ఒక సినిమా.. ఐదు క్లైమాక్స్‌లు | Five Fights And Five Climaxs In Saakshyam | Sakshi
Sakshi News home page

Published Sun, May 27 2018 12:10 PM | Last Updated on Sun, May 27 2018 12:10 PM

Five Fights And Five Climaxs In Saakshyam - Sakshi

జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఐదు క్లైమాక్స్‌లను ప్లాన్‌ చేశారట.

పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రతీ ఫైట్‌ క్లైమాక్స్‌ అనిపించేంత భారీగా తెరకెక్కించారు. యాక్షన్‌ కొరియెగ్రాఫర్ పీటర్‌ హెయిన్స్‌ ఒక్క ఫైట్‌ను ఒక్కో థీమ్‌తో డిఫరెంట్‌గా రూపొందించారట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా శరత్‌ కుమార్‌, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement