ఒక్క పాటకు ఐదుగురు దిగ్గజాలు | Five Top Singers For Saakshyam Special Song | Sakshi
Sakshi News home page

Published Wed, May 30 2018 12:08 PM | Last Updated on Wed, May 30 2018 12:13 PM

Five Top Singers For Saakshyam Special Song - Sakshi

బెల‍్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఐదుగురు గాయకులు కలిసి ఆలపిస్తున్నారు. పంచభూతల నేపథ్యంలో వచ్చే ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, ఏసుదాసు, హరిహరన్‌, కైలాష్‌ఖేర్‌, బాంబే జయశ్రీ లు పాడటం విశేషం.

హర్షవర్దన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా జూన్‌ 14నే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించినా.. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు. శరత్‌కుమార్‌, మీనా, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మరో విజయాన్ని నమోదు చేయటం ఖాయం అని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement