బెల్లంకొండ సినిమాలో మెహ్రీన్ | Mehreen in Bellamkonda Sai Sreenivas Film | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 19 2018 12:24 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Mehreen in Bellamkonda Sai Sreenivas Film - Sakshi

ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ప్రస్తుతం తన ఐదో పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. కొత్త ద‌ర్శకుడు శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నాడు ఈ ద‌ర్శకుడు.

కాజ‌ల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. మరో హీరోయిన్‌ పాత్రలో మెహ్రీన్ న‌టిస్తున్నారు. ఈ రోజు నుంచి మెహ్రీన్‌కు సంబంధిం‍చిన సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభమైంది. వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టులు నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధన్ రాణే కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు.  థ‌మ‌న్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement