సాక్ష్యం టీజర్‌ ఎప్పుడంటే..! | Saakshyam Teaser All Set To Be Released | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 17 2018 4:01 PM | Last Updated on Tue, Apr 17 2018 4:01 PM

Saakshyam Teaser All Set To Be Released - Sakshi

జయ జానకి నాయక సినిమా తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న  తాజా చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేశారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్‌ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకుండానే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది.‌ హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా తెలుగు శాటిలైట్ హక్కులు రికార్డ్ స్థాయిలో అయిదున్నర కోట్లకు అమ్ముడయ్యి రికార్డ్‌ సృష్టించింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ లు కనువిందు చేయనున్నాయి. సాయి శ్రీనివాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement