Bellamkonda Srinivas Saakshyam Audio Release on July 7th - Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 9:20 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda Srinivas Saakshyam Movie Audoa Release On 7th July - Sakshi

‘జయ జానకి నాయక’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు బెల్లకొండ శ్రీనివాస్‌. తన తదుపరి చిత్రంగా ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. స్టార్‌ ప్రొడ్యుసర్‌ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. 

శ్రీవాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా ఆడియో వేడుకను జూలై 7న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. పంచభూతాలే సాక్ష్యం అంటూ ఆ మధ్య రిలీజ్‌ చేసిన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement