‘సాక్ష్యం’ నుంచి రేపు ఫస్ట్‌ సింగిల్‌ | First Single From Saakshyam movie Will Be Released Tomorrow | Sakshi
Sakshi News home page

Published Thu, May 3 2018 4:44 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

First Single From Saakshyam movie Will Be Released Tomorrow - Sakshi

గతేడాది మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో ‘జయ జానకి నాయకా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆ సినిమా విజయవంతమైంది. ఈయన కెరీర్‌లో పెద్దగా విజయాలు లేకపోయినా... హై బడ్జెట్‌, కాస్టింగ్‌తో సినిమాలు రిచ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ‘సాక్ష్యం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. 

ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ (సౌందర్య లహరి...)ను రేపు (మే 4) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించగా...శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement