మే 11న ‘సాక్ష్యం’ | Saakshyam Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 18 2018 12:01 PM | Last Updated on Sun, Feb 18 2018 12:02 PM

Bellamkonda Sai Sreenivas in Saakshyam - Sakshi

‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

‘జయ జానకి నాయక’ సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 11 రిలీజ్ కానున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి.  ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ ‘ప్రేమికుల రోజు సందర్భరంగా రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ ను ఎనౌన్స్ చేయటం మరింత ఆనందంగా ఉంది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో క్లైమాక్స్‌కు సంబంధించిన భారీ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. శ్రీవాస్ అందించిన కథా కథనాలపై మాకు చాలా నమ్మకముంది. హీరో శ్రీనివాస్ కూడా సినిమాలో సరికొత్త లుక్‌ లో కనిపించనున్నారు. పూజాతో చేసిన రొమాంటిక్‌ సీన్స్ తో పాటు అడ్వంచరస్‌ యాక్షన్‌ సీన్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్‌ కోసం చిత్రయూనిట్ అమెరికా వెళ్లనుంద’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement