
బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ చానల్ సొంతం చేసుకుంది. తెలుగు హక్కులను 5.5 కోట్లకు, హిందీ హక్కులను 8 కోట్లకు దక్కించుకుందని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రాన్ని మే 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘మా చిత్రానికి మార్కెట్‌లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఓ యువ హీరో చిత్రానికి ఈ స్థాయిలో శాటిలైట్ బిజినెస్ జరడగం ఇదే మొదటిసారి. నిర్మాణ విలువలపరంగా నో కాంప్రమైజ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆఖరి షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశాం. ‘సాక్ష్యం’ హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.