saakshyam
-
బెల్లంకొండ సినిమాలో మెహ్రీన్
ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తన ఐదో పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. కాజల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ పాత్రలో మెహ్రీన్ నటిస్తున్నారు. ఈ రోజు నుంచి మెహ్రీన్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభమైంది. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. -
నల్గొండలో ‘సాక్ష్యం’ టీం
-
బెల్లంకొండ కెరీర్ బెస్ట్ ‘సాక్ష్యం’
యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సాక్ష్యం. జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన శ్రీనివాస్ కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. పుల్ రన్లో ‘సాక్ష్యం’ బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాల రికార్డ్లను తిరగరాస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యంగ్ హీరో తొలి చిత్రం అల్లుడు శీను పుల్‌రన్‌లో 70 కోట్ల గ్రాస్ వసూళు చేయగా జయ జానకి నాయక దాదాపు 80 కోట్ల గ్రాస్ సాదించింది. ఇప్పుడు సాక్ష్యం ఆ రెండు చిత్రాల కలెక్షన్లు దాటేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. పంచ భూతల నేపథ్యంలో యాక్షన్ డ్రామగా తెరకెక్కిన సాక్ష్యం సినిమా బీసీ సెంటర్లలో మంచి వసూళ్లు సాదిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సాయి శ్రీనివాస్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతమందించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా లో జగపతి బాబు, మీనా, శరత్ కుమార్, జయప్రకాష్, అశుతోష్ రానా, రవికిషన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అందుకు విజయమే సాక్ష్యం
‘‘కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్ ఎలా రీసివ్ చేసుకుంటారు? అనే ప్రశ్నకి కొత్త సక్సెస్‌తో సమాధానం చెబుతున్నారు. ఇంత పెద్ద కథను చెప్పడానికి మా టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. థియేటర్ నుంచి ఆడియన్స్ ఎలా బయటకు రావాలని కోరుకున్నామో అదే ఫీలింగ్‌తో వస్తున్నారు’’ అని శ్రీవాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘అభిషేక్‌గారు కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. శ్రీనివాస్ ప్రాణం పెట్టి పని చేశాడు. అందరం కూడా కసిగా పని చేశాం. ట్రెండ్‌ని, ట్రెడీషన్‌ని కలిపి తీసిన చిత్రం ‘సాక్ష్యం’’ అన్నారు. ‘‘టీమ్ అందరి సపోర్ట్‌కి థ్యాంక్స్. చాలా కష్టపడి పని చేశాం. ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనడానికి సక్సెసే ‘సాక్ష్యం’. శ్రీవాస్‌గారు బాగా తెరకెక్కించారు. అభిషేక్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ‘‘కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపిస్తోంది. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను మంచి యాక్షన్ హీరో అవుతాడు’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. అందరం సినిమాను ప్రేమించి పని చేశాం. థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ఈ విజయంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తే తప్పు చేయడానికి భయపడతారు అనే భావన కలుగుతుంది’’ అన్నారు మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. -
‘సాక్ష్యం’ మూవీ రివ్యూ
టైటిల్ : సాక్ష్యం జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే, జగపతి బాబు, వెన్నెల కిశోర్, అశుతోష్ రానా సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్ దర్శకత్వం : శ్రీవాస్ నిర్మాత : అభిషేక్ నామా అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమాతో సూపర్ హిట్ సాధించి మంచి ఫాంలో ఉన్నాడు. అదే జోరులో శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యం సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి బెల్లంకొండకు సక్సెస్ అందించిందా..? ఇప్పటి వరకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన శ్రీవాస్ ఈ సినిమాతో భారీ యాక్షన్ చిత్రాలను కూడా డీల్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడా..? కథ ; రాజు గారు (శరత్‌కుమార్) స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతంలో ఉండే పెద్ద మనిషి. అదే ప్రాంతంలో ఉండే మును స్వామి (జగపతి బాబు) అతని తమ్ముళ్లు చేసే అన్యాయాలను ఎదిరిస్తుంటారు. ఇది సహించలేని మునుస్వామి మొత్తం రాజుగారి కుటుంబాన్ని చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి తీసుకెళ్లి కాశీలో వదిలేస్తాడు. (సాక్షి రివ్యూస్) పిల్లలు లేని శివ ప్రకాష్ (జయ ప్రకాష్) దంపతులు ఆ పిల్లాడికి విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. శివ ప్రకాష్‌కు విదేశాల్లో వ్యాపారాలు ఉండటంతో విశ్వా కూడా అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. అడ్వంచరస్ లైఫ్‌ను ఇష్టపడే విశ్వా రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అక్కకు తోడుగా ఉండేందుకు అమెరికా వచ్చిన సౌందర్య లహరి(పూజ హెగ్డే) ప్రవచనాలు చెపుతుండగా చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇండియన్ ట్రెడిషన్ పై తాను చేసే ఓ వీడియో గేమ్ కు సాయం చేయమని సౌందర్యను అడుగుతాడు. సౌందర్య.. వాల్మీకి (అనంత శ్రీరామ్) అనే వ్యక్తిని విశ్వకు పరిచయం చేస్తుంది. వాల్మీకి పంచభూతాల నేపథ్యంలో ఓ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్ చెప్తాడు. అదే సమయంలో విశ్వ, సౌందర్యలు చిన్న అపార్థం కారణంగా విడిపోతారు. సౌందర్య ప్రేమకోసం ఇండియా వచ్చిన విశ్వను పంచభూతాలు ఎలా నడిపించాయి..? తనకు తెలియకుండా తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని విశ్వ ఎలా అంతమొందించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు మంచి పరిణితి చూపిస్తున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాక్ష్యంలో మరింతగా మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్ లు ఇరగదీశాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాకు తనవంతుగా పూర్తి న్యాయం చేశాడు. సౌందర్య లహరి పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. నటనపరంగా ఓకే అనిపించినా గ్లామర్, లుక్స్‌తో సూపర్బ్ అనిపించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా జగపతి బాబు మరోసారి తన మార్క్ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మంచి విలనిజం పండించారు. జగపతి బాబు తమ్ముళ్లుగా నటించిన అశుతోష్ రానా, రవికిషన్‌లు కూడా తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, రావూ రమేష్, వెన్నెల కిశోర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; పంచభూతాలే ప్రతీకారం తీర్చుకుంటాయన్న డిఫరెంట్ (ఫాంటసీ) కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను తెరకెక్కించాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు గత చిత్రం జయ జానకీ నాయకతో వచ్చిన మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో కథ నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్ చేసిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నడిపించాడు. (సాక్షి రివ్యూస్)హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కథనం మధ్యలో స్పీడు బ్రేకర్లలా మారి ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అభిషేక్ నామా ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; కథనం మధ్యలో ఇబ్బంది పెట్టే పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. మరిన్ని రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సాక్ష్యం షోలు రద్దు!
సాక్షి, హైదరాబాద్: భారీ బడ్జెట్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్ షోతోపాటు మార్నింగ్ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ.. మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్ వినిపిస్తోంది. నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌కు డిజిటల్ ప్రింట్ అందలేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల సమయంలో చిక్కులు ఎదుర్కొవటం గమనార్హం. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్‌గా సాక్ష్యం తెరకెక్కింది. -
విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి
‘‘అల్లుడుశీను’ సినిమా విడుదలై అప్పుడే నాలుగేళ్లయిందంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయి చాలా మెచ్యూర్డ్‌గా ఎదుగుతున్నాడు. ‘సాక్ష్యం’ ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. అభిషేక్ నామా ‘సాక్ష్యం’ని అంత గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హేగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘సాక్ష్యం’ రేపు విడుదలవుతోంది. ‘సాక్ష్యం’ చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘డెస్టినీ’ని వినాయక్ రిలీజ్ చేశారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అభిషేక్‌గారు ఈ చిత్రాన్ని లావిష్‌గా నిర్మించారు. శ్రీవాస్‌గారి విజన్‌కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలి’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ‘సాక్ష్యం’ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకూ చేయని కొత్త పాత్ర చేశాను. విజువల్స్ చాలా బాగుంటాయి’’ అని పూజాహెగ్డే అన్నారు. -
కన్ఫామ్ చేసిన ‘సాక్ష్యం’ టీం
సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూలై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. గతం కొద్ది రోజులుగా సాక్ష్యం సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో జంతువులు, పక్షులను వినియోగించినందున సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ సాక్ష్యం టీం సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. -
మినీ బాహుబలి చేశాం
‘‘జయ జానకి నాయక’ సినిమాకి ముందే శ్రీవాస్‌గారు ‘సాక్ష్యం’ కథ చెప్పారు. పంచభూతాల నేపథ్యంలో అద్భుతమైన కథ రెడీ చేశారాయన. ఇప్పటివరకూ చూడని సరికొత్త కథ.. చాలా బాగుంటుంది. పర్సనల్‌గా నాకు బాగా నచ్చింది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు... ► పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ ఇలాంటి కథతో సినిమా రాలేదు. బహుశా.. మా సినిమా విడుదల తర్వాత ఈ జానర్లో మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్నా. ఈ సినిమా కోసం 150 రోజులు పనిచేశాం. ► పాటలు, ఫైట్లు చక్కగా కుదిరాయి. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు పీటర్ హెయిన్స్‌గారు యాక్షన్స్ డిజైన్ చేశారు. ఈ చిత్రంలో డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేశా. ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్ ఉంటుందని నా నమ్మకం. అందుకే జెన్యూన్‌గా కష్టపడ్డా. వెరీ హ్యాపీ. యాక్షన్ సీక్వెన్స్ చాలా సహజంగా ఉంటాయి. ► ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో నేను వీడియోగేమ్ డిజైనర్‌గా చేశా. ‘సాక్ష్యం’ కథ వినగానే హిట్ అని తెలుసు. సూపర్ హిట్ చేయాలని యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఓ రకంగా మినీ ‘బాహుబలి’ చేశాం. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చూడదగ్గ చిత్రమిది. ► ఏ సినిమాకైనా నా వైపు నుంచి బెస్ట్ ఇవ్వడానికి కృషి చేస్తా. మినిమం గ్యారంటీ సినిమాలు ఇస్తాడనే పేరు చాలు. నా మార్కెట్ పరిధికి మించి ఎవరూ ఖర్చు పెట్టరు. వసూళ్లు ఒక్కటే కాదు.. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపితే నా సినిమాలకు నష్టం రాదు. బడ్జెట్ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయను. నేనెప్పుడూ నిర్మాతల హీరోనే. ► ‘సాక్ష్యం’ వర్క్‌ని ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తున్నా అని శ్రీవాస్‌గారు అన్నారు. మంచి విజన్‌తో ఈ కథ రెడీ చేశారు. రెండు పార్ట్‌లుగా తీయాల్సిన సినిమా ఇది. నా లైఫ్‌లో ‘సాక్ష్యం’ చిత్రాన్ని గర్వంగా ఫీలవుతా అని అభిషేక్ నామాగారు అన్నారు. ► కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా. ఇందులో కాజల్ హీరోయిన్. 70శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తేజగారి డైరెక్షన్లో చేస్తున్న సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఇది చాలా కొత్త కథ. ఫస్టాఫ్‌లో ఫైట్స్ ఉండవు. ఏడేళ్ల కిందటే ఆయన ఈ కథ తయారు చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా కాజలే హీరోయిన్. యాక్చువల్లీ ఈ సినిమాకు నాకన్నా ముందే కాజల్‌ని ఫైనలైజ్ చేశారు. తర్వాత నేను వచ్చా. మా కాంబినేషన్ రెండోసారి అనుకోకుండా కుదిరింది. -
హీరో, హీరోయిన్లు కాదు.. కథే రాజు
‘‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో మొదటిసారి పంచ భూతాల మీద వస్తున్న సినిమా ‘సాక్ష్యం’. తప్పు చేసినప్పుడు ఎవరూ చూడకుండా చేసాం, తప్పించుకున్నాం అనుకుంటారు. కానీ, కర్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందనీ, దాని నుంచి తప్పించుకోవడం కుదరదనేది మా సినిమా మెయిన్ కాన్సెప్ట్’’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా పంచుకున్న విశేషాలు... ► ‘సాక్ష్యం’ కథని శ్రీవాస్‌గారు మొదట బెల్లంకొండ శ్రీనివాస్‌గారికి చెప్పారు. నిర్మాతగా నేను అయితే బాగుంటుందని వాళ్లు అనుకుని నన్ను కలిశారు. శ్రీవాస్ గత సినిమా ‘డిక్టేటర్’ ఎందుకో ఆ సమయంలో వర్కవుట్ కాలేదు. కానీ, ‘సాక్ష్యం’ కథ మీద నమ్మకంతోనే ఆయనతో ఈ సినిమా చేశా. ► ప్రజెంట్ జనరేషన్ మూవీస్‌లో హీరో, హీరోయిన్ల కంటే కథే మెయిన్ కింగ్. సినిమాలో కాశీలో కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిని హైదరాబాద్‌లో తీయలేం కదా?. కష్టమైనా కాశీలోనే తీయాలి. అందుకే ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం పెరిగింది. ► ‘సాక్ష్యం’ లో శ్రీనివాస్ వీడియో గేమ్ డిజైనర్‌గా నటిస్తున్నారు. హీరో మార్కెట్ పక్కన పెడితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ఈ మాత్రం ఖర్చు కరెక్టే అనిపించింది. పెద్ద హీరోలని పెట్టి సినిమా తీసినా, సరైన కథ లేకపోతే ప్రేక్షకులు చూడరు కదా? ► తన సినిమాల్లో శ్రీవాస్ తొలిసారి హీరోని చాలా డిఫరెంట్‌గా చూపించారు. సాయి శ్రీనివాస్‌గారు కూడా లవ్ సీన్స్‌లో చాలా స్టైలిష్‌గా, ఫైట్ సీన్స్ అప్పుడు బాడీని బాగా బిల్డ్ అప్ చేసి నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కని సంగీతం అందించారు. కథకు తగ్గట్టు, సందర్భానుసారంగా పాటలు వస్తాయి. పాటలు చిత్రీకరించిన లొకేషన్లు అందర్నీ ఆకట్టుకుంటాయి. ► మొత్తం 48మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. వారందరూ స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపిస్తారు. మా బ్యానర్‌కి ‘సాక్ష్యం’ చాలా ప్లస్ అవుతుంది. కొత్త కాన్సెప్ట్ కావడంతో తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. -
‘సాక్ష్యం’ మూవీ స్టిల్స్
-
సృష్టే సాక్ష్యంగా...
ఈ భూమ్మీద జరిగే ప్రతిదానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు. ఆ సృష్టి కూడా. ఇలా సృష్టే సాక్ష్యంగా నిలిచిన ఓ సంఘటన కోసం ఓ కుర్రాడు పోరాడుతున్నాడు. అతని పోరాటానికి పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) ఎలా సాయం చేసాయన్నది థియేటర్లో చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘సాక్ష్యం’ టీమ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సాక్ష్యం’. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ‘‘ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఎలా సాక్ష్యంగా నిలిచింది అన్న అంశం సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్. అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. సినిమాను ఈ నెల 27న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, జయప్రకాశ్, ‘వెన్నల’ కిశోర్ నటించిన ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా. -
పంచభూతాలే ఈ సినిమా చేయించాయి
‘‘నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రికల్ ట్రైలర్, పంచభూతాల సాంగ్ మాట్లాడేశాయి. కొత్త కథలను ఆడియన్స్ ఆదరిస్తున్నారని ఈ స్క్రిప్ట్‌ని ఎంచుకున్నాను. పంచభూతాల సపోర్ట్‌తోనే ఈ సినిమా జరిగిందనుకుంటాను. పంచభూతాలే నాతో ఈ సినిమా చేయించాయి అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీవాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను, ఆడియో సీడీలను పార్లమెంట్ సభ్యులు, టీ న్యూస్ ఎండీ సంతోశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ –‘‘నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ మేకర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. బడ్జెట్ ఎక్కువైనా సరే నిర్మాత అభిషేక్ కథను నమ్మి కాంప్రమైజ్ అవ్వలేదు. హర్షవర్ధన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్థర్ విల్సన్ కెమెరా, చంటిగారి ఎడిటింగ్, అనంత శ్రీరామ్ లిరిక్స్ హైలైట్స్‌గా నిలుస్తాయి. విలన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణాని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక దర్శకుడికి శ్రీనివాస్‌లాంటి హీరో దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఏం చెప్పినా చేసేవాడు. ఫ్యూచర్లో పెద్ద స్థాయికి వెళ్తాడు. పూజా హెగ్డే సౌందర్యలహరి క్యారెక్టర్‌కి మౌల్డ్ అయిపోయింది’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘ఇంత మంచి సినిమాను నాకిచ్చినందుకు శ్రీవాస్ గారికి థ్యాంక్స్. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి కథను నమ్మి నిర్మించినందుకు నిర్మాత అభిషేక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శ్రీవాస్‌గారు ఇందులో డిఫరెంట్ రోల్ ఇచ్చారు. సాయి చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. అభిషేక్ గారికి చాలా డబ్బులు రావాలి’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అనంత శ్రీరామ్‌గారి సపోర్ట్ లేకపోతే పంచభూతాల సాంగ్ ఇలా వచ్చేది కాదు’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘సాంగ్ చూడగానే ‘లెజెండ్’ సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘శ్రీనివాస్‌తో ఓ సినిమా తీశాను. చాలా ఎనర్జిటిక్. కోపరేటివ్. ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌లా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘సినిమాను ఇష్టపడే వ్యక్తి శ్రీవాస్. బ్లాక్‌బస్టర్ కొట్టి టాప్ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు దశరథ్. -
'సాక్ష్యం' చిత్రం ఆడియో
-
‘సాక్ష్యం’ ఆడియో వేడుక
‘జయ జానకి నాయక’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బెల్లకొండ శ్రీనివాస్. తన తదుపరి చిత్రంగా ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ ప్రొడ్యుసర్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా ఆడియో వేడుకను జూలై 7న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. పంచభూతాలే సాక్ష్యం అంటూ ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ప్రకృతే సాక్ష్యం
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించారు. జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్ కీలక పాత్రలు చేశారు. హర్షవర్ధన్ రామేశ్వరన్ స్వర పరచిన ఈ సినిమా ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు. ‘‘ప్రకృతే సాక్ష్యంగా ఈ సినిమాను రూపొందించాం. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆర్తు ఏ.విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలం. ‘బాహుబలి’ చిత్రానికి సీజీ వర్క్ చేసిన టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. టైమ్ మ్యూజిక్ సౌత్ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. జూలై 20న ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆ యువ హీరో సినిమాకు భారీ ఆఫర్!
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు భారీ ఆఫర్ వచ్చింది. సినిమా షూటింగ్ ఇప్పుడే మొదలుపెట్టారు... అప్పుడే ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులకు భారీ ఆఫర్ వచ్చింది. జయ జానకి నాయకా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యువహీరో ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాక్ష్యం సినిమా తరువాత మొదలుపెట్టే ఈ సినిమాకు హిందీ శాటిలైట్ హక్కులను రూ. 9.5కోట్లకు అమ్మినట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. వంశధార క్రియేషన్స్‌పై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. Actress @MsKajalAggarwal joins the sets of #BSS5. Starring @BSaiSreenivas and production by #VamsadharaCreations. A film by #Sreenivas. Hindi satellite rights of the film sold for a whopping ₹9.50 crore. pic.twitter.com/8P9sQCeoOF — BARaju (@baraju_SuperHit) June 1, 2018 -
ఒక్క పాటకు ఐదుగురు దిగ్గజాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఐదుగురు గాయకులు కలిసి ఆలపిస్తున్నారు. పంచభూతల నేపథ్యంలో వచ్చే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, ఏసుదాసు, హరిహరన్, కైలాష్‌ఖేర్, బాంబే జయశ్రీ లు పాడటం విశేషం. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూన్ 14నే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినా.. గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు. శరత్‌కుమార్, మీనా, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో విజయాన్ని నమోదు చేయటం ఖాయం అని భావిస్తున్నారు. -
ఆలస్యంగా ‘సాక్ష్యం’
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా ‘సాక్ష్యం’ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్‌ను జూలై 20కు పోస్ట్ పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ –‘‘బాహుబలి’ సినిమాకు వర్క్ చేసిన సీజీ టీమ్ ‘మకుట’ మా సినిమాకు వర్క్ చేస్తోంది. సినిమా పంచభూతల చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో కొంచెం డిలే అయింది. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాను జూలై 20న రిలీజ్ చేస్తున్నాం. టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్. -
ఒక సినిమా.. ఐదు క్లైమాక్స్‌లు
జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఐదు క్లైమాక్స్‌లను ప్లాన్ చేశారట. పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రతీ ఫైట్ క్లైమాక్స్ అనిపించేంత భారీగా తెరకెక్కించారు. యాక్షన్ కొరియెగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఒక్క ఫైట్‌ను ఒక్కో థీమ్‌తో డిఫరెంట్‌గా రూపొందించారట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా శరత్ కుమార్, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సాక్ష్యం’ విడుదల వాయిదా!
‘జయ జానకి నాయకా’ సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో తన తదుపరి చిత్రం సాక్ష్యం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్, లుక్స్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. జూన్ 14న సాక్ష్యంను విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రం జూలైలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. -
అమెరికా టు రాయలసీమ
అవును.. అమెరికా నుంచి స్ట్రయిట్‌గా రాయలసీమలో అడుగుపెట్టారు పూజా హెగ్డే. అమెరికాలో ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్–ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారీ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సాగే యాక్షన్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ‘రాయలసీమ సెట్’లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అంటే.. పూజా హెగ్డే రాయలసీమలోకి ఎంటరైనట్లే కదా. 45 రోజులు పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందట. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. -
‘సాక్ష్యం’ నుంచి సౌందర్య లహరి సాంగ్
బడా నిర్మాత బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ హీరోకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు రాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ యువ హీరో మొదట్నుంచీ స్టార్ హీరోయిన్లతోనే జతకడుతున్నారు. గతేడాది జయ జానకి నాయకా అంటూ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈరోజు (మే 4) సినిమాలోని మొదటి సాంగ్‌ను రిలీజ్ చేశారు. లహరి ..లహరి..అంటూ సాగే ఈ మెలొడిసాంగ్ను అందమైన లొకేషన్లో తెరకెక్కించినట్లు లిరికల్ వీడియో సాంగ్ చూస్తే తెలుస్తోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత సారథ్యంలో... జితిన్, ఆర్తిలు ఆలపించారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. -
‘సాక్ష్యం’ మొదటి సాంగ్ విడుదల
-
‘సాక్ష్యం’ నుంచి రేపు ఫస్ట్ సింగిల్
గతేడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ‘జయ జానకి నాయకా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా విజయవంతమైంది. ఈయన కెరీర్లో పెద్దగా విజయాలు లేకపోయినా... హై బడ్జెట్, కాస్టింగ్‌తో సినిమాలు రిచ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ‘సాక్ష్యం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ (సౌందర్య లహరి...)ను రేపు (మే 4) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించగా...శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.