
బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’ – నేచర్ ఈజ్ ది విట్‌నెస్ అనేది ట్యాగ్‌లైన్. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా మే 11న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ తర్వాత ఓ కీలక షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించనున్నారట. ఆ షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్ అవ్వనుంది. ఈ సినిమాకు శ్రీవాస్ స్క్రిప్ట్, సాయి శ్రీనివాస్ చేసిన యాక్షన్ సీన్స్, పూజా గ్లామర్ హైలెట్స్‌గా నిలుస్తాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ. విల్సన్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్.8