ఆ యువ హీరో సినిమాకు భారీ ఆఫర్‌! | Bellamkonda Srinivas And Kajal Movie Gets Crazy Offer For Hindi Satellite Rights | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 1 2018 5:19 PM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

Bellamkonda Srinivas And Kajal Movie Gets Crazy Offer For Hindi Satellite Rights - Sakshi

బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాకు భారీ ఆఫర్‌ వచ్చింది. సినిమా షూటింగ్‌ ఇప్పుడే మొదలుపెట్టారు... అప్పుడే ఈ సినిమా హిందీ శాటిలైట్‌ హక్కులకు  భారీ ఆఫర్‌ వచ్చింది. జయ జానకి నాయకా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యువహీరో ప్రస్తుతం సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 

సాక్ష్యం సినిమా తరువాత మొదలుపెట్టే ఈ సినిమాకు హిందీ శాటిలైట్‌ హక్కులను రూ. 9.5కోట్లకు అమ్మినట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపాడు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వంశధార క్రియేషన్స్‌పై నవీన్‌ శొంటినేని నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement