బెల్లంకొండతో సుకుమారి | Keerthy Suresh Next with Bellamkonda Srinivas | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 18 2018 1:37 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Keerthy Suresh Next with Bellamkonda Srinivas - Sakshi

వరుసగా భారీ చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాలో ఓ క్రేజీ హీరోయిన్‌ తో జతకట్టనున్నాడు. శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జయ జానకీ నాయక లాంటి మంచి హిట్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సాక్ష్యం సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్‌ లో పెడుతున్నాడు ఈ యంగ్ హీరో‌.

దర్శకుడిగా మారిన యాంకర్‌.. ఓంకార్‌ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ డ్రామాలో నటించనున్నాడు. ఇటీవల రాజుగారి గది 2 సినిమాతో డీసెంట్‌ హిట్ అందుకున్న ఓంకార్‌, నెక్ట్స్ సినిమాను డిఫరెంట్‌ జానర్‌ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే నెక్ట్స్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. అజ్ఞాతవాసి సినిమాలో సుకుమారిగా ఆకట్టుకున్న కీర్తి సురేష్‌.. కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement