అమెరికా టు రాయలసీమ | Pooja Hegde joins NTR, Trivikram`s next | Sakshi
Sakshi News home page

అమెరికా టు రాయలసీమ

Published Tue, May 15 2018 1:08 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Pooja Hegde joins NTR, Trivikram`s next - Sakshi

అవును.. అమెరికా నుంచి స్ట్రయిట్‌గా రాయలసీమలో అడుగుపెట్టారు పూజా హెగ్డే. అమెరికాలో  ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసి, డైరెక్ట్‌గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌–ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారీ బ్యూటీ. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సోమవారం ఫస్ట్‌ టైమ్‌ పూజా హెగ్డే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టారు. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ‘రాయలసీమ సెట్‌’లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అంటే.. పూజా హెగ్డే రాయలసీమలోకి ఎంటరైనట్లే కదా. 45 రోజులు పాటు ఈ షెడ్యూల్‌ సాగనుంది. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అవుతుందట. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement