, సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో కలిసి పని చేశాడు శ్రీనివాస్. అంతేకాదు ఈ సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడాడు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌తో జోడి కట్టి తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీనివాస్ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సాక్ష్యం తరువాత చేయబోయే రెండు సినిమాలను ఇప్పటికే ఫైనల్ చేశాడు శ్రీనివాస్. ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు కొత్త దర్శకుడు నానిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ హీరోయిన్గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
రిపబ్లిక్ డేకి ‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సంక్రాంతికి ‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్షం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
దుబాయ్ లో ‘సాక్ష్యం’ షూటింగ్
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్, యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘సాక్ష్యం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ రామోజీ ఫీలిం సిటీలో, పొల్లాచిలో, వారణాసి, హోస్ పేటలో కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ సీక్వెన్స్ ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో తెరకెక్కించిన చిత్ర బృందం తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘హైద్రాబాద్, పొల్లాచి, వారణాసి, హోస్ పేట వంటి ప్రాంతాల్లో భారీ క్యాస్టింగ్ తో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరిపాం. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నాం. అలాగే.. పూజా హెగ్డే, జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. వేసవి కానుకగా ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం’ అన్నారు. -
బెల్లంకొండ కొత్త సినిమా అప్ డేట్స్
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్, యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇటీవలే వారణాసిలో 15 రోజుల యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొన్న ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. 'ఆ శివుని ఆశీస్సులతో వారణాసి షెడ్యూల్ పూర్తయ్యింది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఈ పోరాట సన్నివేశాలను పిక్చరైజ్ చేశాం. హీరోహీరోయిన్లు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డేలతోపాటు జయప్రకాష్, సూర్య, అశుతోష్ రాణా, పవిత్ర లోకేష్ వంటి ఆర్టిస్టులు కూడా పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కూడా తీశాం. బలమైన కథా కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఈ మూవీ రూపొందుతోంది. శ్రీవాస్ చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు, తెలుగులో ఇది చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందమంతా కష్టపడి పనిచేస్తోంది' అన్నారు. -
హీరో తల్లిగా మీనా..!
జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో హీరో తల్లిగా ఓ అందాల తార నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. తరువాత టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన మీనా, శ్రీవాస్, బెల్లంకొండ సినిమాలో హీరోగా తల్లిగా నటిస్తోంది. అయితే హీరో చిన్నప్పటి సీన్స్ వరుకు మాత్రమే మీనా కనిపిస్తుందా..? లేక సినిమా అంత కనిపిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో తల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. కీలకమైన ఆ సీన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. -
బెల్లంకొండ కోసం బాలీవుడ్ హీరోయిన్
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ్ శ్రీనివాస్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) విలన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. ''డిక్టేటర్' తరువాత నా దర్శకత్వంలో తెరకెక్కనున్న 6వ చిత్రమిది. ఒక డిఫరెంట్ జోనర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా సరికొత్త రీతిలో ప్రెజంట్ చేయనున్నాను. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా.. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా రూపొందించనున్నాం. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహించనుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ పీటర్ హైన్స్ ఫైట్స్‌ను డిజైన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ రోజు నుంచి(మంగళవారం) రామోజీ ఫిలిమ్ సిటీలో రెగ్యులర్ షూట్ ప్రారంభించాం. తర్వాత ఒక మేజర్ షెడ్యూల్ ను ఫారిన్లో ప్లాన్ చేస్తున్నాం. ఓ బాలీవుడ్ హీరోయిన్ను బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాం' అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా మాట్లాడుతూ.. 'శ్రీవాస్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండడం.. ఇప్పుడు ఈ ప్రోజెక్ట్ ఇలా సెట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కథకి తగినట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్‌ను వేశాం. బెల్లంకొండ శ్రీనివాస్‌తోపాటు శ్రీవాస్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది.' అన్నారు. -
'డిక్టేటర్' మూవీ రివ్యూ
సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్తో మరోసారి పండుగ రేస్ లో నిలిచాడు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌లో తెరకెక్కిన డిక్టేటర్ మరో రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతోంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా...? డిక్టేటర్‌గా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించాడా..? కథ : చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్‌తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు. ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్‌తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటులు : చంద్రశేఖర్ ధర్మగా పవర్ఫుల్ రోల్లో కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగ్‌లతో ఆడియన్స్‌తో విజిల్స్ వేయించాడు. ఫస్టాఫ్‌లో కూల్‌గా, సెకండాఫ్‌లో పవర్‌ఫుల్‌గా రెండు షేడ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపించే బాలకృష్ణ ఈ సారి స్టైలిష్‌గా కనిపించి మెప్పించాడు. తొలిసారిగా బాలయ్యతో జోడి కట్టిన అంజలి మరోసారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రతీ అగ్నిహోత్రి విలన్‌గా మెప్పించింది. నాజర్, సుమన్, శియాజీ షిండే, 30 ఇయర్స్ పృధ్వీలు తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న కథలు మాత్రమే డీల్ చేసిన శ్రీవాస్. బాలయ్య స్టామినాకు తగ్గ సినిమా చేయటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా రెండున్నర గంటల పాటు చెప్పేంత కథ లేకపోవటంతో ఫస్టాఫ్ అంతా కథతో సంబంధం లేని సీన్స్‌తో నింపేశాడు. ఇక అసలు కథలో ఎంటర్ అయిన తరువాత కూడా సినిమాలో వేగం కనిపించలేదు. కోన వెంకట్, గోపి మోహన్‌లు మరోసారి రొటీన్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. చాలా పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎం. రత్నం మాటలు బాగున్నాయి. బాలయ్య అభిమానులతో విజిల్స్ వేయించే పంచ్ డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. థమన్ సంగీతం ఫరవాలేదనిపించింది. పాటలు విజువల్‌గా బాగున్నాయి. చిన్నా అందించిన నేపధ్య సంగీతం చాలా చోట్ల ఆకట్టుకుంటుంది. శ్రీవాస్ సినిమాలలో ఆశించే స్థాయి కామెడీ ఎక్కడా కనిపించలేదు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరి మ్యూజిక్ ఫస్టాఫ్ ఓవరాల్ గా డిక్టేటర్ బాలయ్య అభిమానులను అలరించే కమర్షియల్ ఎంటర్ టైనర్ సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం
హైదరాబాద్: సింహా... లెజెండ్... లయన్ చిత్రాలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు డిక్టేటర్‌గా కనిపించనున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్ షూటింగ్ మే 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ శనివారం హైదరాబాద్‌లో వెళ్లడించారు. కాగా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ 12 నుంచి మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీతోపాటు యూరప్ దేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తుందని చెప్పారు. బాలకృష్ణతో నయనతార నటిస్తున్న మూడో చిత్రం అని శ్రీవాస్ పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు విజయం సాధించాయి.... అలాగే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీవాస్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారని శ్రీవాస్ తెలిపారు. డిక్టేటర్ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగకు విడుదల చేస్తామన్నారు. -
సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు...
‘‘ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇది’’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లౌక్యం’. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఐటెమ్ సాంగ్‌ను హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. ‘సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోళ్లు నా వెంటపడ్డారు’ అనే చంద్రబోస్ విరచిత గీతాన్ని శంకర్ నృత్య దర్శకత్వంలో గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్, హంసానందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, సంపత్‌రాజ్, ప్రగతి తదితరులపై చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి కుటుంబ తరహా వినోదాత్మక చిత్రమిది’’ అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్ కాంబినేషన్లో నేను చేస్తున్న సినిమా ఇది. యూరప్‌లో 3 పాటలు చిత్రీకరించబోతున్నాం. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘సరైన పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందుతున్న సమయంలో ఇందులో నాకు మంచి పాత్ర దొరికింది. నాతో తొలి సినిమా చేసిన నాయికలే కాదు, నాయకులు కూడా విజయం సాధించారనడానికి నాగార్జున, గోపీచంద్లే ఉదాహరణ’’ అని చంద్రమోహన్ చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సంపత్‌రాజ్, ప్రగతి, హంసానందిని తదితరులు మాట్లాడారు. -
లౌక్యం... చాకచక్యం
‘కండబలముతోనే ఘనకార్యమ్ము సాధించలేరు... బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరించగలరు...’ అనే కృష్ణబోధను సరిగ్గా ఆకళింపు చేసుకున్నాడా కుర్రాడు. కొండల్ని పిండిచేసే కండబలం ఉన్నా.. బుద్ధిబలమే అతని ఆయుధం. లౌక్యం, చాకచక్యం అతని శంఖచక్రాలు. అసాధ్యమనుకున్నదాన్ని చిరునవ్వుతోనే సుసాధ్యం చేసేయడం అతని స్టైల్. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్యా క్రియేషన్స్ వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో గోపీచంద్ పాత్ర తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి. గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లక్ష్యం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రతిష్ఠాత్మకంగా శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ ఇందులో కథానాయిక. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ నెల 11తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 25 నుంచి 30 వరకూ క్లైమాక్స్ చిత్రీకరిస్తాం. ఆగస్టులో మూడు పాటలను విదేశాల్లో, రెండు పాటలను హైదరాబాద్‌లోనూ చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ- ‘‘గోపీచంద్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్రచిత్రణ గమ్మత్తుగా ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర ఓ హైలైట్. హంసానందిని స్పెషల్ కేరక్టర్ చేస్తున్నారు. ఆమెపై ఓ పాట కూడా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అయిదు పాటలకు అద్భుతమైన స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. చంద్రమోహన్, పోసాని, కోవై సరళ, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, కెమెరా: వెట్రి, ఎడిటింగ్: శేఖర్.